రాజుగారికి ఒక నిర్దిష్టమైన గమ్యం ఉంది. ఆయన చేస్తున్న ఆరోగ్య ప్రచారం వెనుక చక్కటి ప్రణాళిక, అంతకు మించి ఎవరి ఆరోగ్యాన్ని వారే కాపాడుకొనేలా చేయాలనే బలిష్టమైన తపన ఉంది. ప్రజలు వారికి తెలియకుండా అనేక తప్పులు చేయడం వల్ల అనారోగ్యం పాలౌతూ తాము చేసే తప్పు లేమిటో తెలుసుకొకుండా వైద్యుల చుట్టూ, వైద్యశాలల చుట్టూ తిరుగుతున్నారు. ఒక వైద్య విధానంలో తగ్గనప్పుడు ఇంకో వైద్య విధానాన్ని ఆశ్రయిస్తున్నారు, ఒక మందుతో ఉపయోగం కన్పించకుంటే, ఇంకో మందును వాడుతున్నారె కాని, “ఏ తప్పు చేయడం వల్ల (ద్వారా) ఈ రోగం వచ్చినది" అనే విషయంపై ఏ ఒక్క డాక్టర్ కూడా సరియైన అవగాహన ఇవ్వడం లేదు. చెట్టు కొమ్మలను ఎన్ని సార్లు నరికినా మళ్ళీ క్రొత్తగా చిగురిస్తూనే ఉంటుంది చెట్టు మూలాలను కూకటి వ్రేళ్ళతో పెకిలించి బయటకు తీసే వరకు చిగురించడం ఎంత సహజమో అనారోగ్య కారణమైన నేటి అస్తవ్యస్తమయిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు మానసిక దోరణి మారనంత వరకు రోగాల పాలవడం అంత సహజమని డా|| రాజుగారు ప్రబోధిస్తున్నారు.

 

శాస్త్ర సాంకేతిక విజ్ఞానం పెరిగే కొలది, అంచెలంచెలుగా పూర్వీకులు అందించిన ఆరోగ్యసూత్రాలు రోజు రోజుకు కనుమరుగౌతున్నాయి. తిరిగి ఆ పూర్వీకుల జ్ఞానాన్ని ఏ విద్యుడు వెలికి తీయడం లేదు. అందుకు వారి తప్పేమీ లేదు, కారణం ఒక వైపు వారికి సరియైన సమయం లేకపోవడం ఇంకోవైపున రోగికి, ఈ రహస్యాలు విని, వాటిని ఆచరణలో పెట్టే ఓపిక లేకపోవడం, పైగా రోగి అన్ని వైద్యవిధానాల డాక్టర్ల చుట్టూ తిరిగి తిరిగి నయం కానప్పుడు, చివరి ప్రత్యామ్నాయ వైద్యంగా ప్రకృతి వైద్యానికి రావడం డా|| రాజు గారిని కలవరపరిచింది. ప్రకృతి ఆశ్రమంలో పెట్టే ఉపవాసాల ద్వారా కాని ప్రకృతి చికిత్సల ద్వారా కాని అలాగే ప్రకృతి ఆహారం సేవనం ద్వారా కాని రోగం తగ్గి, ఇంటికి వెళ్ళిన తర్వాత తిరిగి యధావిధిగా పూర్వపు ఆహారాన్నే తీసుకొని పూర్వపు అలవాట్లకే బానిస అయిపోవడం ద్వారా మళ్ళీ అనారోగ్యం పాలౌతున్నాడని డా|| రాజుగారు గ్రహించారు, ఇన్ని లొసుగులను అర్థం చేసుకున్న డా|| రాజుగారు తన వంతు కృషిగా ఈ ఆరోగ్య ప్రచారం మహాయజ్ఞాన్ని చేపట్టారు. రోగి అనారోగ్యం పాలు అయినప్పుడు మాత్రమే వైద్యుని సంప్రదిస్తున్నాడు. వారు ఇచ్చే మందులు తిని తాత్కాలికంగా ఉపశమనం దొరకగానే తిరిగి తన అస్తవ్యస్తమైన అనారోగ్య విధానాన్ని (వైద్యున్ని సంప్రదించడం) కొనసాగిస్తున్నాడు (లేదు) అంటే ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు వైద్యుడి వద్దకు వెళ్ళడం లేదని సత్యం కనుక తానే ప్రజల్లోకి వెళ్లాలని ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఈ ఆరోగ్య సూత్రాలను అందించాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు ఇల్లు విడిచి వైద్యశాలల చుట్టూ, వైద్యుల చుట్టూ తిరగక్కర్లేదని ఆరోగ్యంగా ఎలా జీవించవచ్చో తెలుసుకొని ఎవరింట్లో వారు ఆరోగ్యాన్ని బాగు చూసుకువచ్చని డా|| రాజు గారి అభిప్రాయం.

 

ఆరోగ్య ప్రచారంలో డా|| రాజుగారు ప్రజలకు అందిస్తున్న అంశాలు:

ప్రతివ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే శరీర వ్యవస్థకు కావాల్సిన అతి ముఖ్యఅంశాల గురించి అర్థం చేసుకోవాలి. శరీర ధర్మాలు 7. అవి

1. మంచి గాలి

2. మంచినీరు

3. మంచి ఆహారం

4. మంచి వ్యాయమం

5. మంచి విశ్రాంతి

6. మంచి విసర్జన

7. మంచి ఆలోచనలు

 

పై ఏడు శరీర అవసరాలను సవ్యంగా అందించినపుడు ఏ రోగం రాదనీ రాజుగారి (తన) అవగాహన తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు, డా|| రాజుగారు తీసుకున్న అంశాలు చాలా చిన్నదే అయిన అత్యంత ముఖ్యమైనవి.

 

పై వాటిని (అవసరాలను) ప్రతి వ్యక్తి పూరిస్తున్నారు. కాని సరైన పద్ధతిలో ఆచరించక పోవడమే అనారోగ్య కారణమని గ్రహించి, ప్రతి అవసరాన్ని ఎప్పుడు, ఎంత ఎలా పూరించాలనే విషయాలను తన ప్రచారంలో ప్రజలకు అందిస్తున్నారు.

 

మంచినీరు: మంచినీరు రోజుకు ఎవరు, త్రాగాలి, ఎవరు త్రాగకూడదు. మంచి నీరు ఏ సమయాలలో ఎంత త్రాగాలి. ఎందుకు త్రాగాలి అనే విషయాలను ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెబుతున్నారు. కాని రోజు 4-5 లీ|| నీరును త్రాగాలని దానివెనుకున్న సైన్సు సంగతులను క్షుణ్ణంగా అర్థం చేయించింది. డా|| రాజుగారు మాత్రమే. డా|| రాజుగారి ప్రసంగం వినిన ప్రతి వ్యక్తి మొట్టమొదలుగా ఆరోగ్య సూత్రాలలో భాగంగా నీరు ఎక్కువగా త్రాగిస్తారు. కేవలం నీరు త్రాగి ఎంతో మంది, వారికున్న అనేక రుగ్మతలను తగ్గించుకున్నారు, నేరు త్రాగడం మొదలు పెట్టిన నాటి నుండి మా ఆరోగ్యం ఎంతో బాగుందని ఆచరించే ప్రతి వ్యక్తి చెప్పడం విశేషం. నీరు త్రాగే విధానాన్ని అర్థం చేయించడమే కాక డా|| రాజుగారు నిత్య జీవితంలో వచ్చే చిన్న చిన్న రుగ్మతలకు కూడా కేవలం నీటిని ఉపయోగించే ఎవరింట్లో వారు ఎలా తగ్గించుకోవచ్చునో కూడా ప్రత్యేక ప్రసంగంగా చెబుతున్నారు.

 

మంచి ఆహారం: మనిషి ప్రకృతి సిద్ధమైన సూర్యాహారం (రా డైట్) తినాల్సింది పోయి, ఆహారాన్ని వండి రకరకాలుగా మార్పు చేసి కల్తీ చేసిన ఆహారంతో కడుపునింపుకుంటూ అనారోగ్యం పాలౌతున్నారు. కారం, పులుపు, మసాలాలు, తీపి, నూనె, నెయ్యి, ఉప్పులను అతిగా తినడం ద్వారా మనిషి లేనిపోని రోగాలన్ని తెచ్చుకుంటున్నాడని వాదించే డా|| రాజుగారు "ఇందులో ఉప్పు పూర్తిగా విషం అని, ఇది గుట్కా, గంజాయిల కంటే ప్రమాదమని, ఇది శరీరంలో ప్రతి కణాన్ని ఎలా నాశనం చేస్తుందో స్పష్టంగా చెబుతారు, స్వయంగా గత 10 సం||లుగా పూర్తిగా ఉప్పులేని ఆహారం సేవిస్తూ, అందరిని తనలాగా ఆచరణలో పెట్టి రోగాల్ని దూరంగా పెట్టమని తన ప్రసంగాలలో వివరిస్తుంటారు. అలా ఆచరణలో పెట్టిన (కొన్ని వందల) వెలాది రోగులలో షుగర్, బి.పి. చర్మవ్యాధులు., ఆస్త్మా, మూత్రపిండాల రోగాలు వెంటనే తగ్గుముఖం పట్టడమే కాకుండా ఏ మందులు వాడుకున్నా ఆరోగ్యంగా జీవించడం అందరిని అత్యంత అబ్బుర పరుస్తుంది.

 

మన ఆహారమే మనకు కావాలి అనే ప్రకృతి వైద్య సూక్తిని అక్షరాలా ముందుకు తీసుకెళ్తున్న రాజుగారు మనం రోజు తినే పై రుచులు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి, కనుక వాటికి ప్రత్యాన్మయంగా ఆరోగ్యంగా జీవించడానికి "రోగం రాని రుచుల" పేరుతో ప్రజలకు చక్కటి అవగాహన కల్గిస్తున్నారు. రోగం రానటు వంటి రకరకాల వంటలను ఎలా వండుకోవాలో తెలియజేస్తూ ఈ విషయాలపై వీడియో సి,డిలను, పుస్తకాలను రూపొందించి ప్రజలకు అందచేస్తున్నారు.