మన సంస్కృతిలో - ప్రకృతి జీవనం

ప్రపంచ చరిత్రలో మన భారతీయ సంస్కృతికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు, రామాయణం, మహాభారతం, భగవతం, భగవద్గీతలాంటి ఇతిహాసాలు మన సంస్కృతికి అద్దం పడుతూ సనాతన ధర్మాన్ని తరతరాలుగా ముందుకు నడిపిస్తున్నాయి. ఇవి మానవ జన్మను ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళడానికి దోహదం చేస్తున్నాయి. యోగులు, మునులు, మన పూర్వీకులు, అందించిన ఈ ఋషి సంస్కృతిని మానవ జాతి మనుగడ కోసం మునుముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

“జంతునాం నరజన్మ దుర్లభం" అన్నట్లు ఎన్నో జన్మల పుణ్యఫలము ద్వారా మనం ఈ మానవ జన్మ స్థితిని పొందాం. ఇతర జంతువులు కూడా పుట్టడం, తినడం, తిరగడం, పిల్లలను కనడం తర్వాత గిట్టడం కాదు సుమా! ఈ జన్మకు ప్రత్యేకమైన కారణం ఉంది, “ధర్మ, అర్థ, కామ, మోక్షాలనబడే చతుర్విధ పురుషార్థాలను సాధన చేసి జీవితాన్ని సార్థకత చేసుకోవాలి. అందుకు ధర్మబద్ధమైన, ధార్మిక జీవనం గడపాలి. “శరీరం పలుధర్మ సాధనం" అన్నారు పెద్దలు. అనగా చతుర్విద పురుషార్థాలు సాధించి ఆత్మ దర్శనం చేసుకొని, మోక్షాన్ని పొందాలంటే అతి ముఖ్యమైనది మంచి ఆరోగ్యవంతమైన శరీరం, “A Sound mind in Sound body” అన్నట్లుగా ఆరోగ్యవంతమైన శరీరంలో, ఆరోగ్యవంతమైన మనస్సు ఉంటుంది.

మంచి మనస్సులోంచి మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి మూర్తీభవిస్తాడు. అప్పుడే మనిషి ప్రేమ స్వరూపుడై, పూర్వత్వంతో తన జీవితాన్ని ప్రతి క్షణం ఆనందభరితం చేసుకోగలుగుతాడు. అంచేత మనిషి అనుక్షణం ఆనందంగా గడపడానికి మన సంస్కృతి అడుగడుగున "ఆరోగ్యవంతమైన జీవనయానం గురించి నొక్కి "ఆరోగ్యమే మహాభాగ్యమని" నొక్కి వక్కానించింది. ముఖ్యంగా ప్రకృతిలోంచి ఉద్భవించిన మనిషికి ప్రకృతిలో సహజంగా దొరికే వనరులు అనగా గాలి, నీరు, మట్టి, సూర్యరశ్మి, ఆకాశతత్వాలను ఉపయోగించుకొని, ప్రకృతిలో దొరికే సహజమైన ఆహారాన్ని తీసుకొని, సహజంగా శరీర శ్రమ చేస్తూ, సరియైన విశ్రాంతి తీసుకుంటూ, మంచి శరీర సౌష్టవాన్ని మానసిక పటిష్టాన్ని, సామాజిక స్పృహను, ఆధ్యాత్మిక భావాలను పెంపొందించుకోవడము ప్రకృతి జీవన విధానం. దీనినే పరిపూర్ణ ఆరోగ్యానికి ప్రకృతి జీవన విధానం అని చెప్పవచ్చు, ఈ విధనంలో జీవించినపుడు మనిషి రోగాలమయం కాదు. అలాకాక మానవుని ఆహార, విహారాదులలో, వాతావరణ పరిస్థితులలో మార్పు వచ్చి శరీర ప్రకృతిలో మార్పు వచ్చి అనారోగ్యం పాలైనప్పుడు, వెంటనే తిరిగి ప్రకృతిలోని పంచభూతాలను తదనుకూలంగా ఉపయోగించి చికిత్స చేసి, కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి పొందడాన్ని 'ప్రకృతి చికిత్స' అని అంటారు.

డా|| మంతెన సత్యనారాయణరాజుగారి ఆరోగ్య రచనలు

(సుఖ జీవన సోపానాల శ్రేణి)

1. సుఖజీవన సోపానాలు - 1

2. రోగాలు రాని రుచులు

3. ఉపవాస ధర్మం

4. ఆరోగ్యమే ఆనందం

5. ప్రాణాయామం సుఖ జీవనయానం

6. ఆసనాలు - ఆరోగ్యానికి శాసనాలు

7. సుఖవిరేచనం - సుఖమయ జీవనం

8. నీరు మీరు

9. ప్రకృతి విధానం - మధుమేహం నిదానం

10. మీ ఆరోగ్యం మీ చేతుల్లో (దశపుస్తకమాల)

11. పరిపూర్ణ ఆరోగ్యానికి సంపూర్ణ ఆహారం 1

2. పరిపూర్ణ ఆరోగ్యానికి ప్రకృతి జీవన విధానం

13. Food and Though – 2

14. Health is Happiness – 4

15. A Proven cure for Diabets through Natural Life Style – 9

16. Natural Life Style ( for a Perfectly Healthy Living)

డా|| మంతెన సత్యనారాయణరాజు గారి ఆరోగ్య ఉపన్యాసాల వీడియో సి.డి. ల శ్రేణి

1. పరిపూర్ణ ఆరోగ్యానికి ప్రకృతి జీవన విధానాలు - 2

2. నీరు ఆరోగ్య రహస్యాలు - 2

3. నీరు విరేచనంతో సుఖమయ జీవనం - 3

4. మన సంపూర్ణ ఆహారం ఏది - 3

5. ఉప్పు తెచ్చే ముప్పు - 2

6. రుచులు తెచ్చే రోగాలు - 3

7. పొద్దుపోయి తినడం వల్ల వచ్చే అనర్థాలు - 2

8. టీ - కాఫీ, పాలు - గ్రుడ్డు, మాంసాహారం ఎందుకు మానాలి? - 2

9. ఒక్క రోజు ఉపవాసం విశిష్టత – 3

10. ఆరోగ్యకరమైన వంటలు - 8

11. ఆరోగ్యానికి అనుకూలమైన దినచర్య – 2

12. యోగాసన రహస్యాలు - 2

13. దీర్ఘశ్యాసల ప్రాణాయామం - 3

14. షుగర్ వ్యాధిని తగ్గించే సులువైన మార్గాలు - 4

15. అధిక బరువును ఆరోగ్యకరంగా తగ్గించడం ఎలా? - 3

16. నీటితో చికిత్సలు - 3

17. సాధారణ సమస్యలు - చక్కటి చిట్కాలు