డాక్టర్స్, మంతెన సత్యనారాయణ రాజు, రాజు గారి దృష్టిలో నాడు - నేడు

పూర్వీకులు అందించిన ఆరోగ్య సూత్రాలు, వారు ఆచరించిన ఆహార, విహార అలవాట్లు పూర్తిగా ఆరోగ్యకరమైనవని డా|| రాజుగారు నమ్ముతారు.. మన పూర్వీకులు మనకందించిన ఈ సంస్కృతిని ఈ దేశ సౌభాగ్యాన్ని మనం కాపాడుకోవాలంటారు. ఎంతో విలువైన మన సనాతన ధర్మాలను మనం నేడు ఆచరించి, తరించాలి ముందు ముందు లన పిల్లలకు భావి భారత పౌరులకు అందించాలనేది రాజుగారి అభిప్రాయం. నేడు W.H.O ఇచ్చిన ఆరోగ్యపు definition ఆ నాడే మన పూర్వీకుల జీవితంలో ఒక భాగమైందంటారు.

అది ఎలాగంటే.... పూర్వీకులు ప్రకృతి ప్రసాదించిన ఆహారం తింటూ, నూనె, ఉప్పు, మసాలాలు లేని ఆహారం మితంగా తింటూ కాయ కష్టం చేసి మంచి గాలిని తీసుకొని, మంచి నీటిని త్రాగి మంచి దేహ ధారుడ్యాన్ని కలిగి శారీరక ఆరోగ్యాన్ని పెంచుకున్నారు, ఇటు శారీరకంగానే కాక అటు మానసికంగాను ఎంతో ఆరోగ్యంతో ఆనందంగా జీవించారు, కుటుంబంలో భార్యాబిడ్డలు, అత్తమామలు, ఆడపడుచులు ఒకటిగా ఉమ్మడి కుటుంబంలో జీవించారు, ఒకరినొకరు ప్రేమను పంచుకున్నారు, ఒకరిపై ఒకరు నమ్మకాన్ని పెంచుకున్నారు, మంచి మానసిక ఆరోగ్యంతో విలసిల్లారు.

కుల వృత్తిలో ఒక్కొక్కరు ఒక్కొక పని చేస్తూ అందరు కలిసి కట్టుగా సహజీవనం చేసారు, ఒకరినొకరు గౌరవించుకున్నారు. అభద్రతా భావం లేకుండా ఒకరినొకరు నమ్మకంతో జీవించారు. మంచి సామాజిక ఆరోగ్యాన్ని వారి స్వంతం చేసుకున్నారు. ప్రకృతిలో పుట్టి, ప్రకృతిలో పెరిగిన మనిషి ప్రకృతి బహు మహిమగలదని గ్రహించాడు. ప్రకృతిలోని పంచభూతాల దయవలననే బ్రతుకుతున్నామని అర్థం చేసుకున్నాడు, ప్రకృతిని అనుసరిస్తేనే మనం ఆనందంగా జీవించగలమని తెలుసుకొని ప్రకృతిని దైవంగా ఆరాధించాడు. మంచి ధార్మికమైన జీవితం గడుపుతూ "ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పొందారు.”

నేడు W.H.O. సూచించిన ఆరోగ్యపు defination ప్రకారం ఆరోగ్యం అనగా శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా ఎలాంటి అనారోగ్యం లేకపోవడమే. ఇది అక్షరాల నాటి జీవన విధానంలోనే అంతర్గతంగా ఉంది. కాని నేడు ఈ defination ప్రకారం కాగడాలు పెట్టి వెతికినా ఒక్కరు కనిపించరంటారు డా| రాజుగారు. నేడు మనం శరీరానికి ప్రకృతి విరుద్ధమైన ఆహారం తింటూ, ప్రకృతి విరుద్ద ఆలోచనలు చేస్తూ, శరీరానికి ఎంత మాత్రం పరిశ్రమ లేకుండా శరీరంలో తయారైన మలినాలను ఏ రోజుకారోజు బయటకు పంపకుండా, మానసిక ప్రశాంతత లేకుండా, అటు ఉద్యోగ వ్యాపారాల్లోను, ఇటు కుటుంబంలోను అభద్రత భావంతో చిన్నాభిన్నమైన అస్తవ్యస్తమైన జీవితాన్ని గడుపుతున్నారు. అనురాగాలు, ఆప్యాయతలకు దూరంగా జీవిస్తూ రోజు రోజుకు క్రొత్తక్రొత్త రోగాలతో మనిషి నేడు సతమతమౌతున్నాడు. ఈ సత్యాన్ని తెలుసుకున్న డా|| రాజుగారు ఆరోగ్యానికి ఓ క్రొత్త నిర్వచనాన్ని ఇచ్చారు. “ఆరోగ్యం అనగా నేడు రోగం లేకపోవడమే కాదు, భవిష్యత్తులో ఏ రోగం రాకుండా ఉండడమని తేలియజేసారు.

డా|| రాజుగారు చెప్పిన ప్రకారం ఎవరైతే శరీర ధర్మాలను సంపూర్ణంగా పూరిస్తూ, శరీరం చెప్పే సూచనలను పాటిస్తూ తదనుగుణంగా జీవిస్తారో వారికి నేడు కాదు ముందు ముందు కూడా రోగం రాదని వారే ఆరోగ్యానందాన్ని పొందగలరని గట్టిగా తెలియజేస్తున్నారు. మనం పంట కోసం దాచుకునే గింజలను సమర్థవంతంగా నిల్వ చేస్తే గింజలకు పురుగు పట్టదని వాహనాన్ని కండిషనర్ గా వాడుకోవడం తెలిస్తే అది ఏనాడూ మూలపడదని, సోకదని అలాగే శరీరాన్ని కూడా నియమబద్ధంగా నడిపినప్పుడు దేహానికి అనారోగ్యం సోకదు అని వారు అనుభవపూర్వకంగా తేలియజేస్తున్నారు.