"అయినప్పటికీ, ఆపాత పురాణమంతా తవ్వడంలో అర్ధంలేదు. మేమూ గొడవను మనస్పూర్తిగా మరచిపోతున్నాం. వారుకూడా మరచిపోవాలని కోరుతున్నాం" అన్నాడు చలపతి.
అతను క్రమక్రమంగా తననేస్థాయికి దిగలాగుతున్నదీ మంజరి గమనిస్తూనే వుంది. చిత్ర మేమిటంటే తను 'కా' దనటానికి అవకాశం లేకుండా చలపతీ, తంగవేలూ కలగలపుకొని మాట్లాడేసుకొన్నారు.
"నేనింకా వారితో మాట్లాడలేదు" అన్నాడు తంగవేలు.
'అబద్దం' అనుకొన్నది మంజరి.
"మాట్లాడి చూడండి! వారంగీకరిస్తే మా కభ్యంతరం లేదు అందుకని ఎవరి గానీ, వారిని బ్రతిమిలాడ నవసరం లేదు. పోటీలవల్ల స్పర్ధల వల్ల నష్టపోయేది మేమే కాదు - వారికి నష్టమే!" అన్నాడు చలపతి.
"మంజరి సంస్కారమున్న మనిషని నాకు తెలుసు. ఆమె చప్పున వొప్పుకొంటుందని కూడా నేననుకొన్నాను. మరి - ఆ జనం అటువంటిది కాదు. అయినా ప్రయత్నిద్దాం. పోతూ పోతూ వీలుంటే కలుసుకొంటాను" అని లేచాడు తంగవేలు.
మంజరి అతన్ని మెట్లదాకా సాగనంపింది.
నిజానికి ఇంతకన్నా ఎక్కువగా రావుగారూ, మూర్తిగారూ ఆరాట పడిపోతున్నారు. తమ కళ్ళముందే చంద్రం చకచకా పైకొస్తున్నాడు. ఇప్పటికే అతనికోసం కొన్ని కంపెనీలు పడిగాపులు కాస్తున్నాయి. రషెస్ చూసినవారు చంద్రం మార్వొలెస్ గా యాక్ట్ చేస్తున్నాడంటున్నారు. అతనికేగానీ సరైన రోల్ ఇస్తే - గ్రెగరీ పెక్ ను బీట్ చేస్తాడని కూడా ఓ డైరెక్టరన్నాడు. అతను ఆషామాషీగా అనేవాడు కాడు. బోలెడంత అనుభవమున్న మనిషి!
"ఉన్న ఫీల్దయితే ఇదే! ఈ కాస్తంత జాగాలో మంది బలిసి పోకూడదు. అనవసరంగా మీరు చంద్రాన్ని పైకి రానిచ్చారు ఇప్పుడతను ఏకు మేకై కూచున్నాడు" అన్నాడు తంగవేలు.
"నిజం!" అన్నాడు మూర్తి.
"నిజం!" అన్నాడు రావు. "అతనైనా పరాయివాడు కాదు. మావాడే తిరగేస్తే నాకూ, మా మూర్తన్నయ్య గారికీ చుట్టరికం కూడా కలుస్తుందనుకొంటాను. అసలు చంద్రాన్ని మేమే లాగుదామనుకొన్నాం. సమయంకోసం చూస్తూ ఉన్నాం. అదృష్టవశాత్తూ పోనీ- దురదృష్టవశాత్తూ అనండి- మంజరి మాతో దెబ్బలాడింది.
ఇంతకన్నా మంచి సమయం.
దొరకదనుకొని, చంద్రానికి నేనే సలహా ఇచ్చాను. అతనా సలహాను అక్షరాలా పాటించాడు. తారాజువ్వలా పైకొచ్చాడు. చంద్రం వచ్చినందుకు నాకు గానీ, మా మూర్తన్నయ్యకుగానీ, కోపం లేదు. అసూయ అంతకన్నా లేదు."
"ఒహ్హొహ్హొహ్హొ! ఓ హాహాహా!" అని నవ్వాడు మూర్తిగారు.
"అవునా! మంజరి ఇంతకన్నా చిత్రమైన సంగతి నాతో చెప్పింది" అని ప్రారంభించాడు తంగవేలు. "విజయకు ఏదన్నా మంచి అవకాశం యిప్పించాలని ఆవిడ చాలా కాలం నుండి అనుకొంటున్నదట. చిన్న చిన్న వేషాలు ఎన్ని వేసినా లాభంలేదనీ ఏదన్నా మంచి రోల్ ఉంటే తప్ప, పైకి రావడం కష్టమని అనుకొని - మీకు మల్లేనే -ఆవిడ కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారట. మీతో తగాదా వచ్చాక తనే విజయను మీ దగ్గరకు పంపిందట. విజయ పైకి రావడంకన్నా తనకింకా జీవితధ్యేయంలేదన్న ధోరణిలో మంజరి మాట్లాడింది. దీనికి మీరేం చెబుతారు?"
తంగవేలు కేసి తిరిగి, రావుగారు చూడకుండా కన్ను మలిపాడు మూర్తి.
"అబ్బా మీరు అసాధ్యులండీ" అని నవ్వేశాడు రావు.
తంగవేలు దులిపిన దులుపుడుకు ఇదెలాంటి సమాధానమో భగవంతుడికే తెలియాలి.
- ఆ సమయానికే అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు మద్రాసులో ప్రారంభమవుతున్నాయి. తలలున్నవారూ లేనివారూ కూడా హడావిడిలో మునిగిపోతున్నారు. ఎక్కడ చూసినా వల్లమాలిన సందడి. ముఖ్యంగా డైరెక్టర్లు. ప్రొడ్యూసర్లూ, కవులూ ఈ సినిమాలన్నింటికి హాజరవడానికి నిర్ణయించుకొన్నారు. ఆ సినిమాల్లోంచి, మనకు ఉపయోగ పడగలిగినంత సరుకును పట్టించుకోవడానికి అంతకన్నా మంచి అవకాశం మరిదొరకదు.
తంగవేలు ఈ సందర్బాన్ని అధ్బుతంగా వినియోగించుకున్నాడు. మోహన్ స్టూడియోస్ లో యేర్పాటైన ఈ ఉత్సవాలకు అందరితో బాటు రావును, మూర్తిని, మంజరిని కూడా ఆహ్వానించాడు. వారెవరో క్రొత్తవారైనట్లూ, అప్పుడే కలుసుకొన్నట్లూ ఒకరినొకరికి పరిచయం చేశాడు తంగవేలు.ఆధోరణిని చూసి -
ముందుగా చుట్టూ ఉన్నవారే నవ్వారు.
మంజరి నవ్వింది. రావు నవ్వాడు.
మూర్తి నవ్వాడు!
"ఇదే సినిమాలోనో నయితే, ఈ పాటికి పూలవాన కురిసేది" అన్నాడొకాయన.
25
అయిదారు వారాల పాటు సినిమా జర్నలిస్టులకు ఊపిరాడనంత పని తగిలింది. వాళ్ళు కలాలూ, కెమెరాలూ, వెంటేసుకొని హీరో ద్వయాన్నీ ఏకైక హీరోయిన్నూ ఇంటర్వ్యూలు చేశారు. ఫోటోలు తీశారు. రకరకాల ప్రశ్నలతోనూ వారి ప్రాణాలు తీశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ముగ్గురూ, సున్నితంగా తప్పుకుపోయారు గానీ, నిలబడిన వారుగానీ, తగిన సమాధానం చెప్పినవారు గానీ వొక్కడూ లేడు! ఎవరయినా ఎలా చెబుతారు? మానిపోయిన పుండును -కనీసం మానినట్లు కనిపిస్తున్న పుండును, మళ్ళా కెలకడం ఏ వోక్కరికి ఇష్టంలేదు.
ఈ సందర్భంలో, శర్మ నుండి ఎక్కడ సపోర్టును ఆశించింది మంజరి. అతని కోసం స్వయంగా కబురు పెట్టింది. ఇంకోసారి పంపించింది. అతను వెళ్ళి మొఖం వేళ్ళాడేసుకొని వచ్చాడు.
"ఏమయింది?" అన్నది మంజరి.
అతను చెప్పే సమాధానం ముందుగా తెలిసి, కూడా ఆమె కింకా ఆశ చావలేదు.
"నాకు కాఫీ కావాలమ్మడూ!" అన్నాడు చలపతి.
"అలాగే!" అన్నది మంజరి.
ఈసారావిడ బెల్ నొక్కలేదు. తనే లోపలికెళ్ళి, రెండు కప్పులతో కాఫీ పట్టుకొచ్చి, వొకటి చలపతికిచ్చి, మరొకటి తను తీసుకొంది.
"ఏదన్నా అర్జంటు పనిమీదగానీ ఉన్నాడా?" అన్నది మంజరి తిరిగీ శర్మగారి విషయాన్ని కదుపుతూ.
"లేదు" అన్నాడు చలపతి పంచెమీదపడిన కాఫీచుక్కను జేబు గుడ్డతో అద్దుతూ "బహుశా అతను మనింటికి రాడనుకొంటాను మంజూ!"
"అదేం?" అన్నదావిడ చాలా తాపీగా.
"ఈ ప్రశ్న నేనూ అడిగాను. అతను, రెండు పున్జీల కారణాలు చెప్పుకొచ్చాడు. ఇంత కాలంనుండి తను జ్ఞాపకం రాకుండా, అంతర్జాతీయ ఫిలిం ఉత్సవాలు జరుగుతున్నప్పుడే శర్మ జ్ఞాపకం రావడానికి కారణాలేమిటన్నాడు. తన కాలాన్ని కాణీకీ, అర్ధణాకూ అమ్మదలచు కోన లేదన్నాడు. ఏది న్యాయమయితే అదంతా రాస్తాననీ, ఇందులో వ్యక్తిగత అభిమానాలకూ చోటివ్వబోనని అన్నాడు."
మంజరి ఏదో ఆలోచిస్తూ, సన్నగా నవ్వి, "ఊఁ ఇంకా" అన్నది.
"నవ్వులాట కాదుమంజూ! అతను అన్నంతపనీ చెయ్యగలడు."
"నెవర్" అన్నది మంజరి. ఈ జన్మలో వాడు మారడు. ఎందుకని నన్నడక్కు చలపతీ! ఆ కారణాలేమో నీకు తెలుసు. కానీకి, అర్ధణాకు అతను కలం అమ్మకపోతే, రూపాయికి అమ్ముతాడు. లేదా పదికి, కాదుకూడదంటే, వంద రూపాయలకు అమ్ముతాడు. ఒకసారి - కిందికి జారడం మొదలయ్యాక - దానికిక అంతమంటూ ఉండదు. మనమిలాంటి మేకపోతు పట్టుదలల్ని ఎన్ని చూశాం కాదు గనుక! వీడు - వాళ్ళందరికన్నా ఘనుడనుకోను......"
"అయినా మనం బతిమాలో బామాలో అతన్ని మంచి చేసుకొనవలసిన అవసరమేముందీ!" అన్నాడు చలపతి.
మంజరి అతని ముఖాన్ని, ఎందుకోసమో వెదికింది! తరువాత కింది పెదవి సుతారంగా కొరుక్కుంటూ రెండు చేతులూ., సోఫాకు అటూ ఇటూ చాపి, కాళ్ళూపుకొంటూ మాట్లాడసాగింది!
"ఈ సంగతులన్నీ నీకు తెలియనవి నేనెలా అనుకోను చలపతీ! నువ్వు కాదని వాదించకు గాని -నిస్సందేహంగా నువ్వు కింగ్ మేకర్ వి రాతిని రత్నంగా, రత్నాన్ని రాతిముక్కగా నువ్వు చేయగలవు చలపతి! నాకా సంగతి ఇప్పుడేంఖర్మం- చాలాకాలం క్రింద తెలుసు."
"ణా కొంప మునిగింది!" అనుకొన్నాడు చలపతి. "ఏదోలే మంజూ! అదంతా పాతకాలపు ముచ్చట" అన్నాడు పైకి చాలా జాగ్రత్తగా ఆచి తూచి పదాలు వేస్తూ.
"కాదు నీలో ఇప్పటికీ, ఆ శక్తి సామర్ద్య్హాలున్నాయి. కాకపోతే.- నేనేమన్నా అనుకొని పోతానేమోనని, నువ్వు తొలగి తొలగి మాట్లాడుతున్నావు. నాకా సంగతి మనస్సులో మెదిలినప్పుడల్లా, ఎంత సంక్షోభించిపోతానో నీకు తెలీదు......చెప్పవచ్చిందేమిటంటే - శర్మతో మనకి నాడున్నంత అవసరం మునుపెన్నడూ లేదుయ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు చాలా దేశాలనుండి ఫిలిం పెర్సనాలిటీస్ వస్తున్నారు. వారందరితోనూ మనం పరిచయం చేసుకోవాలి. ఆ ఇంట్రడక్షన్ ఆ దరిమిలా మనకెందుకైనా ఉపయోగపడవచ్చు. పోనీ -ఎందుకూ పనికి రాదనుకో - మనకు నష్టం కూడా ఏమీలేదు. అవునా" అన్నది మంజరి.
"అవును" అన్నాడు చలపతి ముక్తసరిగా.
మంజరి మరోసారి ఫక్కున నవ్వి, వేళ్ళు మెటికలు విరుచుకొన్నది.
"నువ్వలా ముభావంగా వుంటే ఎలా నానీ! నామీద ఏదన్నా కసివుంటే ఇంకో సమయంలో తీర్చుకోరాదా? ఆ మాటకొస్తే - నాకింత పొగరెక్కడానిక్కూడా నువ్వే కారణం! నేనేదన్నా పొరబాటు పని చేసినప్పుడు - ఆ నిమిశానే, నా ముఖం తిరిగిపోయేలాగా సరిదిద్ది వుండవలసింది. ఇంకోసారి అదే పొరబాటు కమిట్ చెయ్యకుండా వుందేలాగా చూడవలసింది నువ్వే! నేనన్న ప్రతిదానికీ నువ్వు గంగిరెద్దులాగా తలూపడం మొదలెట్టావు. నాలో అహం పెరిగిందంటే - పెరగదా? దానిక్కారణం నేనా?" అన్నది మంజరి.
ఈ ధోరణి చూసి చలపతి ఉక్కిరి బిక్కిరయ్యాడు. ఈ వాగుడంతా నిజమో అబద్దమో తేల్చుకోవడం అతనిక్కూడా సాధ్యం కాలేదు. గుడ్లప్పగించి చూస్తూ కూచున్నాడు.
"మాట్లాడవేం చలపతీ!" అన్నది మంజరి.
"వింటున్నాను మంజూ!"
"అది కాదు చలపతీ! మనం చాలా రోజుల కిందట, ఫారెన్ టూర్ ను గురించి ఏదో అనుకొన్నామనుకొంటాను. ఆ ఆలోచనను మెటీరియలైజ్ చెయ్యడానికి ఇదే మంచి తరుణం. అదేమన్నా మనం చెయ్యగలమో లేదో ఆలోచించాలి" అన్నది మంజరి.
"తప్పకుండా చేద్దాం"
"అలా కాదు. ఈ చేద్దాం - చూద్దాం మాటలంటే నాకు బొత్తిగా గిట్టదు. చెయ్యదలిస్తే గట్టిగా నిలబడి చెయ్యడమే. లేదా - ఆ ఛాయలక్కూడా పోకూడదు. కానీ - ఒక్క సంగతి మాత్రం గుర్తుంచుకోవడం అవసరమనుకుంటాను చలపతీ! ఏదైనా పోటీలో -మనం పాల్గొనడమంటూ జరిగితే - గెలుపు ఖాయమని తెలిస్తే తప్ప - అంత గ్యారంటీ వుంటే తప్ప - లేకపోతే అటుకేసి పోనన్నా పోగూడదు. పోటీలో నిలబడి ఓడిపోవడం కన్నా అసలు అందులో వేలు పెట్టకపోవడమే మంచిది" అన్నది మంజరి.
"దీనికెవరన్నా పోటీవుంటారా?"
"నేను పిచ్చిదాన్ననుకొంటే తప్ప నువ్వాప్రస్న అడిగి ఉండవు చలపతీ? ఎంతమంది ఎన్ని రకాలుగా, ప్రయత్నిస్తారో, తెలియనంత అమాయకుడవా నువ్వు? కానే కాదు. నా లోతులేమిటో తెలిసికోడానికిగాను, అలా కూపీలు తీస్తున్నావు" అన్నదావిడ.
"వాళ్ళకసలా ఉద్దేస్యమున్నదో లేదో మనకింకా తెలీదు. ఒక వేళ వున్నా ఏ సంస్థవారు ఫలానా ఫలానా వారిని పంపాలని నిర్ణయిస్తారో మనకు తోచదు. దీనికొక పద్దతంటూ వుంటుందో లేదో? ఏ విధానం మీద ఈ ఎన్నికను జరుపుతారో తెలియాలి.
ప్రభుత్వమే పంపడం జరిగితే మనం ఇతర దేశాలవారికి హారతులివ్వడంలో అర్ధం లేదు. ఢిల్లీ దేవతల్ను ప్రసన్నం చేసుకోవాలి. దానికిది మార్గంకాదు. బొంబాయిలో నీకు తెలిసినవారు చాలామంది ఉన్నారు గదా! వారికి తెలిసిన యం.పీలు తప్పకుండా వుంటారు. వారి ద్వారా అలా అలా - ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్ళాలి గానీ" అన్నాడు చలపతి.
"యస్" అన్నది మండజరి చిటికవేసి జగన్నాధరధం ఇప్పటికి కదిలిందన్నమాట..... హమ్మయ్య అని నిట్టూర్చిందావిడ. "పోన్లే గానీ బాబూ! అసలు సంగతేదో నీతో చెప్పాను. దీనికి ఇక్కడే మనం తంటాలు పడాలో. ఢిల్లీదాకా పోవాలో నాకు తెలీదు. ప్రభుత్వానికి వోకల్చరల్ డెలిగేషన్ ను, ఇతర దేశాలకు పంపవలసిందిగా మనం చెప్పడం బావుండదు. పత్రికలు చెబుతాయి. ఆ విషయమై ప్రత్యేకవ్యాసాలు రాస్తాయి. అందుకు ప్రభుత్వం వొప్పుకొంటే-"
చలపతి వింటూనే హఠాత్తుగా లేచి కూచున్నాడు.
మంజరి తన ప్రవాహాన్ని ఆపి అతనికేసి చూసింది.
"ఇంకో ప్రమాదం కూడా వున్నది మంజూ! ఆ డెలిగేషన్ లో నువ్వు ఉంటానన్న గ్యారంటీ ఎక్కడిదిట? మనం నిర్మొహమాటంగా చెప్పుకోవాలంటే -ఉత్తరాది ఆర్టిస్టులకు, మనకన్నా ఎక్కువ ప్రామినెన్సు వుంటుందా డెలిగేషన్ లో నువ్వందులో వున్నా- 'మొదలైన వారు' లో వుంటావుగానీ, జామినేటేడ్ ఫిగర్ గా కనిపించవు. అయినప్పుడు - నువ్వామందలో కలిసినా, కలవకపోయినా ఒకటే!" అన్నాడు చలపతి.
అతని ఆలోచనా ధోరణి చూసి మంజరి నిజంగానే విస్తుపోయింది. ఆవిడకు ఫారెన్ వెళ్ళాలన్న ఉబలాటమే తప్ప, ఈ సాధక బాధకాలేమీ ఆలోచించదు.
"నిజమే చలపతీ! దీనికేమిటి చెయ్యడం?" మంజరి. ఈసారి బెల్ కొట్టి పనిమనిషిని పిలిపించింది. అదొచ్చాక "రెండు స్ట్రాంగ్ కాఫీ - సిగరెట్లు, లైటర్, టాబులెట్సు తీసుకురా" అన్నది మంజరి.
చలపతి ఏదో అనబోతుంటే మంజరి వారించింది.
"ముందు కాఫీ తీసుకొని, సిగరెట్ కాల్చనీ చలపతీ, కొంచెం రీఫ్రెష్ అవుతాం."
"అలాగే" అన్నాడు చలపతి.
మంజరి స్వయంగా వో కప్పు చలపతి కన్ధించింది. తనోటి తీసుకొంది. సీసాలోంచి పసుపు పచ్చని బిళ్ళలు రెండు తీసుకొని కళ్ళు మూసుకొని మింగి, కాఫీ చప్పరించింది.
"నేనిప్పుడే అలా వెళ్ళొస్తాను" అని లేచాడు చలపతి.
"ఫర్వాలేదు. అధో సిగరెట్....కాల్చు" అన్నది మంజరి.
తనుకూడా వొకటి అంటించి,. రింగురింగులుగా పొగ వదిలిందావిడ.
'మనమిప్పుడెక్కడున్నామంటే- 'అని క్షణకాలం ఆలోచించిందావిడ. అవును గదూ! ఆమందలో నేనున్నా లేకపోయినా ఒకటేనని నువ్వన్నావు. అది నిజమే ! ఏదీ కాకపోవడం కన్నా. ఆ మాత్రమైనా వుండడం నయం కాదా?" అన్నది మంజరి.
"నా ఆంతర్యం కనుక్కోవడం కోసం అలా అన్నావేగాని, నిజంగా మందలో వొకదానివిగా ఉండాలని నీకున్నదా మంజరీ. నిజంగా చెప్పు? అదే నీ ఉద్దేశ్యమయితే- దానికోసం అట్టే ప్రయత్నాలేవీ అవసరంలేదు."
"మరింకేం చెయ్యను చెప్పు?" అన్నది మంజరి., ముక్కుల్లోంచి పొగను వదిలేస్తూ.
"అంతదూరం మనం వెళ్ళకుండా చూడాలి. ఇన్ని వయా మీడియాల మీద అయ్యే పనులు సాధారణంగా వొడ్డెక్కవు. అందుకొక్కటేమార్గం. మనం చెయ్యగలిగిందేమన్నా వుంటే - ఇక్కడే చేద్దాం."
"అదే! ఏం చేద్దామని?" అన్నదావిడ.
"వస్తున్నాను అంటూ చలపతి, సిగరెట్ నుసిని యాష్ ట్రే లోకి రాల్చాడు. "ప్రభుత్వం సంగతి వదిలేస్తే -మనకు మిగిలిందల్లా - ఆయా దేశాలు మనల్ని ఆహ్వానించడం. అందుగ్గాను ఆ యాదేశాలు - అవును గానీ మంజరీ! నువ్వసలు విషయం యింకా స్పష్టంగా తెల్చనేలేదు. నీకేదేశం వెళ్ళాలని వుంది? ఎంతకాలం ఉందామనుకుంటున్నావు?" అన్నాడు చలపతి.
"ఏ రెండు మూడు మాసాలైనా వుందాం. ఏ దేశాలంటే హాలీవుడ్ వెళ్ళాల్సిందే గదా!"
చలపతి నవ్వాడు.
"హాలీవుడ్ దేశంకాదు మంజరీ! అమెరికాలోని వో భాగం. మనకు మద్రాసు, ఉత్తరాదివారికి బొంబాయి ఎలాంటిదో అమెరికాకు హాలీవుడ్ అలాంటిది!"
"పోనీ అమెరికాయే వెడతాను, వస్తూ వస్తూ, మిడిలీస్టు కంట్రీస్, ముఖ్యంగా ఈజిప్టు చూడాలి. అక్కడిపిరమిడ్సు, స్ఫింక్స్, నైల్ నదీ చూడాలని ఉంది. ఇటాలియన్ తారలను కలుసుకోవాలని అమెరికాలో రెండు నెలలుండి, రష్యామీదుగా, జపాన్ వచ్చి, సిలోన్ లో కొద్దిరోజులున్నాక, తిరిగి - అదీ -నాప్లాను" అన్నది మంజరి.
మధ్యనుండే నవ్వడం ప్రారంభించిన చలపతి, ఆవిడ ఆఖరు వాక్యం కూడా అనేశాక, బలవంతాన నవ్వుకొన్నాడు.
"ఏమిటమ్మా అదీ! మరీ నన్నంత తెలియనిదాన్నిగా చెయ్యకు" అని గారాలుపోయింది మంజరి.
అతిగా నవ్వడంవల్ల చలపతికి కళ్ళలో నీటి జీరలు ఏర్పడ్డాయి. పంచె చెరగుతో అతడు వాటిని అద్దుకొన్నాడు.
"ఒక్కసారి నిన్ను చూస్తుంటే -పసి పిల్లకన్నా అధ్వాన్నంగా కనిపిస్తావు మంజరి! ఇన్ని దేశాలు తిరగడానికి, ఆయా దేశాలవారందరూ, నీకు 'వీసా' లివ్వాలి. ముందుగా మన ప్రభుత్వం, నీకు పాస్ పోర్టు శాంక్షన్ చెయ్యాలి. నీ ప్రయాణానికి పారెన్ ఎక్సేంజీని గ్రాంటు చెయ్యాలి. దీనికంతా బోలెడంత తతంగం ఉంటుంది." అన్నాడు చలపతి.
"అయితే, మనకా ఆశ లేదన్నమాటే గా!"
"అలా కాదు. ముందుగా నువ్వు ఏదో వోదేశం వెళ్ళిరా. తరవాత సంగతి చూచుకొందాం" అన్నాడు చలపతి. అతను సిగరెట్ను యాష్ ట్రేలో పారేసి పోగారాకుండా, పైన అగ్గిపెట్టేను మూతగా పెట్టాడు. "ఎవరు ఏ రోజు కేలా మారుతారో. మనం చెప్పలేం మంజరీ! అదృష్టవశాత్తూ ఈ ప్రయత్నం సక్సెస్ అయితే - మొట్టమొదటి సారిగా విదేశాల కెళ్ళిన తెలుగు ఆర్టిస్టులు నువ్వే అవుతావు" అన్నాడతను.
"అదంతా నీ చేతుల్లోనే ఉన్నది చలపతీ!" అన్నది మంజరి అతనికి ఇంకాస్త 'కీ' ఇస్తూ -అవసరమైతే మనం కొంత ఖర్చు పెడదాం....."ఎంత" అని అడక్కు. ఎన్ని వేలయినా వెనక్కు చూడకు. మన డబ్బుతో మనం వెళ్ళి చూసి రావడం కన్నా, ఇంకో దేశంవారు వారి ఖర్చులమీద మనల్ని మనదేశంలో పర్యటించమని ఆహ్వానించడమే మనకు గొప్ప. అలా జరిగేలాగా మనం చూసుకోవాలి..... ఇంద... ఈ చెక్కులన్నింటిమీదా సంతకాలు చేశాను,. ఎంతున్నదీ నీకు తెలుసుగదా! ఎలా చేస్తే పనవుతుందో అలాచెయ్యి."
చెక్ బుక్ అతనున్న సోఫామీదికి విసిరేసింది మంజరి. అతనోసారి దానికేసి చూసి, తిరిగి ఇంకో సిగరెట్ అంటించాడు.
"ఈ ఆలోచన మనొక్కరికే వచ్చివుంటుందని నేననుకోను" అన్నాడు చలపతి.
"నిజమే! మనకన్నా తెలివైనవారు., చాలామందీ మద్రాసులో ఉన్నారు చలపతీ! వాళ్ళల్లో కొందరీపాటికే గాలాలు, వలలూ, విసిరికూడా ఉండవచ్చు. మనం ఆలస్యంగా నడక ప్రారంభించాం. వారిని కలుసుకోవడమే కాదు -వారికన్నా ముందుగా మనం పోల్ ను తాకాలి. అంటే 'తరాట్' మానేసి 'గాలప్'కొట్టాలన్న మాట" అని సలహా ఇచ్చింది మంజరి.
చలపతి చెక్ బుక్ ను చేతికి తీసుకొని, ఓక్షణం దానికేసి చూసి, మంజరి కివ్వబోయాడు.
"నీ దగ్గర ఉంచుకో చలపతీ!" అన్నది మంజరి, కళ్ళింత చేసుకొని.
"ఎక్కడున్నా వొకటే! అవసరమైనప్పుడల్లా, నేనునిన్నడిగి తీసుకొంటూనే ఉంటానుగా!" అన్నాడు చలపతి ఆమె కళ్ళల్లోకి గుచ్చి గుచ్చి చూస్తూ.
మంజరి మాట్లాడలేదు. సోఫాలోంచి లేచి, కిటికీ దగ్గరకెళ్ళి నిలబడింది. రోడ్డుమీద, ఓ యాభైమంది కుర్రకారు, ఆమెను చూడాలని కనిపెట్టుకొని ఉన్నారు. మంజరి ముఖం కిటికీలోంచి కనబడగానే వారందరూ ఒక్కసారిగా గొల్లుమని అరిచారు. మంజరి ఠపీమని రెక్కలుమూసి ఇవతలి కొచ్చింది. ఆవిడ కళ్ళనిండా నీరు నిండి పొర్లిపోవడం చలపతి చూశాడు.
"ఇదేమిటి?" అన్నాడతను, ఒకడుగు ముందుకొచ్చి.
మంజరి పలకలేదు. గబగబా అతని దగ్గరకొచ్చి, చేతిలోంచి చెక్ బుక్ లాక్కుని దూరంగా విసిరి పారేసింది.
"వెళ్ళు, తక్షణం ఇక్కన్నించి వెళ్ళిపో నాకు ఎక్కడికెళ్ళాలనీ లేదు. ఏమి చెయ్యాలనీ లేదు. నీ ముఖం నాకిక చూపించకపో, పోవేం?" అన్నది భోరుమని ఏడుస్తూ.
చలపతి తలొంచుకొన్నాడు. అతని ముఖం చిన్నబోయింది. మంజరి వో అడుగులో అతని దగ్గరికొచ్చింది. రెండు చేతులూ అతని రెండు భుజాలమీద వేసి, గుండెలమీద తలపెట్టి "ఫో, ఇక్కన్నించీ వెంటనే ఫో" అంటూ ఏడ్వసాగింది.
చలపతి ఆమె ముఖాన్ని తనవేపు తిప్పుకొని, కుచ్చిళ్ళ చెంగుతో కన్నీరు తుడిచాడు. ఆ క్షణాన అతనిలోని ఉద్రేకాలన్నీ నిద్రపోతున్నాయి.
* * * *
శర్మను రప్పించడంకోసం, మంజరి మరొకసారి చలపతిని పంపిచూసింది. అయినా శర్మరాలేదు. తను రానని కూడా స్పష్టంగా చెప్పాడు.
"ఆఖరి సారిగా నేనూ ప్రయత్నించి చూస్తాను" అన్నది మంజరి.
"నువ్వా? వాడికోసం పోతావా?" అన్నాడు చలపతి.
"ఏం?" అన్నది మంజరి.
"వాడి దృష్టిలో చులకనయి పోమా?" అని తన సందేహాన్ని వెల్లడించాడు చలపతి.
"మహమ్మద్ కొండదగ్గర కెడితే, కొండకే నామోషీగానీ, మహమ్మద్ కేమీ ఆ అగౌరవం కాదు. మన కతనితో కట్టుకుపోయినంత పని ఉంది. సమయం చూసి బెట్టు చేస్తున్నాడు. మనపని తీరిందాకా మనకు తప్పదు. మరి పనయ్యాక, మళ్ళాలేవకుండా తొక్కేద్దాం. నా మంచితనమే వాడికి తెలుసుగానీ, రెండో భాగం, తెలీదు. ఆ తఢాకా ఏమిటో వోసారి రుచి చూపిస్తాను" అన్నది మంజరి.
"కొంపదీసి వాడితో దెబ్బలాడి గానీ రావుగాదా?" అన్నాడతను.
"దానికైనా వాడికి కొంత యోగ్యత ఉండాలి. ఈ శర్మ కదికూడా ఉన్నదనుకోను"
మంజరి టాయిలెట్టవడానికి పక్కా గంట పట్టింది. పోర్టికోలో కారువచ్చి ఆగి ఉంది. డ్రైవర్ తలుపులు తెరచి సిద్దంగా ఉన్నాడు. మంజరి మెట్లు దిగడం చలపతి చూశాడు. ఛరాలునలేచి, మెట్ల చివరికొచ్చి నిలబడ్డాడు.
"అతను రానంటాడేమోనని భయంగా ఉంది. అనవసరంగా నీ మనస్సు నొచ్చుకోవడం నాకిష్టంలేదు" అన్నాడు చలపతి.
"చూస్తాను" అన్నది మంజరి.
కారు -ఓ చిన్న కుదుపు కుదిపి, సిమెంటు రోడ్డు మీదుగా వీధి గేటు దగ్గరకొచ్చింది. అక్కడ చాలామంది, ఆమె దర్శనం కోసం పడిగాపులు కాస్తున్నారు. గుర్ఖా వాళ్ళు అదిలించినా కదలడం లేదు. తనను చూసి 'ఓ' మనిగోల చేసిన వారందరివేపూ తిరిగి, మంజరి 'టా టా' చెప్పి, నవ్వుకుంటూ సీటుకు చేరగిల బడింది.
స్పీడు తగ్గించి మంజరివేపు తిరిగాడు డ్రైవరు.
"శర్మ దగ్గరకు - అదే - పేపరు శర్మ"
డ్రైవర్ యాక్సిలేటర్ మీద వత్తిడి ఎక్కువ చేశాడు. కారు సర్రున రోడ్డుమీద జారిపోతోంది.
"తలుపులు వేసున్నాయండీ" అన్నాడు డ్రైవరు. రూముకేసి చూస్తూ.
ఈ వేళప్పుడు, ఎక్కడికి వెళ్ళడు. ఒకవేళ లోపలగానీ నిద్రపోతున్నాడేమో మరి అదేం - తాళం కూడా వేసినట్లు లేదే!
ఆవిడన్నదంతా నిజమే! శర్మ అమ్ముడు గాని పేపర్లను పక్కగా పరచుకొని, పడుకొని నిద్రపోతున్నాడు. అలాంటివే రెండు కట్టలను, తలకిందొకటి కాళ్ళకిందొకటి వేసుకొన్నాడు.
"మీకోసం అమ్మగారొచ్చారు" అన్నాడు డ్రైవర్.
శర్మకు మత్తంతా వొదిలిపోయింది.
"వస్తున్నానని చెప్పు" అంటూ డ్రైవర్ని పంపేశాడు,
గబగబా కూజాలో నీళ్ళు గ్లాసులో వొంపుకొన్నాడు. ముఖం కడుక్కుందామంటే, తలుపు తీసుకొని బయటికి పోవాలి. బయట మంజరి ఉన్నది. ఈ ఆకారంలో ఆమెకు కనిపించడం శర్మకిష్టంలేదు. లోపల కడుక్కుందామంటే, గదినిండా పత్రికలే అందుకని, జేబు గుడ్డ గ్లాసులో ముంచి ముఖం తుడుచుకొన్నాడు. పైజమా వేసుకొన్నాడు. లాల్చీ తొడుక్కున్నాడు. ఓ పేపరు పెట్టి చెప్పులమీద దుమ్ము దులుపుకున్నాడు. గబగబా తలకింత నూనె పట్టించి, నున్నగా దువ్వుకొన్నాడు.
ఈలోగా డ్రైవర్ నాలుగయిదు సార్లయినా హారన్ మోగించి ఉంటాడు.
శర్మ గదికి తాళంవేసి, తాళం చేతులు వేలికి తగిలించుకొని గుండ్రంగా తిప్పుతూ, దూరం నుండే 'హలో' అన్నాడు.
మంజరి తను పక్కకు జరిగి కారు తలుపు తీసింది.
శర్మ కారుదగ్గరకొచ్చి, వంగి మంజరికి నమస్కారం చేశాడు.
"నమస్కారం శర్మగారూ! బాగున్నారా?" అన్నది మంజరి.
"మీదయవల్ల -ఇలా ఉన్నాను" అన్నాడు శర్మ , పొడి పొడిగా. "ఇలా దయచేశారేం! ఏదన్నా పనిమీద పోతూ-"
"కాదయ్యా శర్మాజీ! మీకోసమే వచ్చాను....రండి! ముందు కాఫీ తాగాలి"
"నేరాను" అందామనుకొన్నాడు శర్మ.
కానీ ఆమాట అనలేదు. నిశ్శబ్దంగా కారులోకొచ్చి మంజరి పక్కనే కూర్చున్నాడు.
"హోటల్ పెగాసన్" అన్నది మంజరి.
శర్మ ఇంకా తాళం చెవులు, వేలికి తగిలించుకొని తిప్పుతూనే ఉన్నాడు.
మంజరి నవ్వు నాపుకొంటూ "ఇంకా చిన్నపిల్లల చేష్టలు పోకపోతే ఎలా శర్మాజీ! ---ఆ తాళాలు తీయడం మానేయలేవూ?" అన్నది.
శర్మ వాటిని జేబులో వేసుకొన్నాడు,.
"అలాగే ఇంకో చిన్న రిక్వెస్టు"
శర్మ మాట్లాడలేదు. ఊరికే ఆమెకేసి చూశాడు.
"మీరు తల దువ్వుకోవడం మానేయాలి. నున్నగా తల దువ్వుకుంటే మిమ్మల్ని గుర్తుపట్టడం చాలా కష్టం. అదీగాక - నూనె రాసో రాయకుండానో -జుట్టు - ఇంతెత్తున ఈతపొదలాగా ఉంటే తప్ప జర్నలిస్టుని లోకం అనుకోదు. మిమ్మల్ని చూస్తుంటే - ఏ సమస్యా లేనివారికిమల్లే - చాలా తాపీగా -"
పెగాసన్ గార్డెన్ లో కారాగింది.
"నువ్వెళ్ళు కారు నేను తీసుకొస్తాను" అన్నది మంజరి.
ద్రైవాట్ 'కీ' యిచ్చి, సలాం చేసి మరీ పోయాడు.
"రూం నెంబర్ ఫార్టీ త్రీ ఈజ్ ఎవైలబుల్ మేడం" అన్నాడు హోటల్ మేనేజరు.
"రూమెందుకూ? మనం వెంటనే పోతున్నాంగా!" అన్నాడు శర్మ.
"ఈ కాస్సేపే అక్కడ కూచుందాం" అన్నది మంజరి.
అప్పటికే హోటల్లో జనం చూపులు ఆమెచుట్టూ వలల్లా అల్లుకు పోతున్నాయి. మంజరి తలొంచుకొని 48వ నంబరు గదికేసి నడిచింది.
"ఏమిటిదంతా?" అంటున్నాడు శర్మ.
దానికి సమాధానం, ఆవిడ గదిలోకొచ్చి కుర్చీలో కూచున్నాక గానీ చెప్పలేదు.
"ఎందుకయ్యా శర్మాజీ అలా భయపడిపోవటం. నేను నిన్నేం చేస్తాను గనక? యస్....కమిన్" అన్నది మంజరి.
బాయ్ తలుపు కొద్దిగా తెరచి, మెనూకార్డు, ట్రేలో పట్టుకొచ్చాడు.
"ఏం కావాలి శర్మాజీ?"
"ఏదో చెప్పండి!"
"నాకు చెత్తపడాలి ఆకలేస్తున్నది బాబూ! స్ట్రాంగ్ టిఫెను నీ యిష్టం వచ్చిందేదో పట్టుకురా, కాఫీకూడా."
"ఈ కాస్త భాగ్యానికి రూమెందుకండీ తీసుకోవడం?" అన్నాడు శర్మ.
"అంటే?" అన్నది మంజరి సుతారంగా నవ్వుతూ. "కనీసం రూం తీసుకొన్నందుకైనా, ఏదో జరగాలంటావు అంతేనా?"
ఇలా వ్యవహారం పెడతిరుగుతుందని శర్మ అనుకోలేదు. అతను కూడా నవ్వాడు.
"ఇదివరకెప్పుడో నీతో అన్నానానుకొంటాను. నువ్వు నా కన్నా చిన్నవాడవు కాకుంటే, నిన్ను పెండ్లాడి ఉందునని" ఆ మాటకు నేనిప్పటికీ కట్టుబడే ఉన్నాను" అన్నది మంజరి పకపకా నవ్వుతూ. "నామీద కోపంతో మా యింటికి రాకపోతే పోయావు. కనీసం మా వసంత కోసమన్నా రాకూడదా? అదేమో నువ్వంటే అంగలార్చుకు బోతుంటుంది. మరి - తమరేమో ఇలా చెట్టుకొమ్మెక్కి కూచుంటున్నారు."
బాయ్ టిఫిన్, కాఫీ కూడా పెట్టుపోయాడు.
"నీకు ఫోను లేకపోవడం, నా ప్రాణానికొచ్చింది శర్మాజీ! నా సుఖంకోసమైనా నీ గదికి ఫోన్ పెట్టించాలి.... చలపతికి యింకా మానర్స్ తెలీక పోవడం నా ఖర్మం. ఎవరితో ఎలా మాట్లాడాలో అతడికి తెలీదు. ఆ మాటంటే వల్లమాలిన కోపం. నీకేదో అది చేశానని యిది చేశాననీ లగ్గలకెత్తిపోతాడు. పోనీ పంపేద్డామంటే, నీబోటి వాళ్ళంతా చీవాట్లు వేస్తారేమోనని భయంగా ఉంది"
"ఏమయింది?" అన్నాడు శర్మాజీ.
"తెలివి తక్కువ వెధవల్ని ఎక్కడికి పంపినా ఏమవుతుందో అదే అయింది. నిన్ను తీసుకురమ్మని అరడజను సార్లు పంపించాను. నువ్వు రానన్నావని చెబుతాడు. "ఎందుకని?" అంటే చెప్పడు. ఏదన్నా పని తొందరలో ఉండి రానని నువ్వన్నావే అనుకో - తీరా నేరమ్మని చెప్పొచ్చు గదా! కనీసం ఆ తెలివికూడా మావాడికి లేదనుకో శర్మాజీ" అన్నది మంజరి.
శర్మ ఏమనుకోన్నాడో గానీ, ఏమీ మాట్లాడలేదు.
"నీతో మరో పనేదో ఉన్దికాదు. నువ్వు అయిదారు మాసాల నుండీ సరిగా మాయింటికి రావడంలేదు. లేదని, మా వసంత కూడా చెప్పింది. ఎక్కడన్నా కలిస్తే రమ్మనమని కూడా దానితో అన్నాను. అదికూడా అట్టే బయటికి పోవడం లేదు. నాకీ దిక్కు మాలిన సమస్యలతో తల నాదెక్కి పోయింది. ఏ గోడకన్నా తలబాదుకొని చచ్చిపోదామనిపించింది శర్మాజీ! నీ కోసం రెండు మూడు దపాలు మనిషిని పంపించాను. ఓ సారి నేనే వచ్చాను. తలుపులు తాళాలు వేసి వున్నాయి. 'మామ్మ'నడిగితే తెలియదంటుంది. నువ్వు మరీ నల్లపూసవయి పోయావేం? నా మీద గానీ కోపమా?" అన్నది మంజరి.
"కోపమే!" అన్నాడు శర్మ.
మంజరి నిర్ఘాంతపోయింది.
"మీరు పెద్దవారు, నేను అల్పున్ని. మీకు కోపం వచ్చినా నాకు కోపం వచ్చినా, నేనే తగ్గి ఉండాలి. అదీగాక -నాతో అవసరం మీకింకా ఉన్నదని నేననుకోవడం లేదు. ఎప్పుడో వొకప్పుడు మీతో "వెళ్ళిరండి" అన్న ముక్క అనిపించుకో వలసిన వాణ్ణే. ఆ మాట మీరనకముందే, నేను జాగ్రత్తపడ్డాను. ఇందులో తప్పేమిటట?" అన్నాడు శర్మ.
క్షణంలో అతని కళ్ళు కోపంతో భగభగలాడాయి. మంజరి నవ్వింది. అయితే అది నీకుమల్లే లేదు. ఇంకేమీ చెయ్యలేక చేసిన పనిలాగా ఉన్నదా నవ్వు.
"పొరబాట్లు జరగవని కాదు గానీ శర్మగారూ ఎక్కడ జరిగిందో చెబితే సరిదిద్దుకోవడానికి అవకాశ మిచ్చినవారవుతారు. అదేమిటో బయట పెట్టకుండా నన్నిలా కొరత వేయడం ధర్మంకాదు" అన్నది మంజరి.
శర్మ మరింత రెచ్చిపోయాడు. కోపంతో అతని చేతులు, కాళ్ళు వణకడాన్ని మంజరి గ్రహించింది.
తను విదిపే ఎంగిలి మెతుకులు ఏరుకుని తిని, తోకాడించ వలసిన కుక్కలాంటి వాడీ శర్మ. తనమీద కారాలూ, మిరియాలూ నూరుతున్నాడిప్పుడు. తను - సాచి లెంపకాయ కొడితే,. అడిగే దిక్కులేదు. ఆ వనజాక్షిమల్లే నలుగుర్ని పెట్టించి కాలో, చెయ్యో విరిచేసినా, అడిగే నాధుడు లేడు. కానీ -అంతదాకా పోవడమెందుకనేదే తన బాధ సౌమ్యంగా ప్రయత్నించడానికింకా అవకాశాలున్నాయని తన నమ్మకం, ఆ ఆశ కాస్తా పోయిన మరుక్షణం వీణ్ని నల్లిని నలిపినట్లు నలపడం తనకు క్షణాలమీద పని!
"మాట్లాడరేం?" అన్నాడు శర్మ పెద్దగా.
మంజరి సన్నగా నిట్టూర్చింది.
"ఏం చెప్పాను శర్మాజీ! నాకు రోజులు బాగాలేవు. ప్రతివారూ నామీద, పొగలూ, సెగలూ చెరిగిపోస్తున్నారు....వీటన్నింటికీ ప్రత్యక్షంగా నేను కారణం కాకపోవచ్చు. కానీ బాధ్యత నాదే! నాదో ఊరునుంచి, ఓ అభిమాని, అప్పటికి 179 సార్లు నా ఫోటో కోసం ఉత్తరాలు రాశాడుట. ఆ ముక్క నేను నమ్మనేమోనని అతను సర్టిఫికెట్ ఆఫ్ పోస్టింగ్ కాగితాలన్నీ స్వయంగా పట్టుకొచ్చి నాకు చూపించాడు. అంతదాకా నిజంగా నాకా సంగతే తెలీదు. ఇదేమిటని చలపతిగారి నడిగితే పలకడు. చివరికి అతన్ని క్షమాపణ వేడుకొని, అతనదిగిన ఫోటో లన్నింటిమీద సంతకాలు చేసి, రానూ పోనూ చార్జీలిచ్చి మరీ పంపించాను. నిజానికి చలపతి క్షమాపణ చెప్పాలి. కానీ, నైతికంగా బాధ్యత నాది కనక, నేనే ఆపని చేశాను. ఎందుకు చెబుతున్నానంటే - "అని తగ్గుతూ ఆగిపోయింది మంజరి.
"మీ ఇబ్బందులేవో మీకుంటాయనుకోండి. పీతకున్న సమస్యలు పీతకూ ఉంటాయి మరి నేనూ కాదనడంలేదు.....పోదామా?" అని లేచి నిలుచున్నాడు శర్మ.
మంజరి అతని భుజాలమీద చేతులువేసి, బలవంతాన అదిమి, కుర్చీలో కూచోబెట్టింది. తనుకూడా అతనికి ఎదురుగ్గా కూచుంది. ఆమె దగ్గర సిగరెట్లు లేవు. వెదుక్కుంటుంటే శ్రమ అందించాడు.
"ఏం? బ్రాండ్ మార్చారేం?" అన్నది మంజరి.
"డబ్బుల్లేక -"అన్నాడు శర్మ.
"ఏం చంపుతున్నారు �
