Previous Page Next Page 
పాకుడురాళ్ళు పేజి 44

చలపతి ఇంకేమీ అనలేదు.
"పకీరయ్య ఎలా ఉంటాడు?" అన్నది మంజరి.
"ఎలా ఉన్నా అతను చేస్తానన్న దేమిటో చేశాడు మంజరీ! నేను కాస్త కనుగలిగి ఉన్నట్లయితే కళ్యాణికి మరణం సంభవించి ఉండేది కాదు. నేను అనుమానించానే గానీ -ఇంత అఘాయిత్యానికి అతగాడు పూనుకొంటాడనుకోలేదు. సరే - జరిగిందేదో జరిగింది. ఇప్పుడెవరు వచ్చినా కళ్యాణిని బ్రతికించలేరు. కావలసిందల్లా- మనమీ వ్యూహంలో చిక్కుకోకుండా ఉండటం" అన్నాడు చలపతి.
"మామకేం సంబంధం చలపతీ? మనమెందుకు చిక్కుకొంటాం?" అన్నది మంజరి!
"రామాయణమంతా వినికూడా సీతకూ రాముడికీ ఉన్న సంబంధమేమిటంటే నేనేం చెప్పను మంజరీ! కళ్యాణి సహజంగా మరణించలేదనీ, ఎవరో ఆమెను హత్య చేశారనీ అందరూ అనుమానిస్తున్నారు. హంతకుడెవరో కూడా పోలీసులు కొద్దిరోజుల్లో తెలుసుకుంటారు. నీకూ, ఆవిడకూ మాంఛి దోస్తీ గనక - నీనించి -ఈ కేసుకు సంభందించిన సమాచారమేమన్నా రావచ్చునని పోలీసులనుకోవడంలో తప్పులేదు. వాళ్ళడితే ప్రశ్నలేలా ఉంటాయంటే- చివరికి నువ్వే కళ్యాణిని హత్య చేసినట్లు - నీచేతనే చెప్పిస్తారు. జాగ్రత్తగా ఉండటం మంచిది" అన్నాడతను.
"నాకేమీ పాలుపోవడంలేదు చలపతీ! అంతా అమెనయంగా ఉంది. ఏ మనాలో, ఏమనగూడదో కూడా నాకు తోచకుండా ఉంది... ఈ క్షణాన నేనుత్త రబ్బరుబొమ్మను. నువ్వేదారంలాగితే, అ భాగం కదులుతుంది. నాకేమీ తెలీదు.నువ్వేం చెయ్యమంటే అది చేస్తాను. ముంచుతావో, తెలుస్తావో నీదేభారం?" అన్నది మంజరి కళ్ళుముసుకొని.
చలపతి కిందిపెదవి కొరుక్కుంటూ తనలో తనే నవ్వుకొన్నాడు.
                                                                      20
మంజరి మీద తనకున్న యావత్తు కాసినీ తీర్చుకోవడానికింతకన్నా మంచి సమయం చలపతికి మరి లభించదు. అతనికి వొకటి రెండుసార్లు దెబ్బతీద్దామా అనిపించింది. కానీ ఆ ఆలోచనను అతను అణగదొక్కి పారేశాడు. పగ తీర్చుకోవాలన్న స్వభావం మనిషిలో ఉండటం అతని అభివృద్ధి కెంతమాత్రం దోహాదకారికాదన్న సత్యం, అతను అనేక సంధర్బాలలో రుజువుచేసుకొన్నాడు. ముఖ్యంగా సినిమా రంగంలో "డీ" అంతే "డీ" అనడం బొత్తిగా లాభం లేదు.ఏ నిమిషాన, ఎవరు ఏమవుతారో తెలీదు. ఇవ్వాళ ఎందుకూ పనికిరాడనుకొన్న వాజమ్మ, ఆ మర్నాటి ఉదయానికల్లా ప్రముఖ వ్యక్తయికూచుంటున్నాడు. ఈ రోజు రాత్రి పది రూపాయలకు వోళ్ళప్పగించి నావిడ, రేపీవేలకు గొప్ప స్టారాయి కూచుంటున్నది. నిన్న ఒక్క పిక్చరుకు యాబైవేలు తీసుకున్న డైరెక్టరుకు రేపు మంచినీళ్ళు పుట్టుకపోతే ఆశ్చర్యం లేదు. అదేమిటన్న ప్రశ్నకు జవాబులేదు. ఇదింతే!
మజరిని తక్కువ అంచనా వేయడం పోరాబాటుని, చలపతికేనాడో తెలుసు. తన శత్రువును గురించి సరైన అంచనా వేసుకోలేనివాడు, పోరాటంతో ఛస్తే విజయాన్ని సంపాదించుకోలేడు. అవిడకున్న పరపతి కూడా తక్కువది కాదు. ఇప్పటికయినా, మంజరికొచ్చిన చిక్కులేమిలేవు. పోలీసులు తమ వృత్తిధర్మంగా,అందరితోబాటు మంజరిని కూడా అనుమానించారు. రేపో ఎల్లుండో నిజం తెలియకపోదు. మంజరిమీదున్న అనుమానం రహితంకాకనూపోదు. ఉన్న చిక్కల్లా అసలైన హంతకుడు పట్టుపడటంవరకే! అదేదో ఈ సరికే ప్రారంభమయింది పోలీసు కుక్కలకోసం కబురువెళ్ళింది కూడాను.
ఈ కాస్తభాగ్యానికిగాను తను మంజరిని నొక్కి పారేయడం సబబు కానేకాదు.సమయం చిక్కినప్పుడు తనను నామారూపాలు లేకుండా మంజరి చేయగలదు. తనేప్పుడో చేసిన పనికి కళ్యాణి- చచ్చిందాకా తనను సాధిస్తూనే ఉంది. ఆ అనుభవం నుండి తను పాఠాలు నేర్చుకోకపోవడం అనుచితం.
"ఏమిటాలోచిస్తూన్నావు?" అన్నది మంజరి.
చలపతి సిగరేట్ వెలిగించాడు.
"ఏదీ?" అంటూ చెయ్యి చాపింది మంజరి.
చలపతి ఆవిడ పెదవులకు తనే సిగరేట్ అందించి లైటర్ తో వెలిగించాడు.
"మనిషి- అలవాట్లుకు ఎంతగా బానిసయి పోయ్యాడో చలపతీ! ఇందాకణ్నీంచీ సిగరేట్ కాల్చకపోయేసరికి, నరాలన్నీ జివజివలాడిపోతున్నాయి. ఈ అంతలోనే పోను మోగింది.
"చూడు" అన్నది మంజరి.
చలపతి ఆవిడ కళ్ళలోకి చూశాడు.
"అలా చూడకు బాబూ! ఈ క్షణాన, నేను సముద్రమంత భయంలో మునిగి ఉన్నాయి. ప్లీజ్.... అదేదో చూడు నాప్రాణాలింకా తోడేయకు."
చలపతి లేచి రిసివర్ అందుకున్నాడు. "హలో" అని, అవతలనించి మాట్లాడే గొంతువిని' నిర్విణ్ణుడయిపోయాడు. ఒక్కాసారిగా అతనిలో వచ్చిన మార్పు చూసి, మంజరి జావలాగా జారిపోయింది.
"ఎవరు?" అన్నది మంజరి పొడారిపోయిన గొంతుకతో. మళ్ళీ పోలీసులు గానీ.."
చలపతి మౌత్ ఫీసుకు చేయ్యడ్డుపెట్టి "కాదు మంజరీ! పకీరయ్య" అన్నాడు.
మంజరి కళ్ళు భయంతో ఏరు పెక్కిపోయాయి.
"ఏదో మాట్లాడేసెయ్యి. అంతే!" అని సోపాలో, పడుకుని,ముఖాన్ని చేతులతో కప్పేసుకొన్నది.
ఈ లోగా అవతలనించి "హలో హలో హలో" అని ఇకటే గోల. చలపతికింకేమీ తోచలేదు. మౌత్ ఫీసుకుఅడ్డువున్న చెయ్యితీసి "చెప్పండి" అన్నాడు.
"హలో, అని ఇంతసేపాగారేం? సరే - మీరూ, మంజరీ,వోసారి కళ్యాణి ఇంటికిరండి! దాక్టారు పరీక్ష అయిపోయింది. అనుమానితుల్లో కొందర్ని అరెస్టుచేశాం. ఇంకొందరి కోసం వెదుకుతున్నాం"అన్నది అవతలి గొంతు,
"మంజరి రాలేడు. నేనొక్కణ్నీ వస్తాను.సరిపోదా? అన్నాడు చలపతి.
"ఏమటిది?" అన్నది మంజరి లేచికూచుని.
చలపతికి మౌత్ పీసుకు మళ్ళా చెయ్యడుపెట్టాడు   
"పకీరయ్య - నిన్నూ నన్నూ రమ్మంటున్నాడు. అడ్రసుకూడా చెప్పాడు. మనతో ఏదో మాట్లాడాలిట.వెంట ఎవర్నీ తీసుకురావద్దనీ, వొంటరిగా రమ్మానీ అంటున్నాడు,నీవు రాలేవన్నాను" అన్నాడు చలపతి.
"నువ్వూ పోవాకు చలపతీ!" అన్నది మంజరి.
ఈ లోగా అవతలనించి వొకటే పిలుపు.
"మీ ధోరణి చూస్తుంటే ఏదో కుట్రచేస్తున్నట్టుగా ఉన్నది. అడిగిందానికి సమాధానమివ్వడానికి ఇంతఆలస్యం దేనికీ?" అన్నాడు పోలీసాఫీసరు.
"మరేం లేదండీ! మీరు చెప్పిన సంగతులు మంజరిగారికి చెబుతున్నాను.... ఆమె భాగా తీసిపొయ్యారు తనురాలేననీ, మీకు ప్రత్యేకంగా చెప్పమన్నారు... సరే! అలాగే!" అని ఫోనుపెట్టెశాడు చలపతి.
పదినిమిషాలకల్లా పోలీసువారు రావడం మంజరి చూసింది.
"మళ్ళా పోలీసులోచ్చారు" అన్నదావిడ విహ్వాలస్వరంతో.
"వచ్చారు. ఈ గొడవ ఏదో విధంగా తీరిపోయేవరకూ, మనకీ బెడద తప్పదు" అన్నాడు చలపతి."ఊఁ... లాభంలేదు మంజరీ! మన ఇబ్బందులేవీ పోలీసులకు పట్టవు. వాళ్ళ డ్యూటీకి భాననం కాకుండా వాళ్ళు చూసుకోవాలి గదా!"
తలుపు చప్పుడయింది.
"పోలీసులోచ్చారు. వాకిలి దగ్గరున్నారు" అంటూ తలుపుతీశాడు చలపతి. అతనన్నది నిజమే! ఇద్దరు పోలీసులు వాకిలి దగ్గర నిలబడి, మంజరీకి, చలపతికీ శాల్యూట్ చేశారు.
"అయ్యగారు రమ్మంటున్నారండీ!"
మంజరీ, చలపతీ నిశబ్దంగా మెట్లు దిగారు.కారులోకూడా ఎవ్వరూ మాట్లాడలేదు. మంజరి,కారు కుదుపుకు ఊగిపోతూఉంది, చలపతి పెదవులు ఎండిపోయాయి.
"రండీ!" అంటూ తలూపాడు పోలీసాఫిసర్. "మీరింక దాహనానికి ఏర్పాట్లు చేసుకోండి. ప్రస్తుతానికింతే! అవసరమయినప్పుడు కలుసుకొంటాను."
"అదేదో నువ్వేచూడు చలపతీ!" అన్నది మంజరి.
"అలాగే!" అన్నాడతను, అమజరి సన్నగా నిటూర్చి, "నాబాగ్ లో కి ఉంది. బీరువాలో డబ్బుంది... నేనిక్కడే ఉంటాను... నువ్వింటికెళ్ళి పట్టుకురా. నేరాలేను,వోపికలేదు".
మరీ నీరసంగా ఉన్నారా? ఏమన్నా తీసుకొంటారా? అన్నారెవరో.
"ఊఁహూ "
మళ్ళీ ఈగలు ముసిరినట్లు జనం మూగుతున్నారు. చాలామంది సినిమావారు రావడమూ మంజరిని పలకరించడమూ, ఆవిడేదో సమాధానం చెప్పడమూ- మంజరికి సోషిస్తున్నట్లనిపించింది. సమాధానం చెప్పకపోవడం సాంఘీక మర్యాదకాదు. చెప్పటానికి వోపికలేదు. జీవితం ఇంత ఇరుగ్గా ఎందుకుంటుందోననుకొన్నది మజారి.
చలపతి రావడానికి పక్కారెండు గంటలకు పైగా పట్టింది. అతను వస్తూ చాలా ఏర్పాట్లను చేసుకొచ్చాడు. ప్లేబ్లాక్ అర్టిస్టులనూ, ఆర్కెస్ట్రా వారినీ మ్యూజేక్ దైరేక్తర్ర్లనూ పిలిచి, కళ్యాణి ఇంటినుండి స్మశానంనందాకా పాటలురాసి సిద్దంగా ఉన్నారు. శర్మగారితోనూ, బ్రహ్మంగారితోనూ, హనుమంతరావుగారితోనూ, కల్యాణి మరణాన్ని గురించి ప్రత్యక సంచికలువేయమన్నాడు. అందినంతవరకూ పూలూ పూలదండలు పారేశాడు. ప్రతిపాతిక గజాలకూ, కళ్యాణి శవంమీద పూలు చల్లడానికి,ప్రతి ఫర్లాంగుకూ పూలదండలు వేయడానికీ జనాన్ని బుక్ చేశాడు.
"అలా ఉన్నావేం?" అన్నాడతను మంజరిని చూసి.
"నాకు నిద్ర ముంచుకొస్తున్నది; అన్నదావిడ.
రెప్పలకు రాళ్ళుకట్టినట్లుగా అవి కిందికే వాలిపోతున్నాయి.
"ఇహ నా వల్లకాదు. నేను లేచి నిలబడనుకూడా లేను" అన్నది మంజరి.
"అవును గానీ, అతనెవరో చెప్పగలవా? నీవెపు అదేపనిగా చూస్తున్నాడు."
మంజరి అటు దిక్కుగా చూసింది.
'అబ్బ' భగవంతుడు ఇన్ని పరీక్షలు ఎందుకు పెట్టినట్లు చలపతీ! వాడి చూపులు, నన్ను చీలుస్తున్నట్లుగా ఉన్నాయి. వాడు -" అని ఊరుకొన్నది మంజరి.
"అవునవును, కళ్యాణి కొడుకు, నువ్వు గుర్తించావో లేదోనని అడిగాను."
"ఈ ఏర్పాట్లన్నీ అతను చేసుకోలేడూ! మనం వైదొలిగితే పోదా?" అన్నది మంజరి!
"ఇతను కల్యాణి కొడుకో కాదో కోర్టు తేల్చవలసివుంది. అదిమరో చిక్కులమారి వ్యవాహారం. ప్రస్తుతానికి మనం నడుం కట్టుకోకపోతే, కళ్యాణి శవాన్ని కుక్కలూ నక్కలూ ఫిక్కుతింటాయి. ఓపిక ఉన్నా లేకపోయినా, మనమీదపని చేయకతప్పదు" అన్నాడు. చలపతి
మంజరింకేమీ పలకలేదు.
అనుకొన్న పనులన్నీ తు.చ తప్పకుండా అయ్యాయి. కొన్ని వేలమంది ప్రజలు దోవపొడుగునా నిలబడ్డారు. శవానికి ముందుగా, మంజరీ చలపతీ నడిచారు.
తలదగ్గర నిప్పు ముట్టించబోయేముందు, ఆఖరిసారిగా కళ్యాణి ముఖం చూసింది మంజరి. ఆ ముఖమిపుడు పూర్తిగా రంగుమారిపోయింది. పూలవాసులు తప్పుకొని, సన్నని దుర్గంధం పైకి లేస్తున్నది. పూలదండంలు అడుగున, పేగుల కుప్పలు, మాంసపు ముద్దులు, చిత్తవత్తుగా పడివున్నాయి.డాక్టర్లు పరీక్ష నిమిత్తం కళ్యాణి శవాన్ని కోశారని కళ్యాణి విన్నదేగానీ, ఆ దృశ్యాన్ని ఆవిడ ఊహించలేదు. ఇప్పుడు ప్రత్యేకంగా చూసి, విహ్వలురాలయింది.
తలదగ్గర నుఇప్పు ముట్టించబోయేముందు, ఆఖరిసారిగా కళ్యాణి ముఖం చూసింది మంజరి.ఆ ముఖమిపుడు పూర్తిగా రంగుమారిపోయింది. పూలవాసనలు తప్పుకొని, సన్నవి దుర్గంధం పైకి లేస్తున్నది. పూలదండలు అడుగున, పేగుల కుప్పలు,మాంసపు ముద్దులు,చిత్తువత్తుగా పడివున్నాయి. డాక్టర్లు  పరీక్ష నిమిత్తం కళ్యాణి శవాన్ని కోశారని కళ్యాణి విన్నదేగానీ, ఆ దృశ్యాన్ని ఆవిడ ఊహించలేదు. ఇప్పుడు ప్రత్యేకంగా చూసి,విహ్వాలురాలయింది.
తలదగ్గర నిప్పుపెట్టబోయేముందు మంజరి చేతులు వణికాయి.అంతదాకా, ఎక్కడో అణిగి మణిగి ఉన్న దుఃఖం కట్టలుతెంచుకొని ఉరికింది. అంత భయంకరంగా, హృదయ విదారకంగా, మంజరి  ఎప్పుడూ ఏడ్చి వుండలేదు.
"త్వరగా కానియ్.చాలామంది ఇందుకోసం ఉన్నారు" అన్నాడు చలపతి.
మంజరి, కోయ్యలన్నీ తొలగించి, కళ్యాణి ముఖాన్ని రెండు చేతులలోకి తీసుకొని భోరుమని ఏడ్చింది.
ఎవరెవరో వచ్చారు.మంజరిని ఇవతలికి తీసుకొచ్చారు.ఆవిడ తరుపున,ఆవిడల సమక్షంలో, చలపతి నిప్పుముట్టించాడు. మంటలు మేలితిరుగుతూ, పైకిలేచాయి. గప్పుమని పోగమబ్బులు, కట్టేల్లోంచి శవంమీదుగా పైకిలేచి, శ్మశానమంతటా కమ్మసాగాయి. ఇంకెవరోవచ్చి ఇంతనూనెచల్లారు. ఈసారి మంటలు ఆవురావురమంటూ, శవం మీదకి ఎగబాకాయి. అయిదారు నిమిషాలకల్లా, ఒక్కమంటలు తప్ప,ఇంకేమీ కనిపించడం లేదు.
మంజరి గరికమీద పడుకొని, మంటలకేసి చూస్తున్నది.
"పోదామా?" అన్నాడు చలపతి.
మంజరి మాట్లాడలేకపోయింది. చేత్తోసైగచేసింది.       
                                                     *    *    *
ముందుగా పోలీసులు పదిహేనుమందిదాకా అరెస్టు చేశారు. వారందరూ కళ్యాణిని చంపడానికి కారానలున్నాయి. అయితే వీరందరూ హంతకులని పోలీసుశాఖ కూడా అనికోలేదు. అసలు హంతకుడెవరో తెలుసుకోవడానికి ముందు ఇలాంటి చిల్లరమల్లర పనులు కొన్ని ఎటుకూడి చెయ్యాలి. ఇందువల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. పోలీసుల దృష్టి ఇంకోవేపు మళ్ళిన కారణంగా,అసలు హంతకుడికి సంభందించిన సమాచారం ఒక్కొక్కసారి లభిస్తుంది. ఏమాత్రం ఆచూకీ దొరికినా,డొకంతా కదపవచ్చు మరి!
ఈసారీ అలానే జరిగింది. పోలీసులు అరెస్టు చేసిన వారిలో పకీరయ్య స్నేహితుడొకడున్నాడు. వాడు హత్య సంగతి చెప్పలేదుగానీ, పకీరయ్యను గురించి చాలా చెప్పకొచ్చాడు.
"అతనికేమీ పనిలేదు. కానే చాలా కులాసాగా వుండేవాడు. ఎక్కణ్నంచో ప్రతినెలా రెండు మూడు వందల రూపాయలు వస్తుండేవి. అప్పుడప్పుడు అతను కూడా మద్రాసు పోతుండేవాడు. వచ్చేప్పుడు బాగా డబ్బు తెచ్చేవాడు" అన్నాడతను.
"అసలు నీకూ అతనికీ స్నేహామెలా కలిసింది?" అన్నారు పోలీసులు.
"ఇద్దరం పేకాటలో కలుసుకొనేవాళ్ళం" అన్నాడతను.
పకీరయ్య సాధారణంగా ఎక్కడెక్కడ వుండేదీ, అతనే చెప్పాడు. నాలుగురోజులపాటు మద్రాసులోనూ, చుట్టుప్రక్కలా పోలీసులు గాలించి పారేశారు. ఆఖరికి మంజరి యింటి సమీపంలో పకీరయ్యను అరెస్టు చేశారు. ఆ సమయాన పకీరయ్యదగ్గర ఎలాంటి అయూధమూ లేదు.
"అతను అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు. అదీకాక- అతనికి నాలుగు గజాల దూరంలో తో మ్మిదంగుళాల పొడవు కలిగిన కత్తి దొరికింది."
పకీరయ్య, కళ్యాణిని హత్య చేసాడని పోలీసులు కేసు నమోదు చేశారు. కళ్యాణిగదిలోని అడుగుల ముద్రలు, పకీరయ్య అడుగుల ముద్రలూ సరిపోయాయి. కళ్యాణి గొంతుమీదా, టెలిఫోన్ మీదా పకీరయ్య వేలిముద్రలున్నాయి.కళ్యాణి అతనికి పకీరయ్య రౌడీ అనీ బ్లాక్ మేయిల్ చేసి సినిమావాళ్ళను ఏడిపించి డబ్బు పిండుతూ ఉంటారనీ,తాగుబోతునీ, కొన్ని హత్యలు అతనికి పరోక్షంగా సంభందాలున్నాయనీ , ఇంకా శతకోటి కారణాలను పోలీసులు పోగుచేశారు.
"మనం కూడా కోర్టుకు హాజరుకావలి. పోలీసులు మనల్ని సాక్షంకోసం తప్పకుండా పిలుస్తారు" అన్నాడు చలపతి.
"తప్పుకోడాని కింకే మార్గమూ లేదా?" అన్నది మంజరి.
చలపతి నవ్వాడు.
"లేదు మంజరీ! కోర్టును కాదనడం ఎంత పెద్ద నేరమా నీకింకా తెలియదను కొంటాను. మనమయినా చాలా సజాగ్రత్తాగా  ఆలోచించి సమాధానాలు చెప్పాలి. డిఫెన్స్ లాయర్లు అఖండులున్నారు.మన నోటిమనీదుగా మనమే కళ్యాణిని హత్య చేసునట్లు వారుచేపించగలరు. అందుకనీ, మనం కూడా ఓ క్రిమినల్ లాయరును కన్సల్ట్  చేద్దాం అన్నాడతను."
"అలాగే చెయ్యి ఇల్లాంటి విషయాల్లో నన్ను సంప్రదించనవసరం లేదు చలపతీ! నీకేది సబబుగా తోస్తే అలా చెయ్యి.నేను కాదనను." అన్నది చలపతి.
కళ్యాణి పట్ల సానుభూతి ఉన్నాలేకపోయినా, మంజరికంటే గిట్టని వారు కొందరు, పకీరయ్యను కలుసుకొని ఉబకేశారు.
"నీ కొచ్చిన భయంలేదు. నీవేనక మేమంతా వున్నాం. కళ్యాణిని నువ్వు చంపలేదని మాకందరికీ తెలుసు. అధవా చంపావనుకో ఆ పని చెయ్యమని నిన్ను ప్రోత్సహించినావిడ మంజ్రే గదా! అందు కోసం నీకు చాలా యిచ్చింది.నువ్వు చేశావు.చెయ్కపోతే నీమీద దొంగకేసు పెట్టిస్తానన్నది.నిన్ను తన్నిస్తానన్నది.ఆత్మరక్షణ కోసం, నువ్వు ఈ పని చేశావు. అదైనా కళ్యాణిని చపడం నీకిష్టం లేదు. కోడదామని వెళ్ళావు. కొట్టావు పొరబాటున తగలరానిచోట దెబ్బతగిలింది. కళ్యాణి చనిపోయింది" అని నూరి పోశారు వారు.
"ఇందువల్ల లాభముంటుందా?" అన్నాడు పకీరయ్య.
"అఁ" అన్నారు వారు.
"అయితే చెబుతా" నన్నాడు పకీరయ్య.
హఠాత్తుగా అనుకొని మలుపులోకి తిరిగింది కేసు. డిఫెన్స్ లాయరు అడుగుతున్న ప్రశ్నలకు మంజరి హడలిపోసాగింది. అతను రకరకాల ప్రశ్నలు వేసి, పకీరయ్య చాలాకాలంనుండి తెలుసు ననిపించాడు ఆమెచేత. మొదటి రోజున ఈ మాట అనిపింనవాడు ఆఖరిరోజుకు, ఇంకేమన్నా అనిపిస్తాడు. అందులో సందేహమేమీలేదు.
ఈ కేసునూ, కోర్టులో జరిగే విచారణనూ, ప్రత్రికలు,వైన వైనంగా ప్రకటించసాగాయి. డిఫెన్స్ లాయరడిగితే ప్రశ్నలకు హెడ్డిందు చేసి, మంజరి నేరస్తురాలన్న భామను కొన్ని ప్రత్రికలు కలగచేశాయి.
ఆ పత్రికల వాళ్ళకు కబురు చేసి మంజరి మాట్లాడింది.
"మీరలా ప్రతిచిన్న విషయానికి కలగజేసుకొండమ్మాయి గారూ! మేమీ పనిచేయడం మా కిష్టమయికాదు. సెన్సేషనల్ న్యూస్ వేస్తే జనం కొంటారని మీకు తెలీదా?" అన్నారు వారు.
మంజరి  మాట్లాడడానికేమి మిగల్లేదు.
ఈ లోగా మద్రాసు కంపెనీలు అయిదారు మాసాల టైం పట్టింది.ఈ లోగా మద్రాసు కంపెనీలు అయిదారు బొంబాయి కంపెనీలు మూడు, మంజరిని కొత్త బుకింగదులకోసం వత్తిడి చెయ్య సాగాయి.
"నా మనస్సేమీ బావోలేదు. నేని ప్పుడప్పుడే ఏమీ చెప్పలేను. నా కొంతవ్యవధి కావాలి. నన్ను తొడర పెడితే కాదనాలిసోస్తుంది" అన్నాడోకాయన.
మంజరికి ఎక్కడ మందాలో అక్కడే మండింది.ఆవిడకోపం చూసి ఏం కొంప ముంచుతుందోనని చలపతి చక్రం అడ్డుపెట్టాడు.
"అబ్బే అదేం కాదండీ! తనకు మనస్సు బావులేదంటున్నరామేగారు. కళ్యాణి మరణం బాగా దెబ్బతీసింది.కోలుకోవాడానికి కొంత వ్యవధి ఉంటే మంచిదని వారభిప్రాయం. మీరీ లోగా అన్నీ సిద్దం చేసుకోండి" అన్నాడు చలపతి.
"కధ రెడీగా ఉంది.మొన్ననే బెంగాల్ నుండి కనుక్కోచ్చాను. ఇతర ఆర్టిస్టులను కూడా అడిగాను" అన్నాడతను.
"అలాగా!" అంటూ చలపతి ఆ పెద్దమనిషిని ఇవతలకితీసుకొచ్చి, సున్నితంగా చీవాట్లు వేశాడు,
"అదికాదయ్యా బాబూ! నువ్వు బెంగాల్ నుండి తెచ్చినా,బొంబాయి నుండి తెచ్చినా ఆ కధ మంజరికి నచ్చాలి. ఇది మొదటి పాయింటు.రెండోదోమిటంటే- ఆమె నడక్కుండా మీరు హీరోను కానీ,ఇతర ఆర్టిస్టులనుగానీ బుక్ చెయ్యడానికి లేదు."
"అదేం?" దాని కిష్టమయితేనే మీరు మంజరిని బుక్ చేసుకోండి లేకుంటే ఇంకెవరినన్నా చూసుకోండి" అని ఖండితంగా ఏమనుకున్నాడో మరి - మళ్ళా కలుస్తాను అని వెళ్ళిపోయాడు. మిగతా కంపెనీలవాళ్ళు చాలా తెలివిదగా వ్యవహరించారు.
"మంజరి గారు 'సరే' అంతే ఇంకో ఆరు మాసాలపాటు ఆగటానికయినా, మా కభ్యంతరం లేదు" అన్నారు వారు.
ఈ విషయాన్ని మంజరికి చెప్పినప్పుడు అవిడంత ఉత్సాహాన్ని చూపించలేదు.
"ఎందుకొచ్చిన లాయలాస ఇదంతా చలపతీ! ఇప్పుడు మనం కూటికీ గుడ్డకూ మొఖం వాచీపోతున్నదేమీ కాదు. ఉన్నదాన్ని జాగ్రత్తగా వాడుకొంటే, నాకు సరిపోదా? నాకీ సినిమాలా మీద బ్రతుకు మీదా రుచి తప్పిపోయింది" అన్నది మంజరి.
"అలా అనకు కేవలం బ్రతుకలేకనే మనమిదంతా చేస్తున్నామునుకోవడం తప్పు ఘన విజయాలు సాధించే అవకాశాలు కూడా దొరకవు, భగవంతుడు నీకలాంటి వరమిచ్చాడు. నువ్వింకా  ఉన్నత స్టానానికి వెళ్ళాలి. వెడతావు కూడాను. తాత్కాలికమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని శాశ్వత ఫలితాలను  పాడుచేసుకోవడం తెలివైనా లక్షణం కాదు.... విచారమంటావా? అది అందరికీ అంతో ఇంతో ఉంటుంది. అందులోంచి త్వరగా బయట బడి, తిరిగి మామూలు మనుషులం కావడం మీదనే మన మనవ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది"అన్నాడు చలపతి .
"కాబట్టి?" అన్నది మంజరి కనూ బొమలు చిట్లించి.
"మళ్ళ నువ్వు మాములుగా సినిమాల్లో ప్రవేసించుయ అయితే ఈ సారి ఇంకో చిన్న గమ్మత్తుచేద్దాం. ఇకనుండి నేను ఏడాదికీ నాలుగు సినిమాల్లోకన్నా ఎక్కువగా బుక్ కాననీ,ఎలాట్ చేశాననీ ప్రకటించుయ కేవలం ఆరోగ్య కారణాల వలెనే ఇలా చేయవలసి వచ్చిందను, రిజల్స్ ఎలాఉంటాయో చూడు." అన్నాడు చలపతి.
"ఇదేమీ కొత్త ఆలోచనకాదు. లోగడ మనిమిలా అనుకోన్నామని నా జ్ఞాపకం" అన్నది మంజరి
"నువ్వేమన్నా అనుకున్నా వేమో నాకు తెలీదు, ఒకవేళ నేనే ఈ ఐడియా ను బయట పెట్టెనేమో, నాకు జ్ఞాపకం లేదు. ఏమయినా ఇలాంటి ప్రకటన ఇప్పుడు చేయడంలో ఉన్న మజావేరు ఇందువల్ల కంపెనీల సంఖ్య  తగ్గేమాట నిజమేగానీ, ఆవార నీకు డబ్బు ఎక్కువగా ముడుతుంది. డిమాండ్ కూడా పెరుగుతుంది..... ఈ ఆరు మాసాల మద్యలో ఇలాంటి పబ్లిసీటి ఇంకెవరూ ఇచ్చుకోలేదు. చేతులారా ఈ అవకాశాన్ని పాడుచేసుకోవద్దని నా అభిప్రాయం, తరువాత నీ ఇష్టం" అన్నాడు చలపతి.
"సరె! ఏదో కానివ్వండి!" అన్నది మంజరి.
అన్న తరువాత కూడా మంజరి మళ్ళీ మళ్ళీ ఆలోచించింది. ఇలాంటి షరతులు పెట్టడం వలన, లాభమేగానీ, నష్టమేమీ మంజరికి కనిపించలేదు. చలపతి చెప్పాడన్న అభిప్రాయంతో, తనే పనీగట్టిగా చెయ్యలేదు. ఇక ముందుకూడా చెయ్యబోదు. అది మంచిదై ఉండాలే గానీ,ఎవరు చెప్పిన పనైనా తను చెయ్యడానికి సిద్దంగా ఉంది. వాస్తవానికి చలపతి బంగారం లాంటి సలహా ఇచ్చాడు. తను "సరే" అన్నది!
తనకసలు సినిమాలమీద క్రమంగా అబిరుచి తగ్గి పోతున్నదేమో నన్న అనుమానం ఉన్నది. మునుపటంత ఉత్సాహం కానరావడం లేదు కానీ -అది తాత్కాలికం మాత్రామె! ఎక్కడన్నా మంచి సినిమా చూసినప్పుడు- ఎవరికన్నా మంచి రోల్ దొరికినప్పుడు- ప్రాణం జివజివ లాడిపోతుంది. పదివేలు తక్కువైనా అలాంటివేషం దొరికితే బావుండుననిపిస్తుంది. అంటే  డబ్బును మించిన శక్తిదో ఇంకా తన పరిశ్రమకు కట్టిపడేసి ఉంచుతున్నది. దాన్ని కీర్తిదాహామను.ఇంకోటను- తన కభ్యంతరం లేదు.
చెత్తాకానీ పిక్చర్స్ పదింటిలో పనిచెయ్యడం కన్నా, మంచి సినిమాలు నాలుగుచేతిలో ఉంటే చాలుననుకోవాడానికిదో కారణం కూడా ఉన్నది. కేవలమూ డబ్బుకోసమని, ప్రతిబాడఖోవ్ పిక్తర్లోనూ వేషం వేయడంవలన, డబ్బుకాళ్ళనుందు కోచ్చిపడినా, పేరు పోవడం ఖాయం. అటువంటి తుక్కు సినిమాలు నాలుగ్గనక వరసాగ్గా తగిలాయో ఆ ఆర్టిస్టు గోవిందా! మళ్ళా ఆచావు దెబ్బనుండి కోలుకోడానికి నాలుగు రెళ్ళు, ఎనిమిదేళ్ళు పట్టొచ్చు. ఈ లోగా కొత్తజనం వచ్చారంటే మొత్తం కుదేలవుతుంది.
మంజరి తన నిర్ణయాన్ని అదికార యుతంగా ప్రకటించడానికి నిర్ణయించింది. ఆరేడు మాసాల ఈ మద్య ఆవిడ పత్రికల వారితో అంతగా సంబంధాలు పెట్టుకోలేదు. వారిక్కావలసిన కేసు తాలూకు వివరాలేవో కోర్టునుండీ, పోలీసు రికార్డులనుండి తీసుకొన్నారు. దీని మీద తన అభిప్రాయాలుగానీ, తనకు తెలిసిన ఇతర విషయాలు గానీ మంజరి వెల్లడించలేదు. అలా చెయ్యకూడదని చలపతి గట్టిగా చెప్పాడు!
"కోర్టులో కేసున్నప్పుడు, దానిమీద మన ఇష్టం వచ్చిన అభిప్రాయం ప్రచారం చేయడం నేరమవుతుంది." అన్నాడతను!
మంజరికూడా 'అలాగే' అన్నది మంజరి చలపతితో చెప్పి ఫలానా తేదీన పత్రికల వారి సమావేశం ఏర్పాటు చేయమనీ, మంచి పార్టీ కూడా ఒకటి ఇద్దామనీ అన్నది. ఈ లోగా రాజన్ కబురు పెట్టి అతన్ని కూడా పిలిపించింది.
"నువ్వెందుకిలా దిగజారి పోతావు మంజరీ! నీ కోసం పది పదిహేను కంపెనీలు కాచుకొన్నాయి. అందులో ముగ్గురు నలుగురు  నన్నుకూడా అప్రోచ్ అయ్యారు. నేను తప్పకుండా చేబుతానన్నాను. హాఠాత్తుగా నువ్విలా అవడం బావుండదు." అన్నాడు రాజన్.
అతనన్న మాటలన్నింటినీ మంజరి "అవునవు" నంటూ ఆమోదిస్తునే తన వాదన వినిపించింది. తన కసలు ఆరోగ్యం బావోలేదునీ, లేనిపోనివన్నీ నెత్తిమీదకి తెచ్చుకొని ప్రాణం హైరానా పెట్టుకోవడం తనకిష్టం లేదనీ అన్నది మంజరి.
"నాకోటి అనిపిస్తూన్నదండీ! క్షణం విశ్రాంతి లేకుండా రేయ్యింబవుళ్ళు పనిచేసి ఎవర్ని ఉద్దరించడానికిట? ఉన్న దేదో ఉంది. దీంతో ఎలా కాలక్షేపం చేసినా నాకు చాలు. అదీగాక- క్రమంగా నేనీ సినిమా గొడవలన్నీ మానెదామనుకొంటున్నాను" అన్నదావిడ.
"మానేసి?" అన్నాడు రాజన్.
"గృహిణి నవుదామనుకొంటున్నాను."
ఓసారి అటూ ఇటూ చూసి మంజరిని తేలిగ్గా కావలించుకొన్నాడు రాజన్.
"నువ్వెంత మంచిదానివి మంజూ! అన్నాడతను చెవిలో మంజరి నవ్వింది."                       రాజన్ అక్కడుండగానే పత్రికల వారి సమావేశం జరిగింది.ఇలాంటి సమావేశాల్లో సర్వ సాధారణంగా అడిగే ప్రశ్నలూ వాటి జవాబులూ,శర్మగారు రాసుకొచ్చారు. వాటిని నాలుగైదు సార్లు చూసుకొన్నదావిడ.
శర్మగారు, దాదాపుగా- తను రాసిచ్చిన వాటినే అడిగాడు గానీ,ఇతరులు కాస్తంత పేదకు లాగారు. అందులో అప్పోజిషన్ పార్టీ వారి పత్రిక తాలుకూ విలేఖరి, గుడ్లు వెళ్ళుకొచ్చే ప్రశ్నలెన్నో వేశాడు.
"మీకు డబ్బుమీద ఉన్నంత. యావ కళమీద లేదని విన్నాను అది నిజమేనా?" అన్నాడతను.
మంజరి భగ్గు మన్నది. ఆవిడ ముఖం కోపంతో గండరించి పోయింది ఏదో ఫేడీమని చెబుదామనుకొన్నది. ప్రక్కనే ఉన్న చలపతి అడ్డుపడి వాతావరణాన్ని చల్లబరిచాడు.
"మీరు వినలేదని కాదనుకోండి. ఆ మాట కొస్తే మేము కూడా అలాంటి అర్ధం వచ్చే మాటలు విన్నాం.ఇహ- వాటి నిజానిజాలంటారా? అది మేము చెప్పడం- బావుండదు, మీకేది నిజమని తోస్తే అదనుకోకండి" అన్నాడు చలపతి.
ఆ కరస్పాండెంట్ అంతటితో వదల్లోదు.
"అలాకాదు.నా తెలివి తక్కువతనం చేత,. నేను పోరపాటుగా అనుకోవచ్చు. నిజమేదో మీరు చెప్పడమే బావుంటుంది." అన్నాడతను.
"మీరిలా అనే అవకాశ మున్నదని నాకు ముందుగానే తెలుసు. మాకై మేమో అబిప్రాయాన్ని మీలో కలిగించడంకన్నా, మమ్మల్ని అర్ధం చేసుకునేందుకు మీకు తగినంత అవకాశ మివ్వడం మంచిదని, ఇప్పటికీ మా అభిప్రాయం!"
"మా అబిప్రాయమంటే?" అన్నాడతను.
"నాదీ మంజరి గారిది కూడాను!" అన్నాడు రాజన్.
"ఓహౌ! అలాగా! అన్నాడతను తల పంకిస్తూ."చుడండమ్మా! ఓ ప్రోడ్యూసరోచ్చి పాతిక వేలిస్తానన్నాడు.ఫలానా వేషం వెయ్యలన్నాడు. మీరు వేస్తారా?"
మంజరి సన్నగా నవ్వింది.
"నేనుత్త డబ్బు కక్కుర్తి మంనిషిని, ఈ నలుగురు ముందూ.నన్నోప్పించాలని మీరీమాట అడిగి ఉంటారు,అవునా! పోన్లెండి! మరి- డానికి నా సమాధానం కూడా  వినండి! డబ్బంటే నాకు చెదు  కాదు. అలాగని,డబ్బుకోసం నేను కక్కుర్తి పడింది కూడా లేదు.తొలి రోజుల్లో, ఈ పరిశ్రమలో నాకింకా స్టానమనేదే లేనప్పుడు ప్రోడ్యూసర్లు  ఇచ్చిన వేషాలు వేసినందుకు, నేను అదనంగా తీసుకొన్న దేమీలేదు. ఇలాంటి సంఘటనలు లోగడ కొన్ని జరిగాయి. వాటి సంఖ్య తగ్గించడం కోసమనే, నేనిలాంటి నిర్ణయం తీసుకున్నాను" అన్నది మంజరి.
"ఈ రకంగా మీరు ప్రకటించడంద్వారా, ఇండస్ట్రీలో డిమాండ్ పెంచుకొందామని చూస్తున్నారా?"
"నేను యస్ అంటే. ఇంతకుముందు నాకు డిమాండ్ లేదు ఇక డిరెక్టగా వొప్పుకొన్నట్లవుతుంది" అన్నది మంజరి.
"అంటే నో అంటున్నారా?"
"కాదు" అన్నది మంజరి. ఇందులో డిమాండ్ ప్రసక్తే లేదు. నా మీదున్న ప్రెషర్ ను తగ్గించుకోవడం కోసంనాకై కొన్ని నిబంధనలు నియామలు విధించుకొనే ప్రయత్నమిది. నేను వల్ల కాదంటున్నా వినకుండా నామీదవత్తిడి చేస్తున్నారు ప్రోడ్యూసర్లు. ఇంతకన్నా మంచిమార్గమేదన్నా సజేస్టుచేస్తే నేనీ నిర్ణయాన్ని విత్ డ్రా  చేసుకుంటాను."
"అంటే - మీ రడిగినంత డబ్బివ్వగలిగిన చాలా పెద్దకంపెనీలకు తప్ప మమీరిక ముందు దొరకరన్న మాటేనా?" అన్నాడింకో కరస్పాడెంట్.
వీళ్ళిద్దరూ ఒక గ్రూప్ వారేననుకొన్నది మంజరి.
ఇందులో డబ్బును గురించి గొడనేమీ లేదు బాబూ! ఇప్పటికే చాలా మందికన్నా, నే నెక్కువ తీసుకొంటున్నాను. ఆ మొత్తం కాస్త ఎక్కువే అతునా - అది న్యాయమయిందని కూడా నేనను కొంటున్నాను.ఇంకా అక్కువ డిమాండ్ చేసి పుచ్చుకొందామన్న తలంపు ప్రస్తుతానికి లేదు..... ఇందువల్ల - ఆటోమెట్టిగా రేటు పెరుగుతుందంటారా? అది నా తప్పుకాదు. ధరలు పెరిగాయి గనక, కంట్రోల్స్ వద్దనడం భావ్యామా మరి?" అన్నది మంజరి.
మొదటి విలేఖరి ఓసారి భుజలేగరేసి నవ్వాడు.
"భావ్యంకాదు...... మీరిచ్చిన పోలికకూడా సరిగ్గా లేదు. మీరు రేటు పెంచిందేమున్నది? మీ భాషలోనే చెప్పాలంటే- ఓ సర్కురేటును పెంచకుండా సరఫరాను కంట్రోలు చేసినట్లయింది.అంటే రేషనింగ్ అప్లయి చేశారన్నమాట. రేషన్ కార్డుమీద చాలినంత సరుకు దొరకనివాడు, రెట్టింపు రేటు చెల్లించి బ్లాకులో తనక్కావలసిన సరుకును, కొనుక్కుంటున్నాడు...." అలాగే మీరూ చేశారు. ప్రతి కంపెనీకి మీరు అందుబాటలో లేకుండా వుండెందుగ్గాను-"
"నా ఉద్దేశం అది కానప్పుడు, మీరు ఆ పాయింటుమీదనే స్ట్రెస్ చేస్తారెందుకని?" అన్నది మంజరి.
"మీ ఉద్దేశమేదో మీరు స్పష్టంగా చెప్పందే మరి? అన్నాడతను కూడా చిరచరిలాడుతూ."మాములుగా మీరుతీసుకొనే రేటు ఇస్తామని పది కంపెనీలు మీదగ్గర కోచ్చాయనుకోండి- మీరు అందులో ఏ రెండు కంపెనీలో సెలక్టు చేసుకోంటారనుకోండి- ఆ సెలక్షన్ బేసిన్ ఏమిటంటారు?"
మంజరి ఉక్కిరి బిక్కిరయి పోవడం చలపతి గమనించి. తను ముందుకొచ్చాడు.
"ఇంతవరకూ, చెప్పని దోషానికి మమ్మల్ని మన్నించమని వేడుకొంటూ మ ఉద్దేశం కాదు. ఆరోగ్యం దృష్యా తనమీద వత్తిడిని కొంతకు కొంత తగ్గించుకోవడం మంజరికి తప్పని సరావుమ్ది.అదీగాక - సినీ పరిశ్రమలో మళ్ళానిలవనీరు చాలా చేరిపోయింది. ఇది తేట్టలు గట్టి, గావులెత్తిపోతున్నది. కోత్త నీరు రావాలంటే ఉన్న నేరు పోవాలి. ఇది పోవాలంటే _" మధ్యలోనే రెండో విలేఖరి, చలపతి మాటలకు అడ్డుపడ్డాడు.
"మీరు పరిశ్రమ బాగోగుల్ని గురించి ఉపన్యసించడానికి మమ్మల్ని పిలిచారా? మంజరిగారి నిర్ణయాన్ని ప్రచారం చేయిద్దామనని పిలిపించారా?" అన్నాడు ముఖమాటం లేకుండా.
"మంజరిగారి నిర్ణయమీద, పరిశ్రమ బాగోగులు ఆధారపడి ఉన్నాయనుకోండి. అప్పుదేమంటారు?" అన్నాడు శర్మ.
"నేను ఓ పత్రిక తరుపున దని ప్రతినిధంగా వచ్చాను. నా పాఠకులకీ విషయాలన్నీ నేను చెప్పాలి. ముందుగా నాకున్న అనుమానలన్నే రహితమైతే తప్ప. నేనేమీ రాయలేను. కడుపులో బండెడు కుళ్లుంచుకొని పైకి "ఓహొ అహా" అనడం నా వల్ల కాదు.....శర్మగారూ! నేనేదో మంజరిని అడగటం, వారు చేప్పడం సరేననుకోండి. మద్యలో మీ రెందుకుట జోఖ్యం చేసుకోవడం?" అన్నాడు మొదటి విలేఖరి.
"నువ్వు విషయానికి సంబందంలేని ప్రశ్నాలడుగుతున్నావు" అన్నాడు శర్మ.     "వాటికి జవాబు చెప్పకుండా మంజరిగారు రేప్యూజ్ చెయ్యవచ్చు. అది-వారికీనాకూ మద్య, మీ రెండుకు జోఖ్యం చేసు కొంటున్నారు- అని?" అన్నాడతను.
చలపతి ఎనరూ చూడకుండా శర్మకు కన్ను మలిపాడు.
"మరేం ల�


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS