Previous Page Next Page 
తెల్ల గులాబి  పేజి 5

    ఆమె చూపులు మళ్ళీ టీవి మీదకి మళ్ళాయి. హీరో, హీరోయిన్ వాళ్ళకి లభించిన ఏకాంతాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అతని చేతులు ఆమెని ఏదేదో చేస్తున్నాయి.
    ప్రఖ్య కి ఇంకా దూరంగా కూర్చోవాలని పించలేదు.
    చటుక్కున ఆదిత్య కి దగ్గరగా జరిగి అతని చేయి చేతిలోకి తీసుకుని గోముగా అంది. "సారీ కోపం వచ్చిందా?"
    "ఆదిత్య "లేదు" అంటూ ఆ చేయి పట్టుకుని నొక్కాడు.
    "సినిమా బాగుంది కదా ....అంది ప్రఖ్య.
    "చాలా...." కొంచెం ఆమెకి దగ్గరగా జరిగాడు.
    "కానీ, నాకు భయంగా ఉంది చూడాలంటే ...వేరే మూవీ పెట్టనా?" అడిగింది.
    "ఒద్దొద్దు బాగుంది ఇదే ఉంచు." అన్నాడు కంగారుగా.
    ఆమె మాట్లాడలేదు. ఎందుకో ఆమెకి అతనికి కొంచెం అనుకుని కూర్చోవాలనిపించింది. గుండెలు బరువుగా అనిపించసాగాయి. హటాత్తుగా టీ షర్ట్ టైట్ గా అయినట్టు ఉక్కిరిబిక్కిరి గా అనిపించింది.
    ఆదిత్య కూడా తనని సినిమాలో హీరోలాగా ఏదన్నా చేస్తే బాగుండు అనిపించ సాగింది.
    ఆదిత్య క్కూడా అదే పరిస్థితి.... ఒళ్ళంతా ఆవిర్లు వస్తున్నట్టు ఉంది... అతని చూపులు సినిమా మీద ఉన్నా, అంతరంగాలలో ప్రఖ్య గుండెల్ని చూడాలని , తాకాలని అనిపిస్తోంది. ఆమెని ముద్దు పెట్టుకోవాలని కూడా అనిపిస్తోంది. కానీ, భయంగా అనిపిస్తోంది. ఎంత దగ్గరగా ఉన్నా, ఆమె వంటి మీద చేయి వేయాలంటే చేతులు వణుకుతున్నాయి.
    ఇంతలో సడన్ గా కరెంట్ పోయింది.
    ప్రఖ్య సన్నగా అరిచి అడిత్యని అల్లుకుపోయింది.
    "ఏ.....ఏమైంది?" అడిగాడు ఖంగారుగా ఆమెను పట్టుకుని.  
    "కరెంటు పొతే నాకు భయం" భయంగా అంది ప్రఖ్య.
    ఆదిత్య ఇంక ఆగలేకపోయాడు. ఆమెని ఒళ్లోకి లాక్కున్నాడు. అతని ఒళ్ళో ప్రఖ్య వెల్లకిలా పడిపోయింది. ఒంగి ఆమె పెదాలు, బుగ్గలు కళ్ళు ముద్దులతో నింపేయసాగాడు.
    ప్రఖ్య ఉక్కిరిబిక్కిరి అవుతూ మత్తుగా మూలుగుతూ అతడిని దగ్గరకు లాక్కుంది. ఇద్దరూ ఒకరి కౌగిట్లో ఒకరు ఒదిగి పోయారు.
    కాలుతున్న కొలిమి మీద పడ్డట్టు అనిపించింది ప్రఖ్యకి.
    చటుక్కున ఒంగి ఆమె బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు.
    ఆదిత్యా ..ఏయ్.....వాటీజ్ దిస్?" అని అడుగుతూనే అతనికి మరి కొంచెం దగ్గరగా జరిగింది . ఇప్పుడు ఇద్దరి మధ్యా గాలి దూరే సందు కూడా లేదు.
    "కిస్" అన్నాడు ఆదిత్యా.
    "ఛీ....పో....అరచేతుల్లో మొహం దాచుకుంది.
    రెండు చేతుల్తో అచ్చు సినిమాలో హీరో లాగానే ఆమెని చుట్టేసి మత్తుగా పిలిచాడు "ప్రఖ్యా...."
    ఆమె పలకలేదు.
    వాళ్ళ వయసు, వాళ్ళ మానసిక స్థితి, వాళ్ళు చూస్తున్న సినిమా, ఆ ఏకాంతం వాళ్ళిద్దరినీ స్నేహపు సరిహద్దు నుంచి అవతలికి విసిరేసినట్లు వాళ్ళు శృంగార సామ్రాజ్యం వైపు విశృంఖలంగా ప్రయాణించడానికి ఆయత్తం కాసాగారు.
    ఇంతకాలం ఎలాంటి వికారాలు లేకుండా సాగిన మంచి స్నేహంలో ఇప్పుడు కామ ప్రకంపనలు రేగాయి. .. కేవలం స్త్రీ పురుషుల మధ్య ఏర్పడే కెమిస్ట్రీ కి నాంది పడింది.
    ఎంత గొప్ప వాళ్లైనా స్త్రీ పురుషుల మధ్య స్నేహం స్నేహం లా ఎన్నడూ ఉండదు. అది ఒక అడుగు ముందుకేసి హద్దులు దాటితేనే వాళ్ళు స్త్రీ పురుషులు అవుతారేమో?
    టీనేజీ లో వున్నారు. ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం ఉంది. ఒక అవగాహన ఉంది. ఒకళ్ళ మీద ఇంకొకళ్ళకి ఇష్టం ఉంది. అ ఇష్టం స్నేహం వరకా? ఇంకా ఎదన్నానా అని ఆలోచించే అవకాశం కానీ, అవసరం కానీ వాళ్ళకు రాలేదు. అందుచేత దాదాపు ఎనిమిది నెల్ల నుంచీ కలిగిన సాన్నిహిత్యం చాలు వాళ్ళ మధ్య కెమిస్ట్రీ కుదరడానికి.
    ఆదిత్యకి తోటి మనిషి అది ఆడైనా, మగైనా స్పర్శ కావాలి. ఆ స్పర్శ లో ఆత్మీయత కావాలి. అందుకే అతను ఆమెని తాకడానికి సందేహించలేదు. అయితే తను తాకింది అమ్మాయి శరీరాన్ని , ఆ అమ్మాయి తనకెంతో ఇష్టమయిన అమ్మాయి. అప్పుడే అమ్మాయిలో అందాలు గమనించిన అనుభూతి గుండెల్లో తాజాగా తీయని తలపుల్ని రేపుతోంది. ఆ అమ్మాయి శరీరం తాలూకూ స్పందనలు మధురానుభూతుల్ని కలిగిస్తున్నాయి. మనసుకీ, దృష్టి కి కూడా మైకం కలిగి ఆ మైకం లో పరిసరాలను సమస్త ప్రపంచాన్ని మర్చిపోయాడు.
    ఆ క్షణం .... ఒకానొక మధురక్షణం వాళ్ళ స్నేహంలో ఒక అడుగు ముందుకు పడి మూడు ముద్దులు, ఆరు కౌగిలింతల దాకా రావడానికి దోహదం చేసింది... ఇప్పుడు ఇద్దరికీ ఏమి తెలియడం లేదు.... వారి, వారి శారీరక స్పర్శ లో కలుగుతున్న అనేక రకాల రసానుభూతి తో నిలువెల్లా తడిమేస్తున్నాడు ఆదిత్య.
    అక్కడ ఓ సోఫాలో మరే టీనేజీ లవ్ స్టోరీ కి ముహూర్తం కుదిరింది. ఆ క్షణంలో కరెంటు మళ్ళీ వచ్చిందని, లైట్లు వెలుగుతున్నాయని స్పృహ  కూడా లేకుండా ఒకళ్ళ నొకళ్ళు అల్లుకు పోతున్నారు.
    ఇంకా ఏదో కావాలి... ఏదో చేయాలి... ఏం చేయాలో అతనికి తెలీడం లేదు. అందిన చోటల్లా ముద్దు పెట్టేస్తూ ఆమెని అల్లుకు పోతున్నాడు. అతని వేడి స్పర్శకి ఆమె అణువణువు సహకరిస్తోంది. ఆ క్షణంలో ఇద్దరికీ తామిద్దరి మధ్యా ఇలాంటి సందర్భం వస్తుందన్న ఆలోచన లేకపోవడంతో అనుకోకుండా కలుగుతున్న పరస్పరాలింగాన మధురానుభూతుల్లో ఇద్దరికీ కాలం తెలియడం లేదు. సడెన్ గా కాలింగ్ బెల్ వినిపించింది. ప్రఖ్య ఉలిక్కిపడి అతనికి దూరం జరిగింది. ఆదిత్య కూడా ఒక్కసారిగా తగ్గిపోయిన ఆవేశంతో నీరసంగా లేచాడు సోఫా లోంచి.
    క్లిప్పు పడిపోయి జుట్టంతా వీపుని ఆక్రమించింది. సోఫా మీద ఉన్న కుషన్స్ చెల్లాచెదరుగా కింద పడ్డాయి. ఆదిత్య క్రాప్ బాగా చెరిగి పోయింది. క్రాఫ్ సరిచేసుకుని కింద పడిన కుషన్స్ తీసి సరిగ్గా పెట్టేశాడు.
    కింద పడిన క్లిప్పు తీసుకుని జుట్టుకి పెట్టుకుంది. టీ షర్ట్ బటన్స్ పెట్టుకుంది. స్కర్ట్ సర్దుకుని ఆదిత్యను మత్తుగా చూస్తూ అంది "అ డివిడి ఆఫ్ చెయ్యి... నేను డోర్ తీస్తాను మమ్మీ వచ్చింది."
    "వెరీ బాడ్ మనం ఇంకా ఎంజాయ్ చేయాలి. ఇంకేదో ఉంది." అన్నాడు సోఫా లోంచి లేచి  ఆమె దగ్గరగా నడుస్తూ.
    "మమ్మీ వచ్చింది... "పళ్ళ బిగువున అంటూ డోర్ దగ్గరకు వెళ్ళింది ప్రఖ్య.
    గతి లేదన్నట్టు నీరసంగా రిమోట్ తో డివిడి ప్లేయర్ ఆఫ్ చేసేశాడు ఆదిత్య.
    లోపలికి వచ్చిన భాను "హాయ్ గయ్స్" అంటూ ఇద్దరినీ పలకరించి బ్యాగు సోఫాలో పడేసి బాత్ రూమ్ వైపు వెళ్ళిపోయింది.
    ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. వెంటనే ఇద్దరి చూపులు కిందికి వాలిపోయాయి. వాళ్ళని భానుప్రియ సరిగా గమనించలేదు. గమనించి ఉంటె అక్కడ అప్పటిదాకా ఏం జరిగిందో ఆమె ఇట్టే చెప్పెయగలదు.....కానీ ప్రస్తుతం ఆమె వాళ్ళని చూడలేదు. వాళ్ళు ఆమె దృష్టిలో పిల్లలు.
    కానీ,ఆపిల్లతనం లోనే తప్పు చేయడానికి కావలసిన హార్మోన్స్ వాళ్ళలో ముమ్మరంగా ఉన్నాయని ఆమె గ్రహించి ఉంటె వాళ్ళ భవిష్యత్తు మరోలా ఉండేది.
    శిరీష కాని, భాను ప్రియ కానీ వాళ్ళ స్నేహానికి హద్దులు గీయలేదు. వాళ్ళ దృష్టి లో వాళ్ళింకా చిన్నపిల్లలే.... ఇప్పుడే జీవితపు సోపానపు మొదటి మెట్టు మీద ఉన్నారు. వాళ్ళ కింకా జీవితంలో అతి ముఖ్యమైన దశ అనేది ఒకటి ఉందనీ, అది శృంగార జీవితం అని తెలియదని వాళ్ళిద్దరి గాడ నమ్మకం.
    వాళ్ళే కాదు ప్రతి తల్లి, తండ్రి కూడా అలాగే భావిస్తారు. అందుకే ఊహించని తప్పులు జరిగి పోతుంటాయి.
    సరిగ్గా అదే తప్పు జరగడానికి నాంది ఏర్పడిన ఆ క్షణం. ఆ పిల్లలిద్దరికీ వాళ్ళ శరీరంలో వాళ్ళకే తెలియని కొత్త అనుభూతులున్నాయని, అణువణువునీ చల్లబర్చుకోవాలంటే ఒకరి రాపిడి మరొకరికి కావాలని దాని పేరు ఆలింగనం అనీ, ఆ అలింగనమే అనేక రకాల అనుభూతులకు నాంది అనీ తెలిసిన క్షణం. ఆరోజు భాను రాక వారి ఆనందానికి ఆనకట్ట వేయకపోయి ఉంటె ఏం జరిగేదో కానీ, ఆరోజు నుంచి ఏ మాత్రం అవకాశం దొరికినా వాళ్ళు వృధా చేయడం లేదు. అసంకల్పిత ప్రతీకార చర్యలా ఒకరి నొకరు దగ్గరవడం, ముద్దులు, కౌగలింతలు ఇంకా ఏదో కావాలన్న తపన ప్రఖ్యలో, ఆమె నికేందో చేయాలన్న ఆరాటం ఆదిత్య లో బుస కొడుతూనే ఉన్నాయి.
    ఒకరోజు అంది ప్రఖ్య, ఆరోజు కాలేజీ అవగానే ఇద్దరూ పార్కు కి వెళ్ళారు. దగ్గరగా కూర్చున్నారు. ఒకరి చేయి మరొకళ్ళు పట్టుకుని నలిపేస్తూ, మరింత , మరింత దగ్గరగా జరుగుతూ మధ్య, మధ్య ఎవరూ తమని చూడట్లేదని నిర్ధారించుకుని ముద్దులు పెట్టుకుంటూ కూర్చున్నారు. ఆదిత్యకి బాగా దగ్గరగా జరిగి హత్తుకుంటూ అంది ప్రఖ్య...


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS