Previous Page Next Page 
వసుంధర కధలు -3 పేజి 22


    రంగారావు తన జేబులోంచి నాలుగు రుమాళ్ళు తీశాడు. వనజవంకచూసి "నాకు కాసిని మంచినీళ్ళు తెచ్చిపెట్టగలరా?" అనడిగాడు.
    "అయ్యో ఎంతమాట?" అంటూ వనజ అక్కణ్ణించి లేచి లోపలికి వెళ్ళింది.
    రంగారావు ఒక జేబురుమాలు విశ్వనాథానికీ, మరొకటి సరితకూ ఇచ్చాడు.
    "ఇది ఒక అద్భుతమైన ఫారిన్ సెంట్! దీన్ని వాసన చూస్తే ఏవో ఇతర లోకాల్లోకి తేలిపోతున్నట్లు అనిపిస్తుంది. ఇది ఎంతో ఖరీదయినది. ఈ రోజుకోసం ప్రత్యేకంగా తెప్పించాను" అన్నాడు రంగారావు.
    అతని నోటివెంట మాటలు పూర్తికావడం తడవుగా విశ్వనాధం, సరిత - ఇద్దరుకూడా రుమాలు వాసన చూశారు. తర్వాత వారి నోటివెంట మాటలురాలేదు. కూర్చున్నవాళ్ళు కూర్చున్నట్లుగానే సోఫాలో వెనక్కు జారగిలబడిపోయారు. ముఖాల్లోమాత్రం అద్భుతమయిన దృశ్యం చూస్తున్న అనుభూతి ఇద్దరికీ కనబడుతోంది. ఇద్దరి కనులూ మూతలు పడినాయి.
    వనజ మంచినీళ్ళ గ్లాసుతో వెనక్కు వచ్చేసరికి కనులు మూసుకుని వున్న విశ్వనాధం సరిత కనబడ్డారు. "అదేమిటి-ఏమైంది వాళ్ళకు?" అందామె ఆశ్చర్యంగా.
    "ఇద్దరూ నిద్ర నటిస్తున్నారు. మీకో తమాషా చెబుతాను. ఆ గిలోకి రండి" అన్నాడు రంగారావు.
    అతన్నామె ఏ మాత్రమూ అనుమానించలేదు.
    రంగారావామెను పడకగదిలోకి నడిపించి చటుక్కున తలుపులు వేసి ఆమెను కౌగలించుకున్నాడు.
    ఆమె కమగారుపడి "ఇదేమిటి?" అంది.
    "ఇదో థ్రిల్ నాకు. నీ భర్త ఆహ్వానం మీద నీ యింటికి వచ్చి నిన్ననుభవించి వెళ్ళడం నాకు ఆనందం. ఎంతో కష్టపడి సంపాదించానొక ఫారిన్ సెంట్. అది వాసన చూసిన వాళ్ళకు మూడు నాలుగంటల దాకా స్పృహ తెలియదు. స్పృహ వచ్చేక కూడా ఎంతో ఆనందంగా వుంటారు. ఇప్పుడు వాళ్ళిద్దర్నీ ఆ స్థితిలో ఏం చేసినా ప్రతిఘటించలేరు. వాళ్ళనలా వదిలేసి మనం హాయిగా సుఖిద్దాం. మన ఇరువురికీ సంబంధించిన యీ అనుబంధం మన ఇద్దరి మధ్యనూ శాశ్వతంగా రహస్యంగా ఉండిపోతుంది" అన్నాడు రంగారావు.
    వనజ కమగారుగా "మీకు థ్రిల్ కావచ్చు. నాకు యిష్టంలేదు" అంది.
    "ఇష్టమున్నా లేకపోయినా నువ్వు అసహాయురాలివి. విస్తట్లో పంచభక్ష్య పరమాన్నాలున్నాయి. తినాలనుకునే వాణ్ణి ఆ పంచభక్ష్య పరమాన్నాలున్నాయి. తినాలనుకునే వాన్ని ఆ పంచభక్ష్య పరమాన్నాలూ అభ్యంతర పెట్టలేవు" అన్నాడు రంగారావు.
    "నేను ప్రతిఘటిస్తాను" అంది వనజ.
    "ప్రతిఘటించి చూడు" అన్నాడు రంగారావు.
    వనజ ప్రతిఘటించడానికి ప్రయత్నించి ఓడిపోయింది. ఆ ఓటమి అంతటితో ఆగలేదు. ఆమె రంగారావుకు పూర్తిగా వశమైపోయింది.
    తనకు లొంగిన ఆడదని వనజను రంగారావు ఏ మాత్రమూ అశ్రద్ధ చేయలేదు. మాటిమాటికీ వనజను పొగిడేవాడు. ఆమెను అర్ధాంగిగా పొందలేకపోవడం తన దురదృష్టమన్నాడు. ఆమెతో అనుభవమయ్యాక మరే ఆడదానిపైనా తన దృష్టిపోవడంలేదన్నాడు. రహస్యంగా డబ్బు ఇస్తూండేవాడు.
    విశ్వనాధం వనజను బాగా అలక్ష్యం చేసేవాడు. అతనికి బాగా బయటతిరుగుళ్ళు యెక్కువ. ఎప్పుడైనా భార్య వారిస్తే విసుక్కునేవాడు.
    కొంతకాలం గడిచేసరికి అటు తన యింట్లో భర్త ఎదుటా, సరిత యింట్లో ఆమె యెదుటా రంగారావుకు లొంగిపోవడంలో ఒకరకమైన థ్రిల్ కూడ కనబడింది వనజకు.
    ఇవన్నీ కలిసి వనజను రంగారావుకు పూర్తిగా లొంగదీశాయి. అతన్ని ఆమె ఆరాధించటం ప్రారంభించింది.

                                 *    *    *
    
    "అతనిమీద ఆరాధనతో నేనేం చేస్తున్నానో నాకే తెలియదు. అలాగే ద్వారకా లాడ్జికి కూడా వెళ్ళాను" అంది వనజ.
    "బాగుంది. మీ ఆయనతో పుట్టింటికని చెప్పి యిలా తిరిగేవారన్న మాట!" అన్నాడు వెంకన్న.
    వనజ బాధగా నవ్వి తలాడించింది.
    "అయితే రంగారావును యెందుకు చంపేశారు?"
    "నే నతన్ని చంపలేదు. రాత్రి ఆలశ్యంగా పడుకున్నాం. ఆరుగంటల ప్రాంతంలో నాకు మెలకువ వచ్చింది. లేచిచూస్తే పక్కన అతను హత్యచేయబడి వున్నాడు" అంది వనజ.
    "ఎవరైనా నమ్మే కధేనాయిది!" అన్నాడు వెంకన్న.
    "మీరు నమ్మినా నమ్మకపోయినా యిది నిజం! హత్యకూ నాకూ ఏ సంబంధమూ లేదు. మీరు నన్ను రక్షించాలి" అంది వనజ.
    "ఇప్పుడు రక్షించమని ఏం లాభం? వెంటనే పోలీసు లకు చెప్పివుందాల్సింది"
    "ఎలా చెప్పను? చెబితే రంగారావు గదిలో నేనెందుకున్నానో చెప్పాల్సి వస్తుంది. ఆ విషయం బయటపడితే నా భర్త నన్ను వదిలిపెట్టేస్తాడు. నా బ్రతుకు కుక్క చింపిన విస్తరి అవుతుంది" అంది వనజ.
    "ఇప్పుడెలాగూ మీ కథ బయటపడక తప్పదు" అన్నాడు వెంకన్న.
    "నన్ను కాపాడలేరా?" అంది వనజ దీనంగా.
    "మీరు చెప్పినదంతా నిజమైతే కొంతవరకూ ప్రయత్నిస్తాను. మీరు చెప్పినదాంట్లో అబద్దమున్న పక్షంలో నేను మీకు ఏ సహాయమూ చేయలేను!" అన్నాడు వెంకన్న.
    "ఒక్క అక్షరం పొల్లుపోకుండా అంతా నిజమే చెప్పాను మీకు" అంది వనజ.
    ఆమె నిజమే చెబుతున్నదని వెంకన్నకూ అనిపించింది.
    
                                    7

    "ఒక ముఖ్యవిషయం మాట్లాడాలని మళ్ళీ మీ దగ్గరకు వచ్చాను" అన్నాడు వెంకన్న.
    "మీరు నిజంగా డిటెక్టివ్ లేనా అని అనుమానంగా వుంది నాకు" అంది సరిత.
    "ఏం?" అన్నాడు వెంకన్న ఆశ్చర్యంగా.
    "ఒక పర్యాయం నాతో మాట్లాడిన మగాళ్ళు చాలా మంది యేదో వంకపెట్టుకుని మళ్ళీ వచ్చారు. మీరూ అలాంటివారే ననిపిస్తోంది" అంది సరిత.
    "ఎంత మాటన్నావు తల్లీ!" అనుకున్నాడు వెంకన్న. పైకిమాత్రం "మగవాళ్ళలో లేని దురూహల్ని స్ఫురింపజేయడంకోసం యిలా కొందరు ఆడవాళ్ళు మాట్లాడ్డం నాకు అనుభవంలో వుంది. భర్తపోయి పుట్టెడు దుఃఖంతో వున్న మిమ్మల్ని అలా అనుమానించడం న్యాయమా అని తటపటాయిస్తున్నాను" అన్నాడు.
    సరిత ముఖంలో కత్తివాటుకు నెత్తురుచుక్కలేదు "నా గురించి ఎవర్నైనా అడగండి చెబుతారు" అంది రోషంగా.
    "నా ప్రవర్తనే నాకు గీటురాయి. నన్ను గురించి తెలుసుకోవడానికి ఒకరినడిగి తెలుసుకోమనడం అవమానంగా భావిస్తాను నేను" అన్నాడు వెంకన్న.
    సరిత కంఠం దీనంగా మారిపోయింది "మన్నించండి నా మనస్సు నొప్పించినట్లున్నాను. అర్ధాంతరంగా నా భర్త హత్య కావించబడడంతో నా మనసు పాడయింది. మాటల్లో మర్యాద లోపిస్తోంది."
    "అలా అన్నారు కాబట్టి చెబుతున్నాను. మీ అనుమానం అర్ధరహితం కాదు. ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఆకర్షణ మీలో వుంది. ఇలాంటి భార్య వుండీ మీ భర్త పరస్త్రీ వ్యామోహానికి గురికావడం నాకు ఆశ్చర్యంగా వుంది" అన్నాడు వెంకన్న.
    "నా భర్తకు పరస్త్రీ వ్యామోహమా? అసాధ్యం!" అంది సరిత.
    "ముందు నేను చెప్పే కథ వినండి" అంటూ వనజ చెప్పిన కథ సరితకు వినిపించాడు వెంకన్న.
    "ఇవన్నీ మీ కెలా తెలిసాయి?" అంది సరిత ఆశ్చర్యంగా.
    "ఇప్పటికైనా నమ్మగలరనుకుంటాను. నా పేరు వెంకన్న. నేను డిటెక్టివ్ ను."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS