Previous Page Next Page 
అధికారి పేజి 48

    ఇప్పుడు మరోమారు కెమెరాలు క్లిక్ మన్నాయి. సిటీ కమిషనర్ విక్రమ్ ను ఫోటోగ్రాఫర్లు చకచకా ఫోటోలు తీశారు.
   
    డిసిపి, ఏసీపీ, కమిషనర్ ని ముందు హాస్పిటల్ కు వెళ్ళాలని తొందర పెట్టారు.

    "ఐయాం అల్ రైట్. ఈమాత్రం దానికే కంగారు పడితే ఎలా? నా బుగ్గమీద నల్లని మచ్చపడినా ఫర్వాలేదు. లా  అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యింద౦టే అది మన డిపార్టుమెంటుకే మాయని మచ్చ అవుతుంది. ఆఫీసర్స్ పృధ్వీనీ వారెంట్ తో కోర్టులో హాజరు పరచండి. డెడ్ బాడీలకు గార్డును పోస్టు చేయండి. రెవెన్యూ వాళ్ళు రాగానే శవ పంచాయితీ జరిపించి. అనంతరం డేడ్ బాడీలను యూనివర్సిటీ  జనరల్ హాస్పిటల్ కు తరలించండి. సిటీలో ఏ వాంచనీయ  సంఘటనలు జరగకుండా పెట్రోలింగ్ చేయండి. రౌడీలను, గూండాలను, రిఫ్ రాఫ్ గాళ్ళను. వాళ్ళ మనుషులు అని చూడకుండా రౌ౦డఫ్ చేయండి" కమిషనర్ సిబ్బందికి చకచకా సూచనలనీ  కారేక్కాడు.
   
    అంతా కమిషనర్  ధైర్య సాహాసాలను , సమయస్పూర్తిని  హుందాతనాన్ని కొనియాడారు. యువకులకు స్పూర్తిగా నిలిచాడు. "పోలీసు కమిషనర్ విక్రం జిందాబాద్ !.... కమిషనర్ విక్రమ్ జిందాబాద్!.......
   

    కమిషనర్.....
   
    కమిషనర్.....
   
    కమిషనర్......
   
    జిందాబాదు...." మాంటిస్టోరీ, సిద్దార్ద మహిళా కళాశాల విద్యార్ధినులు పోలీసు కమిషనర్ ని, అతని ధైర్యసాహసాలకు స్ల్హాఘిస్తూ, నివసాలిస్తూ  కాలేజీలకు వెళ్ళారు. 
   
                                 32
   
    పశ్చిమ గొదావరిజిల్లా
   
    చింతలపూడి ఫారెస్టులో ... టి. నరసాపురం దగ్గరలో......
   
    అర్దరాత్రి రెండుగంటలు అవుతోంది.
   
    కిరోసిన్ లాంప్స్ సహాయంతో సుమారు ఓ పాతిక మంది యువతీ యువకులు గెరిల్లా తరహా విద్యలో పొందుతున్నారు.
   
    "క్రామేడ్స్!"
   
    ఆ పిలుపుతో వాళ్ళు విల్లంబులను క్రిందకు దించి, వాళ్ళ చూపును టార్గెట్ వేపు నుంచి నాయుకుడి వేపు మరల్చారు.
   
    "కామ్రేడ్స్ ..... నేటితో మీ ట్రయినింగ్ పూర్తీ అయ్యింది.
   
    ఇక్విలాబ్ జిందాబాద్ ......
   
    ఇక్విలాబ్ జిందాబాద్......
   
    సాయుధ విప్లవం వర్ధిల్లాలి.
   
    సాయుధ విప్లవం....
   
    వర్ధిల్లాలి......
   
    సాయుధ విప్లవం.....
   
    "వర్ధిల్లాలి ....." నాయుకుడు చేస్తున్నా నినాదాలకి కోరస్ గా కామ్రేడ్స్ అంతా నినాదాలు చేశారు.
   
    "ఓకే కామ్రేడ్స్ ఇక మీరు మీకు నిర్దేశించిన ప్రాంతాలకు వెళ్ళండి. అక్కడ ప్రజలకు మన ఉద్యోమం పట్ల చైతన్యవంతులను చేయండి. మన సిద్దాంతాలను ప్రజలకు తెలియచెప్పండి.యువతను నిరాశా నిసృహలకు  లోనైనా విధ్యాదుకులకు కలవండి. కుటిల ప్రభుత్వం, ఈ ప్రజా స్వామ్యం మీకేమీ చేసిందని నిలదీయండి. వ్యక్తుల ఆస్తులను కుక్కలా కాపలాకాచే ఈ అధికార యంత్రాంగాన్ని సామాన్యుడికి ఏ చేసిందో నిలదీయండి. వాళ్ళతో చైతన్యం వస్తే వదిలి, గన్ చేతపట్టి సాయుధ మార్గాన పయనించమని చెప్పండి మరొక్కసారి మీ అందరికి విప్లవభినందనలు...."
   
    నాయుకుడు తన ఉపన్యాసం ముగించాడు.
   
    "లాల్ సలాం ...." కామ్రేడ్స్ అంతా తుఫకులు, విల్లంబులు దొరకబుచ్చుకుని నాయుకుడిని విప్లవభినందనలు తేల్చి బయలుదేరారు.
   
    అప్పటివారకు కొంచెం దూరంలో ఉన్న చెట్టు చాటునుంచి జరిగిన అతతంగం అంతా చూసిన అధికరిలో చలనం వచ్చింది, నడుంకి వున్న పౌచ్ లోంచి పిస్టల్ బయటకు తీశాడు.
   
    "నో..."
   
    నాయుకుడు అరవడంతో, పిస్టల్ కాక్ చేయబోతున్న అధికారు క్షణం ఆగాడు.
   
    ఆ కేక కి కామ్రేడ్స్ అంతా వెనుదిరిగి  ఠక్కున రైఫిల్స్ లోడ్ చేసి అధికారికి గురిపెట్టాడు.
   
    "కామ్రేడ్స్ అతన్ని ఏమీ చేయకండి. అతని సంగతి నేను చూస్తాను ఇక మీరు వెళ్ళండి...." నాయుకుడు సూచనలివ్వడంతో వాళ్ళు రైఫిల్స్ క్రిందకు దించారు.
   
    యధావిధిగా వాళ్ళు తమతమ గమ్యలకి బయలుదేరారు.
   
    అధికారి ఆవేశంగా వాళ్ళవెంట పడబోయాడు.
   
    "అగు...."
   
     ఆ మాటలతో  అధికారి కళ్ళకు బ్రేక్ పడినట్లు ఠక్కున ఆగిపోయాడు.
   
    "నువ్వేమన్నా కీర్తిశేషుడిని అవుతానని ఆఫీసర్ల వద్ద ప్రతిజ్ఞగాని చేసి వచ్చావా? అసలు నీ దగ్గర వున్న పిస్టల్ తో నువ్వెప్పుడైనా ఫైర్ చేశావా? మా కామ్రేడ్స్ దగ్గర వున్నవి కావిడిబద్దలనుకున్నావా? పోనీ నీ గురిమీద నీ కంత నమ్మకం బుల్లెట్స్ ఉన్నంతవరకే చస్తారు. మాలో ఒక్కడు పొతే వందమంది పుడతారు. కానీ నువ్వుపొతే ...." నాయుకుడి గొంతు మూగబోయి౦ది.
   
    "ఊ... చెప్పండి నేను పొతే....."
   
    అధికారి రెట్టించి అడిగాడు.
   
    అతను మౌనంగా ఉండిపోయాడు.
   
    "నా ప్రశ్నకు సమాధానం చెప్పరేం?"
   
    జవాబు లేదా? రాదా? లేక జవాబు చెప్పడానికి ధైర్యం చాలడం లేదా!"
   
    నాయుకుడు చివ్వున తలెత్తాడు అతని కళ్ళు అగ్నిగోళ్ళాల్లాఉన్నాయి. అతని వయస్సుకన్నా జీవితంలోకి అనుభవాలు, కఠోర శ్రమ, ఏదో సాధించాలనే పట్టుదల అతని కళ్ళల్లో ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. వృద్దాప్యపు చిహ్నాలకు మరుగు పరుస్తున్నాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS