సరిగ్గా అప్పుడు మాంటీస్టోరీ మహిళా కళాశాలకు వెళుతున్న అడపిల్లల గుంపు ఆ దృశ్యం చూశారు.
పెద్ద పోలీసు బలగం, అంతమంది పోలీసు ఆఫీసర్లు, సాక్ష్యాత్తు కమిషనర్ ఉండగా ఒకే ఒక వ్యక్తి ధర్మం, న్యాయం అంటూ సవాళ్ళు విసరడం కొత్తగా వుంది. ఎక్కడో సినిమాలలోనో, లేకపోతె కమర్శియల్ నవలలలో చూస్తె చూసి ఉండొచ్చు. చదివితే చదవి ఉండొచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళకి కళ్ళ ఎదుట కనబడుతున్న వాస్తవం. అది. ముందు ఆశ్చర్యమయినా తరువాత ఏం జరుగుబోతు౦దొనన్న అందోళన, భయం.....
వాళ్ళు ఊహించినట్లుగానే జరిగిపొయిందొక సంఘటన, అప్పటి దాకా చేట్టుకోకడు, పుట్టకొకడు పారిపోయిన పృధ్వీ మనుషులు నాలుగు వైపులా నుండి ఒక్కసారిగా వచ్చి పోలీసులను చుట్టూ ముట్టారు.
వాళ్ళు రావడం రావడమే పోలీసులం మీద స్మోక్ బాంబులు విసిరారు.
కమిషనర్ కి కర్తవ్యం బోధపడింది.
"పోలీసు ఆఫీసర్స్ టేక పొజిషన్, ఓ పెన్ ఫైర్ ......" కమిషనర్ పైరి౦గ్ ఆర్డర్స్ జారీ చేశాడు.
పోలీసులు తుఫాకులు తీసి చేయడాని కన్నా ముందే మరో సంఘటన జరిగిపోయింది.
పృధ్వీ మనుషులు ఈసారి ఆఫీసర్స్ మీద యాసిడ్ బాంబులు విసిరారు.
అంతే అక్కడ వున్న పోలీసు సిబ్బంది కాకావికలై, ఎక్కడ యాసిడ్ పడి మోహం మాడిపోతుందోనన్న భయంతో చెట్టుకొకరు పుట్టకొకరుగా పడి మోహం మాడిపోతుందోనన్న భయంతో చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదురై పోయారు.
పృద్వీ గుంపులో నుండి ఎవరు వేసారో ఏమోగానీ, ఓ యాసిడ్ బాంబు సాక్షాత్తు నగర పోలీసు కమిషనర్ మీరు పడింది అంతే! కమిషనర్ చాలా సెన్సిటివ్ గా రియాక్ట్ అయి ప్రక్కకు తప్పుకుని యాసిడ్ బాంబు వచ్చిన దిశగా పిస్టల్ తో కాల్చాడు.
యాసిడ్ బాంబు విసిరినా వాడి చావుకేక కంటె ముందు కమిషనర్ త్రుటిలో తప్పించుకోగా, ఆ యాసిడ్ బాంబు కాస్త యువ న్యాయవాది ముఖాన పడింది.
"అయ్యో! నా కళ్ళు, నా కళ్ళు .... నాకు కళ్ళు కనిపించటం లేదు. మంట ... మంట... అమ్మో! నాయనో!...." బాధకి తట్టుకోలేక అతను నేలమీదపడి గిలగిల కొట్టుకుంటున్నాడు.
ఆ కొద్ది క్షణాల గ్యాఫ్ లోనే పృధ్వీ కమిషనర్ చేతిలోంచి జారుకోవడానికి ప్రయత్నించాడు. అంతే కమిషనర్ పిస్టల్ నడినెత్తిన ఒక్కటిచ్చాడు.
పృద్వీ తల చిట్లి రక్తం పౌ౦టెన్ లా చిమ్మింది.
రక్తం చూసిన పృద్వీ మనుషులు, తమ నాయుకుడిని కమిషనర్ చంపేస్తాడేమోనన్న భయంతో గుంపులోకి ఓ అడపిల్లను లాగి యాసిడ్ సీసా తీసి పోయడానికన్నట్లు ఆమె ముఖం మీద ఉంచారు.
ఆ అమ్మాయి కెవ్వున కేక పెట్టింది పొగ తగ్గటంతో అక్కడ ఉన్న వాళ్ళంతా స్పష్టంగా కనిపిస్తున్నారు.
యాసిడ్ చింది కమిషనర్ బుగ్గమీద కూడా పడింది. యాసిడ్ పడినంత భాగం నల్లబడిపోయింది. అయినా అతను అదరలేదు, బెదరలేదు.
పృద్వీని వదిలేయండి, లేకుంటే ఈ అమ్మాయి ముఖం మీద యాసిడ్ పోస్తాం..."
అప్పటికి చాటునుండి రోడ్డు మీదకు వచ్చిన పోలీసు అధికారం అంతా అ దృశ్యం చూసి నిశ్చేష్టులైపోయారు తప్ప కనిసం ఆమెను రక్షించే ప్రయత్నం కూడా చేయలేదు.
పోలీసు కమిషనర్ విక్రమ్, డిసిపి, ఎసిపిలను దగ్గరకు రమ్మనట్టు కళ్ళతోనే సైగ చేశాడు.
వాళ్ళు దగ్గరకు రాగానే పృధ్వీ ని వాళ్ళకి అప్పజెప్పి మెరుపులా ముందుకు కదిలాడు.
"ఆగండి..... అడుగు ముందుకు వేస్తె మీ మీద కూడా యాసిడ్ బాంబు వేస్తాం...." అంటూ గుంపులోని పృద్వీ అనుచరుడుడొకడు యాసిడ్ సీసా మూట తీసి కమిషనర్ వైపు గురి చూశాడు.
"కమాన్..... త్రో ఇట్.... కమాన్, త్రో ఇట్....." కమిషనర్ వాళ్ళని మరింత రెచ్చగోడుతూముందుకు కదిలాడు.
"ఆగండిసార్..... ఆగండి.... మీరు ఆగకపొతే అన్యాయంగా ఆడపిల్ల బలిపోతుంది...." తుది హెచ్చరిక చేశారు.
కమిషనర్ షడన్ గా ట్రిగ్గర్ నొక్కాడు.
యాసిడ్ బాటిల్ పట్టుకున్న వ్యక్తి గుండెల్లోకి బుల్లెట్ దూసుకుపోయింది. అతను కుప్పకూలిపోయాడు. అతని చేతిలో యాసిడ్ బాటిల్ క్రిందపడి చిట్లడం, ఆ యాసిడ్ లోనే అతను పడిపోవడం అంతా చాలా డ్రమిటిక్ గా జరిగిపోయింది.
రెప్పపాటు కాలంలో మరో బుల్లెట్ ఆడపిల్లలను బంధించినతని, తలలోకి దూసుకుపోయి తలచిట్లి మెదడు బయటకి వచ్చింది.. ఆ అమ్మాయి అప్పటికే అతని చేయి వదిలించుకుని పరుగున వచ్చి కమిషనర్ ని కౌగలించుకుని బావురుమంది.
"కూల్ డౌన్ బేబి, కూల్ డౌన్ , నీకేమీ కాదు...."
కమిషనర్ ఆమె తలమీద చేయివేసి నిమురుతూ ధైర్యంగా చెప్పాడు.
అప్పటికి అక్కడ ఆచేతనంగా వున్న ఆడపిల్లలందరిలో ఒక్క సారిగా చైతన్యం వచ్చింది. అంతా చప్పట్లు కొట్టారు. వాళ్ళతోపాటే పోలీసు సిబ్బంది చేతులు కలిపారు.
సిటీ కమిషనర్ క్రింద పడిన యువ న్యాయవాదిని పైకి లేపి సౌత్ ఇన్స్ స్పెక్టర్ని పిలిచి అతన్ని వెంటనే హాస్పిటల్ లో చేర్పించవలసిందిగా సూచనలిచ్చాడు.
