Previous Page Next Page 
మహాశక్తి పేజి 28

    "ఏయ్ నిన్నే" గట్టిగా అంది స్వర్ణ.

    ఆ సందులో ఎవరూ లేరు. ఆగి ఉన్న ఓ టాక్సీ దగ్గర ఆగింది రిక్షా.

    టాక్సీలోంచి నలుగురు మనుషులు దిగారు. అందులోంచి ఒకడు స్వర్ణని టాక్సీలోకి ఈడ్చేశాడు.

    టాక్సీ కదిలింది మరుక్షణం.

    "నన్నొదలండి. ఏమిటిది?" కంగారుగా అరిచింది స్వర్ణ.

    ఒకడు ఆమె నోరు నొక్కేశాడు.

    "అరిస్తే పీక తెగిపోతుంది" కరుకుగా ఉందా గొంతు.

    గుడ్లు తేలేసి చూస్తోంది స్వర్ణ.

    ఆమెకి అర్ధం అయిందొక్కటే!

    ఎవరో అగంతకులు తనని ఎత్తుకుపోతున్నారు.

    తను ఆడది.

    అంటే వాళ్ళు తనని ఎత్తుకెళ్ళి ఏం చేస్తారో తెలుసు.

    అయిపోయింది. ఈ రోజుతో తన బతుక్కి నూరేళ్ళు నిండిపోతున్నాయి.

    కళ్ళవెంట నీళ్ళు...... ధారగా కారుతున్నాయి.

    వూపిరి ఆడ్డంలేదు గింజుకొంటోంది. అతని పట్టు సడలింది

    "మీకు చేతులు జోడిస్తున్నాను. నన్ను ఏమీ చేయద్దు. నన్ను విడిచిపెట్టండి" కన్నీళ్ళ మధ్య ప్రార్ధించింది స్వర్ణ.

    "ఈశ్వర్ మీద రిపోర్ట్ చేసినందుకు అనుభవిద్దూగానీ పద" కసిగా అన్నాడొకడు.

    ఈశ్వర్ ప్రతీకారం తీర్చుకొంటున్నాడన్నమాట.

    ఏడీ జెన్నీ? తన ప్రాణాన్ని అడ్డేస్తానన్నాడు. అన్నీ మాటలేనా? కారు ఓ ఇంటి ముందు ఆగింది. అప్పటికే చీకటి పడిపోయింది.

    "దిగు"

    స్వర్ణ కారుదిగి భయంగా చూసింది. ఎవరూ లేరు ఆ పరిసరాల్లో.

    అక్కడ్నించి తప్పించుకోవాలి. కానీ ఎలా

    చుట్టూ నలుగురు దుండగులు.

    ఆమెని గభాల్న ఎత్తుకొని ఇంట్లోకి తీసుకెళ్ళాడు ఒకడు. మిగిలిన వాళ్ళు అతన్ని అనుసరించారు.

    స్వర్ణకి మరికొన్ని క్షణాల్లో ఏం జరగబోతుందో తెలిసిపోయింది.

    ఆమె మెదడు మొద్దుబారిపోతోంది.

    గుండె వేగంగా కొట్టుకుంటోంది.

    తానొక్కతి.

    వాళ్ళు నలుగురు.

    వూహించలేని పరిస్థితి.

    నలుగురి చేతిలో తను ఏం కాబోతుంది?

   
    ఇంకెంతసేపో పట్టదు. ఒంటిమీద బట్టలొలిచి తనని పిశాచాల్లా అనుభవించడానికి సమాయత్తమవుతారు వాళ్ళు.

    అలా జరగకముందే తన ప్రాణం పోతే బాగుండును అనుకొంది స్వర్ణ. అసలీపాటికి గుండె పగిలి చావాల్సింది. కానీ అలా ఎందుకు జరగలేదో అర్థం కావడం లేదామెకి.

    ఒకరు కాదు, యిద్దరుకాదు, నలుగురు.

    అంతమంది చేతుల్లో జీవితం నాశనం అయినాక బతకడంలో అర్ధంలేదు. ఆత్మవంచన చేసుకుని జీవించడం తనవల్లకాదు. ఈలోగానే అక్కడినుంచి తప్పించుకోడానికి ప్రయత్నించాలి. కానీ అలాంటి అవకాశం ఏమాత్రం లేదని కూడా ఆమెకు తెలుసు.

    ఆ నలుగురిలో ఒకడు ఆమెని జబ్బ పట్టుకుని లోపలికి విసురుగా తోశాడు. ఆ విసురుకి ఆమె వెళ్ళి మంచంపైన వెల్లకిలా పడిపోయింది. నడుం విరిగిపోయిందా అనిపించింది.

    ఆమె పవిట తొలగి, చీర మోకాళ్ళ పైకి చెదిరిపోయింది.

    ఆమె అవయవాల పొందికని చూసి అందులో ఓ అగంతకుడు పెదాలు తడి చేసుకుంటూ అన్నాడు.
    "చిన్న ప్రోగ్రాం పెట్టుకోవచ్చు."

    ఆ మాటకి స్వర్ణ నిలువెల్లా కంపించిపోయింది. వాళ్ళు నలుగురూ ఒకేసారి మీదపడి కుమ్మేస్తున్నట్టుగా అనిపించి భయంతో కెవ్వుమని అరిచింది.

    "ఎందుకే అలా అరుస్తావ్?" కసిరాడొకడు.

    "ఒద్దు  దయచేసి నన్నేం చేయకండి. విడిచిపెట్టండి" కీచుగా అరిచింది స్వర్ణ.   

    "ఏమీ చేయొద్దంటే ఎలా? నిన్ను కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చింది ఏదో ఒకటి చేద్దామనేగా!" అడుగు ముందుకేశాడొకడు.   

    పవిట సర్దుకోవాలన్న దానికన్నా భయంతో ముందుగా గుండెకి రెండు చేతులనీ అడ్డుపెట్టుకుని మంచం అవతలకి జరిగింది స్వర్ణ.

    "హ. హ. హా!" అని వికటంగా నవ్వుతూ ఒకడు మంచంమీద నుంచి అల్సేసియన్ కుక్కలా ఆమె వేపుకి దుమికాడు.

    ఆమెకి అంతా సినిమాలా అనిపిస్తోంది.

    ఆమె జబ్బపైన గట్టిగా పట్టుకున్నాడు. అతని చేతి బలానికి ఆమెకి తన చేతి గూడు ఊడిపోతుందేమోననిపించింది. బాధతో విలవిల్లాడిపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS