జానికమ్మగారు ఏదో చెప్పబోయినట్లయింది.
"ఆ అమ్మాయిని వుండిపోనీ __" బరువుగా పలికింది. రాఘవయ్యగారి గొంతు అది ఆమెతో రాజీపడటం కాదు. పరిస్థితుల్లో రాజీ పడిపోవటం కాదు. సాంఘీక పరిస్థితులకి బలి అయిపోయిన ఓ అబలపై జాలిపడడం.
జానికమ్మగారు బరువుగా నిట్టూర్చారు.
ఆమె తలుపు వైపు వస్తోన్న అడుగుల చప్పుడు వినిపించింది. తడబడుతొన్న అడుగులతో బరువెక్కిన హృదయంతో తన యింటివైపు గబగబా వెళ్ళిపోయింది సుజాత.
ఆమె మనస్సులో యిప్పుడు కవిత మొదలుతోంది.
ఎవరీ కవిత! ఎవరీ కవిత !
జానికమ్మగారి కేమవుతుంది.__
ఆలోచనలతో వాకిలీ తెరచి వెళ్ళి మంచంపై వాలిపోయింది సుజాత.
10
సుమారు పది పదిహేను రోజులు గడచిపోయాయి. మల్లేశ్వరి అటుజానికమ్మగారికీ యిటు సుజాతికీ బాగా మాలిమి అయింది. ఆవుపాలు బాగా వంట పట్టాయామో __ కొద్దిగా వళ్ళు చేసి బొద్దుగ తయారై నాలుగయిదు నెలల బేబీలాగా కనిపిస్తోంది.
"ఛీ! పో __" అంటే నవ్వుతోంది.
అలా నవ్వితే "పెద్దయ్యాక చీఫో అంటే ఏడుస్తావే వెర్రి ముఖందానా" అంటుంది. జానికమ్మ.
ఆ మాటలకి సుజాత పకాల్ని నవ్వుతోంది.
ఆ నవ్వు చూసి జానికమ్మగారు సిగ్గుపడుతుంది.
"ఎందుకు పిన్ని ఆ సిగ్గు?
"మన ఆడబ్రతుకు గురించి తల్లీ _ ఏమయింది చెప్పు __ మనమంతా జీతం తీసుకోకుండా కూటికీ బట్టకి పని చేసే కూలీలం. వెట్టి చాకిరీ పేట్టి చాకిరి అంటుంది. ఇందిరమ్మ. మనం ఇంట్లో పిల్లలకి, మొగుడుకి, బంధువుకి చేసే చాకిరి గురించి ఆమెకేం తెలుసు, ఆ బాధ తెలియని అదృష్టవంతురాలు. మనకి సోషియల్ సెక్యూరిటీ పేరుతో బంధించేశారు.
చిన్న తనం నించీ మనల్ని భయ భక్తులతో పెంచుతారు. పుట్టుకలోనే ఆడా మగా అంటూ తేడాలు పెడతారు. మనకో తిండి, మగవాడికో, తిండి. శారీరకంగా మనం బలహీనులం కావటంతో యీ చిక్కోచ్చింది_"
సుజాత మాటడుతోన్న జనికమ్మగారినే చూస్తూంది. నివ్వెర పోతున్నది.
ఆ రోజు ఆ రాత్రి ఆ సంఘటన జరిగిన తర్వాత రోజూ మల్లి రాత్రి జానికమ్మగారి పక్కలోనేపడుకుంటోంది. ఆ యింటి నుంచి అలా వచ్చేశాక సుజాత మళ్ళీ వెళ్ళి మల్లేశ్వరిని తెచ్చుకోలేదు. ఆ రాత్రి జనికమ్మగారూ తెచ్చి యివ్వలేదు. ఆపిల్లని పక్కలో వేసుకునే పడుకుంది ఆమె.
ఆ మరురోజు ఉఅదయం పాపకి నీళ్ళు, పోసి, పౌడరు వేసి తను స్వయంగా కత్తరించి చేతికుట్టుతో కుట్టిన చేతుల్లేని గౌను తొడిగి తీసుకుని వచ్చి "ఇదిగో నమ్మా నీ పాప" అందామె.
సుజాత నవ్వుతూ ఎత్తుకుంది.
"పొద్దున్నే పని పెట్టానన్నమాట __" రాత్రంతా అలసి ఆలోచనలతో సతమతమయిపోయి ఎప్పుడో నిద్దరపోయింది సుజాత. నిద్దర్లోనూ పాపని పలకరించింది. అందుకే ఎంతో ఆర్తితో ఎత్తుకుంది. మల్లిని.
"రాత్రి పాప అక్కడే నిద్రపోయింది. నువ్వు రావటం కాస్త ఆలస్యమై చీకటి పడ్డాక వచ్చావు కదూ. అది అప్పటికే నిద్రపోతోంది. అందుకే __ దాన్నెందుకు కదిలించి నిద్ర చేదగొట్టాలని నా ప్రక్కలోనే వేసుకున్నాను __"
"పోనీలే పిన్నీ!" అంది దాని బుగ్గలు ముద్దాడుతూ.
అంతకు ముందు ఎన్నేన్నో అనుకున్నా దాన్ని చూడగానే గుండెల్లోకి ప్రేమ తన్నుక వచ్చింది.
"ఈ పాప కళ్ళల్లోకి చూస్తూ, దీన్ని ముద్దులాడుతూ వుంటే ఇంత ఆనందంగా వుందే! దీన్ని యిటర్లకోసం __ యిటర్ల సూటిపోటి మాటల కోసం వదులుకొనా! ఈ లోకం దేవుంది? ఎటు పడితే అటు మాటాడుతుంది. ఒక హద్దూ పద్దూ వుందా" అనుకుంది.
పాపని ఇచ్చేసి జనికమ్మగారు వెళ్ళిపోయారు.
దానితో కాలక్షేపం అవుతోంది బాగా.
పరిస్థితులన్నీ తర్కించుకుంది. సుజాత. ఎంతో అలోచించాక ఎలాగైనా సరే మల్లేశ్వరిని వదలకూడదని నిర్ణయించుకుంది.
మనుషుల కేం ఎలా వీలయితే అలా మాటాడతారు.
ఈ పాప ఎవరో!
ఎ తల్లి కన్నదో! ఏకాంనేపిల్ల ఏ దుర్మార్గుడి మోసానికి బలి అయిపోయిందో! వాడు చేసిన ద్రోహానికి ఆ పిల్ల, యీ పిల్ల యిద్దరూ బలి అయిపోయారు.
ఈ పిల్ల అనాధ కాకూడదు.
సవతి తల్లి పెంపకంలోనే తానేనని బాధలు అనుభవించి మాత్రు ప్రేమకి మొగం వాచింది!
అనాధ శరణాలయాల్లో నిజమైన సేవాతత్సరత నశించింది. హొదా కోసం డబ్బుకోసం నడుపుతోన్నారు. వాళ్ళు. అలాటి వాళ్ళు యీ పిల్లల్ని ప్రేమగా చూస్తారా? ఊహూ
ఇలా అనుకుని పాపని తన వద్దే వుంచుకోవటానికి నిర్ణయించుకుంది. సుజాత.
11
దాదాపు పది పదిహేను రోజులు గడచిపోయాయి.
ఈ పదిహేను రోజుల్లోనూ సుధాకర్ చమత్కారాలు ఎక్కువయ్యాయి.
అతని మాటల్లో శృంగారం ఆకుచాటు మొగ్గలాగా తొంగి చూస్తున్నాయి. ఆప్రయత్నంగా దొర్లుతున్న ఆ చాయలకి సూటిగా అతని కళ్ళలోకి చూస్తె అందులో ప్రేమ తప్ప మరో భాగం కనిపించలేదామేకి.
ఆ రోజు _
సుధాకర్ సేక్షనాఫీసరుగా ప్రమోషన్ వచ్చింది.
ఆఫీసరు గారు పిలిపించి చెప్పగానే అతను నేరుగా అక్కడి నుంచి సుజాత వద్దకి వచ్చాడు.
"ఒక గుడ్ న్యూస్!" అన్నాడు నవ్వుతో.
"ఒక టేమిటి మీకు అన్నీ గుడ్ న్యూస్ లే!"
