'బాగానే వున్నానమ్మా?
'చూడమ్మా కమలా నువ్వు శ్రీపతి మాటలకి ప్రవర్తన కి బాధపడుతున్నట్లున్నావమ్మా నేను పెద్దదాన్ని చెప్తున్నాను విను. అవ్వేమీ మనసులో పెట్టుకోకు. వాడేమిటో వెర్రివాడు. మునుపు బాగానే వుండేవాడు. నాలుగేళ్ళ నాటి దెబ్బ నించి ఇంకా కోలుకోలేదు. నువ్వు మాములుగా వుండాలి నా మాట విను' అంది దీనంగా.
కమల మళ్ళీ మాములుగా బైటి కొచ్చ్జి తిరగటం చూసి శ్రీపతి 'ఏం పాపా నీ అయాకి ఘోషా తీరిందా బైటి కొచ్చిందే' అనో 'జీతం తీసుకునేవాళ్ళు వాళ్ళ పనులు చచ్చినట్లు చేసుకోవాలి. మూల కూర్చుంటే గడుస్తుందా ' అనో లేకపోతె 'నౌకర్లు ఇల్లంతా తిరగటం ఎమిటనో' అనేవాడు. ఈమాట లనేటప్పుడు రాజేశ్వరి అక్కడుంటే అసహనంగా ' శ్రీపతి' అని అరిచేది. కమల బాధపడుతూ అవతలి కెళ్ళేది.
ఇది చాలనట్లు పాపకి వేసిన గౌను బాగా లేదనో, మాసిందనో , తల సరిగా దువ్వలేదనో ఏదో వంక పెట్టేవాడు. పాపకు అన్నం తినిపించే టైముకి హాజరై పిల్లకు సరైన పోషణ జరగటం లేదనేవాడు.
ఈమధ్య కమలకి బొత్తిగా సహనం పోతున్నది. ఈ ములుకుల్లాంటి మాటలకి ఏదో సమాధానం చెప్తున్నది. 'ఇష్టమైతే గౌను వెయ్యచ్చుగా' అనో, చేతనైతే తల దువ్వుకోమనీ, ' అంత పట్టింపు వుంటే పోషణ చేయ్యమనో , ఇట్లాగే ఏదో అనేది. వింతగా ఈ సమాధానాలతో కొంచెం తృప్తి చెందినట్లు కనిపించేవాడు శ్రీపతి. అప్పటికీ వూరుకోక 'నే చెసేట్టటయితే జీతం ఇచ్చి మనుషులని పెట్టుకోడం ఎందుకూ' అని రెట్టించేవాడు. ఆ క్షణాన రాజేశ్వరి దేవితో నేనింక పని చెయ్యనని చెప్పి వెళ్ళి పోవాలన్నంత ఆవేశం వచ్చేది కమలకి. కాని ఆవిడ అన్నమాటలు జ్ఞాపకం వచ్చి మెత్తబడేది.
ఏమైనా సరే చలించకూడదనుకుంది. నిజమే మునపటిహాయి సంతోషం మాయమైనై. కాని కొన్నాళ్ళు వోపిక పట్టాలి. అంతగా మరీ భరించలేకపోతె రాజేశ్వరి దేవితో చెప్పి ఆశ్రమంలో చేరుదాం అని నిర్ణయించుకుంది.
5
నలుగురిలో సంతోషం గా నవ్వుతూ నవ్విస్తూ తిరిగే శ్రీపతి ఇట్లా ఎందుకు మారినట్టు అని ఆశ్చర్యపోయేది. అసలు విషయం తెలుసుకోవాలని ఆరాటం ఎక్కువయింది. కాని ఎవరి నడిగినా ఏదో చెప్పి దాతెస్తున్నారే కాని ఏమైందీ చెప్పలేదు. చివరికి రాజేశ్వరినే అడగటానికి కమల అవకాశం కోసం చూస్తున్నది.
నీరజ వాళ్ళ చిన్నప్పటి పోటోలన్నీ చూపించింది. వాటి అన్నింట్లో ఎంతో అందంగా ఆనందంగా వున్నాడీ శ్రీపతి అంటూ ఇప్పటి అసహనానికి ప్రతిరూపం అయిన శ్రీపతి ని పోల్చి చూసి జాలిపడేది.
వెళ్ళిన రెండు నెల్ల కే చెప్పా పెట్టాకుండా నీరజ దిగింది. వాళ్ళ తోడికోడలు తమ్ముడు రాజుతో, మొదట్లో ఎవరే మడిగినా వూరికనే చూసిపోదామని అని నవ్వింది. తరవాత కమల లేని సమయం చూసి వూరికి వెళ్ళినాక ఎప్పుడూ కమల విషయం ప్రస్తావిస్తూ ఉండేదిట తను. రాజు ఆ మాటలకి కుతూహలం చూపించేవాట్ట. మెల్లగా అరాలన్నీ తియ్యటం చివరికి కమల గురించి అన్నీ విషయాలు చెప్పించుకుని విన్న మీదట తను సామాన్య కుటుంబం లోంచి మంచి చక్కని చదువు కున్నపిల్లని చేసుకోవాలను కున్నానని కమలీని చూస్తానని కూర్చున్నట్ట. వాళ్ళ అక్కయ్య కూడా రాజుకేది ఇష్టమైతే అట్లాగే చేద్దాం. మాకేం పిల్ల ఆస్తి పాస్తులు తేవాలా అన్నది. సరేనని తీసుకొచ్చాను అని అన్నదో లేదో.
'వోహో పనిపిల్ల రాణి ఔతుందా సిండ్రిల్లా కధలో అల్లే' అని హహ్హహ్హ' అని నవ్వడం మొదలుపెట్టాడు శ్రీపతి.
తల్లీ కూతుళ్ళకి నోటమాట రాలేదు. రాజేశ్వరి మొహంలో అప్రసన్నత, చిరాకు, నీరజ మొహంలో కోపం స్థానం చేసుకోటం చూసి శ్రీపతి తన వికటాటహాసం మాని మెల్లగా బైటకి నడిచాడు.
శ్రీపతికి ఇప్పటికి ఇంకో విషయం కూడా గ్రహింపు అయింది. ఈ సంఘటనతో. రాజేప్పుడైతే కమలని చేసుకుంటానని వచ్చాడో అప్పటి నుంచి శ్రీపతికి ఎవరో తన వస్తువు లాక్కుపోవటానికి వచ్చినట్టు అనిపించసాగింది. తన మనసులో తనకి తెలియకుండానే కమలని అభిమానిస్తూన్నట్టు తెలుసుకున్నాడు. కమల విలువ ఇంకా పెరిగింది. ఇప్పుడు తనకి ప్రతిక్షణం కమల, కమల మాటలు, చేష్టలే జ్ఞాపకాని కొస్తున్నై.
మూడు జన్మల శతృత్వమా, ఏడు జన్మల మిత్రత్వమా అన్నట్టు కచ్చతో శ్రీపతి కమల ప్రతి చేష్టని కనిపెడ్తూ వున్నాడు. ప్రతిమాటని పట్టించుకుంటూ విన్నాడు. ఇప్పుడవ్వన్నీ మనసులో విడవకుండా సినిమా రీళ్లల్లె తిరుగుతున్నాయి. కమల హావభావ ప్రదర్శన గుర్తు చేసుకుని నవ్వుకుంటున్నాడు. కొంచెం కోపం వచ్చినప్పుడు ముక్కు పుటాలు ఎట్లా వుబ్బించేది, కనుబొమలు ఎట్లా ఎత్తెది పెదవులేట్లా బిగపట్టేది , ఇంకా మరీ కోపం వచ్చినప్పుడు పిడికిళ్ళు , పళ్ళు ఎట్లా బిగపెట్టేది బాధపడ్డప్పుడు కళ్ళేతలా వాల్చేది ముఖం ఎట్లా తెల్లబడేది పాపతో సర్వం మరిచి నవ్వుతున్నప్పుడు ముఖం ఎంత కాంతితో వెలుగుతూ విప్పారేదీ వద్దనుకున్నా మనసులో మెదుల్తున్నై.
పాపతో సమానంగా అల్లరి చేస్తున్న కమలీ పసిపిల్ల అల్లే చప్పట్లు కొడ్తూ పరిగెత్తే కమలీ అనుక్షణం కళ్ళ ఎదుట నిలుస్తున్నది. తనకు తెలియకుండానే తను కచ్చతో మొదలెట్టిన ఈ వింత చర్యల పర్యవసానంగా కమల ఈ విధంగా తన మనస్సంతని ఆక్రమించిందని చెరగని ముద్ర వేసిందని గుండెలో తిష్ట వేసుక్కూర్చుందని శ్రీపతి ఇప్పుడే తెలుసుకున్నాడు.
ఒకవేళ తనకి కోర్కె వుండబట్టే కమలని కవ్వించి , సాధించైనా ఎదట నిలుపుకునే వాడినేమోనని శ్రీపతికి అనుమానం వచ్చింది. ఇంతలో ఎవరో కొరడాతో కొట్టినట్టు ఇట్లాంటి వుద్దేశాలకి తావివ్వకూడదని , కావాలంటే ఇంకా కిరాతకంగానైనా ప్రవర్తించి తన మనసులోని కమలని వెళ్ళగొట్టాలని , ఆడవాళ్ళ ని నమ్మటం అంత పాపఖర్మ ఇంకొకటి లేదనుకుని నిశ్చయించుకున్నాడు.
మనసు మరొక వైపుకు మార్దవంగా లాగుతున్నా మునపటి కన్నా తీవ్రం చేశాడు తన ప్రవర్తన.
అన్న కమల పట్ల చూపిస్తున్న ఈ వైషమ్యానికి కర్కశత్వానికి నీరజ విస్తుపోయింది. తల్లితో ఈమాటే అన్నది. ఏమిటో నమ్మా వాడి ప్రకృతి అర్ధం కావడం లేదు. ఇప్పుడు మిగతా అందరితో కాస్త మనిషల్లే ప్రావర్తిస్తున్నాడు కాని కమల కనిపిస్తే రెచ్చిపోతాడు. కమల నీడపడ్డా అట్లా పెట్రేగిపోతాడు. కమల కూడా బాధపడుతున్నది. నామాట తీసేయ్యలేక ఏదో సర్దుకుపోతున్నది. చివరికి ఏమౌతుందో ఏమో' అన్నది రాజేశ్వరి దిగులుగా.
మర్నాడు రాజుకి కమలతో మాట్లాడే అవకాశం కల్పించటానికి నీరజ శ్రీపతి బయలుదేర తీసి పిల్లతో సహా ఐదుగురు జు కెళ్ళారు.
రాజు ఎండుకోచ్చాడో ఏమిటో ఇప్పటికి ఈ విషయాలేమీ కమలకి తెలియదు. మాములుగా పాపతో నవ్వుతూ కబుర్లు చెప్తూ, కాసేపు పాప నెట్టుకుని కాసేపు చెయ్యి పట్టుకుని నడిపిస్తూ తిరుగుతున్నది. పాప ' కమలీ అదుగో కోతి' అత్తా ఇదిగో చిలక' అంటూ కేకలేస్తూ పరుగేడుతున్నది. దేన్నైనా చూసి భయం వేసి నప్పుడు మాత్రం కమలీ వెనక నక్కినక్కి చూస్తున్నది. 'కమలీ నీవప్పుడు చెప్పిన కధలో మొసలిదేనా, హనుమంతుడిదేనా' అంటూ అడుగుతున్నది. శ్రీపతి వెయ్యి కళ్ళతో వద్దనుకుంటూనే వీళ్ళద్దరినీ గమనిస్తున్నాడు.
పడవల దగ్గర కొచ్చేటప్పటికి పాప ' అబ్బ ఎన్ని నీళ్ళో పడవేక్కుదాం కమలీ' అంటూ మారాం చేసింది. పడవలో ఇద్దరిద్దరుతప్ప ఎక్కటానికి వీల్లేదు. నడిపేవాడు కావాలంటే వుంటాడు. లేకపోతె దిగి పోతాడు. ఆ ఎక్కడం లో కమల కాలు జారి నీళ్ళలో పడబోయింది.

వెనకనే వున్న శ్రీపతి చటుక్కున పట్టుకుని ఆపి, నీరజ ఎక్కిన దాంట్లో ఎక్కించాడు. 'పడవెక్కడం రానివాళ్ళు ఎక్కటం ఎందుకు' అని ' నాకూతుర్ని అట్లాంటి వాళ్ళ చేతుల్లో పెట్టబోనంటూ తానె ఎత్తుకుని రాజుతో పాటు వేరే పడవేక్కాడు.
కమల ముఖం చిన్నబోయింది. కళ్ళల్లో నీళ్ళు తిరిగినై. బలవంతంగా ఆపుకుని కూర్చుంది.
