'క్లాస్ మేట్సు గా ఉండి ఒకర్నొకరు ప్రేమించుని పెళ్ళి చేసుకున్న వాళ్ళున్నారు. మీరు పెళ్ళి చేసుకున్న తరువాత ఒకే పరీక్షకు చదువుతూ క్లాస్ మేట్స్ అవడం చిత్రమైన , సవ్యమైన చక్కనైనా అనుభవం. మీకు మా జ=హృదయ పూర్వక అభినందనలు.'
సిలబస్ వచ్చాక చూసుకునేసరికి నా మతి పోయింది. అంతవరకు నాకు ఈ యూనివర్సిటీలో ఎం.ఎ పరీక్షకు రెండేళ్ళు కూచోవాలని తెలీదు. మొదిటేడు 'ప్రీవియస్' కి నాలుగు పేపర్లు. రెండో ఏడు ' ఫైనలు ' కి అయిదు పేపర్లు' నా తరమా ఈ సాగర మీదను, నళిని ద'ళేక్షణ రామా!' అనిపించింది.
అప్లికేషను ఫారాలు నిమ్పించి, సకాలంలో పరీక్ష ఫీజు కట్టించాను గాని ఈ 'మొద్దబ్బాయి ' చేత చదివించడం ఎవడి తరమమ్మా! తను ఒక్క పిసరు చదవక పోగా నాకే ఎసరు పెట్టేవారు! ఇంకా మా మధురమే నయం. అల్లరి చేసినంత సేపు చేసినా ఏ రబ్బరు బొమ్మనో జోకొడుతూ కూచునేది. ఏ చాకలేట్తో చప్పరిస్తూ నిద్దరోయేది. నాలుగు తొందరగా చక్క బెట్టుకుని మెడ మీదికి చేరి కాస్త శ్రద్దగా పుస్తకం తెరచే సమయంలో ఈయన తను పడుకోరు నన్ను చదువు కొనియ్యరు.
ఇలా కాదని మంచి నీళ్ళిచ్చి రమ్మని ఓనాడు రంగిని మేడ మీదకి పంపి నేను కిందే ఉండి పోయాను. అక్కడ్నించే మంచీ చెడ్డ లేకుండా పెద్ద పెద్ద కేకలు.
దాంతో నా ఒళ్ళు పులకరించేది. జ్ఞాపకమున్న నాలుగు ముక్కలూ చెల్లా చెదరు అయిపోయేవి.
-ఇంకా చదివి ఏం ఉద్దరిస్తావు లెద్దూ!!
-నిజానికి చదివి బాగు పడిందేవరుచేబ్దూ?
- ఈ పాడు చదువెక్కడ వచ్చి పడింది పోనిద్దూ!
-ఏయ్ మొద్దూ!
- ఇలా రద్దూ!
నేను ఏ మిల్టన్ మహాశయుని నరకం లోనో పడి కొట్టుకుంటూ ఉండేదాన్ని. ఫ్లాస్కులో నాకోసం పెట్టుకున్న టీ వూన బట్టేసే వారు. నేను తయారు చేసుకున్న వోట్స్ దాచేవారు. ఉన్నట్టుండి మెయిన్ స్విచ్చి అపేసేవారు. 'ఎన్ని విద్యలు నేర్చినాడమ్మా ఈ చిన్ని కృష్ణుడు!' అని 'ఒకప్పుడు కళ్ళు వెలుగుతూ, ఒకప్పుడు పళ్ళు కొరుకుతూ పాడుకునేదాన్ని ఒకనాడు మంచిగా దారిలోకి తీసుకు రావడానికి గట్టి ప్రయత్నమే చేశాను.
'చూడండి , ఇంక పరీక్షలు సరిగ్గా నాలుగు నెలలున్నాయి. ఎలాగ డబ్బు కట్టేశాముగా ఈ కాస్త కాలమూ నా మాట విని బుద్దిగా చదువుకుందాం రండి. ఇద్దరం ఒకచోట కూచుని 'ఎస్సేలూ యానోటేషన్స్ ' మననం చేసుకుంటే మరచి పోకుండా జ్ఞాపకం ముంటాయి. మా ఫ్రెండు పరిమళ చెప్పింది. ఇవాళ నుంచి అలా మొదలెడదాం. మనకున్న అవకాశం వెయ్యి మందిలో ఏ ఒకరిద్దరికో గాని ఉండదని అప్పుడే అందరికీ కన్ను కుడుతోంది. ఇద్దరూ ప్యాసైతే ఎంత ఆనందంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి.'
అయన బుద్ది మంతుడిలా తల వూగించారు. అలాంటప్పుడు ఆ ముక్కు దొరక పుచ్చుకుని అటూ యిటూ వూపాలని మక్కువ పడ్డాను గాని తరువాతి సంఘటనలు ఊహించుకుని కష్టపడి నిలదోక్కుకున్నాను.
ఆవాళ నుంచి ఏడింటి కే చదువు మొదలెడదామని అనుకున్నాం గనక అయిదున్నరకే వంట చేసేసి అయన కోసం చూస్తూ మధురిమ వేలు పట్టుకుని వీధిలో నిలబడ్డాను. అయన వచ్చారు. లాంబ్రెట్టా లోపల పెడుతుంటే నాకెంతో ఆనందమనిపించింది. ఇక ఈయన బయటికి వెళ్ళరు గదా అని.
ఇంతలో మా వీధి గుమ్మంలో కారాగింది. నాకన్నా ముందొచ్చి కారు దగ్గర కెళ్ళి వాళ్ళను పలకరించింది మావారే. 'ఆలశ్యమై పోతుంది. మళ్ళీ టిక్కెట్లు దొరకవు. కమిన్ మోహన్' అని కార్లోంచే వాళ్ళ మేనేజరనుకుంటాను కేకేశారు.
'ఇదిగో వచ్చేస్తున్నాం . నేను చెప్పలేదా మా మిసెస్ నా మాట దాటదని. ముందు చెప్పి వెళ్ళేనెమో వేళకి పిల్లని కూడా ముస్తాబు చేసి ఎలా రడీగా ఉందొ చూడండి' అన్నారు. పెంకితనంగా ఆయన నా వైపు చూస్తూ.
'అదేమిటి మంజులా అలా ఉన్నారు. ఒంట్లో బాగులేదా?' అంది మేనేజరు భార్య, కారులోంచి తల ఇవతలకి పెట్టి, తోర్రలోంచి తొండ తొంగి చూసినట్టు. నేను ' ఇప్పుడు కాదు మీ పని ఇంటికి రానియ్యండి.' అన్నట్టు అయన వేపు చూస్తూ -- చేసేది లేక తలుపు తాళాలు వేసి కారులో కూలబడ్డాను.
ఆ రాత్రి తిరిగి వచ్చాక మధురిమ పడుకున్నాక అయన ధోరణి నాకు చాలా చిరాకు కలుగ జేసింది.
'దయచేసి ఇవాళ మాత్రం నాజోలికి రాకుండా పడుకోండి. నేను పట్టుదల మనిషిని. కనీసం ఈరోజు మూడు గంటలయినా చదువుదామానుకున్నాను. ఇలా చేస్తారను కోలేదు. పోన్లెండి. ఇప్పుడు మాత్రం ఏం పోయింది? ఇప్పట్నుంచి రెండు గంటల దాకా చదివి తీరతాను. నన్నెవడు అడ్డగలడో చూస్తాను.' గడగడ పైకి చదవడం ప్రారంభించాను. లోపల మనసు ఆలోచిస్తూనే ఉంది.
-ఈయనకు వ్యతిరేకంగా ఈ చదువు ఎన్నాళ్ళు సాగుతుంది?
-దీని వల్ల కలిసి వచ్చేదేముంది?
- నేను ఎం.ఏ కాకపొతే వచ్చిన నష్టమేముంది?
-ఎప్పుడూ లెంది ఆయన్ని ఎదిరిస్తున్నాను కూడా ఏమిటి?
దోమతెర మెల్లగా ఒత్తిగించాను. జబ్బ మీద తడుతూ అన్నాను.
"ఏమండీ, నిద్రా, నా మీద కోపమా?'
అయన జవాబుగా ఒక్క చేత్తో నన్ను లోపలికి లాగేశారు.
నా రెండో చేతిలో పుస్తకం ఎగిరి పక్కింటి డాబా మీద పడిపోయింది.
4
"ఏమండీ, శలవు దొరికిందా లేదా?'
వీధిలోనే లాంబ్రెట్టా హేండిల్ బార్ పట్టుకుని నిలేబెట్టేశారు.
"దొరికేటట్టు లేదు.' అన్నారు. అంటూ దొరికి పోయినట్టు నవ్వేశారు.
'ఎందుకండి నా దగ్గిర అబద్దాలు? మీకు రావాలని లేకపోతె చెప్పకూడదు? మీ మేనేజర్ని అసలు మీరు అడగలేదు కదూ, అడిగితె కాదనరు కదూ?'
అయన మాట్లాడలేదు.
'సరే ఇవాళ నేను మీ ఆఫీసుకి వస్తాను. నేనే మీమేనేజర్ని కలుసుకుంటాను. పై చదువు చదువుకుంటానంటే పగలబడి ఏడ్చే పరమ దౌర్భాగ్యుడెమో తెలుసుకుంటాను. పరీక్షలకని పై వూరు వెళ్ళవలసి వస్తే శలవు తీసుకుంటే ఓ పది హీను రోజులపాటు ఏం బ్రహ్మండభాండాలు బ్రద్దలౌతాయో కనుక్కుంటాను."
'అబ్బ, నీ కేండుకంత పట్టుదల చెప్పు? నాకూ ఈ పరీక్షలకి మొదట్నించీ పగ మేరిక అని నీకు తెలుసు. తెల్లని ఇస్త్రీ మడతలు తొడుక్కుని తెల్లని సిగరెట్టు ఒకటి నోట్లో కుక్కుకుని నన్నిలా తేలిగ్గా తిరగానియ్యక ఎందుకు చంపుతావ్?'
ఆ మధ్య వదిన రాసిన కార్డు జ్ఞాపకం వచ్చింది. రెండు ప్రశ్నలు మరేం లేదు.
1. మా కంబైన్డ్ స్టడీ ఎట్లు సాగుతున్నది?
2. ఆ రాకాశి మీతో కాశీ వచ్చు చున్నడా?
అదే పద్దతిలో వెంటనే జవాబు రాసి పడేశాను.
1. వో దివ్యంగా!
2. చిన్నదాంతో ఎలాగైనా పరవాలేదు. పెద్ద దాన్ని దారిలో తీసుకు రావడమే మహా కష్టంగా ఉంది!
'ఎందుకు నవ్వుతున్నావ్?' అన్నారు అయన,
'చూడండి వెళ్ళేది కాశీ పట్నం. పెళ్ళిలో స్నాతకం వెళ్ళేప్పుడు నాలుగు అడుగులు కాశీకి వెళ్లినట్టు వెళ్లి తాటాకు గొడుగూ, పాంకోళ్ళు చూసి మురిసి పోయి ఏం తిరిగిచ్చారో అంతే. మహా పవిత్రస్థలం. పుణ్యం పురుషార్ధం కూడా కలిసి వస్తుంది. తక్కిన వన్నీ అలా ఉంచి నేనోక్కత్తేనూ ఎలా వెళ్ళి రానూ? అక్కడ భాషేమోలోకమేమో నాకు తెలియదాయె. అన్నింటినీ మించి గంగా తీరం మంచి విహార స్థలమంటారు. కనీసం ఒక ఎస్కర్షన్ లా, గానీ పిక్నిక్ లాగాని నాతొ రావాలని మీకు లేదా?'
ఆ చివరి మాటలకి ఆయన కళ్ళు ,మిలమిలా మెరిశాయి.
'మా మేనేజరు ఎవడి కోసం శలవిస్తాడు? ఇవ్వక పొతే నేను ఉద్యోగానికే శలవిచ్చేస్తాను' అని రేయ్ మని బయలుదేరారు.
వారితో కలిసి వారణాసి వెళ్ళి రావడం నా జీవితంలో మరువలేని మధుర ఘట్టం. మా మధురిమ మొదట్లో తనూ వస్తానని పేచీ పెట్టినా వదిన పిల్లలతో ఆడుకుంటూ ఉండి పోడానికి గుప్పెడు హార్లిక్స్ గుండ లంచం ఇస్తే ఒప్పుకుంది. స్లీపింగు కోచ్ లో బెర్త్ లు ముందుగానే రిజర్వు చేయించుకుని బయలు దేరామేమో వెళ్ళేటప్పుడు మాకు ప్రయాణం చేసినట్లే అనిపించలేదు. అందులో ఆ పెట్టెలో మూడొంతుల మంది తెలుగువాళ్ళు మాలా పరీక్ష కు కట్టిన వాళ్ళు అయి ఉండడం మాకు మరింత ధైర్యంగానూ ప్రోత్సాహకారంగానూ ఉంది. అది రైలు పెట్టె అన్నమాట చాలా తొందరగానే మరిచిపోయావనుకుంటాను. అదొక కుటుంబమనీ అందరూ నా వాళ్ళే అని అనిపించింది. అందరి కంటే నన్ను ఆకర్షించింది ఏభై ఏళ్ళు దగ్గర పడినట్లున్న ఒకామె రైల్లోనే ఏదో నోట్సు తీసి వర్క్ చేసుకోవడం.
'ఎవరికైనా మీరు శిక్షణ ఇస్తున్నారా?' అన్నాను ఆవిడ దగ్గిర కెళ్ళి.
"ఏం, నేను పరీక్షకు వెళ్ళకూడదా!" అందామె నవ్వుతూ. ఎంతో ఆప్యాయంగా నా గురించి అన్నీ అడిగి తెలుసుకుంది. ఆవిడేమో మేధామేటిక్స్ ఎం.ఎ ప్రీవియస్ కి రెండు సార్లు వెళ్ళిందిట. పోయిందిట. ఇది మూడో సారి.
'అయ్య బాబోయ్ ఎంత ఓపిక మీకు రుక్మిణమ్మగారు!'
'ఆ మాట నాకు చెప్పమాకమ్మాయ్.... మన కిష్టమైన వాటి కన్నిటికీ వోపిక ఉండి దీనికి లేకుండా పోయిందా ఏం? అరవై ఏళ్ళు దాటిన మన వాళ్ళు అరిసెలూ, చక్కిలాలు అవలీలగా చేసి పారెయ్యటం లేదూ! దానికి వోపిక ఎక్కణ్ణించి వచ్చిందేం! రోజుకి ఏడెనిమిది గంటలు మొగాళ్ళు పని చేసుకు వస్తుంటే మహా అయితే నాలుగ్గంటలలో వంటా పై పనీ ముగించ గల మనం మిగిలిన కాలమంతా ఏం చేస్తున్నట్టూ?"
