58. హఠాత్తుగా స్పృహా కోల్పోతే ఏం చేయాలి?
ఆసుపత్రికి వచ్చిన అనసూయ వెయిటింగ్ రూమ్ లో కూర్చోని అక్కడ కూర్చున్న వారితో ఉత్సాహంగా ఏవో కబుర్లు చెబుతోంది. అంతలో ఒక్కక్షణం పాటు హాఠాత్తుగా మాట్లాడటం మానేసిందామె. ఆ విషయాన్ని ఎవరూ గమనించలేదు. ఆమె కళ్ళు తెరచి చూస్తోండనే అంతా అనుకున్నారు. అంతలోనే గుడ్లు తెలవేసింది. పట్టుతప్పికూర్చునే బల్లమీదే నుంచి కిందపడి పోయింది. క్షణంలో ఆమె ముఖం పాలిపోయినట్లుఅయింది. నాలిక రక్తం లేనివారి మాదిరిగా తెల్లగా మారింది. అంతకు ముందు వరకు లేతగూలాభీ రంగులో ఉన ఆమె పెదవులు వివర్ణమై పోయాయి. నాడి నీరసంగా కొట్టుకుంతోంది ఒంటిమీద స్పృహాలేదు.
క్షణంలో ఇలాగ జరగడం చూసి పక్కన ఉనవాళ్ళు గాభరా పడిపోయారు. వాళ్ళు ఆ కంగారు నుంచి కోలుకోక మనుమడే మరి కొన్ని క్షణాల్లో ఎవరూ ఎ ఉపచర్యలూ చేయక ముందే తెలివితప్పినా అనసూయ తేరుకుంది. నిదానంగా కళ్ళు విప్పిచూసి ఒకటి_ రెండు నిమిషాల్లో మామూలు మనిషి అయిపోయింది.
ఇలా అనుకోకుండా కొద్ది క్షణాలపటు తెలివితప్పి పడిపోవటాన్ని ఫేయితిమ్గ్" అంటారు. ఈ పరిస్థితి కలగటానికి మెదడుకి కొన్ని క్షనలాపాటు రక్త సరఫారా బాగా తగ్గిపోవడమే కారణం. ఇందుకు కొందరిలో శారీరికబలహీనత, అనారోగ్యం కారణం అయితే మరికొదరిలో వీనో మోటార్ నెర్వస్ సిస్టంలో స్థిరత్వం లేకపోవడం, కార్డియోజనిక్ సింకోఫ్ ముఖ్యకారాణాలు.
బాగా నీరసంగా వున్నప్పుడు ఏ మాత్రం నడిచినా, లేచి కూర్చున్నా అకస్మాత్తుగా తెలివి తప్పిపోవడం సహజం. చాలా సందర్భాలలో ఆసుపత్రికి వెళ్ళినవాళ్ళు అంతవరకు బగానే ఉన్నా ఇంజక్షను చేయించుకున్న కొద్దిసేకండ్లకే ఉన్నవరు ఉన్నట్లే తెలివి తప్పి పడిపోతారు. అలా స్పృహా తప్పటానికి ఇంజక్షను రియక్షను కారణం కానేకాదు. ఇంజక్షను అంటే భయమో లేదా, సూది నావుప్పావు కారణం. అ మాత్రం సూది నొప్పి కూడా వ్యతిరేకచర్య కలిగించి రక్తసరఫరా తగ్గిపోయేటట్లు చేస్తుంది దాంతోతెలివి తప్పిపోతుంది.
భయంకూడా 'సైకోజనిక్ షాక్' కలిగిస్తుంది కొన్ని సందర్భాలలో ఇంజక్షను చేస్తున్నప్పుడు చూసో, దెబ్బ తగిలినప్పుడు కారుతున్న రక్తాన్ని చూసో ఇతరులు తెలివి తప్పి పడిపోయిగుడ్లు తెలేస్తారు. దీనికి కారణం, వారిలో ఉన్న "సైకోన్యూరోసిన్" మెదడుకి రక్త సరఫరా తగ్గిపోయేటట్లు చేయటం. సుకుమారంగా ఉండే స్రీలు ఎక్కువసేపు నిలబడవలసిన ఉద్యోగానికి చదువులకి వెళ్ళి మొదటి రోజుల్లో కొద్ది గంటలకే కళ్ళు తిరిగి పడిపోతూఉంటారు. మరికొందరు పిల్లిని చూసి, ఎలుకని చూసి, భయంతో అరిచి కేకలు పేట్టి స్పృహా కోల్పోతారు. తరువాత ఒకటి రెండు నిమిషాలకి వారంతటవారేతెప్పరిల్లుతారు. ఇలా "ఫేయింటు" అవడానికి మాత్రం వారికి ఉన్న "హిస్తోరియా" వ్యక్తత్వం కారణం. అందుకే ఈ రకం వ్యాధిని సుకుమారులకు, భయసతులకు స్న్హేహిటునిగా పేర్కొంటూ ఉంటారు. వైద్యులు మూర్చ వ్యాధి (ఎపిలేస్పీ) ఉన్నవాళ్ళు, హిస్తిరియా ఫిత్సు ఉన్నవాళ్ళుకూడా అప్పుడప్పుడు ఇలా పడిపోతూ ఉంటారు. మామూలుగా "ఫేయింట్" అయ్యేవాళ్ళు రెండు మూడు నిమిషాల్లో కోలుకుంటారు. తరువాత ఏ బాధ లేకుండా లేచి నడిచి వెళ్ళిపోతుంటారు. అకస్మాత్తుగా కొందరు అంతవరకు బాగానే ఉండిఅకస్మాత్తుగా తెలివితప్పిపడిపోయిఇకకోలుకోలేకపోవచ్చు. అటువంటి వారికి మెదడులో రక్తనాళాలుపగలదమావు, రక్తం గడ్డకట్టి రక్తం సరఫరాకు అడ్డుపడటమో కారణం అవుతుంది.
అధిక రక్తపోతు కూడా స్పృహ తపడానికి కారణమే. ఇలాంటి ఫేయింట్స్ 'స్ట్రోక్" లవల్ల కలుగుతాయి. వారిలో మూతి వంకర పోవడం, శరీరానికి ఒకవైపు పక్షవాతం వచ్చి కాలు చెయ్యి బలహీనం అవడం మనం గమనించవచ్చు. సరిగ్గా గలి ప్రసరించమని గదుల్లో కూర్చున్నప్పుడు తగినంత ఆక్సిజన్ అందక మనకు తెలియకుండానే స్పృహా కోల్పోతూ ఉంటాం అలాంటప్పుడు వారిని వెంటనే బాగా గాలి వీచేచోట పడుకోబెట్టాలి ఆ వ్యక్తి చుట్టూ జనం గిమికూడకుండా చూడాలి. అలా చల్లని గాలి వారికి అందేటట్లు చేస్తే కొద్దిసేపట్లో వారు కోలుకుంటారు.
సర్వ సాధారణంగా తెలివితప్పిపడిపోయినప్పుడు ఆ వ్యక్తిని నేలమీద గాని బల్లమీద గాని పడుకావుబెట్టాలి కుర్చీలో కూర్చుని ఫేయింట్అయిన వాళ్ళనికూడా వెంటనే కింద పడుకోబెట్టాలి. ఒకవేళ కుర్చీ మీద నుంచి కిందికి జారిపోతే, అల కింద పడుకొనివ్వాలి గాని ఎత్తులో కూర్చోపెట్టడం చేయకూడదు. నేలమీద తిన్నగా పడుకోవడంవల్ల మెదడుకి వెంటనే రక్త సరఫరా అయి 1_2నిమిషాల్లో ఆ వ్యక్తి కోలుకుంటాడు.
ఒకవేళ పడుకోబెట్టెందుకుస్థలం లేకపోతేరెండు మోకాళ్ళ మధ్యకి తలని వంచ్ఘి పట్టుకోవాలి. గుండెకంటె తల తక్కువ ఎత్తులో ఉండటంవల్ల గుండె తెలికిగా మెదడుకి రక్తం అందజేయగలుగుటుంది. అందువల్ల తెలివితప్పి తలవ్రేలాదేస్తే అ తలను అలాగే వదిలిపెట్టాలి, గాని తలఎత్తి పట్టుకాకూడదు అలా చేస్తే గుండెపంఫ్ చేసే ఆ కొద్దిపాతి రక్తం కూడా మెదడుకి అందకుండాఅడ్డుపడిన వాళ్ళమవుతాం. నేలమీద పడుకొనివ్వడం గౌరవానికి భాగం అనుకుని బలవంతంగా వారిని కుర్చీలో కూర్చోపెట్టడానికి ప్రయత్నిస్తే తెలివి తప్పినా వాళ్ళపట్ల మనం తెలివితక్కువ తనాన్ని ప్రదర్శించినట్లు అవుతుంది.
****
