ఆరోజే డ్యూటీలో జాయిన్ అయ్యాడు.
అతను కూర్చోమనేదాకా తనునిలబడవలసిరావడం.....
"వెల్ మిస్టర్ నాగరాజ్! చెప్పండి!" అన్నాడు సంజయ్.
"ముందుగా క్రైం ఛార్టుని గురించి చెబుతాను సార్!"
"ప్లీజ్ ప్రొసీడ్!"
సర్కిల్ ఇన్స్ పెక్టరు నాగరాజ్ చెప్పడం మొదలెట్టాడు. దొంగసారా, గేంబ్లింగ్ డెన్స్, గూండా ముఠాలూ, బ్రోతల్ హవుసెస్.....
అప్పటిదాకా మౌనంగా తల ఊపుతూ వింటున్న సంజయ్, బ్రోతల్స్ అన్న మాట వినగానే ఆసక్తిగా ముందుకువంగాడు. అతని మొహంలో కుతూహలం తొంగిచూస్తోంది.
అది గమనించిన నాగరాజ్ మనసులోనే నవ్వుకున్నాడు. యంగ్ ఏ.సీ.పీ. యంగ్ బ్లట్! అమ్మాయిల పేరు చెబితే మనసు అలజడిచేసే వయసు అతనిది.
"ఆగిపోయారే మిస్టర్ నాగరాజ్! చెప్పండి!" అన్నాడు సంజయ్.
గొంతుసవరించుకుని చెప్పడం మొదలెట్టాడు నాగరాజ్.
"సర్! ఈ హైదరాబాద్ నగరంలో వ్యభిచారం అనగానే ముందుగా గుర్తొచ్చేది మెహబూబ్ కీ మెహందీ! ఓల్డ్ సిటీలో చార్మినార్ దగ్గర ఉంది ఆ లొకాలిటీ!"
"మెహబూబ్ కీ మెహిందీనా?" అన్నాడు సంజయ్ "మెహాబూబ్ కీ మెహిందీ లో ఉండే వాళ్ళందరూ వ్యభిచారులు కారని విన్నానే! అక్కడ ఉండే డాన్సింగ్ గరల్స్ అందరూ ప్రాస్టిట్యూట్సే అయి ఉండాలని ఏమీ లేదుటకదా?"
"ఇన్ ఫర్ మేషన్ అంతా ముందే బాగా తెలుసుకుని వచ్చినట్లున్నాడే!" అనుకున్నాడు నాగరాజ్. ఒక్కసారి సంజయ్ మొహంలోకి చూశాడు. చూసీ చూడగానే సంజయ్ మొహంలో అత్యంత ఆకర్షణీయంగా కనబడడేం అతని 'కళ్ళు!' చూపులతో ఎదుటివాళ్ళని నిలబెట్టి బంధించగల శక్తి ఉంది ఆ కళ్ళకి.
అంతేకాదు--
మదనుడిచాపంలోనుండి వెలువడిన వాడిచూలలో మగువలలో మన్మధతాపం రేకెత్తించి బాధించగలశక్తి కూడా ఉంది ఆ చూపులకి.
"యస్సర్! మీరు చెప్పింది కరెక్టే! మెహిందీలో ఉండే డాన్సింగ్ గరల్స్ అందరూ ప్రాస్టిట్యూట్స్ కారు. ఆడి, పాడి, సరసులను రంజింపచేయడానికి వాళ్ళకు లైసెన్సు ఉంది. అయితే దానికీ టైమింగ్సు ఉన్నాయి. సాయంత్రం ఆరునుంచి రాత్రి పదకొండు గంటలదాకావాళ్ళు గానాబజానానడిపించవచ్చు. మామూలుగా వాళ్ళ ఇళ్ళలో ఒక పెద్దగది ఉంటుంది. అందులో గోడలకి ఆనించి పరుపులూ దిళ్ళూ వేస్తారు. మధ్యలో డాన్సింగ్ గరల్స్ ఆడుతూ పాడుతూ ఉంటారు. ఎవరైనా అక్కడికి వెళ్ళవచ్చు. కాసేపు కూర్చుని ఆనందించవచ్చు. అందుకుగాను ఖచ్చితంగా ఇంత డబ్బు ఇచ్చితీరాలని ఏమీ ఉండదు. మెప్పుదలని సూచిస్తూ ఎవరికీ తోచినంతవారు అభిమానంగా ఇవ్వడం ఆనవాయితీ, అయితే అదికూడా ఇప్పుడు కమర్షియల్ గా మారిపోతోందనుకోండి."
మెహబూబ్ కీ మెహందీలోనే, ఈ డాన్సింగ్ గళ్స్ ఇళ్ళచుట్టు పక్కల అంతా వ్యభిచారుల ఇళ్ళు ఉన్నాయి. కాసేపు గానాబజానాను ఎన్ జాయ్ చేసిన తర్వాత కస్టమర్సు లో కొంతమంది "మూడ్" లోకి వచ్చెయ్యడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ అవసరాలని తీరుస్తూ ఉంటారు ఆ ప్రాస్టిట్యూట్స్.
తన పీక్ క్యాప్ ని తీసి టేబుల్ మీద ఉంచి, దానివైపు చూస్తూ కొంచెం మొహమాటంగా అడిగాడు సంజయ్. "ఇంకా?"
"స్ట్రీట్ వాకర్స్ వేరే కేటగిరి సర్! రోడ్డుమీద కాపువేసి విటులను ఆకర్షించే రకాలు వీళ్ళు. మరీ చీప్ అనుకోండి. క్లాస్ ఫోర్ రకం!"
తల పంకించాడు సంజయ్ "నౌ టెల్ మీ అబౌట్ హైక్లాస్ బ్రోతల్స్!"
"ఇక్కడ టాప్ క్లాస్ వ్యభిచారం మామూలుగా టాప్ క్లాస్ బ్రోతల్స్ లో నడుస్తుంది సర్!"
"ఓపెన్ గానా?"
"కాదు సార్! దానికి ఒక ప్రొసీజర్ ఉంది."
"ఏమిటది?"
చెప్పాడు నాగరాజ్.
కొద్దిసేపు ఆలోచించాడు సంజయ్.
"ఆల్ రైట్! ఇవాళ వాళ్ళందరి మీదా రెయిడ్స్ అరేంజి చేయించండి."
"రెయిడ్సా?" అని సందిగ్ధంగా చూశాడు నాగరాజ్. "సర్! ఐ డోన్ట్ థింక్ ఇటీజ్ దట్ ఈజీ! పెద్ద పెద్ద హోటళ్ళమీదా, వ్యభిచారం గోప్యంగా జరిగిపోయే ఇళ్ళమీదా ఎప్పుడు తలుచుకకుంటే అప్పుడు రెయిడ్స్ చెయ్యలేం సర్!"
"ఎందుకని?"
"అక్కడ వ్యభిచారం జరుగుతోందని నూటికి నూరుపాళ్ళు నమ్మకంగా తెలిస్తేగానీ మామూలుగా రెయిడ్ కి వెళ్ళం. వెళ్ళాక మన అనుమానం నిరాధారమయినదని తేలితే పెద్దగొడవయిపోతుంది. ాఒ" ఆ పని వస్తుంది. సీత! చిత్రంగా లేదూ? సాని కొంపలని అరికట్టడానికి ఉద్దేశించిన చట్టం పేరు సీత! చిత్రంగా లేదూ?"
"అవును సర్ ాఒ"ఆ.ాఒ"ఆ కింద రెయిడ్స్ ఏర్పాటు చెయ్యడం అప్పటికప్పుడు జరిగేపని కాదు. కానీ పోలీస్ యాక్ట్ సెక్షన్ 68 క్రింద స్ట్రీట్ వాకర్స్ నీ, మెహిందీ ప్రాస్టిట్యూట్స్ నీ బుక్ చేసి పట్టుకు వచ్చెయ్యవచ్చు సర్. ఎప్పుడూ కావాలంటే అప్పుడు!"
"ాఒ"ఆకీ సెక్షన్ 68కి తేడా ఏమిటి?"
సెక్షనులు వివరించి చెప్పడం మొదలెట్టాడు నాగరాజ్.
అంతావిన్న తర్వాత నిదానంగా అన్నాడు సంజయ్. "అంటే, సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ ని పెద్దవాళ్ళమీద ఉపయోగిస్తాం. ఉపయోగించడానికి తటపటాయిస్తాం కూడా. సెక్షన్ 68 కింద నోరూవాయిలేని బక్క ప్రాణాలను బాధపెడుతూ ఉండాం. ఈజిట్ సో?"
తల ఊపి ఇబ్బందిగా నవ్వాడు నాగరాజ్.
"ఎనీవే! ఈ ఊళ్ళో ఉన్న ప్రతి ప్రాస్టిట్యూట్ మొహాన్ని నేను పర్సనల్ గా చూడాలి. మనసులో ఉంచుకోండి" అన్నాడు సంజయ్.
ఫోన్ మోగింది.
"ఒక నిమిషం?" అంటూ ఫోన్ ఎత్తాడు సంజయ్. "ఏ.సీ.పీ. హియర్!" అన్నాడు. లైన్లో అవతల ఉన్నది ఎవరో గుర్తుపట్టిన వెంటనే అతని గొంతులో అధికారం తగ్గి, స్నేహంధ్వనించింది. "ఏరా?
బాగున్నావా? అవును......నిన్ననేవచ్చా! రాగానే నిన్ను కలుద్దామనుకున్నాగాని.....ఏమిటీ? అవును....అవును......ఇంకా పిట్టలని పట్టుకుంటూనే ఉన్నావా? మంచి పిట్టలు దొరికితే నాకూ ఒకటిరెండు పంపకూడదూ? ఆ? ఏం? పోలీసు వాడినయితే నాకుమాత్రం హాబీలు ఉండకూడదేమిటీ? అని నవ్వాడు.
