నేను ఒక్క చిన్న నాటకం ఆడాను. ఈహత్య గురించి నాకు తెలుసునంటూ ఫోటోలు, క్యాసెట్ నా దగ్గర ఉన్నా యంటూ బ్లాక్ మెయిల్ పేరుతో వ్యవహరిస్తూ నేను కిరణ్ కి ఒక బెదిరింపు లేఖ రాశాను. ఆ దెబ్బతో కలుగులో ఎలుకలకి చలనం వచ్చింది. కాని బయటకు రాలేదు. నేను ఇన్ స్పెక్టర్ సహాయం అర్ధించి నాటకరంగంలోకి ప్రవేశించాను. ఇన్ స్పెక్టర్ నా భుజంతట్టి "గో ఎ హెడ్" అన్నారు. నాటకం తయారుచేశాను. స్టేజికూడా చాలా ఖరీదైనదిగా తయారయింది. చేతిలో కారు, ఎవరూలేని ఖరీదయిన పెద్ద భవంతి ఐదువేల క్యాషూ మార్చుకున్న నా రూపముతో పాండే పేరుతో, దామోదరాన్ని కలుసుకున్నాను. ఈవిధంగా........................................................... .............................................................................................నా చెల్లెలు శాలిని అని, కిరణ్ ఆమెని హత్య చేశాడు అని కామినీ దగ్గర ఆధారాలు వున్నాయని తీసుకురమ్మని చెప్పాను. ఈ విషయంలో కామినీ దామోదరం పోట్లాడుకున్నారు.
ఆ మాట అని రికార్డు చేశాము. నేనే దొంగ ఫోటోలు తయారుచేయించి, మొహంవుండేచోట కిరణ్ తలవరకూ వున్న ఫోటోలను తీసుకువెళ్ళి దామోదరం ఇంట్లోనే వుంచాను. ఆ ఫోటోల్లో ఒకటి తీసుకుని రావుగారిని ఫలానా చోటకి రమ్మని దామోదరం ఫోన్ చేశాడు. కలుగులో ఎలుక లన్నీ బయటకు వచ్చాయి. ఫోన్ కాల్ మేము కూడా వినటం జరిగింది. రావుగారి వెనుక నే కిరణ్ వస్తాడు. రావుగారు, కిరణ్, దామోదరం మాట్లాడుకుంటూ వుంటే ఆ మాటలు రికార్డు చెయ్యొచ్చు అనుకొన్నాము. ఒకవేళ అవసరం అయితే అక్కడే పట్టుకోవచ్చు అనుకొని నేనూ, ఇన్ స్పెక్టర్, ఇంకో ఇద్దరు పోలీసులు ఆ యింట్లోనే ఒక మూల దాక్కున్నాము. వాళ్ళ సంభాషణని రికార్డుచేస్తున్నాము. కలుగులోని మరో ఎలుక కామినీ కూడా రంగంలోకి వచ్చింది. కానీ మేము ఆమె వస్తుందని అసలు అనుకోలేదు. కామినీ రావడంతో ఆమె, దామోదరం కలసి రావుగారికి ఎదురు తిరిగారు.
వాళ్ళని బెదిరించడానికి అన్నట్లు రివాల్వర్ తీశారు రావుగారు. దామోదరం తన చేతిలోని బ్రీఫ్ కేస్ ని రావుగారి చేతిమీదకు విసిరేయడంతో దామోదరం ఆయన చేతినుండీ అయితే మృత్యుఉని తప్పించుకున్నాడు గాని కిరణ్ చేతిలో తప్పించుకోలేకపోయాడు. ప్రతి చిన్న విషయానికీ ఆవేశపరుడైన కిరణ్ కోపం పట్టలేక తన జేబులోని రివాల్వర్ పైకితీసి టపటపా దామోదరాన్ని కాల్చివేశాడు.
మేము ఇది ఊహించలేదు. కాని అప్పటికే ఆలస్యం అయిపోయింది. చాటుగావున్న ఇన్ స్పెక్టర్ గారి చేతిలో వున్న రివాల్వర్ రావుగారిచేతిని చూస్తూవుంది కాని, కన్ను మూసి తెరిచేలోగా కిరణ్ ఇంతపని చేస్తాడని వూహించలేదు. వెంటనే మేము లోపలికివచ్చి వాళ్ళందరినీ కష్టడీలోకి తీసుకోవడం జరిగింది. కాని, దామోదరాన్ని రక్షించలేక పోయాము. రావుగారు, కామిని, కిరణ్ తేలికగా లొంగిపోయారు."
కానిస్టేబుల్ కనకారావు టూకీగా కధను ముందు చెప్పి, ఆ తరువాత ముఖ్యమయిన విషయాలు వివరించాడు.
"మిష్టర్ గోవిందరావ్! హంతకుడిని పట్టుకోడం జరిగింది. మా ఇన్స్ పెక్టర్ గారినుండి నాకు అభినందనలు అందాయి. నాకు ప్రమోషన్ వచ్చింది. నేను త్వరలో ఇన్ స్పెక్టర్ ని కాబోతున్నాను. ఫైలు మూసేసిన ఒక కేసు బయటకురావడమూ, హంతకుడు దొరకడం, ఒక హెడ్ కానిస్టేబుల్ ఇన్ స్పెక్టర్ కావడమూ, ఇవేమీ గొప్ప విషయాలు కావు. నన్నడిగితే 24గంటలూ త్రాగినాసరే మైండ్ కంట్రోల్ లొ వుండి ఒక విషయాన్ని, ఒక వ్యక్తిని చక్కగా గుర్తుపెట్టుకుని పోలీసులకి సహకరించడమే గొప్ప విషయం.
ఈ ఘనత నీది, నీవా చిన్నపాటి సాక్ష్యం కూడా ఇవ్వకపోతే అనిత హత్య బయటపడేదికాదు. ఈ క్రెడిట్ అంతా నీది" గోవిందరావ్ భుజం తడుతూ అభినందిస్తూ అన్నాడు కనకారావ్.
"చేసినదంతా మీరు! నాదేముంది" సిగ్గుపడుతూ అన్నాడు గోవిందరావు.
"ఈ హత్యవల్లకాదు, నే చేసిన పరిశోధనవల్లా కాదు. కేవలం నీ సాక్ష్యంలో ఇదంతా బయటపడింది. నీవు ఆ నాలుగు ముక్కలయినా చెప్పకపోతే నేను రంగంలోకి దిగేవాడినీ కాదు. నీవిప్పుడు పారిపొయినా నిజాయితీగా ఇప్పుడు తిరిగి వచ్చావు. నిన్ను చూస్తూంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇహపై నీవు నా మిత్రుడివి. కలకాలం గుర్తుండేలా నీకు మంచి బహుమతి ఇద్దామనుకుంటున్నాను. ఏమి ఇవ్వమంటావు గోవిందరావ్!" కనకారావ్ మనస్పూర్తిగా అన్నాడు.
ఒక్కోసారి ఏనుగులు చేయలేనిపని చీమలు చేస్తాయనే సామెత ఉంది. అల్పుడు, అసమర్ధుడు, త్రాగుబోతు అయిన గోవిందరావే ఈ కేసులో ఉపయోగపడ్డాడు.
"పోలీసువాళ్ళే నోరు తెరిచి అడగమంటూంటే అలా మొహమాట పడతావేమిటి! అడుగు గోవిందరావ్!"
"అయ్యా కాబోయే ఇన్ స్పెక్టరు గారూ! విస్కీ బాటిల్స్ తో యిల్లు కట్టిపెడతారా!" నవ్వుతూ అడిగాడు గోవిందరావు.
"అయితే స్థలం చూడు మిత్రమా! అయితే ఇక్కడ కాదు, ఫారిన్ లో" అంటూ తనూ నవ్వాడు కానిస్టేబుల్ కనకారావు.
కాదు కాదు
ఇన్ స్పెక్టర్ కనకారావు.
* * * *
* * *
* *
*
