Previous Page Next Page 
రామ్ శాస్త్రి పేజి 5


                                    5
    అది మధ్యాహ్న సమయం. చించ్ నాడ్ గ్రామం లో చంప్రాజీ అనే యువకుడు బుర్రకధలు చెప్తున్నాడు. అతను యోధుడు గానే కాక కవిగా కూడా పేరు పొందినవాడు. అయితే చంఫాజీ ఎప్పుడూ మారాజా వీరుల శౌర్యాన్ని వర్ణించే పాటలు తప్ప కట్టేవాడు కాదు. పాడేవాడు కాదు. తనే పానిపట్ లో అతి సాహసంగా పోట్లాడి ఎన్నో గాయాలు పొందినవాడు.
    --పానిపట్టు లో అశువులు బాసిన
    మరాటీ వీరులు స్వర్గం చేరిరి
    సోదరులారా స్వర్గం చేరిరి!
    --వారి కోసమయి దేవతలంతా
    విమానాలని పంపారూ
    విమానాలనీ పంపారూ!
    --విమానాలలో వీరులయినా
    అచ్చరలందరు పూలవాననీ
    కురిపించారూ, కుఅరిపించారూ!
    -- ధన్యుల హూ! ఆ మరాఠీ వీరులు!
    పాని పట్టులో అశువులు బాసిరి
    సోదరులారా అశువులు బాసిరి!
    అసలు చంఫాజీ గాయకుడు కావటానికి కారణం ఉంది. సేద్యం చేసుకొనటానికి అతనికి స్వంత భూమి లేదు. ఇలా పాటలు పాడి, బుర్రకధలు చెప్పి దేశ దిమ్మరి అయి పొట్ట పోషించు కుంటున్నాడు. ఆనాడు చించ్ నాడ్ గ్రామస్థులు అతని పాట వింటామన్నారు కాబట్టి అక్కడే ఆగిపోయాడు.
    మర్రిచెట్టు నీడ కింద కూర్చుని శ్రావ్యంగా పాడుతున్న అతని చుట్టూ మూగే జనం సంఖ్య క్రమంగా అధికం కాజొచ్చింది. చివరిదిగా "పానిపట్ వీరుల' పాట వినిపిస్తున్నాడు.
    చంఫాజీ చుట్టూ కూర్చుని ముగ్దులయిపోయి విన్తున్నట్లే అక్కడికి అతి సమీపం లో ఉన్న ఒక ఇంట్లో శ్యామా అనే పదిహేడేళ్ళ బానిస యువతి కూడా అతని పాటలు విని వళ్ళు మయిమరిచి పోతున్నది. "పానిపట్ వీరుల' వద్దకి వచ్చేసరికి ఆమెలో ఒక విపరీతమయిన ఆవేశం ప్రవేశించింది. తనూ ఆగుంపు లో చేరి ఆ పాడే వ్యక్తిని కళ్ళారా చూసి ఆనందించాలనిపించింది. యజమానురాలు భోజనం ముగించి నిద్ర పోతోంది. యజమాని గుళ్ళో ఏదో పని ఉండటం చేత ఇంట్లో లేడు. చడీ చప్పుడు లేకుండా ఒక బిందె చేత బుచ్చుకుని పిల్లి నడకతో ఇల్లు వదిలి బయటికి వచ్చింది. పక్కనే వున్న నది వైపుకి వెళ్లి, బిందె నింపుకుని ఇంటికి తిరిగి వచ్చేప్పుడు ఆ క్షణంలోనే తనకి పాట వినాలనే ఉద్దేశం కలిగినట్లు మర్రి చెట్టు దగ్గిరే ఆగిపోయింది. చంఫాజీ గానంలో మునిగిపోయి వున్న ఆ గుంపు లో కంట తడి పెట్టని వారు లేరు. కాని గాయకుడూ శ్యామా హృదయాన్ని దొంగి లించినట్లు గా మాత్రం మరెవరి హృదయాన్నీ వశపరుచు కొనలేదేమో! అందుకనే పాట ముగిసి శ్రోతలందరూ తమ తమ ఇళ్ళకీ తిరిగి వెళ్ళిపోతూ ఉంటె ఆ బానిస పిల్ల మాత్రం ఒక మర్రి వూడకే అనుకుని శిలా ప్రతిమ లాగ అలాగే నుంచుని ఉండి పోయింది. తన కళ్ళ వెంబడి నీరు ధారలుగా చెక్కిళ్ళ మీద జారిపోతున్న సంగతి శ్యామాకి తెలియనే తెలియదు!
    పాడి, పాడి అలిసిపోయి సేద తీర్చుకుంటున్న చంఫాజీ దృష్టి ఆమె మీద పడింది. లేచి నుంచుని, ఆమె వైపు జరిగి, "ఎవరమ్మాయి నువ్వు? ఎందుకిలా ఏడుస్తున్నావు?" అని అడిగాడు.
    శ్యామా ఈ ప్రశ్నకి ఉలిక్కి పడింది. తను ఒక పెళ్లి కాని పిల్ల. అలా బహిరంగ ప్రదేశం లో వంటరిగా ఒక అపరిచిత యువకుడితో మాట్లాడుతున్నదనే ఆలోచన రాగానే సిగ్గుతో కుంచించుకు పోయింది. గాబరాగా కళ్ళు తుడుచుకుని పమిటని నిండుగా కప్పుకుంటూ నేల మీద దించిన బిందేని ఎత్తుకుని అక్కడ నుంచి వెళ్ళిపో బోయింది. కాని చంఫాజీ మళ్ళీ తన మొదటి ప్రశ్ననే వేశాడు. అతని స్వరం దృడంగా ఉన్నప్పటికీ దాని వెనుక ఉన్న సౌమ్యత్వమా కాళ్ళకి బంధం వేసింది. ఎలాగో తెప్పరిల్లి వణుకుతున్న పెదిమలతో "నేనొక దిక్కులేని బానిస పిల్లని...అదే మా యజమాని  ఇల్లు....." అని, ఇక చెప్పలేక ఆగిపోయింది.
    "నువ్వా! బానిసవా?' చంఫాజీ కంఠస్వరంలో అప నమ్మకమూ, బాధా ప్రతిద్యనించాయి. "నువ్వసలు బానిస వేలా అయ్యావు?"
    శ్యామా సమాధానం చెప్పలేకపోయింది కాని చంఫాజీ ఆమెని వదలలేదు. "నువ్వు బానిస కావటానికి కారణ మేమిటి? ఎలా అమ్ముడు పోయా" నని గుచ్చి గుచ్చి అడిగాడు.
    అతని ఆప్యాయత శ్యామా సంకోచాలని పటాపంచలు చేసింది. ఏడుస్తూ తన కధనంతా చెప్పింది.
    శ్యామా తండ్రి ఒక కర్షకుడు. పానిఫట్ యుద్ధం వచ్చినప్పుడు సైనికుడుగా చేరాడు. వీర మరణం చెందాడు. భర్త మరణానంతరం శ్యామా తల్లి తమకి ఉన్న పొలం సాగుబడి చెయ్యటం ప్రారంభించింది కాని అనావృష్టి వల్ల నేల ఎండిపోయి, వారు తీవ్రమయిన బాధలకి లోనయ్యారు. ఒక ఏడు అనావృష్టి కి తోడు కరువు కూడా రావటంతో శ్యామా తన కుటుంబం పడే బాధలు చూడలేక తల్లితో తనని బానిసగా అమ్మి వేసి అయినా కొంత ధనం సంపాదించు కొనమన్నది. గత్యంతరం లేక శ్యామా తల్లి కూతురిని బజారు లో బానిసగా విక్రయించింది. ప్రస్తుతం ఆమె 'మోర్ భట్' అనే అతని ఇంటి పనిమనిషిగా ఉంటున్నది.
    'అయ్యా , కవిగారూ! ఇవాళ మీ పాట వింటున్నప్పుడు యుద్దంలో పోయిన మా నాన్న గుర్తుకి వచ్చాడు. ఇలా బానిస బ్రతుకు బ్రతుకుతున్న నాకు అమృతం ప్రసాదించినట్లయింది! పెద్ద కూతుర్నని మా నాన్న నన్నెంత ప్రేమగా చూసుకునేవాడు......అదంతా జ్ఞాపకం వచ్చేప్పటికి నాకు ఏడుపు ఆగలేదు....." అని ముగించింది శ్యామా.
    శంఫాజీ మాట పెగల్లేదు. శ్యామాని చూడగా చూడగా అతనిలోని ఆవేదనా, ప్రేమా అధికం అయిపోసాగాయి. ఆ సమయంలో మర్రిచెట్టు మీద నుంచి ఒక పావురం ఎగిరి వచ్చి చంపాజీ భుజం మీద వాలి అతని మెడని తన ముక్కుతో పొడవడం ప్రారంభించింది. ఆ పక్షి అల్లరి పని చూడగానే శ్యామా విచారం మాయమయింది. కన్నీళ్ళతో నుంచి ఆమె చిరునవ్వు వెలిసింది.
    "ఇది నా పెంపుడు పావురం -- ఈ లోకంలో నాకు మిగిలిన ఏకైక మిత్రుడు !" అని చెప్పాడు చంఫాజీ. "నేనెక్కడి కెళ్ళినా నా వెంటే వస్తుంది. ఎన్నో పావురం పందేల లో గెలిచి నాకు మంచి పేరు తెచ్చి పెట్టింది. అయితే, ఈ పిట్టకి దర్జా జాస్తి! వేరుశనగ, పెసలు, నువ్వులు నాన్చి చేసిన 'చట్నీ' మాత్రమె తింటుంది! ఏనాడయినా ఈ వేళకి తిండి పెట్టక పోయానా, నన్నిలా పొడిచి కోప్పడుతుంది !" (మహారాష్ట్ర దేశంలో పావురాలు పందేలు చాలా రోజుల నుంచీ వాడుకలో ఉంటున్నాయి. ఈ పందేలలో పావురాలు ఎంత బాగా ఎగురుతాయన్నదే చూస్తారు -- రచయిత)
    ఎన్ని కష్టాలు పడ్డా శ్యామాలో అమాయకత నశించి పోలేదు. "నేనూ చిన్నప్పుడు పావురాలతో ఆడుకునేదాన్ని. వాటికి తినిపించడం అంటే నాకెంతో ఇష్టం! ఏమండీ -- ఈ వూళ్ళో మీరు ఉన్నన్ని రోజులూ మీ పావురానికి నేను తిండి పెడ్తాను. సరేనా?" అని ప్రాధేయపడుతూ అడిగింది.
    "పాపం ఈ అమ్మాయిది ఎంత జాలి గుండో!' అనుకున్నాడు చంపాజీ. 'అమ్మాయి, నువ్వు తిండి పెడ్తా నంటున్నావు బాగానే ఉంది కాని నా నేస్తం వట్టి పెంకె నీ చేత్తో పెడితే తింటుందో తినదో " ఈ పావురం! అయినా ప్రయత్నించి చూడు....మూగాజీవులకి దేవుడు సూక్ష్మ దృష్టి ని ప్రసాదించాడు. అని తమ స్నేహితులెవరో ఇట్టే కనిపెట్టేస్తాయి....." అన్నాడు బయటికి . అంటూ కపోతాన్ని భుజం మీద నుంచి తీసి ఆమె చేతికి ఇచ్చాడు.
    శ్యామా విప్పారిన మొహంతో దాన్ని గుండెలకి హత్తుకుని సంతోషంగా ఇంటి వైపు నడిచి వెళ్ళిపోయింది. ఒక చేత్తో పావురం, మరొక చేత్తో నడుం మీద బిందె ని పట్టుకుని వయ్యారంగా నడిచి వెళ్ళిపోతున్న శ్యామాని చూస్తూ అలాగే నుంచుని పోయాడు చంఫాజీ. "నేనేమీ కలగనటం లేదు కదా!" అనుకున్నాడు.

                          *    *    *    *
    పావురానికి శ్యామాతో మంచి స్నేహం ఏర్పడింది. ప్రతి మధ్యాహ్నం భోజనం చెయ్యటానికి శ్యామా దగ్గరికి వెళ్ళిపోయేది. అమ్మాయి, పక్షుల మధ్య స్నేహం కవి , అమ్మాయిల మధ్య స్నేహానికి తోడ్పడింది.
    కొన్ని రోజులు గడిచాయి. ఒకనాడు శ్యామా పావురం కాలికి ఒక చిన్న పూమాల కట్టి పంపింది. చంఫాజీ సంతోషానికి అంతులేదు. పిట్ట కాలికి చిన్న హారం కట్టి పంపాడు. ఈ విధంగా కపోతం వారి దూత అయిపొయింది! ఈ దౌత్యం కాక వారు శ్యామా నీటి కోసం వచ్చే నది గట్టున కూడా కలుసుకునే వారు. ఒకరి కొకరు తమ ప్రేమ వ్యక్తం చేసుకున్నారు. చంఫాజీ , "నిన్నేలాగయినా బానిసత్వం నుంచి విడిపించి పెళ్లి చేసుకుంటా" నని శ్యామాతో చెప్పేవాడు.

                          *    *    *    *
    "శ్యామా నిన్ను విడిపించి పెళ్లి చేసుకునే రోజు ఇంకెంత దూరం లోనో లేదు చూస్కో!" అన్నాడు చంఫాజీ ఒకనాడు ఆమెను నది ఒడ్డున కలిసినప్పుడు  'ఇక్కడ సంతలు మొదలవుతున్నాయి ఈ చుట్టూ పక్కల గ్రామాలలో బుర్రకధలు చెప్పమని కబుర్లు వస్తున్నాయి. వీటన్నిటికీ కొంత డబ్బులిస్తారు. రేన్నెల్లలో మీ యజమాని కి ఇవ్వ వలిసినంత సంపదించేస్తాను! రేపు తెల్లవారి జామునే ఈ వూరు వదిలి వెళ్ళిపోతున్నాను."
    ఈ మాట విని శ్యామా ఎంతో సంతోషిస్తుందనుకున్నాడు చంఫాజీ. కాని, ఆమె కళ్ళలో నీరు తిరగటం చూసి ఆశ్చర్య పోయాడు.
    "చంఫాజీ నన్ను విడిపిస్తానంటున్నావు. నిజంగా చాలా మంచి మాటే చెప్పావు! అయినా ఎందుకో నేను కీడు శంకిస్తున్నాను. నువ్వు వెళ్లి పోతున్నా వంటే ఇదే పెద్ద కీడని పిస్తోంది -- " శ్యామా గొంతుక గద్గదమయి పోయింది.
    చంఫాజీకి ఏమనాలో తోచలేదు . ఇద్దరు మవునంగా విడిపోయారు.
    శ్యామా , చంఫాజీ ళ ప్రణయం వారనుకున్నంత రహస్యంగా ఉండిపోలేదు. దానిని గురించి విన్న మోర్ భట్, అయన భార్య శ్యామా భట్టుతో పారిపోతుందేమో నని అనుమానించారు. మోర్ భట్ భార్య శ్యామా ని హింసించటం ప్రారంభించింది. అంతటితో అపక శ్యామాని పూనా నగరానికి తీసుకు వెళ్లి అమ్మి వెయ్యమని వేధించటం మొదలు పెట్టింది . ఈ విషయం కాస్తా చంపాజీ కి తెలిసింది. మొదట కాస్త, తల్లడిల్లి పోయినా, తర్వాత శ్యామాని విడిపించాలనే సంకల్పం మరింత దృడ మయి వీలయినంత ధనం సేకరించటానికి పూనుకున్నాడు. "నువ్వేమీ భయపడకు శ్యామా, నేనున్నానుగా'  అని ఆమెను ఊరడించేవాడు. "వెలుగు ముందు చీకటి సామాన్యమెగా!"
    ఇంతలో పావురం ఎగిరి వచ్చి శ్యామా భుజం మీద వాలింది. "అదిగో మన దూత వచ్చేసింది! నేనే వూళ్ళో వున్నా మనిద్దరి కబుర్లూ ఒకరి కొకరికి తెలియ చేస్తుంది! నిన్ను గనక పూనా బజారి కి తీసుకు వెళ్ళే ధోరణి కనిపిస్తే ఈ పక్షి కాలి చుట్టూ ముళ్ళ హారం కట్టి పంపించు! నేనూ పూనా కి వచ్చి నీ కొత్త యజమాని కూడా ఎవరో తెలుసుకుంటాను!"
    చంపాజీ మాటలు శ్యామాని వూరడిల్ల చేశాయి. కన్నీరు తుడుచుకుని చిరునవ్వు తో అతనిని సాగనంపింది.

                            


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS