Previous Page Next Page 
ప్రియా.....ప్రియతమా పేజి 5


    ఆవేశంగా అంటోన్న ప్రనూష వంక చూస్తూండి పోయారు కామాక్షి, ప్రసూనాంబలు.    ఎప్పుడూ సరదాగా వుండే ప్రనూష జోక్స్ కట్ చేస్తూ, అల్లరిగా వుండే ప్రనూష యింత లోతుగా ఆలోచిస్తుందా?"
    ప్రనూష మాటల్లో నిజం లేకపోలేదనిపించింది. ఎక్కడో నవలలో సినిమాలలో తప్ప, నిజంగా అలా బాస్ ని తెలివిగా దెబ్బతీసేవారు ఎంతమంది?
    అలాంటిపరిస్థితి ఓ అమ్మాయికి వస్తే ఏంచేస్తుంది? సినిమా ట్రిగ్గా సేఫ్టీపిన్ తో బుద్ది చెబుతుందా? ఆ ఆలోచనే నవ్వుతెప్పిస్తుంది. అంతకన్నా ఆనందాన్ని కలిగిస్తోంది.
    నిజంగా ఇలాంటి పరిస్థితి తమకే వస్తే....తామేం చేయగలిగేవారు? లౌక్యంగా తప్పించుకోవడమో, భయపడుతూ రోజులు వెళ్ళదీయడమో? ఉద్యోగం వదిలేసుకోవడమో...
    ఈ మార్గాలు కాక...తప్పనిసరి అనుకున్నప్పుడు, దురదృష్టవశాత్తు ఉద్యోగంద్వారా వచ్చే ఈ ఆసరా అనివార్యమైనప్పుడు... శీ.....లా...న్ని తా....క.......ట్టు పెట్టి.....
    కానీ....అవసరమైతే, సమస్యలతో తుదివరకూ పోరాడే ప్రనూషలాంటి వాళ్ళు ఎంతమంది వుంటారు?
    అలాంటివాళ్ళంటే ఈ ఎక్స్ ప్లాయిటేషన్లు, సెక్స్ ప్లాయిటేషన్లూ ఎందుకుంటాయి?
    దీర్ఘంగా విశ్వసించింది ప్రసూనాంబ. ప్రనూష వైపు అభినందన పూర్వకంగా చూసి, ఆమె చేయి నొక్కి అంది.
    'యూ ఆర్ గ్రేట్ ప్రనూషా....కీపిటప్....మేము చేయలేని పని నువ్వు చేశావు' అంది మనస్పూర్తిగా తను చేసిన ఆ సాహసం ఎలాంటి మలుపును తిప్పనుందో ఆ క్షణం తెలియదు ప్రనూషకు.
    స్కూటర్ లోపల పెట్టి ఇంట్లోకి అడుగుపెట్టే సరికి తలుపులు బార్లా తెరిచి వుండటం కనిపించింది శ్రీచరణ్ కు.
    "ఈ మూవింగ్ వాక్ వుమన్" వచ్చిందన్నమాట అనుకుంటూ హాల్లోకి అడుగుపెట్టాడు.
    గోడ గడియారం ఏడుగంటలను సూచిస్తోంది. ఇల్లంతా లైట్లు వేసి వున్నాయి.
    'ఈ మూవింగ్ వాక్ వుమన్ కు ఎన్నిసార్లు చెప్పినా బుద్దిరాదు. ఈ సారి రెంటు బిల్లు చచ్చినా కట్టన్నేను". మనసులో అనుకుని తన గదిలోకి వెళ్ళాడు తన గదిలో మాత్రం లైటు వెలగడం లేదు.
    గదిలోకి వచ్చి లైటు వేశాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది.
    కొంపదీసి దొంగలుగాని ఇంట్లోకి రాలేదు కదా! అన్న అనుమానం వచ్చింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండటంతో.
    లేకపోతే ఈపాటికి పక్కగదిలోనుంచి టీవీ శబ్దం సోఖ్రాన్ ప్రేలుడు లెవల్లో వినిపించేది.
    పక్క గదిలోకి తొంగి చూశాడు. తలుపు దగ్గరగా వేసి వుంది.
    "మహాతల్లి ఏంచేస్తోందో..." అనుకుంటూనే తలుపు తట్టాడు. ఆ తలుపు గొళ్ళెం ప్రనూషపెట్టడం మరచిపోయిందన్న విషయం తెలియని శ్రీచరణ్...
    
                                                                  * * *


    షవర్ నుంచి గోరువెచ్చని సన్నటి ధార పడుతోంది. హాయిగా వుంది ప్రనూషకు.
    "వళ్ళంత..తుళ్ళింత..." పాటని హమ్ చేస్తోంది.
    ఉదయమంతా అలసిపోయి, బస్సులో జర్నీచేసి, ఆ కిక్కిరిసిలాటలో పులిసిపోయిన శరీరానికి రిలాక్సేషన్ లా అనిపించింది. నున్నటి ఆమె శరీరంనుంచి నీటి ధార ఆమె శరీరం నునుపుదనం చూసి, అబ్బురపడుతూ, ఎక్స్ యిటైపోతూ జారిపోతూ ఉంది.
    ఆమె శరీరంలోని ప్రతి అవయవం ప్రత్యేకతను సంతరించుకున్నట్టు వుంటుంది.
    అద్భుతమైన చిత్రకారులను పిలిచి, అహర్నిశలూ శ్రమపడి, ఆ బ్రహ్మదేవుడు తయారుచేసిన బొమ్మలా వుంటుంది ప్రనూష. సబ్బు నీటి నురగ ఆమె శరీరాన్ని స్పృశిస్తూ మెరిసిపోతోంది.
    అరగంటపాటు అలా  స్నానంచేస్తేగానీ ఆమెకు హాయిగా వుండదు.
    హేంగర్ కు ఉన్న పెట్టీకోట్, బ్రా తీస్కోని గదిలోకి నడిచింది.
    అద్దంముందు నిలబడి బట్టలు కట్టుకుంటోంది.
    తన అందం అద్దంలో చూసుకుంటూంటే తన దిష్టే తగులుతుందేమోనని అనిపిస్తోంది.
    "ఇంత అందం....ఎవరి స్వంతం?" ఆ ఆలోచనే ఆమెకు గమ్మత్తుగా తోచింది.
    చీర కుచ్చెళ్ళు సవరించుకుంది. బ్లౌజు హుక్కుపట్టడం లేదు.
    "కొద్దిగా లావయ్యావేమో! అనుకుంది. మరి కాస్త ట్రేస్ చేసి బ్లౌజుహుక్కును పెట్టుకోబోయింది. రెండు పళ్ళ మధ్య పైటను బిగించి, బ్లౌజు హుక్కును పెట్టుకుంటోంది. సరిగ్గా... అప్పుడే...
    శ్రీచరణ్ తలుపు తట్టాడు.
    లోపల్నుంచి బోల్టుపెట్టి లేకపోవడంతో తలుపు తెరుచుకుంది.
    ఎదురుగా బ్లౌజు హుక్కు పెట్టుకుంటున్న ప్రనూష కంగారుగా పళ్ళమధ్య బిగించి పట్టుకున్న పైట వదిలేసింది.
    పట్టని బ్లౌజు హుక్కుతో, పోతపోసిన విగ్రహంలా ఎదురుగా.... ప్రనూష.
    ఒక్క క్షణం కళ్ళార్పకుండా చూశాడు.
    ఆ ట్రాన్స్ లోంచి తేరుకోవడానికి చాలా క్షణాలు పట్టంది.
    "యూ...ఛీ...బట్టలు మార్చుకుంటుంటే చూసే బుద్ది మీ వంశానికుందా?" కోపంగా అంది ప్రనూష.
    "మరే...ఇంతటి అందాల సుందరి....అంతోటి ఎత్తులతో వుందని తెలిసి, చొంగ కార్చడం మా వంశాచారం..." అన్నాడు ఆమె ఎద ఎత్తుల వైపు చూస్తూ.
    "అలా చెప్పడానికి సిగ్గేయడం లేదూ..." కోపంగా అంది.
    "ఆహా....మరి తలుపు దగ్గరకేసి...'దా....చూద్దువుగానీ...అన్నట్టు బోల్టుపెట్టకుండా వుండటానికీ నీకు సిగ్గు లేదా?" అన్నాడు శ్రీచరణ్.
    "దొంగతనంగా బోల్టు తీసే విద్యకూడా వుందా మీ వంశంలో..." అంది తనే బోల్టు పెట్టని విషయం మరిచి, ఉక్రోషంగా ప్రనూష.
    'అవునవును. నువ్వు శ్రీదేవివి....నేను బోనీ కపూర్ ని...యింతోటి అందం చూడాలని. వచ్చాను."
    "మణిరత్నం చూసి ఛాన్సిస్తాడేమో...పిలిచేదా!" రిటార్టిచ్చాడు శ్రీచరణ్.
    కోపంగా ముందుకు రాబోయింది. కిందపడిన ప్రనూష పైట కాళ్ళకు అడ్డం వచ్చింది. వంగి తీసుకోబోయింది. శ్రీచరణ్ కళ్ళు మూసుకుంటూ...
    "చాల్చాలు....చూపెట్టిన ఎగ్జిబిషన్ చాలుగానీ.... యిక పోస్టాఫీసు కట్టేసుకో..." అన్నాడు. ప్రనూష ఉక్రోషంగా చీర కుచ్చెళ్ళు విప్పి, మొత్తం చీర విప్పి అతని మొహం మీద పడేలా వేసి "గెట్ అవుట్ అని అరిచింది.
    'అమ్మో.....మొత్తం అందాలు చూపించి.... నా...శీలాన్ని లాగేసుకుందామనే' అనుకుంటూ బయటకు వెళ్ళి తలుపులు వేశాడు శ్రీచరణ్.
    
                                                                    * * *
    
    అయినా అతనిలో ఎక్సైట్ మెంట్ తగ్గలేదు.
    తన గదిలోకి వచ్చినా ఇంకా ఎక్సైట్ మెంట్ తగ్గలేదు శ్రీచరణ్ కు. ప్రనూష కళ్ళముందు కనిపిస్తోంది. ఆమె అందాలు కవ్విస్తున్నాయి. పెళ్ళయిన బ్రహ్మచారి, వయసులో వున్నవాడు పైగా అందమైన భార్య అందుబాటులో ఉండి కూడా...
    "ఛీ....ఛీ.....వెధవ చలి.....ఇప్పుడే చంపేయాలా? మగాళ్ళను రెచ్చగొట్టడానికి కాకపోతే....అతని కోపం చలిమీదకు మళ్ళింది. అక్కడినుంచి ప్రనూష మీదికి..."
    కాసేపయ్యాక తనను తాను తిట్టుకున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS