Previous Page Next Page 
కూచిపూడి కళాసాగరము పేజి 48

                                  

                               -: చమక వృక్షము :-

    తా: అథోలాంగూల  హస్తము  వినియోగింపవలయునని  పూర్వ శాస్త్రజ్ఞులచే  చెప్పబడియున్నది.

                                                   -: ఖదిర వృక్షము :-

    తా: ఎక్కువ క్రిందకు  మొగముగ  తామ్రచూడ హస్తము  వంచి పట్టిన నల్ల తుమ్మచెట్టును  చెల్లును.

                              -: శమీవృక్షము (జఘ్మి) :-

    తా: శ్లిష్టకర్తరీ హస్తము  జమ్మిచెట్టుకు చెల్లును.

                                  -: అశోక వృక్షము :-

    తా: పతాక స్వస్తిక హస్తమును, (పతాకములు మణికట్టు  నుంచి సచో) అశోక వృక్షమునకు చెల్లును.

                           -: శింధుకార వృక్షము (వావిరి) :-

    తా: శ్లిష్టమయూర హస్తము వావిరిచెట్టుకు వర్తించును.

                              -: ఆమలక వృక్షము :-

    తా: సంయమమను  హస్తము  ఉశిరిక చెట్టునందు చెల్లును. (తర్జనే. మిధ్యమలు అరచేతిలోచేర్చి  తక్కినవి చాచితచో సంయమమను  హస్తము వచ్చును)

                       -: కురువక వృక్షము (ఎర్రపూల గోరింట) :-

    తా: ఎర్రపూల గోరింట చెట్టునకు, కర్తరి, త్రిపతాక హస్తములు చెల్లును.

                            -: కపిత్థ వృక్షము (వెలగ) :-

    తా: వెలగచెట్టునకు  అలపద్మ హస్తములు స్వస్తికముగ పట్టినచో కపిద్ధవృక్షము (వెలగ)కు చెల్లును.

                          -: కేతకీ వృక్షము (పచ్చ మొగలి)

    తా: పతాక చతుర హస్తములను, మణిబంధములందు  స్వస్తికములుగా  బట్టినచో పచ్చమొగలియందు, దేవమంత్రియందు చెల్లును.

                                   -: శింశుపాల వృక్షము (ఇరుగుడు మ్రాను) :-

    తా: అర్థచంద్ర  హస్తములు  స్వస్తికములు  చేసినచో, ఇరుగుడు మ్రానుకు వినియోగించును.

                                               -: నిమ్బసాల వృక్షములు :-

    తా: వేపవృక్షమునకును, సాలవృక్షమునకును, శుకతుండ  హస్తములు స్వస్తికము చేసిపట్టిన వర్తించును.

                                 -: పారిజాత వృక్షము :-

    తా: ఎడమ, కుడిచేతులతో  పతాక హస్తములు  త్రిప్పిబట్టిన  త్రిజ్ఞాన హస్తము వచ్చును. ఈ హస్తము  రొమ్మున కెదురుగా  ఉంచినచో  పారిజాత వృక్షమునకు చెల్లును.

                              -: తింత్రిణీ, జంబూ వృక్షములు (చింత, నేరేడు) :-

    తా: చింతచెట్టుకు లాంగూలము, నేరేడుకు పతాకహస్తము వర్తించును.

              -: పాలాశ_దసాల వృక్షములు (మోదుగ, తియ్యమామిడి) :-

    తా: అర్ధచంద్ర హస్తము మోదుగను, త్రిపతాక హస్తము తియ్యమామిడికి  వినియోగించును.
        -: సింహాది మృగముల హస్త లక్షణములు :-
       
                                      -: సింహ హస్త లక్షణము :-

    తా: కుడిచేత సింహముఖ హస్తమునుబట్టి  దానివెనుక పతాకహస్తమును వ్రేళ్ళు ఎడముచేసి పట్టినచో, శ్లిష్టసింహముఖ హస్తమగును, ఇది సింహమునకు వర్తించును.

                       -: వ్యాఘ్రాహస్త లక్షణము (పులి):-
   
    తా: పెద్దపులికి, అర్ధచంద్రహస్తము అథోముఖముచేసినచో వ్యాఘ్రమునకు వినియోగించును.

                         -: సూకరహస్త లక్షణము (పంది) :-

    తా: మత్స్య హస్తమును, దక్షణహస్తమువంచి కదలించుచు వ్రేళ్ళనంటిని విరళముగ బట్టిన  సంకీర్ణ మకరహస్త మగును. ఇది సూకరముకు చెల్లును.

                          -: కపిహస్త లక్షణము (కోతి) :-

    తా: ఊర్ణ నాభ హస్తము కపికి, (కోతికి) చెల్లును. ముష్టిహస్త మందలి మధ్యమాంగుష్టములు చేరిక వలన అథోముష్టి ముకుళమగును. ఈ హస్తము కూడా కోతికి వినియోగింపబడును.

                        -: భల్లూక హస్త లక్షణము (ఎలుగుగొడ్డు) :-

    తా: వామకరమున పద్మకోశహస్తము దిగుమొగముగాబట్టి  దక్షణ కరముచే పతాకహస్తముబట్టి  దానిపై నుంచిన పద్మకోశ పతాక హస్తమగును.

                                           -: మార్బారహస్త లక్షణము (పిల్లి) :-

    తా: ఆర్ధముకుళ హస్తము పిల్లికి వినియోగించును. (ముష్టిహస్త మందలి అనామికాంగుష్టములు చేర్చినచో అర్ధముకుళ మగును.)


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS