4. వేసవి సృష్టించే చమట పొక్కులు
ఎండాకాలం వచ్చేసరికి చలమయ్య శరీరమంతా చమట పొక్కులతోనిండిపోతాయి. సంపత్ కి సమ్మర్ బాయిల్స్ తప్పనిసరిగా వస్తాయి. మామిడి పళ్ళు అంటే ఇష్టమనీ ఇందరకి అని ఎక్కువ తినటంతో వాళ్ళంతా లేచిన సేగ్గద్దలు భాదాకరంగా తయారవుతాయి. సుకుమరి అయిన సుభాశిని విషయం చెప్పనే అవసరంలేదు. ఎండలు ముదిరేసరికల్లా మెడదగ్గర, శరీరంలో మరికొన్ని చోట్ల చర్మం ఎండవేడిమికి కమిలిపోతుంది. ఎల్లారావు విషయం సరేసరి. ఎండాకాలం ప్రారంభం అయితేసరి ఎలర్జీ వచ్చి ఒళ్ళంతా దద్దుర్లు తేలిపోతాయి.
వేసవిలో ఇంతమంది ఇన్ని రకాలుగా బాధపడటానికి కారణం_ ఎండలు, ఎండవేడిమికి కలిగే చమట, చమటవల్ల తయారయ్యే మడ్డి, మడ్డిలో స్థావరం ఏర్పరుచుకునే బాక్టీరియా క్రిములు: ఎండాకాలం వచ్చిందంటే యెంతో మందికి మెడదగ్గర, వీపుదగ్గర, పొట్టదగ్గర, కాళ్ళు చేతులమీద చమటపొక్కులు వస్తాయి. కొమ్దరకి అరచేతులు, అరికాళ్ళలో కూడా ఈ చమట పొక్కులు వస్తాయి . చమట పొక్కులు రావడానికి చమటవచ్చే రంధ్రాలు మూసుకునిపోవడమే ముఖ్య కారణం. చమట పొక్కుల వల్ల దురద, మంట కలుగుతాయి. గాలి అడవి దుస్త్రులు ధరించేవారిలోనూ, ఎండలో ఎక్కువ తిరిగేవారికీ చెమట పొక్కులు విధిగావస్తాయి. వంటి మీద మడ్డిపేరుకునిపోకుండా ఎండా కాలంలో రాజుకు జాగ్రత్తపడవచ్ఘ్హు అంటేకాకుండా చెమట వల్ల బాక్టీరియా క్రిములు చేరకుండా జాగ్రత్తపడవచ్చు . అంటేకాకుండా చెమట వల్ల బాక్తెరియా క్రిములు చేరకుండా నైసిల్ పౌడరు వంటికంతా రాసుకోవడం మంచిది.ఎండా కాలంలో వంటిమ్మీదచీము పొక్కులు సేగ్గడ్డలు రావడం కూడా సహజమే . వీటినే "సమ్మర్ బాయిల్స్" లేదా వుడుకు గడ్డలుగా వ్యవహరిస్తారు. ఎండ వేడికి చర్మం కుమిలి పోవడం, చర్మంమ్మీద చమటతో పాటుదుమ్ము ధూళిపేరుకునిపోవడం, దుమ్ము వుందే ప్రదేశాలల్లో నివసించడం, గాలి సరిగ్గా సోకని ఇళ్ళల్లోఉండడం సమ్మర్ బాయిల్స్ రావడానికి కారాణాలు. ఈ సందర్బాలు స్టఫలోకైక్రిములు చర్మంలోతెలికిగా స్థావరం ఏర్పరుచుకుంటాయి. ఈ బాకీరియా క్రిములు ముఖ్యంగా వెంట్రుకుల కుదుళ్ళలో చేరి అక్కడి టిన్యూలను నాశనం చేస్తాయి. నష్టపోయిన టిన్యూలు కొద్దిగానే అయితే చిన్నగడ్డలు, ఎక్కువ అయితే పెద్దగడ్డలు తయరవుతాయి. తరువాత ఈ గడ్డలు పగిలి అందులోంచి చీము బయటకు వస్తుంది.
ఎండాకాలంలో యెక్కువ మామిడిపళ్ళు తినడం పిండి పదార్ధం యెక్కువఉన్న ఆహారాన్ని భుజించటం కూడా వుడుకు గడ్డలు రావాడానికి కారణమని వైద్యాశాస్రజ్ఞలు వివరించారు. మామిడిపళ్ళు యెక్కువతినడం వల్ల రక్తంలో షుగర్ శాతం పెరిగి బాక్టీరియా క్రిములు తేలికగా వృద్ధిచెందుతాయి. ఈ విధంగా వచ్చిన సమ్మర్ బాయిల్స్ ని మాంగోబాయిల్స్అని కూడా అంటారు మామిడిపళ్ళు తినకుండానే మధుమోహం (డయబటీన్ ) వున్నవారికీ కూడా సమ్మర్ బాయిల్స్ రావడం సహజం. అందుకే సేగ్గద్దలు యెక్కువ వస్తూవుంటే షుగర్ వ్యాధి ఉందేమో పరీక్షించడం అవసరం అంటారు దాక్టరు.
పైత్యపు దద్ద్ర్లుర్లులాగా ఎండాకాలంలో కొమ్దరకి వంటిమీదచిన్నవీ_ పెద్దవీ దద్దుర్లువస్తాయి. ఇలా దద్దుర్లు రావడానికి ఎండవేడి ఎలర్జీ అవడమే. వీరు ఎండలోకి వెళ్ళినా, బాగా వేడిగా వుందే గదుల్లో నివసించినా "ఎలర్జిక్ రాష్" వస్తుంది అయితే ఎవిల్, బటనలాల్ లాంటి మందు బిళ్ళలు వ్డితే ఎలర్జీ తగ్గిపోతుంది.
మరి కొందరికిఎండా కాలం రావడంతో "సం బర్న్స్" తయారవుతాయి. సన్బర్న్ అంటే ఎండవేడి వల్ల చర్మంమ్మేద అక్కడక్కడ చిన్నవీ పెద్దవీ ల్నల్లవీ ఉదారంగువీ మచ్చలు రావటం. ఎండ వేడి వల్ల ఏర్పడ్డ ఈ మచ్చలు కొందరికి కొద్దిగా వచ్చి తగ్గిపోతే మరికొందరికి బాగా వచ్చి దురద, మంట కలిగిస్తాయి. ఇంకొందరికివేడి నీళ్ళు పడితేచర్మం ఎర్రగా కుమిలి పోయినట్లు అయి, బొబ్బలులాగా కూడా వస్తాయి ఎండలవల్ల ఇలా వచ్చిన చర్మవ్యాధిని "సోలార్ ఎక్జిమా పాలీ మార్బిక్ లైట్ ఎరప్షన్" అని కూడా అంటారు.
ఎండా కాలంలో ఉష్ణతాపంతో పాటు ఈ చికాకులు కూడా తోడైతే ఆ బాధ చెప్పానలవి కాదు. ఎండలో యెక్కువ తిరగకుండా వుండటం, గాలి చక్కగా ప్రసరించే ఇళ్ళలో నివసించడం, శరీర శుభ్రతను పాటించడం, షుగర్ శాతం యెక్కువ వుందేపదార్ధాలను తక్కువ భిజించటం ముందు జగ్రత్తల ద్వారా వేసవిలో మన శరీర ఆరోగ్యాన్ని రక్షించుకో వచ్చు. *****
