Previous Page Next Page 
వసుంధర కథలు-14 పేజి 4

 

    దురదృష్టమేమిటంటే క్యాష్ బాక్స్ మీద వేలిముద్రలు పోలీసులు తీసుకున్నారు. క్యాషియర్ నీ, ఏజంటు గారిదీ కాక మరో ఇద్దరి వేలిముద్రలు స్పష్టంగా ఉన్నాయి. దాని పైన . అందులో ఒకటి బ్యాంకు ఉద్యోగిని. అతడప్పుడప్పుడు క్యాష్ బాక్సు ను ముట్టుకుంటుంటాడు.    
    ఆరోజు డబ్బు లెక్కపెట్టే సమయంలో అతడు కాసేపు క్యాషియర్ కు సాయం చేశాడు. గుర్తు తెలియని వ్రేలిముద్రలు దొంగవై ఉండాలని పోలీసుల భావన. అందుకోసమని వారెందరివో వేలిముద్రలు సంపాదిస్తున్నారు . ముఖ్యంగా బ్యాంకు ద్యోగుల తాలుకూ వారందరినీ వెలి ముద్రల కోసం వేటాడుతున్నారు. ఇది అందరికీ చాలా అవమానంగా ఉంది.
    కానీ ఎవరూ అభ్యంతర పెట్టడం లేదు.
    అభ్యంతర పెడితే అనుమానం పెరుగుతుందని అందరికి భయమూ!
    బ్యాంకు దొంగతనాలు, పోలీసుల బెడద గురించి ఏజెంటు గారితో కాసేపు మాట్లాడేక క్యాషియర్ తిరిగి తన సీట్లోకి వచ్చాడు.
    ఆ రోజు కస్టమర్స్ రష్ అట్టే లేదు.
    క్యాషియర్ కాలక్షేపం కోసం పక్కతడిని పేపరడిగాడు. "తేలేదు గురూ" అన్నాడతను.  
    క్యాషియర్ సీట్లోంచి లేచి వెళ్ళి ఎవరైనా పేపరు తెచ్చారేమోనని అడిగాడు.
    ఎవ్వరూ తేలేదు.
    ఒకతడి దగ్గర మూడు రోజుల క్రితం పేపరుంది. అది సొరుగు లో పడేసి మర్చిపోయాడతడు.
    "పోనీ అదే ఇయ్యి" అన్నాడు క్యాషియర్.
    సాధారణంగా క్యాషియర్ గానీ మరెవ్వరు గానీ పేపరు క్షుణ్ణంగా చదవరు. హెడ్ లైన్సు చూస్తారు. హాడావుడిగా తమకాసక్తి ఉన్న వార్తలు చూసి పేజీలు  తిరగేసేస్తారు.
    అందుకే క్యాషియర్ తీరుబడిగా పేపరు చూడవచ్చు ననుకున్నాడు.
    ఇలా పేపరు చూసే సందర్భాలు చాలా అరుదతడి జీవితంలో.
    కానీ అరుదైన సంఘటనల్లోంచి అద్భుత విశేషాలు బయటపడుతుంటాయి.
    క్యాషియర్ పేపర్లో రెండో పేజీలో ఒక ఫోటో చూసి ఉలిక్కిపడ్డారు. ఆ ఫోటో నిస్సందేహంగా బ్యాంకు దొంగది....
    ఆరోజు గోపీనాద్ పేరు చెప్పి తన్ను బెదిరించిన బ్యాంకు దొంగ అతడే.... అనుమానం రవంత కూడా లేదు.
    ఆత్రుతగా వివరాలు చదివాడు క్యాషియర్.
    ఆ యువకుడి పేరు కిషోర్ . సంపాన్నుడు. మరి స్థిరం లేదు. ఇంట్లోంచి పారిపోయాడు. వెతికిచ్చినవారికి వెయ్యి న్నూట పదహార్లు బహుమానం ప్రకటించాడు కిషోర్ మేనమామ.
    అక్కడ మేనమామ ఇంటి అడ్రసు , ఫోన్ నంబరు ఉన్నాయి.
    క్యాషియర్ పేపరు తీసుకుని ఏజంటు గారి దగ్గరకు పరుగెత్తి హడావుడిగా విషయం చెప్పాడు.
    "నువ్వు నిజమే చెబుతున్నావా?"
    "ఊ"
    ఏజంటుగానా యువకుణ్ణి చూడలేదు. క్యాషియర్ తన వద్దకు వచ్చి విషయం చెప్పేక అయన వచ్చి చూసేసరి కా యువకుడు లేడు.
    "మరోసారి ఆలోచించు --" అన్నా ఏజెంటుగారు.
    "ఎందుకని ?"
    "ఈ కిషోర్ సంపన్నుల కుర్రాడు. మతి స్థిరం లేని వాడు. ఇలాంటి దొంగతనం చేయలేడు...."
    "లేదు సార్ .....పిచ్చి వాళ్ళ కోకోసారి అతి తెలివి వస్తుంది...."
    "మరి గోపీనాద్ ఎవరు ?"
    "అవన్నీ నాకెలా తెలుస్తాయి ?"
    "ఒకసారి మనం కిషోర్ మేనమామకు ఫోన్ చేసి చూద్దాం --" అన్నాడెంజంటుగారు.
    ఫోన్ చేయగానే లైన్ దొరికింది.
    "హలో --- సోమేశ్వర్ గారేనా ?" అన్నాడేజంటుగారు.
    "అవును -- మీరెవరు ?'
    "మీ మేనల్లుడు కిషోర్ గురించిన ఆచూకీ చెబుదామని?"
    అవతల నుంచి సన్నగా నువ్వు వినబడింది -- 'ఆచూకీ ఏమిటి?" నాడిప్పుడింట్లోనే ఉన్నాడు..."
    "ఇంట్లోనే ఉన్నాడా?" ఆశ్చర్యంతో నోరు తెరిచాడు ఏజంటుగారు.
    "అవును -- దొరికి మూడ్రోజులయింది...."
    "మీకు గోపీనాద్ తెలుసా ?" అన్నాడు ఏజంటు గారు.
    "ఆశ్చర్యంగా ఉందే నాపేరు మీకెలా తెలుసు ?" అన్న అవతలి వైపు గొంతులోని ఆశ్చర్యం ఫోన్ తీగ ల్లోంచీ పయనించి ఏజెంటు గారిని చేరుకుంది.
    "మీపేరు సోమేశ్వర్ గదా ...."అన్నాడు ఏజెంటు గారు.
    'అవును పి.జి. సోమేశ్వర్ నాపేరు. అంటే పి.జ గోపీనాద్ సోమేశ్వర్ . బయటి వాళ్ళ కందరికీ సోమేశ్వర్ని. ఇంట్లో వాళ్ళంతా నన్ను గోపీ నాద్ అనే అంటారు...."
    "మీ మేనల్లుడు కూడా మిమ్మల్ని గోపీనాద్ అనే అంటాడా?"
    "ఏం -- వాడు మా యింట్లోని వాడుకాడా -- వాడు నా మేనల్లుడే " అవతలి వైపు నుంచి నవ్వు వినిపించింది.
    "థాంక్స్ , సారీ ఫర్ డిస్టర్బెన్స్ ...."
    "ఇట్సా లైట్ ....మీకు మావాడి ఆచూకీ ఎప్పుడు తెలిసింది ? ఎక్కడ తెలిసింది ."
    "అవన్నీ ఇప్పుడెందుకులెండి -- ఉంటాను" అంటూ ఫోన్ పెట్టేశా దేజంటుగారు.
    క్యాషియర్ కి కొంత అర్ధమయింది. ఏజంటు గారు చెప్పింది విని "ఫోన్ అప్పుడే పెట్టేశారేం ?" అన్నాడు.
    "వ్యవహారంలో ఏదో తిరకాసుందనిపిస్తుంది. అర్జంటుగా పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి ఇన్ స్పెక్టర్ గారికి విషయం చెప్పటం మంచిది" అన్నాడేజంటుగారు.

                                    3
    ఇన్ స్పెక్టరు ఏజంటు గారి టెలిఫోన్ సందేశాన్ని సీరియస్ గా తీసుకోలేదు. అంతా అసందర్భంగా అనిపించింది.
    కిషోర్ సంపన్నుడి కొడుకు. మతి స్టిమితం లేదు.
    అతనికి డబ్బవసరమూ లేదు. పధకంవేసే తెలివి లేదు.
    తన ఆలోచనలిలా ఉన్నప్పటికీ ఇన్ స్పెక్టర్ డ్యూటీ మాత్రం చేశాడు.విషయమిది అని చెప్పకుండా సోమేశ్వర్ ఇంటికి వెళ్ళి అతడు తప్పిపోయిన వివరాలన్నీ అడిగి తెలుసుకుని ఎలా దొరికాడో కూడా అడిగి తెలుసుకుని తెలివిగా వేలిముద్రలు సేకరించాడు.
    సోమేశ్వర్ ఆస్తి వ్యవహారాలన్నీ చూసే మేనేజర్ ముకుందం కిషోర్ని తిరిగి పట్టుకోగలిగాడు.
    అయితే బ్యాంకు దొంగతనం జరిగిన రోజున కిషోర్ ఎక్కడున్నాడో సోమేశ్వర్ కి గానీ ముకుందని కీ గానీ తెలియదు.
    కిషోర్ని ప్రశ్నలు వేస్తె అన్నింటికీ తన కేసు తెలియదనే అతడు బదులిచ్చాడు.
    బ్యాంకు దొంగతనం గురించి ఇన్ స్పెక్టరక్కడేమీ మాట్లాడలేదు.
    తర్వాత అద్భుతమైన విశేషం జరిగిపోయింది.
    కిషోర్ వేలిముద్రలు బ్యాంకు క్యాష్ బాక్స్ మీది వాటితో సరిపోయాయి.
    ఇన్ స్పెక్టరిక జాప్యం చేయలేదు. అతడు మరోసారి బ్యాంకు క్యాషియర్ని కలుసుకుని కిషోర్ గురించి వివరాలడిగాడు. తర్వాత నలుగురు కానిస్టేబుల్స్ తో సోమేశ్వర్ ఇంటికి వెళ్ళాడు.
    సోమేశ్వర్ అతడి రాకకు ఆశ్చర్యపడ్డాడు.
    "నేను కిషోర్ ని అరెస్టు చేయడానికి వచ్చాను" అన్నాడు ఇన్ స్పెక్టర్.
    "కిషోరేం చేశాడు ?"
    "బ్యాంకు దొంగతనం అంటూ వివరాలు చెప్పాడు ఇన్ స్పెక్టర్.   
వాడా -- ఆ వెర్రివాడా!" అన్నాడు సోమేశ్వర్.
    'అతడు వెర్రి వాడని నేననుకోను. ఇందులో మీ చేయి కూడా ఉందని నా అనుమానం. అతడు బ్యాంకు లో మీ పేరు చెప్పాడు. ఆ వెనువెంటనే ఫోన్ వచ్చింది ...."
    సోమేశ్వర్ తెల్లబోయి "అంటే నేను కిషోర్ కలిసి ఈ దొంగతనం చేశామంటారా ?" అన్నాడు.
    'అవును. మీ పధకం కూడా నేను వివరించి చెప్పగలను."
    "చెప్పండి ...." అన్నాడు సోమేశ్వర్ అసహనంగా.
    "కిషోర్ కు మీరు పిచ్చి అని ప్రచారం చేశారు. ఆ పిచ్చితో ఇంట్లోంచి పారిపోయినట్లు ఒక ప్రకటన కూడా యిచ్చారు. వెతికి పట్టుకున్నవారికీ వెయ్యి నూట పదహార్లు బహుమతి కూడా ప్రకటించారు. అయితే మీ ప్రకటన కిషోర్ ఇంట్లోంచి పారిపోయిన వెంటనే పేపర్లో రాలేదు. బ్యాంకు దొంగతనం జరిగిన కొద్ది రోజులకు వచ్చింది. అంటే బ్యాంకు దొంగతనానికి ముందే అతడి ఫోటో పేపర్లో పడడం మీ కిష్టం లేదు."
    సోమేశ్వర్ కలగజేసుకుని "కిషోర్ కు తలిదండ్రులు యాక్సిడెంట్ లో మరణించినప్పటినుంచీ మతిభ్రమణ ప్రారంభమైంది. పేరు పొందిన మనస్తత్వ శాస్త్ర నిపుణుల ద్వారా వైద్యం చేయిస్తున్నాను. అయితే కిషోర్ కు మతి భ్రమించిన విషయం ప్రచారం కావడం నా కిష్టం లేదు. అందుకే వాణ్ణి వెతికి పట్టుకోవడానికి రహస్యంగా నా ప్రయత్నాలు నేను చేసి అవి ఫలించకపోగా పేపర్లో ప్రకటన ఇచ్చాను " అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS