Previous Page Next Page 
అతని లక్ష్యం పేజి 38


    'ఏమో బాబూ నామట్టుకు నేనే అయితే ఇలా వెళ్ళనిచ్చుండేదాన్ని గాను, ఒకవేళ వెళ్లినా ఇన్నాళ్ళు ఉండనిచ్చే దాన్నీ గాను తెలిసిందా.' అలోల్లక అరవై ఏళ్ళూ మొగుడోల్లక ముప్పయ్యేళ్ళూ అన్నీ సామ్యం లాగా ఈ సరదాగా వుండాల్సిన -'
    'అలా అనుకోవడం చాలా పొరపాటక్కయ్యా , మనుషుల మై పుట్టింది ఒక్క సుఖ పడ్డాని కెనా! అంతకన్నా ముఖ్యమైన విధాయ కాలేన్ని లేవూ.'
    'ఏమో సుమా నాకవన్నీ తెలియవ్....'
    'నిజంగా బావ అక్కడ సాధిస్తున్న అమోఘమైన విషయాన్ని చదువు తుంటే...నాకటువంటి అదృష్టం , అవకాశం, ఎప్పుడన్నా పడుతుందా? అని పిస్తుందంటే నమ్ము. అంత శిధిలమై పోయిన ఒక శరీరాన్ని మళ్లీ కూర్చి సరిజేసి సాధించారంటే --'
    'ఏవిటీ?' ఆశ్చర్యంగా అడిగింది శాంత.
    'యుద్ద సమయం లో అపాయాల్లో గాయపడ్డ వారందర్నీ కాపాడుతుండే ఒక డాక్టరు ఇక్కడి ప్రిన్సు పాలు ద్వారా ఈ బావకి పరిచయమయ్యాడు లే. నాకాలు వైద్యమపుడు కూడా బావతో అతనూ వచ్చాడుట. అయన ఇరవై సంవత్సరాలు పైగా ఈ కేసులో పని చేస్తున్నారుట.'
    'అమ్మ బాబో ఆయన వైద్యం చెయ్యడం మాటెలా గున్నా ఆ రోగి ఇన్నాళ్లూ ఎలా పడుండగల్గాడు అని. నేనేగనకైతే చాటుగా ఏ విషమో పుచ్చుకుని--'
    'అబ్బ ఎమ్మాటక్కయ్యా' కసిరింది సుధ.
    'లేకపోతె పాతికేళ్ళ పాటు వో మనిషి జబ్బుతో పడుండడవేమిటి చెప్పు. విడ్డూరం!'
    'అబ్బబ్బ పూర్తిగా చెప్పేలోగా అంత తొందరేమిటి నీకూ. అయన ఇన్నేళ్ళ బట్టీ తీసుకోవడం లేదు. యుద్ధం లో ఎముకలన్నీ పాడై పోయి, మనిషి రూపంటూ లేకుండా పోయి ఒక ప్రాణం మాత్రం నిలబడిందట మరి. ఆ గొడవల్లో ఎట్నుంచీ ఆ గాయపడ్డా వారితో పాటు అటు కొట్టు కొచ్చాడో ఇతను.'
    'అంటే?'
    'అంటే గాయపడ్డ వారందర్నీ యుద్ద భయాల్నుంచీ మజలీలు మజలీలుగా మారుస్తూ వుంటారుగా! అలా ఏ దేశం నుంచి ఏ దేశానికి తీసుకు రాబడ్డడో పాపం అతను! అతని శరీరం మీద ఎనిమిది పెద్దా పరేషన్లూ, పన్నెండు చోట్ల చర్మపు అటుకులూ, అంటే నాకాలుకి వేశారు చూడూ! అలాగ జరిగాయిట. తప్పని సరి అవడం వల్ల'
    'రామారామా? ఇంతకీ అతనెలా వోర్చాడో బాబూ!'
    అదృష్టవశాత్తూ రెండేళ్ళ పాటు ప్రజ్ఞే లేదుట అతనికి. ఆ తరవాత ప్రజ్ఞా వచ్చిందిట గానీ, స్థిరం తప్పి మతి భ్రమ లాగే మాట్లాడేవాడట. అలా దాదాపు పదహారేళ్ళ పాటు గడిచాక మళ్లీ వో లారీ విపత్తు లో గాయపడి, ఇదివరకూ అతగ్గా మిగిలిన ఒకటి రెండు ఎముకలూ మళ్లీ విరిగి కూర్కున్నాయిట. మళ్ళీ ప్రజ్ఞా కూడా వచ్చిందిట.'
    'ఏడ్చినట్టే వుంది. లేకపోతె యముడి చేతుల్లో పడ్డవాణ్ణి వీళ్లు విడిపించి బతికిద్డామనే?'
    'బతికిస్తున్నారుగా? అవన్నీ మళ్ళీ అతికి చర్మమంతా మళ్లీ కుట్టి అన్నట్టు ఎంతో అందంగా ఉండే అతని ముఖం మీద వో అంగుళం చర్మం అతకాల్చోస్తే , పాపం తనకి కాస్త మచ్చా పడ్డా ఫరవాలేదను కుని బావ తన చెంప మీది చర్మాన్ని చ్చాడుట కూడా.'
    'పైగా ఇదొహటా ఇంతకీ అతనే మయ్యాట్ట.'
    'ఈ మూడేళ్ళ బట్టీ ప్రయత్నాల్చేయ్యగా చెయ్యగా మనిషంతా ఎప్పట్లా అయ్యాట్ట గానీ , ఇంకా ప్రజ్ఞా మాత్రం రాలేదుట.'
    'అయితే అతనికి తెలివోచ్చే దాకా మీ అయన రాడా? చాలా బాగుంది లే అతన్చేయ్యడం, నువ్వు మెచ్చు కోవడమూను.'
    'నువ్వూ ఈ మెడిసిన్ చదివుంటే తెలిసోచ్చే దక్కా ఇటువంటి అవకాశాల కోసరం ఎంత తాపత్రయ పడుతూంటారోనూ.'
    'వెర్రి కుదిరింది . రోకలి తలకి చుట్ట మన్నాట్ట. ఊ' నిట్టురుస్తూ లేచింది శాంత.
    'అయింది , అతనికి తెలివోచ్చే అవకాశాలన్నీ బాగా తోసతున్నాయట . అది కాస్తా దైవ కృప వల్ల త్వరగా జరిగితే --'
    'ఇంతకీ మీ ఆయన వెళ్ళింది --'
    'ఆ కోర్సు  నిరుడే అయిపొయింది గా? ఇప్పుడిక అగిందల్లా ఇతని కోసరమే నన్నమాట. అంటే ఈ పని తగలక పోవడమో, తెమిలి పోవడమో జరిగి వుంటే ఈ ఏడాది . అక్కడ పనిచేసి వద్దాం అనుకున్నాడు. అటువంటిదేదీ వీలులేకుండా దాన్తోనే సరిపోయింది. అబ్బ, ఈ కేసు గనక జయిస్తేనా.'
    'వొడనిండా కీర్తీ పోసుకు వొస్తాడు మీ ఆయన. అంతేనా? ఇంకా డబ్బు సంపాదించి ఏవేవో కొని తేస్తాడేమో. మనకూ కావలసిన వేవో కొట్టేయ్యోచ్చునని నేననుకుంటే '
    'అటువంటి వన్నీ ఎవరు పడితే వారే తెగల్రుగానీ ఇంత గొప్ప కీర్తి ని ఎవరు సంపాదించుకు రాగల్రని అక్కా,' అంది పరవశించి పోతూ సుధ.
    ఏవిటో శాంత కి మాత్రం ఈ విషయాలేవీ ఏమంత రుచించ లేదు. కొత్తగా పెళ్ళయిన దంపతులు హాయిగా కులాసాగా గడుపుకో వలసిన కాలాన్ని ఇలా ఎవడో ఊరూ పేరూ లేని వో అనామకుడ్నీ బతికించి బట్ట కట్టించాలను కుంటూ ఇలా మూర్కత్వంగా దేశాలకాడన వుండి పోవడమేమిటి? ఇంతకీ అతడే గొప్ప దేశ నాయకుడో గనక అయినా, ఏదో అతణ్ణి బతికిస్తే , ఎందర్నో వుద్దరిస్తాడనన్నా అనుకోవచ్చు. ఏవిటో ఇదొక వెర్రి. అంత కన్నా ఏమీ లేదు.' ఆనే అనిపిస్తుంది శాంత మనసుకి.
    అయితే రాధా, నళిని మొదలైన వారంతా మాత్రం అతడిని గురించి ఎంతో ఆసక్తి చూపుతూ ఆ వివరాల్ని తెల్సు కుందుకు తరచూ సుదకి ఫోన్లు చేస్తుండే వారు. వాళ్ళందరి కీ రఘు స్వయంగా వక మనిషిని తనే సృష్టించి అ మనిషికి ప్రాణం పొయ్యడం కోసరం పాటు పడు తున్నట్టుగానే అనిపిస్తుంది.
    అయితే వారలా అనుకొనడం లో పొరపాటేమీ లేదనే చేప్పాలి. ఎందుకంటె ఆ శిధిల శరీరాన్ని బాగుచేసి, దానికి ప్రజ్ఞ తెప్పించేందు గ్గానూ వారు అక్కడ పడుతున్న శ్రమ కీ, ఆలోచన్ల కి , నిజంగా ఒక మనిషిని తయారించి ప్రాణం పొయ్యడం కూడా అంతకన్నా సుళువు గానే వుండేదేమో అంతంత పరిశోధనలు జరుపుతున్నాడు రఘు మొదలైన డాక్టర్లంతా అక్కడ.
    ఎలాగైతేనేం తమ ప్రయత్నాలు ఫలించి అతనికి ప్రజ్ఞా వచ్చిందనీ అందువల్ల తను బయల్దేరి వస్తున్నానని , తను అక్కడే వుండి పోయేది, లేక మళ్ళీ వెళ్ళవలసుండేది, అలా వెళ్ళవలసుంటే సుధని కూడా తనతో తీసుకెళ్లడమో, మానడమో అన్న విషయాలన్నీ కొన్ని కారణాల ముందు నిర్ణయించు కుందుకు వీలవలేదని రాశాడు రఘు.
    ఆ సంగతి తెల్సుకున్నప్పటి నుంచీ ఇక సుధ కి చదువు తలకెక్కడం మానేసింది. ఎంత ప్రయత్నించినా చదువులో బుద్ది పోకపోవడం చూసి 'అబ్బ , తీరా ఆఖరు కొచ్చేసరికి తనకీ ఆశ్రద్దెలా వచ్చిందీ? ఇన్నాళ్ళూ ఆగిన బావ ఈ ఆరేడు నెలలూ వుండి అన్నా ఈ ప్రయాణం పెట్టుకు న్నాడు కాదూ,' అని బెంగ పడసాగింది సుధ.
    రాసిన ప్రకారం రఘు వచ్చాడు. ఈసారి సుధ మాత్రమే బొంబాయి వరకూ వెళ్ళింది. బొంబాయి లోని స్నేహితులందరి బలవంతం మీదా, రెండు రోజులక్కడ ఆగి వారందరి తోటీ కులాసాగా కాలక్షేపం చేసేసి, సుధతో సహా విశాఖ వచ్చాడు రఘు.
    అ'అక్కడాగా వెందుకు రఘూ , పిన్ని నీ కోసరం తపించి పోతుంది పాపం' అన్నాడు రఘుని చూడ్డం తోనే రామం.
    'బాగుందండీ మీరడగడం . వెళ్ళవలసిన వారు అక్కడకే వెళ్లినప్పుడు ఇక ఆయనకి ఇల్లెలా గుర్తు కొస్తుందనీ' అంది నవ్వుతూ శాంత'    
    'అందరూ మీలాగే అనుకోకండోదినా.' అన్నాడు శాంత చీరే పట్టుకు నిలబడున్న బాబుని ఎగరేసి ఎత్తుకుని వెళ్లి, పార్వతమ్మ గారి పక్కనే ఉయ్యాల బల్ల మీద కూర్చుంటూ . ఆ తరవాత అంతా కులాసాగా వేళాకోళలు వాగ్వాదాలుతో కొంతసేపు హాయిగా కాలక్షేపం చేశారు.
    'అయితే నువ్వు ఓకే వారం లో మళ్లీ వెళ్లి పోవాలన్నమాట' అన్నారు దారిలో కార్లోనే కనుక్కోవలసినవన్నీ కనుక్కున్నందున తిన్నగా తన ఆఫీసు రూము లో కెళ్ళిపోయిన శర్మగారు తన పనులేవో చూసుకున్నాక, మళ్ళీ హల్లో కోస్తూ.
    'అవున్నాన్నా' తను తెచ్చిన అట సామాను లతో బాబుని అడిస్తూన్న రఘు లేచి వస్తూ అన్నాడు.
    'సుధనీ తీసుకు వెళ్తావా?'
    పరీక్షలయ్యాక ఆలోచించాలి.
    'ఏమిటంత తొందరా. మళ్లీ ఆ చుట్టానికి సేవ చెయ్యడానికేనా?'హేళనగా అడిగింది శాంత.
    'అన్నట్టు అతనికేలా వుంది రఘూ' అన్నారు ఆదుర్దాతో పార్వతమ్మ గారు.
    'వో అతన్ని గురించి మీ అందరికీ కూడా ఆదుర్దా పట్టుకుందా ఏం? అయితే ఒదిన ఆన్నట్టు అతను మనకి తప్పకుండా చుట్టమే అయ్యిండాలి. లేకపోతె నేనంటే అతన్తో ఏళ్ల తరబడి పరిచయం పడ్డాను గనక నాకు మాత్రం అలా అనిపిస్తుందేమో అనుకుంటే?-'
    'ఏం మాకు మాత్రం? ప్రతివారం నీ వద్ద నుంచి ఉత్తరం రావడం తోనే సుధ దాన్ని సవిస్తరంగా చదివి మాకు అర్ధం చేపుతూండడం, మేమంతా...మీ అద్భుతచర్యల్ని నోరు వెళ్ళబెట్టుకుని వింటుండడం . ఈ మూడేళ్ళాయి మీ ఉత్తరాల మూలకంగా అతడు మాకూ--'
    'అంటే సుధ చెప్తున్నది మీ స్వవిషయాల్ని మినహాయించుకునే సుమా. గాభరా పడకు.' అన్నాడు హాస్యంగా మధ్యలో రామం.
    'ఆ ఆపాటి సరసత కూడానూ మీ తమ్ముడికి. ఇదుగో ఏమైనా సరే ఈసారి సుధనీ మీతో పాటు తీసు కెళ్ళాల్సిందే , లేకపోతె ఊర్కునేది లేదు--'
    'ఎవరూ! మీరా? సుధా?' నవ్వుతూ అడిగాడు రఘు.
    'అదంతా మీకెందుకూ క్రియ జరపండి. అంతే' ఖచితంగా చెప్పేసింది శాంత.
    'అయినా ఇందు కేపాటి కమీషనేమీ ట్నీకు' వేణు అడిగాడు.
    'ఎందుకూ?'
    'చిన్నొదొదినే గారి తరపున వాదించేందుకు . అంతే కదురా" రామం అడిగాడు.
    'అదా నేనేదో అడిగాను. అదేదో ఇస్తానంది. అవన్నీ మీకేండుకూ మధ్యా' నవ్వాపుకుంటూ అంది శాంత.
    ఇంతలో మురళీ వాళ్ళంతా రావడం తో అందరూ మళ్ళీ మామూలు మాటల్లో పడ్డారు. అయితే ఇన్నీ చూస్తూ, వింటూ గుమ్మం లో నిలబడున్న జానకి హృదయం మాత్రం 'అయ్యో , ఈ రఘు వంటి కార్యదీక్ష గల డాక్టర్లు తన భర్త అపాయానికి గురైనప్పుడు వుండుంటే వారి ప్రభావం వల్ల ఆయన్ను బతికించుండేవారేమో కదా?' అని కొట్టుకుంటుంది. మళ్లీ అంతలో, ' అయ్యో రామ, వారుంటే మంగల్ని పిల్చుండేవారన్న సామ్యం లాగ అటువంటి జాగ్రత్త ప్రదేశాల్లో గనక వుండి వుంటే ఆయనకీ ప్రమాదం ఎందుకు సంభవించుంటుందనీ , అసలూ. ఆ రుద్ర భూమి వంటి ఎడారి లో తిండికీ, నీళ్ళ కి కరువై పొతే ఇక-- 'అనుకుని మనసుని ఊరడించుకుని లోపలి కెళ్లి పోయింది ఇక అక్కడ నిలబడ లేక జానకి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS