Previous Page Next Page 
నీ మీద మనసాయరా పేజి 38


    "నీలో ఏదో కొత్త కళ వచ్చినట్లుందే. మెరిసిపోతున్నావ్" అడిగింది ప్రియ.    

    సూర్యాదేవి గతుక్కుమంది. వసంత్ పరిచయమైనప్పటి నుంచీ తనకు బోర్ కొట్టడం లేదు. జీవితం నిస్తేజంగా అనిపించడం లేదు. ఏదో అలజడి తన శరీరంలో ఉద్వేగాల్ని సృష్టిస్తోంది. అందుకే తనలో అంత మెరుపు ప్రియబాంధవి దీన్నంతా పసిగట్టిందా?
    
    "కొత్త కళ ఏం వుంది ప్రియా! మామూలుగానే వున్నాను" అంది తన ఇబ్బందినంతా నవ్వులో దాస్తూ.
    
    "మీ రాజాగారు ఏమంటున్నారు? పెళ్ళయి ఇన్ని సంవత్సరాలైనా ఇంత పెద్ద ఇంట్లో పసిపాప నవ్వు వినిపించదే రాజాగారు సరిగానే చూసుకుంటున్నారా? లేదూ నిన్ను ముట్టుకోవాలంటే భయపడిపోతున్నారా?" అంటూ కొంటెగా కన్నుగీటింది ప్రియబాంధవి.
    
    ఆమె నిస్సిగ్గుగా ఇలాంటివి మాట్లాడుతుంది. కారణం ఆమె వితంతువు. మగతోడు కావాలన్న యావనంతా అలా పచ్చిగా మాట్లాడడం ద్వారా తీర్చుకుంటూ వుంటుంది. అందుకే ఆమె ఎప్పుడైనా ఎదురుపడ్డా సూర్యాదేవి తప్పించుకు తిరిగేది.
    
    కానీ ఇప్పుడామె ఇంటికి రావడంతో అలా కుదరదని తెలుసు. అందునా ఇప్పుడు తనకు అలాంటి మాటలు కొత్త మైకాన్నిస్తున్నాయి.
    
    "బాగానే చూసుకుంటున్నాడు" అంది ఇంతకు ముందు నవ్విన నవ్వునే కంటిన్యూ చేస్తూ.
    
    "ఈ మగవాళ్ళలో రకరకాలు. ప్రపంచంలోని వైవిధ్య మంతా ఈ మగాళ్ళలోనే ప్రతిఫలిస్తుంటుంది. అందులోనూ మా ఊర్లో సీతారామయ్య గుర్తొచ్చి అలా అడిగానులే"
    
    "సీతారామయ్యా..."
    
    "ఆఁ ఓ వింత కారెక్టర్"
    
    "ఏం చేస్తాడేం?"
    
    "ఏం చేయదు అందుకే మా ఊర్లో విచిత్రమైన మనిషయ్యాడు" అన్నది ప్రియ.
    
    "అంటే?" అడిగింది సూర్యాదేవి.
    
    "అర్ధం కావాలంటే ఆయన గురించి పూర్తిగా చెప్పాలి విను చెబుతాను" అని చెప్పడం ప్రారంభించింది ప్రియబాంధవి.
    
    "మా ఊర్లో సీతారామయ్య మోతుబరి సముద్రపు పక్కనున్న భూములన్నీ ఆయనవే. వాటిల్లో సరుగుడుచెట్లు వేసేవాడు. సంవత్సరానికి లక్షల్లో ఆదాయం వచ్చేది మరి ఇంత ఆదాయం వస్తున్నా ఊర్లోనే వుండేవాడు ఇద్దరు కొడుకులు ఎదిగారు. వాళ్ళు పోరు పెట్టడం వల్ల, వాళ్ళ పైచదువుల కోసం సీతారామయ్య మద్రాసులో చేరిపోయాడు.
    
    అప్పటికి ఏభై ఏళ్ల వయసొచ్చింది.
    
    అక్కడ ఊరికే తిని కూర్చోవడం ఇష్టంలేక కూరగాయల హోల్ సేల్ వ్యాపారం ప్రారంభించాడు. రోజూ వేలల్లో వుండేది వ్యాపారం.    

    అదిగో ఆ సమయంలో ఆయనకీ ఓ కుర్ర హీరోయిన్ మీద మనసు పుట్టింది. ద్బాబుకు కొదువలేదు కాబట్టి ఆమె కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇలా ఆయన ప్రయత్నాల్లో వుండగానే ఆమె బాంబేకి షిఫ్టు అయింది కానీ సీతారామయ్య మాత్రం అందుకు నిరుత్సాహపడలేదు. మంచి వయసులో కోనికా కలర్ ఫిల్మ్ రోల్ లా వుండే ఆమెను మరిచిపోలేక పోయాడు. తిరిగి బాంబేలో వున్న వారి ద్వారా ట్రై చేయడం మొదలుపెట్టాడు.
    
    ఎన్నో తంటాలు పడి, ఎంతో డబ్బు ఖర్చు పెట్టాక ఓ రాత్రి తనతో గడపడానికి ఆమె ఒప్పుకునేటట్లు మధ్యవర్తుల ద్వారా ఒప్పించాడు.
    
    ఫలానా రోజు రాత్రి మద్రాసులో ఫలానా ఫైవ్ స్టార్ హోటల్ లో ఫలానా రూమ్ లో కలుసుకొమ్మని ఆయనకి వర్తమానం అందింది.
    
    ఇక ఆ రోజు సీతారామయ్యని చూడాల్సిందే. బిల్ క్లింటన్ అమెరికా సింహాసనం ఎక్కినప్పుడు కూడా అంతగా ఆనందించి వుండదు. ఎగ్జయిట్ మెంట్ తో ఆయన గుండాగి పోతుందేమోనని ఇదంతా అరేంజ్ చేసిన మిత్రుడైన ఓ పెద్ద నిర్మాత భయపడిపోయాడు.
    
    ఉదయం లేస్తూనే తలస్నానం చేశాడు సీతారామయ్య ఆరోజు కట్టుకోవాల్సిన బట్టల్ని ఓ ఆర్నెల్ల క్రితమే కొన్నాడు. వాటిని కట్టుకొన్నాడు. మొత్తం తన స్టాఫ్ కంతా కారణం చెప్పకుండానే తలా వంద రూపాయలు చేతిలో పెట్టి సెలవిచ్చేశాడు.
    
    ఆరోజు అతను చిన్న కుర్రాడై పోయాడనుకో.
    
    రాత్రి ఎనిమిదింటికి హోటల్ కి బయల్దేరాడు.
    
    అప్పటికి ఆ హీరోయిన్ రెడీగా వుంది. నిజానికి ఇలాంటివి ఆమె కిష్టం లేదు. కానీ సంవత్సరం నుంచి ఇండస్ట్రీలో తనకు గాడ్ ఫాదర్ లా వుండే ఆ నిర్మాత చెప్పగా చెప్పగా చివరికి జాలితో ఒప్పుకుంది. అప్పటివరకు ఆమె సీతారామయ్యను చూడకపోయినా వయసు, వృత్తిలాంటి వివరాలు తెలుసు.
    
    బజ్జర్ సౌండ్ వినిపించగానే వెళ్ళి తలుపు తీసింది. ఆ కళ్ళల్లో మెరుపు, ఆనందం చూడగానే అతనే సీతారామయ్య అని గ్రహించింది.
    
    నవ్వుతూ లోపలికి ఆహ్వానించింది.
    
    ఆమె వెనకే వెళ్ళి దూరంగా వున్న కుర్చీలో కూర్చున్నారు సీతారామయ్య.    

    "ఎనీ డ్రింక్స్?" అనడిగింది.
    
    అలవాటు లేదన్నట్లు తల అడ్డంగా వూపాడు.
        
    ఆమెకి ఇదంతా కొత్తగా వుంది. తనను చూడడంతోనే మీదపడి రక్కేస్తాడేమోనని ఆమె ఊహించింది. కానీ అతను బుద్దిమంతుడిలాగా కూర్చోవడం వింతగా వుంది. అయితే ఆయన ధ్యానముద్రలో వున్నట్లు ఓ రకమైన అలౌకిక ఆనందంతో తన్మయత్వంలో వుండదాన్ని గమనించింది.
    
    ఆయన ట్రాన్స్ లో వున్నట్లు పైకి లేచాడు. కొన్ని ఏళ్ల ఘోరమైన తపస్సు తరువాత దేవత ప్రత్యక్షమైనప్పుడు మునిపుంగవుడు ఎలా పరమానందంతో వీక్షిస్తాడో అలా చూస్తూ ఆమె దగ్గరికి వచ్చాడు.
    
    "బట్టలన్నీ విప్పేయ్" అన్నాడు సీతారామయ్య మాట్లాడిన మొదటి మాట అదే.
    
    ఆమె ఏదో చెప్పబోయింది గానీ ఆయన ఈ లోకంలో వున్నట్లు లేకపోవడంతో మౌనంగా ఆయన చెప్పినట్లే బట్టలు విప్పడం మొదలుపెట్టింది.
    
    ఆయన అలా బిగుసుకుపోయి చూస్తున్నాడు. ఆ కళ్ళల్లో నీళ్ళు ఆనందం మరీ ఎక్కువైపోయి కళ్ళు వర్షిస్తున్నట్లు ఆమె కనిపెట్టింది.
    
    తనను తాకనైనా తాకకుండా అడుగుదూరంలో నిలుచుండిపోయి రెప్పవేయకుండా చూస్తున్న ఆయన మనస్థితి ఏమిటో అంతుబట్టడం లేదామెకి.    

    మొత్తం బట్టలన్నీ విప్పేసింది నగ్నంగా వుందామె.
    
    ఆయన ఆమె దగ్గరికి వెళ్ళి కుడిచేయి పైకెత్తి తలంతా నిమిరి, అలా అంటీ అంటనట్లు కిందకు రాస్తూ ఓ దగ్గర ఆగిపోయాడు.
    
    "సరసుడికి మంచి చోటు" అని గిర్రున వెనక్కి తిరిగి తలుపు తీసుకుని రూమ్ లో నుండి బయటపడ్డాడు. మరుక్షణంలో ఆయన కారు బయలుదేరింది. ఆయనిక రాడని తెలుస్తూనే వుందామెకి"
    
    ప్రియబాంధవి చెప్పడం పూర్తిచేసి నవ్వుతోంది. సూర్యాదేవి మాత్రం ఆలోచనలో పడింది. అతని మానసిక స్థితి ఏమిటో అర్ధం కావడం లేదు. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS