పరాయి అడవి
వసుంధర
రంగనాధం ఉత్సాహం చూస్తె నాకు విపరీతమైన ఆశ్చర్యం కలిగింది.
నాకే కాదు మా ఆఫీసులోని ప్రతి ఒక్కరికీ కూడా రంగనాధం చలాకీ తనం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటె ఉత్సాహాన్ని రంగానాదాన్నీ కలిపి కనీసం ఆలోచనల్లో నైనా అంతవరకూ ఎవ్వరూ చూడలేదు.
రంగనాధాన్ని అందరూ జిడ్డుగా డనీ, దేభ్యమనీ, ఏడుపు గోట్టనీ ఇలా రకరకాల పేర్లతో పిల్చు కుంటుంటారు. అతన్ని రంగనాధంగా గుర్తుంచుకున్న ఏకైక వ్యక్తీ ఆఫీసు మొత్తానికి నేనొక్కడినే అనుకుంటాను.
అదే కారణం వల్ల కాబోలు అతను నా స్నేహాన్ని అపెక్షించి- తన కేబాధలున్నా నా దగ్గర వెళ్ళబోసుకుంటాడు. అందుకనే నన్ను జిడ్డు గాడి స్నేహితుడని చాలామంది అనుకుంటారు.
అయితే ఆమాటా నా ముఖం మీదనే ధైర్యం ఎవరికీ లేదు. నా ప్రవర్తన, తెలివితేటలూ - ఆఫీసులో నాకొక గౌరవ స్తానాన్నుంచేయనడం లో సందేహం లేదు.
"ఏమిటండీ ఈరోజు మీలో కొత్త ఉత్సాహం కనబడుతుంది?" అని అడిగేశాను చివరికి ఉండబట్టలేక.
ఎందుకంటె ఏదైనా కొత్త విశేషముంటే రంగనాధం నాకు చెప్పడానికి ఉబలాటపడిపోతుంటాడు. అటువంటిది రోజు కనీసం నా దగ్గర రావడానికే నా ప్రయత్నించడం లేదు.
"అబ్బే - ఏమీలేదే!" అన్నాడు . రంగనాధం ఏమీ లేదంటే నమ్మడమేలా? రంగనాధం కళ్ళలో మెరుపులున్నాయి. ముఖంలోకి తేజస్సు వచ్చింది. కదలికలో కొత్త చైతన్యం కనబడుతోంది. ఇవన్నీ ఏ ఒక్కరోజు కూడా రంగనాధం దరిదాపుల్లో లేవు. ఏ విశేషమూ లేకుండా అవి అడవి ప్రాంతాల కేలా వస్తాయి?
"ఏదో ఉంది. మీరు నాదగ్గర దాస్తున్నారు-" అన్నాడు.
"నిజం - ఏమీ లేదు -" అన్నాడు రంగనాధం. అలా అంటూనే అనుకోకుండానే అతను ముసిముసిగా నవ్వుకుంటున్నాడు.
నేను అతని ముఖం లోకి తీవ్రంగా చూశాను. ఆ ముఖంలో ఏదో సందిగ్దావస్థ ఉన్నట్లు కనబడింది. ఏదో చెప్పాలని తటపటాయిస్తున్నట్లనిపించింది. లాభం లేదు. ఈ సస్పెన్స్ నేను భరించలేను. రంగానాధాన్ని ఎలాగోలా టాప్ చేయాలి. అందుకే - "రండి- టీ తాగి వద్దాం!" అన్నాను.
బహుశా అతనికి చెప్పాలనే ఉన్నట్లుంది. నన్ను వెంటనే ఫాలో అయ్యాడు.
ఎవ్వరికీ చెప్పకుండా ఒక రహస్యాన్ని దాచాలని ఎవ్వరూ కోరుకోదు. రహస్యాన్ని మరింత రహస్యంగా మరొకరికి చేరవేయడం లోనే మనిషికి ఆనందం కలుగుతుంది. ఎటొచ్చి కుతూహలాన్ని కనబరిచే వ్యక్తీ దొరకాలి. పదేపదే అడగానో చివరకు రహస్యం బయట పడుతుంది.
కావాలనే మరెవ్వరూ లేని ఒకమూలకు తీసుకుపోయా నతన్ని. రెండు టీ తీసుకురమ్మని సర్వర్ కు చెప్పి - "చెప్పండి ఏమి కధ -" అన్నాను.
"ఏదో కధ ఉందని ఎందుకనుకుంటున్నారు?" అన్నాడు రంగనాధం.
ఓరి జిడ్డు గాడా - నీ జిడ్డు ముఖంలో నవ్వు, కనబడితే కధ వుండదని ఎంత చవటదద్దమ్మ కైనా తడుతుందని మనసులో అనుకుని - "మనది కొన్నేళ్ళ పరిచయం ఈమాత్రం తెలుసుకోలేనా?" అన్నాను.
"మీ ఊహ కరెక్టే గానీ- చెప్పడానికి సందేహిస్తున్నాను నేను. ఎందుకంటె ఇది కేవలం నా ఒక్కడికే సంబంధించిన రహస్యం కాదు మరి-"
నాకు కుతూహలం మరింత పెరిగింది. "కావచ్చు కానీ నామీద మీకు మాత్రం నమ్మకం లేదా?" అన్నాను కాస్త జాలిగా ముఖం పెట్టి - "చెప్పండి ప్లీజ్!" అన్నట్లు చూస్తుండి ఉంటాయి ఆ కళ్ళు.
"అది కాదు సార్ - ఈ రహస్యం బట్ట బయలైతే ఒక ఆడదాని జీవితం నాశనం చేసినవాడినవుతాను నేను-"
"ఒరేయ్ రంగనాధం -- చంపెస్తున్నావురా -" అనుకున్నా మనసులో. రంగనాధం దగ్గర ఒక ఆడదానికి సంబంధించిన రహశ్యం ముందనేసరికి నాలో కుతుహలం తో పాటు అసూయ కూడా కలిగింది. అయినా రెండవది వ్యక్తపరచలేసరిగదా!
"ఇన్ని చెప్పడమెందుకు? ఇంతకాలం మనం ఆత్మీయుల మనుకున్నాను. ఈరోజే తెలిసింది మనం మామూలు స్నేహితులమని-" అన్నాను కాస్త నిష్టూరంగా.
సర్వర్ టీ తెచ్చాడు. రంగనాధం మౌనంగా టీ చప్పరించసాగాడు. నిముషం అనంతరం - "మీకంటే నాకాప్తులేవరు సార్ - చెప్పేస్తాను-" అన్నాడు.
"వద్దు లెండి - అది కేవలం మీకు సంబంధించిన రహస్యం అన్నాను" టీ చప్పరిస్తూ.
"ఏదో సరదా కన్నాను కాని మీ దగ్గిర నాకు రహస్యమేమిటండీ" అన్నాడు రంగనాధం. అతని కిప్పుడు చెప్పే మూడ్ వచ్చింది. నేను వద్దన్నా చెబుతాడు.
అతను కొద్దిగా స్వరం తగ్గించి -" నెలరోజుల క్రితం మా పక్కింట్లో ఎవరో దిగేరని చెప్పాను గుర్తుందా?" అన్నాను.
"ఊ"
"వాళ్ళు కొత్తగా పెళ్ళయిన దంపతులనుకుంటాను. అతనట్టే బాగుండడు కానీ ఆమె చాలా బాగుంటుంది. పేరు మాలతి. అని ఒక్క క్షణం ఆగాడు రంగానాధం.
నేను కుతూహలంగా ముందుకు వంగాను. రంగనాధం స్వరం కొంచెం తగ్గించి - "ఇటీవలే మా ఆవిడ పుట్టింటికి వెళ్ళిన విషయం మీకు తెలుసు గదా .మా ఇంటినీ వాళ్ళింటివిడదీసేది మా బెడ్ రూం తలుపే నని గూడా మీకు తెలుసు గదా. నాలుగు రోజుల క్రితం ఏమిటి జరిగిందంటే....."
రంగనాధం ఆగిపోయాడు. కారణం - బిల్లు తీసుకుని సర్వర్ వచ్చాడు.
బిల్లు నేనే అందుకొని "ఊ ఏం జరిగింది చెప్పండి" అన్నాను.
"ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ఆ తలుపు తట్టిందామే - చాలా కంగారుగా. నేను గొళ్ళెం తీసి తలుపు తెరిచాను.
"ఏమండీ" అని అడిగాను.
"తేలు....తేలు...." అంటూ కంగారుగా ఒక మూలాన చూపించింది.
నేను అటు చూశాను.
అక్కడ - పాత బట్టలు వేసుకునే పెట్టె ఉంది. తేలు అంటే నాకు భయమే. కాని ఒక ఆడదాని ముందు వెలితి పడడం ఇష్టం లేక వెళ్ళి ఆ పెట్టెని కదిపాను.
ఒక ఎలుక పిల్ల ఉరకలు పరుగుల మీద బయటకు దూకింది. బహుశా ఆమె వైపే దూకిందో ఏమి కెవ్వు మంటూ అరచింది.
నేను ఆమె వైపు నవ్వుతూ చూసిన వాణ్ని, అలా మ్రాన్పడి పోయాను. ఆవిడ చీర జారిపోయింది. ఒంటిమీద లంగా బాడీ తప్ప మరో ఆచ్చాదన లేదు.
నేను గబుక్కున గోడ వైపు తిరిగాను.
బట్టలు కట్టుకుంటుంటే తేలు కనిపించింది. చాలా భయం వేసింది. చీర చుట్ట బెట్టుకుని త్వరత్వరగా మిమ్మల్ని పిలిచాను. ఎలకపిల్ల హటాత్తుగా దూకేసరికి భయం వేసింది" అందామె. నేను ఇంకా వెనక్కు తిరక్కపోవడం చూసి, "మీరు వెనక్కి తిరగవచ్చు" అంది.
వెనక్కు తిరిగాను. చీర కట్టుకుని పమిట నిండుగా కప్పుకుందామె. అప్పుడే కాస్త ధైర్యంగా పరీక్షించి ఆమె ముఖంలోకి చూశాను. చాలా అందంగా ఉందామె.
"మీ అయన లేరా?' అన్నాను.
"బజారు వెళ్ళారు. ఇంకా అరగంటా దాకా రారు" అందామె.
"మరి వస్తాను" అంటూ మా గది వైపు నడిచాను.
"మీరు చాలా ధైర్య వంతులు. నాకు ధైర్యం వంతులంటే చాలా ఇష్టం" అందామె. నేనేం మాట్లాడలేదు. "మీరింకా ధైర్యంగా మసల గలిగితే నాకు ఇంకా ఇంకా ఇష్టం" అందామె.
ఆమె ఉద్దేశ్యమేమిటో నా కర్ధం కాలేదు. కానీ ఆడవారితో వ్యవహారమని గుర్తొచ్చి భయం వేసి తలుపులు వేసేశాను-" అన్నాడు రంగనాధం.
"ఇంతేనా . ఇంకా విశేషాలున్నాయా?' అనడిగాను. ఇంకా ఉండకపోతే బాగుండు ననిపించింది.
'అప్పుడే ఎక్కడ - ఇది నాలుగు రోజుల క్రితం సంగతి. మూడు రోజుల క్రితం ఇంకా విచిత్రం జరిగింది. మా రెండిళ్ళ కి కామన్ బాత్రూమ్ కదా" అంటూ ఆగాడు రంగనాధం.
బాత్రూం అనగానే నాలో విపరీతమైన ఆసక్తి కలిగింది. రంగానాధానికి ఏమదృష్టం తగిలిందో అన్న భయం కూడా మెదిలింది. "చెప్పండి" అన్నాను.
"బాత్రూమ్ లోంచి ఆవిడా కేకలు వినపడ్డాయి. "రంగానాధంగారూ ఒక్కసారి ఇలా రండి' అని. ఏమైందోనని పరుగెత్తాను. బాత్రూమ్ లోపల ఇనప గడియ ఉంది. అది చాలా బిగుతుగా ఉంటుంది. ఒక్కొక్కసారి నాకే అది తీయడం కష్టమవుతూ ఉంటుంది. ఆవిడ లోపల ఉంది. గడియ తీయలేక పోతోంది. ఇంక ఒక్కటే దారి. నేను బాత్రూమ్ గోడ ఎక్కి లోపలకు దూకీ తలుపులు తీయాలి.
"కళ్ళు మూసుకుని లోపలికి దూకండి. అసలే నా వంటి మీద బట్టలు లేవు" అందావిడ.
కళ్ళు మూసుకోవాలని పించలేదు. కానీ మర్యాద కోసం కళ్ళు మూసుకుని గోడ దూకి తడుముకుంటూ తలుపు దగ్గరకు వెళ్లాను. గడియ నిజంగానే బిగుసుకు పోయింది. యావచ్చక్తీ ఉపయోగించి గడియ తీసాను.
"సరదా కన్నాను కానీ కళ్ళు మూసుకోనవసరం లేదు. బట్టలు వేసుకునే ఉన్నాను" అందామె.
వెంటనే కళ్ళు విప్పి ఆమెను చూశాను. ఒంటిమీద నూలుపోగు కూడా లేదు. ఆమె అందానికి కళ్ళు చెదిరి పోయాయి. వెంటనే కళ్ళు మూసుకున్నాను.
