Previous Page Next Page 
ఈ రేయి నీదోయి పేజి 36

 

    నిజానికి ఆమెకున్న భయం అదే తన బావకు క్షోభ కలిగించాలని భార్య నుండి విడదీయాలని ఈ ప్లాన్ వేసింది. ఈ పథకంలో తను ఏం కోల్పోతుందో తెలుసు. వ్రతం చెడ్డా ఫలితం దక్కడంతో పాటు ఆ వ్రతాన్ని మళ్ళీ మళ్ళీ చేయటానికి ఇబ్బందులు ఉండకూడదు.
    
    "నిన్ను వదలను" ఈసారి వరస ఎగిరిపోయింది. అది ఎందుకనో అడ్డొస్తోంది. అందుకే 'అత్త' అన్న పదాన్ని వదిలిపెట్టేశాడు.
    
    ఇక ఆమెకి ఏమీ అభ్యంతరాలు కనపడలేదు. చాలా ఏళ్ల తర్వాత మగవాడ్ని తన దగ్గరికి లాక్కొంది.
    
    అతను గట్టిగా కౌగిలించుకున్నాడు.
    
    ఆమె ఆ సుఖాన్ని పూర్తిగా అనుభవించటానికి కళ్ళు మూసుకుంది. చేతులు మాత్రం అతని చొక్కాలోంచి దూరి ఛాతీని తడుముతున్నాయి.
    
    వేసవి ఎండల తరువాత తన ఒక్కదాని మీదే తొలకరి కురిసినట్టు, చలిరాత్రి తరువాత పొద్దునే నీరెండలో శరీరాన్ని ఆరబెట్టుకొంటున్నట్టు ఆమెలో ఎన్నో మధురమైన పులకింతలు.
    
    అతను పెదవుల మీద నుంచి జారి ఎదమీదకి వచ్చాడు. అతని ఒత్తిడికి కోరిక పగిలినట్టు ఆమె అరంగుళం పైన లేచి గాఢంగా హత్తుకుంది.    

 

    వర్షం శబ్దం వాళ్ళకు వినబడడం లేదు. అప్పుడప్పుడూ తమమీద పడుతున్న చినుకుల చల్లదనం వాళ్ళకి తెలియడం లేదు. ఇంట్లోకి దూరి ఇబ్బంది పెడుతున్న చలిని వాళ్ళు పట్టించుకోలేదు.
    
    చాలా విషయాల్లో మనసు, శరీరం కలిసి పనిచేయవు. ఈ ఒక్క విషయంలోనే రెండూ ఏకమై సుఖాల్ని అన్వేషిస్తాయి.
    
    వాళ్ళు ఆ రాత్రికి ద్రోహం చేయలేదు. ఏకధాటిగా వెలగడానికి మధ్యలో వేలాడుతున్న బల్బుకు విసుగొచ్చి వుంటుందేమోగాని వాళ్ళు మాత్రం కనీసం అలసటగా కూడా ఫీల్ కాలేదు.
    
    ఎక్కడో కూసిన కోడి వాళ్ళిద్దరినీ ఈ లోకంలోకి తెచ్చి పడేసింది.
    
    కోడి కూతతో పాటు ముసల్ది కూడా వచ్చింది.
    
    ఒకరాత్రి అజ్ఞాతవాసం చేసి, తిరిగి తన రాజ్యానికే వచ్చినట్టు ఆ ముసల్ది వాళ్ళతో ఒక్కమాట కూడా మాట్లాడలేదు. తన పనులు చేసుకోవడం మొదలుపెట్టింది.
    
    అతనైతే తన ధ్యాస తాను మరిచిపోయాడు. ఒకసారి స్వర్గం చూసిన వ్యక్తికి తిరిగి ఆ ప్రపంచం రుచించనట్టు అతను మాటిమాటికీ రాత్రి అనుభవాల్నే గుర్తుకు తెచ్చుకొంటున్నాడు. పడకలో ఆమె చూపిన టెక్నిక్ అతనికి కొత్త లోకాన్ని చూపించింది. అప్పుడప్పుడూ చెవిలో మాత్రమే చెప్పిన మాటలు అతన్ని అద్భుతంగా రెచ్చగొట్టాయి.
    
    ఆమె పరిస్థితి కూడా అంతే. చాలా ఏళ్ల తరువాత శరీరం తిరిగి శరీరంలా అనిపిస్తోంది. మగవాడితో తెగిపోయిన లింకు బిగుసుకున్నట్టు తోస్తోంది. ఆమెకైతే ఒక్క క్షణం కూడా అతన్ని వదిలిపెట్టాలనిపించడం లేదు.
    
    మరో పదినిముషాలకి ఇద్దరూ బయల్దేరారు.
    
    ముసల్దాని చేతిలో రెండు పదిరూపాయల నోట్లు పెట్టి 'వెళ్ళొస్తా' అంది. మాటలు మరిచిపోయినట్టు ఆమె ఏమీ మాట్లాడకుండా వెళ్ళి రమ్మన్నట్టు సైగ చేసింది.
    
    ఇద్దరూ దగ్గరున్న టీ అంగడికి నడిచారు. కాఫీలు తాగాక బస్టాండ్ కి చేరుకొన్నారు.
    
    మార్గమధ్యంలో తనను వదిలిపెట్టకూడదని ఆమె అతనిచేత ఒట్టు పెట్టించుకొంది. బ్రతిమిలాడుకుంది.
    
    ఆమె అభిమానానికి అతను కదిలిపోయాడు.
    
    ఆమెను బస్సు ఎక్కించాక తను మరో బస్సు ఎక్కాడు.
    
    ఇంటికి వెళ్ళినా, ఫ్యాక్టరీకి వెళ్ళినా, స్నేహితుల్తో మాట్లాడినా అతనికి చిన్నితో గడిపిన రాత్రే గుర్తొచ్చేది. ఆ అనుభవం మనసులో మెదిలి, తృప్తితో కలిసిపోయిన చిర్నవ్వు పెదవుల మీద కదిలేది.
    
    విచిత్రంగా అతని భార్య మాత్రం గుర్తుకు రాలేదు.
    
    మూడురోజులు ఓపిక పట్టాడుగానీ నాలుగోరోజుకి మనసూ, శరీరమూ రెండు నిలవలేకపోయాయి.
    
    సాయంకాలం పొద్దుపోయాక అత్తగారింటికి బయల్దేరాడు.
    
    టౌన్ లో మిత్రులతో గడిపి, అక్కడే భోజనం చేశాడు. అత్తారింటికి వెళ్ళే బస్సు రాత్రి పదిగంటలకి.
    
    దాన్ని ఎక్కాడు.
    
    అతనితోపాటు మరో పదిమందిదాకా దిగారు. వాళ్ళంతా ముందుకు వెళ్ళిపోయేవరకు చిన్నగా నడిచాడు.
    
    ఇళ్ళు సమీపిస్తున్న కొద్దీ శరీరమంతా కోరిక పరుచుకొంటోంది.
    
    ఒక ఇల్లు ముందుకి వెళితే భార్య ఇల్లు ఒక ఇల్లు వెనకే ఆగిపోతే చిన్ని ఇల్లు.
    
    అతను మరో ఆలోచన లేకుండా మెల్లగా చిన్ని ఇంట్లోకి దూరాడు.
    
    ఆ సమయంలో చిన్ని కసువు పట్టెడ కింద నులకమంచం వాల్చుకొని పడుకుని వుంది.
    
    ఎవరో వచ్చినట్టనిపించి కళ్ళు విప్పితే ఎదురుగా నాదముని.
    
    ఆమె తన ఆనందాన్నంతా బయటికి తెలియజెయ్యటానికి కళ్ళను వెలిగించి, దిగ్గున లేచింది.
    
    ముఖమంతా పరచుకొన్న సంతోషాన్ని చూసి తను పొరబాటు నిర్ణయం తీసుకోలేదని అనిపించింది.
    
    ఆమె ఏదో అనబోతుంటే మాట్లాడవద్దని సైగ చేశాడు.
    
    ఆ తరువాత వాళ్ళిద్దరికీ మాట్లాడే అవసరమే రాలేదు. అంతా వాళ్ళ శరీరాలే మాట్లాడుకున్నాయి.
    
    ఫస్ట్ బస్ టయానికి అతను బస్టాండ్ కి చేరుకొని తన స్వంత వూరికి వచ్చేశాడు.
    
    బాగా పొద్దుపోయాక చిన్ని ఇంటికివెళ్ళి, మరీ తెల్లవారుజామున వచ్చేస్తుండడంతో ఈ విషయం ఎవరికీ తెలిసే అవకాశం లేదనుకున్నాడు. కానీ ఇలాంటివి చాలారోజులు దాగవు.
    
    ఓ రోజు చిన్ని ఎదురింటి పార్వతమ్మ అతన్ని చూసింది. తన అనుమానం నిజమో కాదో తెలుసుకోవటానికి రాత్రంతా మేల్కొంది. అతను తెల్లవారుజామున తిరిగి చిన్ని ఇంటినుంచి బయటపడ్డప్పుడు ఆమె అనందానికి అవధులు లేవు.
    
    ఇంటిముందు కళ్ళాపు అయినా చల్లకుండా నాదముని భార్య దగ్గరికి వెళ్ళింది.
    
    "అదేమిటే- నీ మొగుడు మీ ఇంటికి రాకుండా పక్కింట్లో దూరుతున్నాడు. రాత్రంతా అక్కడే గడపడం ఇప్పుడే లేచి వెళ్ళాడు" అని వచ్సినంత హడావుడిగా వెళ్ళిపోయింది.
    
    నాదముని భార్య ఒక్క క్షణం ఆలస్యం చేయలేదు. బస్టాండ్ కి పరిగెత్తింది.
    
    అక్కడ ఎవరూ లేరు.
    
    అప్పటికి ఆమెకి ఏడుపు తగ్గింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS