Previous Page Next Page 
మెయిడ్ ఇన్ ఇండియా పేజి 32

 

    విష్ణు చెప్పింది చెప్పినట్లు అక్షరం కూడా పొల్లు పోకుండా జరిగినందుకు ఆరుగురు ప్రాణాలు తీసుకున్నారనే విషాద వార్తను సయితం మరచిపోయి....భవిష్యత్ దర్శనం చేయగల మహా పురుషుడు విష్ణు అనే మెచ్చుకోలు అధికంగా వినిపించాయి.
    అయితే విష్ణు హృదయానికి గాయమైంది అనే విషయం పసిగట్టిన వ్యక్తీ ధీరజ మాత్రమే.....
    ఇప్పుడు విష్ణు మనసునిండా ఎడతెగని ఆలోచనలు......అతను మనసంతా అల్లకల్లోలంగా వున్నది. జరుగబోయే దారుణాన్ని ముందే గ్రహించగలిగినా తన వాళ్ళను తను రక్షించుకోలేకపోయాడు.
    తను చెప్పిన భవిష్యవాణిని విశ్వసించక ఆ ఇన్ స్పెక్టర్ తాత్సారం చేయడం వలన కానీ, తను చెప్పడంలో జాప్యం జరిగినందువల్ల కానీ......ఆరు నిండు ప్రాణాలు బలి అయిపోయినందుకు పరోక్షంగా తనను తను ఆత్మ పరిశీలన చేసుకోవడం వలన విష్ణులో చెలరేగిన అంతర్మధనం అది!
    మొదటిసారిగా విష్ణు ముఖంలో రంగులు మారిపోవడం, కళ్ళలో ఆ ప్రయత్నంగానే నీళ్ళు సుడులు తిరగడం, అడుగులు తడబడటం........గొంతు గాద్గిదికం కావడం భారతి, రీటాలు గమనించారు.
    అప్పటికే విష్ణు వేదిక దిగి వెళ్ళిపోయాడు.
    "విష్ణు కూడా ఒక సగటు మనిషిలా ఆ సంఘటనకు చలించి పోయాడు. అంటే, జయిన్చాలేకపోయాడనుకోవాలా? లేక అతను అలా కలవరపడిపోడానికి ఇంకొక కారణం ఏదైనా వున్నదా?" అతని వెన్నంటే అడుగులు వేస్తున్న భారతి, రీటాలు ఆలోచనలో పడ్డారు.
    భారతీ, రీటాలు ఆశ్రమంలో వుంటూ , ఇంతకాలం విష్ణుని పరిశీలించిన మీదట అతనిలో కొన్ని అతీంద్రియ శక్తులు విబిడికృతమై వున్నాయనే అభిప్రాయానికొచ్చారు. అవి మానసిక శక్తులో, యోగప్రభావం వలన సిద్దిమ్చిన మహిమలో కానీ విష్ణు సాధారణ మానవునికి బిన్నంగా సాధన చేసిన యోగి అని ఒప్పుకోక తప్పదు.
    అయితే, రాగద్వేషాలకు అతీతంగా వుండవలసిన వ్యక్తిలో అంత విషాదమా!
    అంటే విష్ణు హృదయం పూర్తిగా అముష్మిక చింతనకు లోంగిపోలేదు.....! కరుణ, జాలి, దయ , ప్రేమ అనే సున్నితమైన స్పర్శలకు చలిస్తుంది అనే ఊహ ఆ ఇరువురి మనసులకు తట్టడంతో పరమానంద భరితులై పోయారు.
    భారతి , రీటాలిద్దరూ ఎవరికి వారే , ఒకరికి - తెలియకుండా ఒకరు ఆశ్రమానికి వెళ్ళిన వెంటనే విష్ణును కలిసి అతని మనసును శోధించాలనే నిర్ణయానికి వచ్చారు.
    వాళ్ళ మనసులలో చెలరేగుతున్న వూహల పరంపరను పసిగట్టాడో , లేదో గానీ విష్ణు ముఖంలో ఇప్పుడు గంబీర్యత చోటు చేసుకున్నది అన్నింటికి అతీతంగా.

                                                     *    *    *    *

    భవానీ ద్వీపం......
    కృష్ణానది మధ్య నున్న సహజసిద్దమయిన ద్వీపం అది.....పర్యాటకుల కోసం ఇప్పుడిప్పుడే టూరిస్టు స్పాట్ గా తీర్చదిద్దబడుతున్న ఆ ద్వీపానికి విజయవాడ పట్టణం నుంచి సరి అయిన రవాణా సౌకర్యాలు లేనేలేవు.
    చేపలు పట్టుకునే వారి చిన్న పడవలు, టూరిస్ట్ డిపార్టుమెంట్ వారు నడుపుతున్న మరబోట్లు.......
    ఒక చేపలు పట్టేవాడి నావ నెక్కి భవానీ ఐలాండ్ చేరింది ఏ.సి.పి కిరణ్మయి.
    అప్పటికే మరో రెండు పడవలు కూడా అక్కడ ఆగి వుండడం చూసిన కిరణ్మయి ఆశ్చర్యపోయింది.
    అక్కడ అవి ఎందుకు వున్నాయనే అనుమానం వచ్చినా ప్రశ్నలతో సమయాన్ని వృధా చేసుకోవడానికి ఇష్టపడక చకచకా ముందుకు కదిలింది.
    వంద అడుగులు అయినా వేసిందో లేదో కనిపించిన ఇద్దరు సుందరాంగులను చూసి ఆశ్చర్యంతో బిగుసుకుపోయింది కిరణ్మయి.
    వాళ్ళు భారతి....రీటా!
    భక్తులు చెప్పినదాన్ని బట్టి విష్ణు ఎప్పుడూ భవానీ ద్వీపానికి ఒంటరిగా వెళుతుంటాడు. తోడుగా శిష్యులు ఎవరినీ వెంటబెట్టుకు వెళ్ళడానేదే నిజం!
    కానీం ఈరోజు అందుకు విరుద్దంగా ఈ ఇద్దరు కొమలాంగులను తోడుగా తీసికొని రావడంలో ఏదయినా అంతరార్ధం వున్నదా?
    కిరణ్మయి ఆలోచనలు ఈవిధంగా సాగుతుంటే ఆ సమయంలో పోలీస్ ఆఫీసర్ ని అక్కడ చూడడంతో భారతి, రీటాలిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.
    ఆమెను చూసిన క్షణంలోనే ఎన్నెన్నో అనుమానాలు ఒక్క సారిగా రేకేట్టినా , అలాంటి భావాలనేమీ బయటపడనివ్వకుండా మాములుగా వుండటానికి ప్రయత్నిస్తున్నారు.
    "నమస్తే మేడమ్.....ఒంటరిగా ఫ్యాన్సీ డ్రస్ లో వచ్చారు....... ఏదయినా జాలీ ట్రిప్పా?" భారతి వుండబట్టలేక అడిగింది.
    'అవును, జల్సా ట్రిప్పే మిస్ భారతి అండ్ రీటా.....ఈ సమయంలో విష్ణు గారు ఇక్కడ ఒంటరిగా వుంటారని తెలిసే వచ్చాను" చిరునవ్వుతో చెప్పింది కిరణ్మయి.
    ఆమె మాటలకు భారతి ఉలుక్కిపడితే, రీటా గతుక్కుమన్నది.
    "మా పేర్లు మీకు ఏలా తెలుసు?" విస్మయంతో ప్రశ్నించింది భారతి.
    "మీ పేర్లు మాత్రమే కాదు, మీరిద్దరూ విష్ణు ఆశ్రమంలో ఎందుకుంటున్నారో కూడా తెలుసు" వాళ్ళ ఫీలింగ్స్ గమనించడానికి అన్నట్టు పరిశీలనగా చూస్తూ చురక వేసింది కిరణ్మయి.
    ఆ ఇద్దరూ మరోసారి ఖంగారుపడిపోయారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS