Previous Page Next Page 
సంపెంగలూ - సన్నజాజులూ పేజి 30

 

                                      13

    దూరం నుంచే నన్ను చూసి పరిగెత్తుకు వచ్చింది మధురిమ. పిల్లను ఆప్యాయంగా దగ్గిరకు తీసుకుని ముద్దెట్టుకున్నాను.
    'ఇన్నాళ్ళుండి పోయావేమే అమ్మా. ఇంకెప్పుడూ యిలా చెయ్యకే అమ్మా' అంటుంటే నా హృదయం ద్రవించింది. లోపల్నుంచీ కామేశ్వరి వచ్చింది. 'వచ్చావుటమ్మా తల్లీ మంజులా! అక్కడే ఉండి పోయావేమో అనుకున్నాం లే, ఇప్పటి కైనా యిల్లు జ్ఞాపకానికి వచ్చిందా? నీలాగే నీ కూతురు కూడా సామాన్యురాలు కాదమ్మోయ్. వెర్రి పిల్ల దీన్ని సాకడం యిదో కష్టమా అనుకున్నాను, జెర్రి పిల్ల గాని వెర్రి పిల్ల కాదమ్మోయ్. నన్ను మూడు చెరువుల నీళ్ళూ తాగించింది. వేరే విడి ఖైదు అక్కర్లేదు తల్లోయ్' గుమ్మం లోకి రాగానే ఏమిటీ సోద అనుకున్నాను.
    'మధూ నాన్నారు ఏరే?'
    'ఆఫీసుకి వెళ్ళారే.....అవును గాని అమ్మా, కాశీ నుంచి నాకేం తెచ్చేవే?' ముందుగా రసగుల్లా డబ్బాలు యిచ్చాను. తర్వాత గౌన్లు జోళ్ళు తీశాను. అవన్నీ చూస్తుంటే దానిలో కలిగిన ఆనందాన్ని తనివి తీరా చూస్తున్నాను.
    'వచ్చావా అక్కా?' తలెత్తి చూశాను. సరళ!
    'ఆ నువ్వెప్పుడోచ్చావ్? నాన్నగారి ఒంట్లో కొంచెం నెమ్మదిగా ఉందా?"
    'ఇప్పుడు కాస్త నయమే. క్రిందటి ఆదివారం నాడు కాబోలు నేను వచ్చాను. మీరేం అలా చిక్కి నల్లబడి పోయారు, చదువు వేడే?"
    దీనికి నేను కాదు, కామేశ్వరి జవాబు చెప్పింది.
    'ఒక్క చడువైతే బాగానే ఉండు. వూళ్ళో ఉన్న సోదలన్నీ మా మంజులకే, ఇంక ఆ వెర్రిలో పడితే యిల్లూ వాకిలీ ఎమైయినా , మొగుడూ సంసారం నట్టేట్లో కలిసినా ఆవిడకి లక్ష్యం ఉండదు. మొత్తం మ్మీద ఆవిడ గుండె నిబ్బరం మెచ్చుకోదగ్గది. ఇంతకీ ఒక్కొక్కళ్ళకీ ఆడింది ఆటా పాడింది పాటా అవుతూంటుంది. అది వాళ్ళ అదృష్టం లెండి!' నాకు అత్తగారి సాధింపు లేదు, ఆడబిడ్డ పొరు లేదు, ఆయనకూడా పల్లెత్తు మాట అనరు. మద్యని ఈవిడేవర్తి? తలచుకుంటే ఆవిడకు జవాబు చెప్పే స్థితిలో నేను లేకపోదును గాని వస్తూనే ఇంకా అల్లరి పెంచుకోడం నాకు ఆశుభంగా తోచింది.
    'ఎవరేమనుకున్నా సరే, నేను అదృష్టవంతురాల్నే' అనేసి మధురిమను ఆ చంక నుండి ఈ చంకకు మార్చుకుని విసురుగా లోపలికి వెళ్ళిపోయాను.
    "చూశావా , చూశావా ....' అని ఆమె యింకా ఏవేవో సరళ తో చెప్పబోతే.
    'వస్తానండీ , పనుందీ' అని ఆ ఆమ్మాయి  దాటుకుంది. అప్పుడు కామేశ్వరి దాసీ మనిషిని కేకేసి దాని చెయ్యి పట్టుకుని కూచోపెట్టి మొదలెట్టబోయింది.
    'ఉండండోమ్మగోరూ! అరెప్పుడనగా బయలేల్లినారో ఎటో . ఈ యిసురు ఎప్పుడూ యిన్నదేగా' అని చెయ్యి విదిలించుకుని పెరట్లో కి వచ్చి నాకు నీళ్ళు కాగబెడుతూ కూచుంది.
    కామేశ్వరి కింక ఎవరూ కనబడలేదు. కరివేపాకు అమ్ముకునే మనిషిని కేకేసింది.
    'విన్నావుటమ్మా తలుపులమ్మా ఈ విడ్డూరం? తనేమో వూరూ వాడా తిరిగొస్తుందీ, అదేమీ అనడానికి వల్ల కాదు? ఇదెక్కడి రాక్షసమే! ఇంతకీ నాకెందుకు యీ నిష్టూరాలు ? ఎక్కడుండవలసిన వాళ్ళని అక్కడుంచక పొతే ముందు ముందు వాడే అనుభవిస్తాడు. అవతల మా అమ్మ పుట్టెడు రోగంలో ఉన్నా చుట్టపు చూపు కదా అని వచ్చాను. అయినా ఏమిటో నా వెర్రి గాని, మోకాట్లో మెడ నరం పట్టిందని, దాని కెందుకుంటుంది? ఇంత గుంట ముండకి అన్ని సామాన్లు తెచ్చిందే, పోనీ నేను తనలాంటి ఆడపడుచును కానూ, వచ్చేది కాశీ నుంచి కద , ఒక్క బనారసు చీర, అధమ పక్షం ఒక్క వీశెడు బనారసు కాజా తెచ్చి నా కివ్వాలంటావా, వద్దంటావా , తలుపులమ్మా, నువ్వే చెప్పు.'
    'అమ్మా కామేసారమ్మగారూ, నేనే వో పెస్నే అడుగుతాను. తవరే సెప్పండి. నన్ను అమ్ముకోమంటారా, సేంగేసుకుని యిక్కడ తొంగోమంటారా?'
    'హాసి రాకాసీ ఎంత మాటాడేవే? పోతావా పోవా' అని దాన్ని వెంతబెట్టింది. హాల్లోకి వచ్చి అక్కడున్న అయన ఫోటో దగ్గర నుంచుంది. అపజయం ఎరుగని కామేశ్వరి.
    'ఒరే తమ్ముడూ, ఎవర్నో అనుకోడం దేనికి? ఈ తప్పంతా నీది. అడ కూతురికి అంత స్వేచ్చేమిటిరా? నిన్ను మించిన చదువువేమిటిరా? ఎంత తెగించింది కాకపొతే గుమ్మం లోనే నన్ను ఎదిరిస్తుందా? తను లేకపోతె తనింట్లో వండి పెట్టడానికీ , తన పిల్లను ఆడించడానికీ నేను పనికొచ్చానా? అదేమే అనడానికి పనికి రానూ? దేశానికి వచ్చి కూడా అన్నగారింట్లో వారం రోజులు తిష్ట వేస్తుందా? అడగడానికి వల్లగాదూ?'
    వినీ విననట్లు వూరుకున్నా నా చెవిలో పడుతూనే ఉన్నాయి.
    'అమ్మా , అత్త రోజూ యిదిగో యిది వరస. సాధారణంగా హోటల్ నుంచే తెప్పించేసేది. ఒక వేళ యింట్లో చేసినా ఏం బాగా వండేది కాదు. బాగులే దనడానికి వల్ల కాదు. తినకుండా వూరుకోడానికీ వల్ల కాదు. ఏం మీ అమ్మ చేసినట్లు లేదూ? చాకిరీ కి తప్ప నేను పనికి రానూ? అని మొదలెట్టేది . నాన్నతో చెప్పి కొట్టించేది కూడా. నువ్వెప్పుడోస్తావో అని బెంగ పెట్టుకున్నానే అమ్మా!' నేను దాన్ని దగ్గిరగా తీసుకుని,
    'తప్పమ్మా , అలా ఒకచోట మాటలు మరొక చోట చేప్పకూడదు. పైకి అలా అంటుంది గాని అత్త ఎంతో మంచిది' అనబోతే.
    "ఏం మంచి నా మొహం మంచి' అనేసింది.
    'అదిగో అలా అనొద్దనే చెబుతూంట.ఎలాగోలా ఇన్నాళ్ళూ ఉండి నీకు చేసిందిగా .... అయినా యిప్పుడు నేనోచ్చేశాగా' అని నేను అంటుంటే వీధిలో లాంబ్రెట్టా ఆగిన చప్పుడయింది. మధురిమ వీధిలోకి పరిగెత్తింది.

 

                 
    "నాన్నా , నాన్నా మనమ్మోచ్చేసింది, మనమ్మోచ్చేసింది' అంటూ ఎదురు వెళ్ళింది. అయన దాన్ని ఎత్తుకుని తీసుకు వస్తూ.
    'మనమ్మ ఎవరే?' అన్నారు.
    'అప్పుడే వచ్చేశావెం, దారి తప్పలేదు గద?' అన్నారు నవ్వుతూ. నవ్వుతుంటే అయన బుగ్గలు పైకి లేచి అసలే చిన్నవిగా ఉన్న కళ్ళని మరింత మూసేస్తాయి. ఆ పరిస్థితుల్లో అయన కనురెప్పలే కనుబొమ్మలే నవ్వుతున్నట్టు నాకు కనిపిస్తుంది. సూర్యిదయ పూర్వ సుందరాకాశరాగం లాంటి ఆ దృశ్యం నాకు చాలా యిష్టం. ఆయన్ని చూసి ఎన్నేళ్ళు అయిపోయినట్టుంది నాకు. అయన అలా నవ్వుతూ అడుగుతుంటే నేను పడిన మానసిక శ్రమంతా క్షణంలో ఎగిరిపోయినట్లయింది.
    'ఎలా రాశావ్ పరీక్షలు? అనుకున్నవన్నీ పడ్డాయా?'
    'ఆ బాగానే రాశాను. వెంటనే రాలేకపోయాను. కోపమెం రాలేదు గద? అన్నయ్య ఒంట్లో ఏం బాగులేదండీ.'
    'అయ్యో , అదేం పాపం? ఏం జబ్బు?' వివరాలు చెప్పెను.
    'అయినా మందు పుచ్చుకోక పోడం ఏమిటీ? తెలివితక్కువ మనిషి.'
    'అంతేకాదు , ఉద్యోగం విషయంలో కూడా ఘర్షణ పడ్డాడు.'
    ఆ వివరాలు కూడా చెప్పెను.
    ఇతడే తొందరపడ్డాడేమోనని నా అభిప్రాయం. ఏ ఎండకా గొడుగు పట్టవలసిన రోజులివి. అనవసరంగా నోరు జార్చుకుంటే కలసివచ్చేదేముంది? పోనీ జరిగిందేదో జరిగింది. అంత ధైర్యమైన మనిషి దాని కోసం మనసు పాడుచేసుకు కూచుంటాడా? తగినట్లు ధైర్యం చెప్పి రాకపోయావా?
    'ఊరుకున్నానా మరి? అన్నీ చేసే వచ్చాను! ఏమయినా మళ్ళీ వాడు బతుకులో పడే వరకూ నాకు బెంగగానే వుంటుందండి. ఒకవారం రోజులు పోయాక మళ్ళీ వెళ్ళి ఒకటి రెండు రోజులుండి వస్తాను, పంపించరూ?'
    ఇంట్లో వినేవాళ్ళూ లేరని పక్కింటి పని గట్టుకు వెళ్ళిన కామేశ్వరి అప్పుడే తిరిగొచ్చింది. తిరిగొస్తూ అందుకుంది.
    'ఎందుకు పంపడూ? పంపనూ పంపుతాడు ఎదురుగుండా ఏమీ అనలేక , వెనకాల బాధపడనూ పడతాడు . ఇంతకీ అస్తమానూ పుట్టింటికి బయలుదేరే వాళ్ళకి ఉండాలి. ఆ యింగిత జ్ఞానం!'
    నేనింక భరించ లేకపోయాను. అడిగింది ఆయన్నీ, ఈవిడ కేండుకూ?
    'కామేశ్వరి వదినా, ఆడది అవసరం వచ్చినప్పుడు కూడా పుట్టింటికి వెళ్ళడం తప్పంటారా?'
    'తప్పా , తప్పున్నరా!'
    'అది ఎవరైనా , ఎందుకైనా తప్పేనా?"
    "ఆహా!'
    'అయితే మీరిప్పుడు ఎక్కడున్నారు? ఎందుకున్నారు?' అయన నావైపు కొంచెం కోపంగా చూసి గబగబ మేడమీదకి వెళ్ళిపోయారు. కామేశ్వరి కి వెంటనే బోధపదినట్టు లేదు. బోధపడగానే మాత్రం యిల్లెగరగొట్టేసింది.
    'ఏ-మీ-టి , నేను పుట్టింటి కెందు కొచ్చానని అడుగుతున్నావా, ఎంత ధైర్యమే నీకు! బంగారం లాంటి ఈ యిల్లూ, నీ పుట్టింటారి ఆ దరిద్రపు కొంపా రెండూ ఒకటే? అదిగాక ఇది నిజంగా నా పుట్టిల్లు ఎందు కయిందీ> మెడ్రాసు లాంటి వూళ్ళో సేతువు లాంటి యిల్లు నాకుందే! మేరుపు లాంటి తల్లి నా కుందే! ఏదో పనిమీద ఈ ప్రాంతానికి వచ్చాను. పోనీ ఉండమన్నాడు గదా అని గడిపి పెట్టెను. దిక్కులేని దాన్ని కాదె! గతి కడుక్కుపోయి రాలేదే! మంచిమాట లేకపోతె పోయిరి -- నన్నిలా అవమాన పరుస్తుందా? ఇదంతా చూసి వాడు కూడా వూరుకుంటాడా? ఛీ.... యీ దరిద్రపు కొంపలో యిక క్షణ ముండను.'


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS