Previous Page Next Page 
మళ్ళీ వచ్చిన వసంతం పేజి 30

 

    'అమ్మ లలితా - నువ్వేమీ ఇదవకు - ఈ పెద్దతనంలో రకరకాల బాధలలో ఇదొకటి - మేమూ పడుతున్నంగా మానాన్నతో" - వేంకటేశు అంటుంటే,
   
    "ఏం చేస్తారయ్యా పడక - మీరు వృద్దులు కారా మీకు, మాకు ఏమిటీ - వృద్దాప్యం అందరికీ శాపమే" వేంకత్రామయ్య లోపల కెళ్ళి పడుకున్నాడు.
   
    "శారద వచ్చిందా ఊరినించి. నేను ఈ మధ్య వెళ్ళాను ఇంకా రాలేదు" అంది వేంకటేశు వైపు చూస్తూ.
   
    వేంకటేశు దీర్ఘంగా నిట్టూర్చాడు.
   
    "ఆ వచ్చింది. నేను వచ్చింది నీతో కొన్ని ముఖ్యమయిన విషయాలు మాట్లాడటానికి - చల్లకొచ్చిముంతదాచటం అనవసరం కదా. మా శారద మాకో పెద్ద సమస్య అయిపోయింది" - వేంకటేశు గొంతుతగ్గించాడు.
   
    "అంటే"
   
    "అదే - సరే నీకూ తెలుసు విడాకులు తీసుకోబోతోందని - దాని గురించి బెంగకన్నా స్నేహితులు, గొడవలు, మాకేం అర్ధంకావటం లేదు ఏమిటో - దాన్ని పలకరిస్తే కోపం, ఏం చెప్తుందో ఏమీ అర్ధంకాహ్డు - అంతా కన్ ఫ్యూజన్ - వేంకటేశు లలిత మొఖంలోకి చూసి, "నీకు తెలిసినది ఏదన్నావుంటే నిర్మొహమాటంగా చెప్పేయి. దాచటం వలన ప్రయోజనం లేదు" అన్నాడు.
   
    లలితముఖం విప్పారింది. తను ఎన్నోసార్లు ప్రయత్నించి చెప్పటానికి, అవకాశం లేక మనసులో దాచుకున్న మాట అలానే వుండి పోయింది. ఆ విషయం చెప్పటానికి సరిగ్గా తగిన వ్యక్తి వేంకటేశు మాత్రమే. ముందర ఆ విషయం చెప్పేస్తే తన మనసు తేలికపడుతుంది.
   
    'మేడ మీద కెళ్ళి మాట్లాడుకుందాం అన్నయ్యా' అంది మెల్లగా వేంకటేశు, లలిత మేడమీదకెళ్ళారు. లలిత ఏం చెప్పబోతోందో అనే ఆవేదన వేంకటేశు మనసులో కదిలింది. తను చెప్పే విషయం ఎలా అర్ధంచేసుకుంటాడోననే భయం లలిత మనసులో మెదిలింది.
   
    'అన్నయ్యా నేను చెప్పే విషయాలు విని నువ్వు మరీ ఖంగారు పడక్కర్లేదు. అంతేకాదు శారదపైన కూడా అనవసరంగా దురభిప్రాయం పెంచుకోవద్దు. వీలయితే శారదతో కూడా మనిద్దరం మాట్లాడుదాం' అంది ముందు లలిత.
   
    'అమ్మ - ఇంతకీ ఆ దినేష్ స్నేహం ఎందుకు దీనికి ' - అన్నాడు వేంకటేశు.
   
    'నీరజ అని' మేం చదువుకునేప్పుడు మాక్లాస్ మేటు - చాలా కోటీశ్వరుల పిల్లలా వుండేది - కానీ అప్పుడే మా ఎవరికీ సదభిప్రాయం లేదు. శారద రామంతో అభిప్రాయ భేదాలొచ్చాక దాంతో స్నేహం మొదలెట్టింది -
   
    "ఆ అమ్మాయి దినేష్ భార్యా' కాదా -
   
    "భార్యా కాదు ఏమీకాదు ఫ్రెండ్సుట -ఏమిటో నాకు తెలియదు - పెళ్ళిచేసుకోరు - లివింగ్ టుగెదర్ అంతే అంటుంది శారద - నా కర్ధం కాలేదు మరి'
   
    'అమ్మా - లలితా, ఈ విడాకులు జరక్కుండా శారదని ఎలాగో ఒప్పించి రామాన్ని బతిమాలి కాంప్రమైజ్ పిటీషను పడేస్తే ఎలా వుంటుందంటావు - ఏవో అపార్ధాలు, అపశ్రుతులు - సరిదిద్దుకోవచ్చు.....ఆలోచించు" - వేంకటేశ్ బతిమాలుతున్నట్టు అన్నాడు.
   
    "ఆ ఆ అలాగే" - లలిత అంటుంటేనే వీధిలో ఆటో ఆగింది ఆటోని ఆపు నేను వెళ్ళిపోతాను - వేంకటేశు లలిత గుమ్మంలోకొచ్చారు ఆ ఆటోలో దిగింది రామం!! వేంకటేశు ముఖంలో క్షణం రంగులు మారాయి. చెల్లాయి విడాకుల విషయంలో ఇంతవరకు తనే మీ పట్టించుకోలేదు - పైగా ఆమె తరపున నిలబడి వకీలుని మాట్లాడింది దినేష్ ఏనాడూ రామాన్ని కలిసి సద్దుకుపోటం ఇద్దరికీ మంచిదని ఒక్కమాట కూడా చెప్పలేదు వేంకటేశు - రామం మీద సదభిప్రాయంలేకకానీ, చెల్లెలిమాటలు పూర్తిగా నమ్మికానీ, శారద ఎవరిమాట వినదు, మన కెందుకులే అనికానీ - ఏదైనా ఈ రోజు వరకు దూరంగా వుండి వ్యవహారాలు తెలుసుకుంటున్నాడే కానీ, రామానికి దగ్గరయే ప్రయత్నం ఏదీ చేయలేదు వేంకటేశు.
   
    చెల్లెలి పరిస్థితి చేతులు దాటి పోయే స్థితిలో భయంతో, రాజీమార్గం కుదిరితే బాగుండునని అనుకుంటున్నాడిప్పుడు తను - రామం ఎందుకొప్పుకుంటాడూ!! - ఏనాడో చేయవలసినపని తను ఆలస్యం చేసాడు - ఆలస్యం అమృతమ్ విషం - అంతే - వేంకటేశు, అక్కడ నుంచుండగానే, ఆటకి డబ్బులిచ్చేయటం, ఆటోవెళ్ళిపోవటం జరిగింది రామం వేంకటేశు నొక్కసారి చూసి, లలితకి హలో చెప్పి లోపల కెళ్ళిపోయాడు.
   
    "ఆలోచించు మరి సాయంత్రం మళ్ళీ కలుస్తాను. ఎలాగానై శారద బతుకు ఓదారికి తేవటమే మన లక్ష్యం - స్నేహితురాలిగా నువ్వు, అన్నగానేను చేయగలిగిందిదే, లలితా ఇవి చేతులుకావు కళ్ళు - నిన్ను బతిమాలుతున్నా - రామంతో న అతరపున నువ్వు మాట్లాడు - అతనేమన్నడో చెప్పు - రేపు నేను వచ్చి అతనితో అన్ని విషయాలు మాట్లాడుతా - వస్తాను మరి" - వేంకటేశు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. లలిత ఆ గుమ్మంలో చాలాసేపు నిలబడింది.
   
    పదిహేను రోజుల వరకు రానున్న రామం నాలుగురోజులకే వచ్చేయటం ఆశ్చర్యమేసింది లలితకి తన విషయమే ఏదన్న తల్లితో చెప్పటానికి వెళ్ళాడేమో ఆవిడ వద్దందేమో - మరి అంత అర్జంటుగా ఎందుకెళ్ళినట్టు - అంత అర్జెంటుగా ఎందుకు వచ్చినట్టు - లలిత ఇలా అనుకుంటూ వుండగానే రామం తలుపుతీసాడు "నాన్నగారు బాగున్నారా ఆ మీ చిన్నన్నయ్య వచ్చాడా - అతన్ని తీసుకొచ్చాడా" అన్నాడు లలితతో, "అన్నయ్యరాడు - రావద్దని టెలిగ్రాం ఇచ్చాను" అంది లలిత, రామం ముఖంలో వున్న ఉత్సాహాన్ని గమనిస్తూ.
   
    సందు చివర సిగరెట్టు కాలుస్తూ నుంచున్న వేంకటేశుని చూసి దినేష్ కారువేగం పెంచాడు. స్నేహితున్ని హైదర్ గూడాలో దించాడు. తిన్నగా నీరజ ఇంటికెళ్ళాడు దినేష్. నీరజ దినేష్ కోసమే ఎదురుచూస్తోంది. "ఇన్నిరోజులా" - దినేష్ లోపలకి రాగానే కౌగిలించుకుంది గాఢంగా రెండురోజులనుంచీ నిద్ర పట్టడం లేదు తెలుసా.
   
    "నాకూ అంతే -ఎప్పుడెప్పుడు వచ్చి నీ ఒళ్ళో వాలిపోదామా అని 'నీరజనడుం చుట్టు చేతులు పోనిచ్చాడు.
   
    'మీ అమ్మవుందా నెమ్మదిగా అన్నాడు.
   
    'మొన్ననే ధనంజయరావుగారొచ్చి సింగపూర్ తీసికెళ్ళిపోయారు ఇప్పుడు చెప్పుమనం అనుకున్న పనులన్నీ అయినట్టేనా'-
   
    "ఆ పల్లెటూరి ప్రజలు ఎంత అమాయకంగా వున్నారో ఇంకా నన్ను నామాటలు ఎంతగానమ్మారంటే, నన్ను దేముడని పూజించటానికి సిద్దంగా వున్నారు'-
   
    'నిన్ను నమ్మేది పల్లెటూరు వాళ్ళేమిటి - పట్నంవాళ్ళయినా అంతే - ఇంతకీ భగవంతుడు నీకు పెట్టిన ఆకర్షణ అది'
   
    'భగవంతుడు అంటున్నావేమిటి - ఆమాట అనకుండా తక్కినమాటలను'
   
    'ఆ అంతానీలోవున్న ఆకర్షణే' - అంది నీరజ నవ్వుతూ
   
    'ఇంతకీ నా ఫ్రెండు, అదే నీ ఫ్రెండు విషయమేమిటీ' అంది ఆసక్తిగా.
   
    'ఏమిటీ ఏముందీ, బెంగుళూరులో, కలకత్తాలో ఏమైందో అదే హైదరాబాద్ లోనూ అంతే. దినేష్ హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు నరసాపుర అనుభవం అతనికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. షేర్స - షేర్ మార్కెట్ - ఏజెంట్లు, బ్రోకర్లు - ఓహో, ఒకటేమిటి - పైగా దినేష్ కంపెనీ, నీరజా ఎంటర్ ప్రైజెస్, రాగిణీ కంపెనీ - ఓహో, ఎన్ని కంపెనీలలో ఎందరెందరిచేత షేర్స్ కొనిపించాడు ఈ దినేష్. దినేష్ అంటే ఏమనుకుంటున్నారో ఎప్పుడు ఏ కొత్త విద్య కనిపెడతాడో ఎవ్వడూ పట్టుకోలేరు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS