Previous Page Next Page 
వసుంధర కధలు-5 పేజి 3

 

    "ఎవరైనా దొంగేమో?"
    "ఇంత పట్టపగలు -- దొంగాడా? ఈ వస్తాదు కండలు వాణ్ని పిండి చేసేయనూ?"
    ఆప్రయట్నంగా వణికిపోయాను నేను.
    ఆమె చటుక్కున మంచందిగింది.
    నేనామెను చూసే అవకాశ ముంది. ఆమెకు నేను కనబడను. నేనున్న వైపు బాగా చీకటిగా వుంది.
    అందమైన ఆమె అర్ధ నగ్న శరీరం నాలో ఏమీ చలనం కలిగించడం లేదు. ఊపిరి బిగాబట్టాను. నా గుండెల నిండా భయం ఒక్కటే ఉంది.
    అతనూ మంచం దిగి చటుక్కున ఆమెను రెండు చేతులతో ఎత్తుకున్నాడు. "దొంగంటూ వస్తే క్షణంలో మాయం కాలేదు గదా -- వాడిగురించి మన మధుర క్షణాలు వృధా చేయను" అన్నాడు.
    ఇద్దరూ మళ్ళీ మంచం యెక్కారు. ఇప్పుడు వాళ్ళు నాకు కనబడడం లేదు. అమెమేత్తగా నెమ్మదిగా నవ్వుతోంది. అతడేవేవో ఛలోక్తులు విసురుతున్నాడు. చప్పుళ్ళు, నిట్టూర్పులు వినబడుతున్నాయి. నాకు బాధగా, బెంగగా భయంగా వుంది.
    మంచం మీద వాళ్ళిద్దరూ స్వర్గాన్ననుభావిస్తున్నారు. డ్రెస్సింగ్ టేబుల్ అద్దం వెనుక నేను నరకాననుభవిస్తున్నాను.
    ఒక చిన్న తుమ్ము, దగ్గు చాలు.... నా ప్రాణం తీయడానికి.
    పిక్ పాకేటింగ్ మానేయాలని నేనీ పనికి పూనుకున్నాను. అయితే యిందులో యెన్ని కష్టాలున్నాయి. క్షణ క్షణం ప్రాణ గండం. అంతా గడిచి క్షేమంగా బయట పడతానో లేదో తెలియదు. అక్కణ్ణించి కదలాలంటే భయంగా వుంది.
    అలాగే బిగపట్టుకుని క్షణ మొక యుగంలా అక్కడ వున్నాను.
    "ఈ క్షణం యెప్పుడూ ఇలాగే నిలిచిపోతే అంటోందామె.
    "అంతకుమించిన అదృష్టమే ముంటుంది?' అన్నాడతను.
    నిజంగా ఆ క్షణం అలాగే నిలిచి పోతుందేమోనని నేను భయపడ్డాను.
    వాళ్ళు మంచం మీద సుమారు మూడు గంటలున్నారు. అంతసేపు వాళ్ళేమేం కబుర్లు చెప్పుకున్నారో నాకు తెలియదు? నా జేబులోని నగలతో నేను బయట పడగలనా లేనా అనే ఆలోచిస్తున్నాను నేను.
    నా చేతి గడియారం మూడు గంటలు చూపిస్తుంది. ఇద్దరూ మంచం దిగి బట్టలు కట్టుకున్నారు. అతను లుంగీ పంచతో హాల్లోకి నడిచాడు. ఆమె డ్రెస్సింగ్ టేబుల్ వైపు వచ్చి సొరుగు లాగింది.
    "హేయ్ పాండూ -- కొంప మునిగింది" అందామె.
    ఆ పాండు వెంటనే రాలేదు. ఒక నిముషం లో అతను కంగారుగా వచ్చాడు. "కొట్టుగది లోని నా బట్టలు లేవు. ఇవి నావి కాదు" అన్నాడు.
    "సొరుగులో నా నగలు లేవు...." అందామె.
    'అయితే యెవరో దొంగ ఇంట్లోకి రానే వచ్చాడు. వాడెవరో యిక్కడే వుంటాడు" అన్నాడు పాండు.
    నా జేబులు తడుముకున్నాను. జేబులో నగలున్నాయి. కానీ కత్తి లేదు. కత్తిని ఆ ప్యాంటు లో వదిలిపెట్టాను పొరపాటున. ఇప్పుడు దొరికిపోతే నాకు ఆత్మరక్షణకు వేరే మార్గం లేదు.
    పాండు మంచం కింద వెతికాడు. లేచి వచ్చి "తప్పు నాదే- నిన్ను నగలు తీసేయమన్నాను. ఇప్పుడెం చేయాలి?" అన్నాడు.
    "మంగళసూత్రాలు కూడా పోయాయి."ఆమె కంఠం ఇంకా వణుకుతూనే వుంది.
    మంగళసూత్రాలు తీసుకు వెళ్ళే ఉద్దేశ్యం నాకు లేదు. వాటిని వదిలి పెట్టేయాలనే అనిపిస్తోంది. అయితే ఇలాంటి సెంటిమెంట్లన్నీ పెట్టుకునే సులభమైన పరిస్థితి నుంచి ఈ గతికి వచ్చానని మనసు దెబ్బలాడింది. కానీ మంచినీళ్ళు ఇచ్చినప్పుడే జానకిని బెదిరించి నట్లయితే ఇంట్లోంచి పాండు వచ్చి వుండేవాడు. గదిలోకి తొంగి చూసేవరకూ పాండు ఉనికి నాకు తెలియలేదు. అప్పుడామెను నేను వదిలి పెట్టడం వల్లనే యింతవరకూ నేను క్షేమంగా వున్నాను.
    నేనిలా ఆలోచిస్తూ వుండగానే "ఆ డ్రెస్సింగ్ టేబుల్ వెనకాల చూడు"అందామె.
    చటుక్కున నేను చతికిల బడ్డాను.
    పాండు నన్ను సమీపిస్తున్నాడు. ఇంక లాభం లేదు. నేను దొరికిపోతాను. దొరికిపోతాను....
    దొరికిపోయాను.
    పాండు నన్ను బయటకు లాగాడు. కెవ్వున అరవబోయి ఆగింది జానకి.
    పాండు నా ముఖం మీది రుమాలు లాగేశాడు.
    నా శ్రమంతా వ్యర్ధమయింది. దొంగతనం చేసి దొరికిపోయాను. దొంగగా జానకి కళ్ళబడ్డాను.
    "ఇతనా?" అంది జానకి ఆశ్చర్యంగా.
    "ఇతను నీకు తెలుసా ?' అన్నాడు పాండు ఆశ్చర్యంగా.
    జానకి నా గురించి తనకు తెలిసింది అతనికి చెప్పింది.
    పాండు నా జేబులు తడిమి నగలు బయటకు తీయించాడు. అంతటితో అతనాగడని నాకు తెలుసు. ఇంటి చుట్టూ పక్కల వాళ్ళందర్నీ పిలిచి నానా హడావుడీ చేసి పోలీసుల కప్పగిస్తాడు. చావు దెబ్బలు పాండు చేతిలో జానకి కళ్ళ ముందు తినాలి.
    "గతిలేక ఇందుకు పల్పడ్డాను. ఇంకెప్పుడూ ఈ పన్లు చేయను. నన్ను క్షమించి వదిలి పెట్టేయండి. అన్నాను ప్రాధేయపడుతూ.
    "ముందు గుడ్డలు మార్చుకో-- ఇవి నీవే కదూ" అని నా బట్టలు నాకు అందించాడు. అందిచేతప్పుడు నా పాంటు జేబులోని కాగితాలూ, కత్తీ కూడా తీసి "ఆహా - నీ దగ్గర కత్తి కూడా వుందే !"అని నవ్వాడు.
    ఒక్క క్షణం జానకీ అక్కణ్ణించి తప్పుకుంది. బట్టలు మార్చుకున్నాను.
    పాండు నా చేతికి ఓ వంద రూపాయల నోటు అందించి నాకూ కష్టాలంటే తెలుసు. కానీ కష్టాలకు గురై ఇలా దిగజారి పోను. ఏమీ చేతకాక పొతే ఓ కిళ్ళీ కొట్టైనా పెట్టుకో. అంతేకానీ దొంగతనాలు చేయకు" అన్నాడు.
    నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. ఓసారి వళ్ళు గిల్లి చూసుకుని "మీరెంత మంచి వారండీ?" అని ఇంకా ఏదో అనాలని గొంతు సహకరించక మానేశాను.
    "ఇప్పుడీ నగలు పోయి వుంటే వేలకు వేలు పోయేవి. నువ్వు దొరకడం నీ దురదృష్టం. మా అదృష్టం. ఈ వందరూపాయాల్లో నాకు పోయేదేమీ లేదు. నీకు మాత్రం చాలా పెద్ద లాభం. అటు జైలు తప్పింది. ఇటు కొత్త జీవితానికి అవకాశమూ వస్తోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సుఖంగా వుండు. మళ్ళీ ఇలాంటి అవకాశం నీకు రాకపోవచ్చు" అన్నాడు పాండు.
    అది నేను మారిపోయిన క్షణం. ఒక వారం రోజులు తర్వాత నేను చిన్న పుస్తకాల షాపు ప్రారంభించాను. పెట్టుబడి అట్టే లేదు. ప్రముఖ వార, మాసపత్రికలు కమిషను కి తెచ్చి అమ్మడం . ఇతర వస్తువులు కూడా చేర్చాలనుకుంటున్నాను. ముఖ్యంగా వక్కపొడి, స్వీట్స్, వగైరాలు!
    ఒక నెల రోజుల తర్వాత జానకి ఇంటికి వెళ్ళాను -- నా కృతజ్ఞతలు తెలుపుకోడానికి!
    తలుపు తట్టగానే ఒక్క బక్క పలచటి మనిషి తలుపు తీశాడు.
    "నమస్కారమండీ -- జానకి గారు , పాండు గారూ వున్నారా?" అన్నాను.
    "పాండా-- వాడేవాడు? ఈ ఇంట్లో నేనూ, నా భార్య జానకి తప్ప ఇంకెవ్వరూ లేరు" అన్నాడతను.
    ఇంతలో జానకీ అలా వచ్చింది. నన్ను చూసి కంగారుగా "చూడండి - ఇప్పట్లో మా కేవ్వరికీ పోస్టల్ లో సేవింగ్స్ చేసే ఉద్దెశ్యమేమీ లేదు. మీరు వెళ్ళొచ్చు....." అని నాతొ అని "త్వరగా లోపలకు రండి. కమిషన్ కు పోస్టల్ సేవింగ్స్ చేయించే మనిషి ఇతను. ఇదివరకు మనింటి కోసారి వచ్చాడు" అంది అతనితో.
    "పాండు అంటారేమిటే?'అన్నాడతను.
    "వెయ్యిళ్ళ పూజారి -- ఎన్నో పేర్లు అతని మనసులో కలగ పులగంగా వుండొచ్చు" అని భళ్ళున తలుపెసేసింది జానకి.
    నాకు కధ అర్ధమై పోయింది. పాండు జానకి ప్రియురాలు. నన్ను పట్టివ్వడం వల్ల తమ నేరం బట్టబయలౌతుందని నన్ను డబ్బిచ్చి వడుల్చుకున్నాడు పాండు. అది నేను అతని ఔదార్యమని భ్రమ పడ్డాను.
    అంతేకాదు - పాండు బట్టలు కొట్టు గదిలో పెట్టాడానికి కారణం హటాత్తుగా భర్త వస్తే కట్టుకునే టందుకన్న విషయం కూడా నాకిప్పుడే భోధపడింది.
    పాండు, జానకి నిశ్శబ్దంగా ఎండుకున్నారో కూడా తెలిసిపోయింది.
    నేను దొంగతనానికి వెళ్ళిన సమయంలో ఆ ఇంట్లో వాళ్ళిద్దరూ దొంగలు.
    ఆరోజు దొంగతనం గుర్తుకు వస్తే ఇప్పటికీ నాకు నవ్వొస్తుంటుంది.
    కనబడ్డప్పుడల్లా జానకి, పాండు నన్ను చూసి భయ పడుతుంటారు- నేను వాళ్ళింట్లో దొంగతనానికి వెళ్ళిన దొంగనైనప్పటికీ కూడా?.... బహుశా నా దొంగతనం కంటే వారి దొంగతనం ప్రమాదకరమైనది , అసహ్య మైనదీ అయుండాలనుకున్నాను.

                                     ***


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS