వీధి మలుపులో ఒక వ్యక్తీ ఎదురై వారిద్దరినీ ఎగాదిగా చూశాడు. రాజారావు వెంట ఉన్న వృద్దుడా వ్యక్తికీ నమస్కరించాడు. అయన అజానుభాహువు . చేతిలో కర్ర వుంది. కళ్ళలో ఎర్రని జీరలు మనిషిలోని కాఠిన్యాన్ని చెప్పక చెబుతున్నాయి. అయన వృద్దుడ్నీ కళ్ళతో పలకరించాడు. కళ్ళతోనే ప్రశ్నలు వేశాడు. వృద్దుడు రాజారావు ను చూపించి "రాఘవయ్య గారి మేనల్లుడు వీరు....నిన్న రాత్రి ఆలయంలో వర్షంలో చిక్కుబడి పోయారు. ఇల్లు చూపించేందుకు తీసుకు వెడుతున్నాను........" అన్నాడు. తర్వాత రాజారావు వంక తిరిగి అతడు "వీరు ఈ వూరి మునసబు గారు ...." అని పరిచయం చేశాడు.
రాజారావు ఏమీ మాట్లాడలేదు. మునసబు ఒక ఒక్కసారి గొంతు సర్దుకుని "మిమ్మల్ని గురించి మీ అమ్మగారిని గురించీ రాఘవయ్య అప్పుడప్పుడు మాతో చెబుతూ ఉండేవాడు. "పాత మనస్పర్ధలు యింకా ఎందుకు? చక్కగా కలిసి మెలిసి ఉండరాదా? అని నేను కొన్ని సార్లన్నాను కూడా అయినా అయన కూడా మహా పట్టుదల మనిషి. మనసు అనుకోవాలే గానీ బ్రహ్మదేవుడు దిగి వచ్చినా తన పట్టుదల మార్చుకునే వాడు కాదు. నిజానికి నాకూ ఆయనకూ యిటీవలే అట్టే స్నేహం లేదు. ఒక విషయంలో తగవు వచ్చి అయన నాతొ పల్లెత్తి మాటాడకుండా భీష్మించుకు పోయాడు. అయితే అటువంటి మనుషులతో వ్యవహారంచడం నాకు బాగా తెలుసునను కొండి....ఏది ఏమైనా అయన మంచి వైద్యుడు...అటువంటి వైద్యుణ్ణి పోగొట్టు కుని వూరు నష్ట పడిందనే చెప్పాలి....అంతే గాకుండా అది భయంకరమైన హత్య కావడం వల్ల వూళ్ళో అందరికీ హడలుగా ఉంది. రాత్రిళ్ళు బయటికి రావడానికీ, పొలం పనులకు పోవడానికీ జనానికి భయంగా ఉంది. తోడు లేకుండా ఎవరూ ఎటూ కదలటం లేదు....' అంటూ ఆగి "అన్ని సంగతులూ మిమ్మల్ని నిలబెట్టి మాట్లాడి వేశాను. రండి ....వారి యింటికి పోదాం.....మిమ్మల్ని అక్కడ నడచి నా పని మీద నేను పోతాను ." అంటూ వెనుదిరిగాడు.
రాజారావు పరిశీలనగా చూశాడు. "మునసబు తొణుకూ బెణుకూ లేకుండా మాట్లాడ గల మనిషి ' అని అనిపించింది. అతడు నిట్టూర్చాడు.
వారు ఒక యింటి ముందు ఆగారు. అది ఒక పెద్ద పెంకుటిల్లు. వాకిట్లో ఆవరణ ఉంది. ఒక వైపు చుట్టూ పాక ఒకటి ఉంది.
మునసబు "ఒక్క క్షణం ఉండండి. నేను వెళ్లి ముందు చెప్పి వస్తాను." అని వీరిద్దరినీ ఆవరణ లో నిలబెట్టి "సుభాద్రమ్మా" అని పిలుస్తూ లోపలికి వెళ్ళాడు.
రాజారావు చిత్రమైన అనుభూతిని పొందుతున్నాడు. ఎన్నో ఏళ్ళ తర్వాత రక్త సంబంధీకులను కలుసుకుంటున్న ఆనందం అతనిలో కలిగి మన

2
సుభద్రమ్మ కి దుఃఖం పెల్లుబికి వస్తోంది. నోటికి చీర చెంగు అడ్డు పెట్టుకుని ఏడుస్తోంది. రాజారావు గుమ్మం దగ్గర మవునంగా నిలబడి ఉన్నాడు. అతనికిప్పుడెమీ తోచడం లేదు. ఎన్నో ఆశల్ని గుండెల్లో దాచుకుని ఈ వూరు వచ్చాడు. ఇక్కడ ఈ పరిస్థితిని గమనించడంతో అతని మనసంతా చెదిరిపోయింది. అతని వయస్సూ, అనుభవాల్లో ఇలాంటి సన్నివేశాలు రెండే రెండు చోటు చేసుకున్నాయి.
అమ్మ పోయిన నాడు దిగ్భ్రాంతి చెందేడు. ఘోల్లున ఏడవలేక పోయినా, దుఃఖానికి అతీతమైన భావన ఏదో అతన్ని అవరించిందానాదు. అమ్మ లేదు ! తిరిగి రాదు!-- ఈ వెలితి తనని నిలువునా కూల్చి వేసింది. పరిచయస్థుల సమక్షంలో అతని మతిపోయిన మనిషై నాడు.
ఈనాడు అత్తయ్య స్థితి -- అతనూహించగలడు -- కానీ, వోదార్చే నేర్పు తనకి లేదు.చేతకాదు. అతను తల వంచుకుని కాలి గోటితో నేలను రాస్తూ నించుండిపోయాడు.
తాత, ముసనబు ఇద్దరూ ఆ సమయానికి అక్కడ లేకపోతె రాజారావు ఇరకాటంలో పడిపోయి ఉండేవాడు. వాళ్ళిద్దరూ జీవితాన్ని బాగా ఆకళింపు చేసుకున్న వ్యక్తులు కావడాన, ఇలాటి దారుణాలు వాళ్ళ అనుభవంలో చాలా చూసి ఉన్నారు కాబట్టి సుభద్రమ్మ ను వోదార్చ గలిగేరు. ఆవిడ కుదుట పడిన తర్వాత సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ.
రాజారావు బిక్కుబిక్కుమంటూ అవతలి గదిలోకి అడుగు పెట్టాడు. సంచీ నేల మీద ఉంచి ఒళ్ళు విరుచుకున్నాడు. గోడ మీద ఉన్న పాత కాలపు ఫోటో అతన్ని ఆకర్షించింది. గబగబా అటు వైపున నడిచేడు. ఫోటోని తీక్షణంగా చూడటం ప్రారంభించేడు.
మామయ్య కాబోలు, అయన మొహంలోని గంబీరత కొట్టోచ్చినట్టుంది. అయన ప్రక్క అత్తయ్య. వాళ్ళిద్దరి వెనుకా అమ్మ! మొహాన బొట్టు లేకపోయినా, అలంకరణ విషయంలో ఆమె నోచుకోలేక పోయినా, దేవత లాటి మనిషి అమ్మ!
రాజారావు కళ్ళు అర్ధ్రమైనాయి. వెంటనే తల దించేసుకున్నాడు. అంతలోనే ఉలిక్కిపడ్డాడు. తన వెనుకే -- ఎవరో మెల్లిగా ఎడుస్తూన్నట్టనిపించింది. గభాలున వెనక్కు తిరిగి చూసేడు. లోపలి గుమ్మానికి చేరగిలబడి తలని కిటికీ వై వుంచి ఆ పిల్ల ఏడుస్తోంది. రాజారావు ఆమె దగ్గరిగా వెళ్ళాడు. అది ఆమె గమనించనే లేదు. ఏడుపు ఆపనూ లేదు. అమ్మ వరలక్ష్మీ గురించి చెప్పిన పోలికలు గుర్తుకొచ్చాయి. చనువుతో నెమ్మదిగా పిలిచేడు.
"వరలక్ష్మీ!"
ఆమె ఆ పిలుపు విని తెల్లబోయింది. అందమైన తన చేతులతో కళ్ళు తుడుచుకుంది.
"మా అమ్మ పోయిన నాడు నేనూ నీ స్థితిలోనే ఉన్నాను. మనసు దిట్ట పరుచుకోవాలి వరలక్ష్మీ! గతించిన దాన్ని మరిచిపో! ఇంతకంటే నీకేం ఎక్కువ చెప్పగలను?"
ఆ పిల్ల రాజారావు వైపు చిత్రంగా చూసింది. అతను గుమ్మాన్ని చేత్తో రాస్తూ అన్నాడు-----
"నిన్ను చూడటం ఇదే మొదటి సారి. నా దౌర్భాగ్యం కొద్ది అవాంచనీయమైన వాతావరణం లో నిన్ను పరిచయం చేసుకుంటున్నాను." అన్నాడు బాధగా.
"నిజానికి నేను చాలా దురదృష్ట వంతుడ్ని వరలక్ష్మీ!చాలా దురదృష్ట వంతుడ్ని."
వరలక్ష్మీ ఏమీ మాట్లాడలేదు.
"పుట్టిన ఏడాది లోనే తండ్రిని పోగొట్టుకున్నాను. అయిన వాళ్ళందర్నీ అమ్మ దూరం చేసుకున్నది. మేమిద్దరం చావలేక బ్రతికినట్టు బ్రతికాం వరలక్ష్మీ! కానీ అమ్మకున్న ధైర్యం నన్ను మనిషిగా చేసింది. ఇప్పుడు ఆ అమ్మ లేదు. ఆవిడ గౌరవించిన మావయ్యా లేడు. నా కలలూ గాలి మేడలయ్యాయి. పోనీలే వరలక్ష్మీ! అసలే దెబ్బ తిన్న నీ మనసుని నా కధలు చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేదునాకు."
అతను మళ్లా గదిలోకి వచ్చాడు. ఎంత వద్దను కుంటున్నా అతని చూపు మావయ్య వాళ్ళ ఫోటో మీదికి పోతూనే ఉంది. వరలక్ష్మీ అక్కడ నుంచి కదలి వెళ్ళిపోయినట్టు గమనించేడు రాజారావు . భారంగా నిట్టుర్చేడు.
పాలేరు నీళ్ళు తోడినట్టు చెప్పడంతో టవలు తీసుకుని దొడ్లోకి వెళ్ళేడు.
* * * *
తల దువ్వుకుంటూ వుండగా వరలక్ష్మీ గదిలోకి వచ్చింది. ఆ పిల్ల చేతిలో కాఫీ పొగలు కక్కుతోంది. దువ్వెన బల్ల మీద ఉంచి, చేతులు టవల్ తో తుడుచుకుని వరలక్ష్మీ దగ్గరకు వెళ్ళాడు. కాఫీ కప్పు తీసుకుంటూ అన్నాడు.
'అలా కూర్చో వరం!"
ఆ పిల్ల ఆ పేరు వినడంతో ఉలిక్కి పడింది. రాజారావు మెల్లిగా నవ్వేడు.
"మా వివరాలు మీరు పట్టించుకోక పోయినా మిమ్మల్ని గురించి అమ్మ చాలా వాకబు చేస్తుండేది. నీకు తెలీదు వరం అమ్మ మనసు! మావయ్య ఆమెను ఇంటి నుంచి గెంటివేసినా అయన మీద గౌరవం గానీ, ఆత్మీయత గానీ అమ్మకి పిసరైనా తగ్గలేదు. పైపెచ్చు ఇరవై నాలుగ్గంటలు మావయ్య నే తలుస్తుండేది. అయన గుణ గుణాలను పోగుడుతూండేది. ఎందుచేత నంటావ్?' అడిగేడు.
