Previous Page Next Page 
నేస్తం నీ పేరే నిశ్శబ్దం పేజి 28

 

    విభ్రమంగా చూశాడు రాకేష్ ."ఎందుకు?"

 

    "మీ ఉత్సాహం బట్టి మీ పేరు లిస్ట్ లో వుందన్న నమ్మకం."

 

    "పప్పులో సోలిడ్ గా కాళ్ళేసారు" రాకేష్ నవ్వాడు. "ప్రామిస్ మాస్టారు. నేను రిటెన్ లో ఫెయిలయ్యాను."

 

    అదో లాంటి భావంతో "ఆయామ్ సారీ" ఆన్నాడు ధన్వి. వైఫల్యాన్ని సైతం రాకేష్ అంత స్పోర్టివ్ గా తీసుకోవడం ఆశ్చర్యంగా అనిపించింది కూడా.

 

    పరిచయం అయి పది నిముషాలు కూడా కాలేదు. కానీ రాకేష్ ధన్విని చాలా ఆకట్టుకున్నాడు. అంతకుమించి అణువంత బాధని సైతం ప్రదర్శించని రాకేష్ ఒక చిన్న అపజయానికి సైతం నిరాశావాదంతో కూరుకుపోయే నేటి యువతకి భిన్నంగా అనిపించాడు.

 

    "నేను యిప్పుడు ఫీలైంది లిస్టులో నా పేరు లేనందుకు కాదు మిస్టర్ ధన్వి.

 

    "మరి!"

 

    "మీరు సారీ చెప్పినందుకు" రాకేష్ ఫకాల్న నవ్వాడు కడలి ఒడ్డును దాటినా కెరటంలా.

 

    "ఇలా అన్నందుకు మీరు ఫీలైతే నేను సెకండ్ టైం ఫీలవుతాను. ప్రామిస్."

 

    ధన్వి ఆశ్చర్యంగా చూస్తూ "ఇష్టం లేకుండానే మీరీ ఇంటర్వ్యూకి వచ్చారా?' అన్నాడు రాకేష్ ఉద్దేశ్యం అర్ధం కాక.

 

    "భలేవారే" రాకేష్ లో అదే వూపు. ఉత్సాహం. "ఒక బ్రహ్మాండమైన జాబ్ కి అయిష్టంగా వచ్చేవాడు ఎవడు వుండడు ధన్విజీ. నిజంగా ఆశపడే వచ్చినా అంతర్లినంగా ఎక్కడో ఫెయిలవాలని కోరుకున్ననేమో...."

 

    "నాకు అర్ధంకావడం లేదు."

 

    'అర్ధం కావాలి అంటే మీకు మన తెలుగు కవి 'సినారె' పరిచయం వుందో లేదో ముందు నాకు చెప్పాలి."

 

    "వ్యక్తిగతంగా లేదు కానీ నారాయణ రెడ్డిగారి సాహిత్యంతో పరిచయం వుంది."

 

    "వండర్ పుల్. ఇంకేముంది మాస్టారు....ఇలా నేను ఆనందంగా వుండటానికి కారణాన్ని నారాయణ రెడ్డి గారు రాసిన 'భూమిక' లోని కవిత ద్వారా తెలియచెప్తాను.'

 

    ఆధునికంగా కనిపించే రాకేష్ కి తెలుగు సాహిత్యం గురించి అవగాహన వుండటం అనందమనిపించడంతో "వెల్ కమ్" అన్నాడు ధన్వి.

 

    గొంతు సవరించుకున్న రాకేష్ పొయిటిక్ గా చెప్పాడు.

 

    "కరిమేఘంలా నేను కురుస్తానుకానీ, ఆ వాన ఎడారికి కాక ఒక చేని నోటికందినప్పుడే గణ్యతంటాను."

 

    ఆ తరువాత తమని ఎవరూ గమనించడంలేదని నిర్ధారణ చేసుకుని రహస్యంగా చెప్పాడు రాకేష్ . నా గాళ్ ఫ్రెండ్ వుండేది మీ హైదరాబాదులోనే మాస్టారు....ఒకరి కోసం మరొకరం చచ్చేటంత ప్రేమని ఏక్స్ ప్రెస్ చేసుకుంటామంటే నమ్మండి. అయితే ఆ అమ్మాయి బాగా వున్నది, నా మీద మనసున్నదే కాక తెలుగు రాష్ట్రంలోనే తాను వుండాలని కోరుతున్నది కూడా. ఎస్ మాస్టారు....మా పెళ్ళికి అదో తిరుగులేని షరతు అందుకే ఈ జాబ్ తప్పిపోయినందుకు బాధపడుతూ కూడా రవ్వంత ఆనందాన్ని ప్రకటిస్తున్నాను. తెలుగు రాష్ట్రంలో కాక మరెక్కడైనా జాబ్ చేయడమంటే ప్రేమని పోగొట్టుకోవడం. పచ్చని చేలమద్య గాక ఎక్కడో ఎడారిలో వర్షమై కురవడం లాంటిది అనిపించి యిప్పుడు హేపిగా వైజాక్ వెళ్లిపోవాలనుకుంటున్నాను. ఓ.కే.....నేను మిమ్మల్ని హైదరాబాద్ లో కలవాలనుకుంటున్నాను. కాబట్టి మీ ఎడ్రస్ యిస్తే ఆనందిస్తాను.

 

    ఓ స్లిప్ మీద తన ఎడ్రస్ రాసిచ్చిన ధన్వి ఇంటర్వ్యూస్ మొదలయ్యాక కూడా రాకేష్ తో మాట్లాడుతూ చాలాసేపు గడిపాడు. అది ఆహ్లాదమో లేక విసుగో చెందే అవకాశం లేని పారవశ్యమో ధన్వి రెప్పలార్పకుండా చూడటం మాత్రమే కాదు, చెవులు రిక్కించి కర్ణసేయంగా మాట్లాడగలుగుతున్న రాకేష్ వినడాన్ని ఇష్టపడుతున్నాడు.

 

    ప్రతి చిన్న రాపిడిని తెరవడని నాటకంలోని గాయమనుకుంటు పాత్రల్లా నటించడం అలవాటైన యిప్పటి యువతీ యువకులు అందరూ రాకేష్ ని ఆదర్శంగా తీసుకుంటే.....

 


    దట్టించబడ్డ తుపాకిలా దశలవారీగా సంఘాన్ని తిట్టుకుంటూ బ్రతుకుతూ, ఓంటరితనపు చీకటి గదిలో ముఖం చెల్లని స్థితిలో అంతర్ముఖల్లా నిట్టుర్చుతూ కుంచించుకుపోయేవాడు కాదు."

 

    "అది కాదు....ధన్వి తనని తాను కూడా రాకేష్ తో కంపేర్ చేసుకుంటున్నాడు.

 

    ప్రతి సంఘటనా జీవితానుభవాన్ని అందించే ప్రేరణా , ప్రతి అనుబంధము ముందుకు కదిలించే స్పూర్తిగా అంగీకరిస్తూ సైతం తెలీని భ్రమల దగ్గర ఆగిపోయి ఝుంకారాలని గమ్యం గురించి తనూ ఆకజడి చెందడం ధన్వికి అలవాటే. ఆశావాదిననుకుంటు ఎక్కాల్సిన శిఖరం వేపు చూస్తూ అసలు యిది సాధ్యమౌతుందా అనుకునే క్షణికమయిన అందోళనలో ధన్వి కూడా చాలాసార్లు ఇరుక్కున్నాడు.

 

    అయితే.....

 

    రాకేష్ వీటన్నింటికీ అతితుడిలా వున్నాడు.


    తన ఉనికిని చూసి తనే ఉలికిపడడం నేరమనుకునే ధన్వికి రాకేష్ ఎంత నచ్చాడు అంటే అతడి నుంచి తనూ నేర్చుకోవాల్సిన ఏ అంశాన్నో ఇప్పుడు గమనించగలిగినట్టు అనిపించింది.

 

    అదుగో....సరిగ్గా అప్పుడు వినిపించింది.

 

    "మిస్టర్ ధన్వి.....ఫ్రం హైదరాబాదు."

 

    ఆలోచనల నుండి తేరుకున్న ధన్వి "యస్" అంటూ పైకి లేచాడు.

 


    "మీకు ఓ అర్జెంట్ ఫోన్ కాల్" అంది అక్కడ రిసెప్షన్ దగ్గర వున్న అమ్మాయి.

 

    విభ్రమంగా చూశాడు ధన్వి.

 

    తన పేరు పిలిచింది ఇంటర్వ్యూ కోసమనుకుంటే రిసెప్షన్ కౌంటర్ దగ్గరికి రమ్మని కబురొచ్చింది.

 

    నెమ్మదిగా నడిచాడు. సాలోచనగా రిసీవర్ అందుకున్న ధన్వి.....


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS