Previous Page Next Page 
అతని లక్ష్యం పేజి 27


    'సరిగంగ స్నానాలేవిట్రా తమ్ముడూ! చెప్పావే కావు చూసి కాస్త పుణ్యమన్నా మూట గట్టుకుందుం .' అని పద్మనాభం అంటే, 'అవెం నాయనమ్మ ఉపమానాల్రా నాయనమ్మా?' చక్కగా గోపీ వస్త్రాపహరణం అనో రాస క్రీడలనో అంటే, అది నాజూకుగా వుంటుంది గానీ' అన్నాడు. కాలక్ష్జేపం గాక గులక రాళ్ళని ఒక్కొక్కటీ చెట్ల మీదికి బలం కొద్దీ విసురుతూ నిల్చున్న శేఖర్.
    'ఛ, ఛ. ఏదో చాటుగా మాటుగా వాళ్ళేదో సరదాలు పడ్డామనుకుంటుంటే' చూసినా చూడనట్టే నటించాలి గాని అవన్నీ అందరి ఎదుటా బయట పెట్టెస్తావుట్రా.' అనుభవం లేని ఘటమా?' అంటూ అతణ్ణి మందలించాడు బస్సులో కూర్చునున్న వాడల్లా మళ్లీ దిగి వాళ్ళ వద్ద కోస్తూ రాం మ్మోహన్. ఇంతలో రాధ , శ్యామలా , రావడం తో అంతతో హస్యాలన్నీ కట్టి పెట్టి బుద్దిగా బస్సెక్కి పోయారు ఆ స్నేహిత బృందమంతానూ. ఎప్పుడూ కాలేజీ లోనూ, హాస్పిటల్ లోనూ , వారు చేస్తుండే ఇటువంటి గొడవల కల్లా అలవాటు పడిపోయిన రఘు ఆహాస్యాల్ని అక్కడే విదిలించేసి తను మాత్రం బస్సెక్కాడు. అందరూ వచ్చారో లేదో ఒకసారి చూసుకున్నాక మళ్లీ బయల్దేరింది బస్సు. పాపం ఈ  అల్లర్ని గురించి రాధ కేమీ తెలివక పోయినా ఏదో కాస్త పసి కట్టారన్నది మాత్రం గ్రహించింది.
    కొండల మధ్య నుంచీ, లోయల వారల్నుంచీ , ప్రయాణం సాగిస్తూ, చిన్న చిన్న వాగుల్నీ, గుహల్నీ దాటుకుంటూ ఎత్తు పల్లాలున్న చోట ఎగరేసి పడేస్తూ , రోడ్డు వెడల్పు లేని చోట్ల అడ్డంగా ఊగిస్తూ బస్సు ప్రయాణం లో ఎన్నెన్ని రకాల ఇబ్బందులుంటాయో , అన్ని రకాలూ ఆ ప్రయాణికులకి చవి చూపిస్తూ, ఎలాగనైతేనేం , పది గంటల ఆ ప్రాంతాల్లో వారందర్నీ 'మాచ్ ఖండ్' చేర్చిండా బస్సు.
    అమ్మయ్యా అనుకుని, అదివరకే అక్కడ పనిచేస్తుండే ఒకరిద్దరు ఇంకనీయర్ల ను పట్టి, ఏర్పాటు చేసుకున్న విడిది గృహానికి సామాన్లు పట్టించ బోతుండగా 'క్షమించా లండీ . అనుకోకుండా మా ముఖ్య అధికారోకాయన నిన్న రాత్రోచ్చి ఆ బంగ్లా లో తిష్ట వేశాడు' అంటూ ఆ ఏర్పాటు చేసిన వార్లో ఒకాయన ఎదురొచ్చి చల్లగా ఈ కబురు చెప్పి వెళ్ళిపోయాడు.
    'నే బస్సేక్కు తుండగా ఈ రామబ్రహ్మం గాడు పుసుక్కున తుమ్మాడు. అప్పుడే అనుకున్నా, వీడి తుమ్మేం చేస్తుందో ననీ. అనుకున్నంతా అయింది.' అన్నాడు ' బెడ్డింగ్' మీద చతికిల పడుతూ పద్మనాభం.
    'చాల్లేరా. తీరా బస్సు బయల్దేరు తుంటే శుభమా అంటూ ఒంటి బ్రాహ్మడల్లె వచ్చి అందరికీ ఇబ్బంది తెచ్చి పెట్టడమే గాకుండా పైగా ఇదొటా. అసల్దారిలో ఏ ప్రమాదం సంభావించకుండా వెళ్లి చేరాలి గదా. దేవుడా అనుకుంటూ, దారి పొడుగునా చేట్టుకీ, పుట్టకీ దండం పెట్టుకుంటూనే వొస్తే, ' అన్నాడు బస్సు మెట్టు మీద కాలూ నేల మీదో కాలు పెట్టి పోజిస్తూ రామబ్రహ్మం.
    'అవి నీలాంటి వాడొస్తే రా నాయనా, నే బ్రహ్మడ్ని కాను రెడ్డి ని ఒకటీ! రెండోది నేను ఒంటి గాణ్ణి కాను. ఇదుగో చూడండి' అన్నాడు జేబు లోని ఒకమ్మాయి ఫోటో తీసి చూపిస్తూ.
    'ఎవర్రా అదీ' అంటూ అందరూ ఒకే సారి తన్ని చుట్టూ ముట్టేశారు ఆ ఫోటో ని చూడ్డం కోసం.
    'ఎవరేమిటి. నాక్కాబోయే భార్య' మొహం బడాయి గా పెడుతూ అన్నాడు పద్మనాభం.
    'అందుకని జేబులోనే పెట్టుకు తిరుగుతున్నావా , సిగ్గు లేకపోతె సరి.'
    'హు. చేసుకునే ముందు ఆ ఫోటో ని చూసి భవిష్యత్తు ని ఊహించుకుంటుంటే ఆ ఆనందం ఉంది చూశావ్. తమ్ముడూ, ...హే. ఏఏ సమయాల్లో ఏ ఏ విధమైన సుఖానుభవం పొందడానికి వీలో అవన్నీ హాయిగా అనుభవించాలి. అంతేగాని , మన రఘు కి మల్లె--'
    'చాల్లే గాని ఆర్నెల్ల తరవాత పెళ్లి చేసుకో బోతున్నందుకే ఇప్పట్నుంచీ , ఇన్ని రకాల వేషాలు వేస్తుంటే, ఇంక ఆ పెళ్లి అయ్యాక --'
    'అయ్యాకేం వుందిరా. నా మొహం , అమ్మగారటు మోహమైతే, అయ్యగారిటు మొహం బస్.'
    ఆతని ధోరణి కి అంతా ఘోల్లున నవ్వారు.
    'సరి బాగుందర్రా. ఇంతదూరం ఈ బస్సులో ఎముకలు విరిగేటట్టు ప్రయాణం చేసోచ్చింది , ఇక్కడా ఈ పద్మనాభం గాడి సోది వినాటికెనా ఏం! లేవండి' అన్నాడోకతను.
    'ఎక్కడికిరా లేవడం' మరొకతనడిగాడు.
    'ఎక్కడికేవిటర్రా . ఈ ఇళ్ళూ, ఇరకాటాలూ , ఇక్కడ. మనకా ప్రారబ్ధమేం వచ్చే! రండి హాయిగా ఆ చెట్ల నీడని మఖాం పేడదాం.' అంటూ తన సంచీ భుజానికి తగిలించుకుంటూ లేచాడు మరొకతను.
    'మరి విద్యుత్ కేంద్రాన్ని చూడ్డవో!' అన్నాడు మొదటతను.
    'దానికేం పెద్ద ఆలోచనేం ఉందీ, కాళ్ళ కి బుద్ది చెప్పడం వెళ్లి, చూసి రావడం.'
    'ఈలోగా ఏ బుద్ది మంతులైనా ఈ సంచుల్నీ కాజేసేస్తేన్తో ? గుడ్డ ముక్కలు పొతే పీడా పోయే గానీ, తిండి పట్టుకు పోయాడంటే ఇక్కడిక గడ్డి కూడా పుట్టదు.'
    'వోరి సాపాట్రంగా , అందరి తిండీ ఎవడు పట్టుకు పోతాడ్రా. పట్టుకు పొతే మాత్రం...'
    'ఏవోలె?' అంతా సంచీల్తో సహా చెట్ల వేపు బయల్దేరారు.
    వోపని చెద్దావర్రా. ఫోటో చూసుకుంటూ ఉండమని ఈ పద్మనాభంగాణ్ణి ఇక్కడ కాపలా పెట్టి మనమంతా వెళ్లోద్దాం.'
    'మహారాజులా వెళ్ళండి. అయితే మీ సంచీల్లో , పళ్ళో, పిండి వంటలో , తగ్గిపోయాయంటే ,మాత్రం నన్ననోద్దు .'
    'బంగ్లా దొరకనప్పుడు అంతా సంచీల్తో సహా బయల్ద్గేరుతున్నారెందుకు ?' అన్నాడు అక్కడి వివరాలన్నీ కనుక్కుని వస్తున్న రఘు వాళ్ళను చూసి.
    'చెట్టూ, పుట్టా పట్టిపోదాం అంటున్నార్రా నాన్నా వీళ్ళంతానూ' అన్నాడు ఏడుపు వరసతో  రామమోహన్.
    'ఎందుకూ ,అందాకా అన్నీ బస్సులోనే వుంచి అన్నీ చూసోచ్చాక భోజనాలు కావలిస్తే చెట్టు కింద చెయ్యొచ్చు.'
    అన్నీ బస్సులో పెట్టి, కిటికీ తెరల్ని బటన్ చేసేసి త్వరగా రండి' అన్నాడు తను ముందు నడుస్తూ రఘు.
    అక్కడ చూడవలసినవన్నీ చూచి పన్నెండయ్యే సరికే అంతా అక్కడ్నించి ఒచ్చేసి, ఆహార సామాగ్రంతా పట్టుకుని చెట్ల కిందికి చేరారు.
    డ్రైవరూ, కండక్టర్ వెళ్లి అక్కడి వార్నడిగి రెండు కడవ ల్నిండా నీళ్ళు పట్టుకోచ్చాక , ఒకరు తెచ్చిన ఆహార పదార్ధాల్ని మరొకరికి రుచి చూడమని వడ్డించుకుంటూ సరదాగా భోజనాల్చేస్తున్నారు.
    రఘు కూడా తన బెస్కేట్ తెరిచి ప్లేట్లూ, స్పున్లూ వగైరా లన్నీ పైకి తీశాడు. 'తనే రాధ ని పిల్చి పెట్టాలా? లేక రాధే ఇద్దరికీ వడ్డిస్తుందా? 'ఏం చేయ్యాలో తోచక తటపటాయిస్తూన్న రఘు ని చూసి, అంతవరకూ ఈ స్నేహితుల గొడవ పడలేక ఎడం ఎడంగా వుండిపోయిన రాధ ఇక బాగుండదనుకుని 'ఉండండీ రఘూ, మీకేం తెలుస్తుందీ.' అంటూ తనొచ్చి ఇద్దరి ప్లేట్ల ల్లోనూ సర్దింది.
    తలెత్తి నలుగురి వేపూ చూస్తె, ఏవి గోల చేస్తారో అన్నట్టుగా తలొంచుకుని గప్ చుప్ గా భోజనం చేస్తున్నాడు రఘు. అలా వున్నా వాళ్ళలో వాళ్ళేదో చెవులు కొరుక్కుంటూ , ఈలలు కొట్టి గొడవల్చేస్తూనే వున్నారు. అదివరకే పెళ్లై పోయిన వారూ, అటు పైన పెళ్లి చేసుకో బోతున్న వారూ, ఇంకా ఆరంభ స్నేహం లోనో హాయిని అనుభవిస్తున్న వారూ అయినా  విడి విడిగా కొంచెం దూరంగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ , భోజనం కానిస్తున్న కొన్ని జంటల్ని చూసి, మిగతా ఒంటరి సజ్జంతానూ-
    'మీ కుక్కు చాలా బాగా చేస్తాడే వంటా' అంది ఏదో ఒకటి మాట్లాడాలి కదా అనుకుంటూ రాధ.
    'అతడూ బాగానే చేస్తాడు లెండి గాని ఇవాళ ఇవన్నీ చీకటి తో లేచి, మా అత్తయ్యే తయారు చేసింది. ఆవిడ ఏ పని చేసినా, అందులో ఒక మంచి ప్రత్యేకత కనబరుస్తుంది.'
    'అత్తయ్యంటే?' ఎరిగుండే అడిగింది రాధ.
    'మా మేనమామ భార్య. అయన యుద్ద సమయం లో పోయారు.' తోడ మీది పుస్తకంలో పెజీల్తిరగేస్తూ అన్నాడు రఘు.
    ఇలా విడిగా వుండగా మాట్లాడ్డం అతని కిష్టం లేదని గ్రహించిన రాధ తనూ మౌనంగా భోజనం ముగించి, మళ్ళీ అన్నీ ఎప్పట్లా సర్దేసింది.
    చేయి కడుక్కునొచ్చి తన వద్ద నున్న వక్క పొడిని  అందరికీ పంచి పెట్టాక బెత్తం సజ్జ లో నున్న రంగు దుప్పటీ తీసుకుని, ఎటు వేపుగా పరుచు కోవడమా? అని నాలుగు వేపులా పరాకాయిస్తున్న రఘు కి ఒట్టి నేల మీద చెట్టుకి చేరగిలబడి కూర్చునున్న రాధ కనిపించింది.
    'మీరేమీ తెచ్చుకోలేదా?'
    'లేదు. ఏదో బంగాళ లో దిగుతున్నావని వీళ్ళంతా అనడంతో ఎందుకొచ్చిన మోత చేటని ఊర్కున్నా.' అంది చిరాగ్గా రాధ.   
    'నాకిటువంటి వన్నీ అయితే తెలియవు. ఇవన్నీ సుధే సర్దింది పాపం. అంటూ వెళ్ళ బోయిన వాడల్లా మళ్లీ 'అభ్యంతరం లేకపోతె మీరు దాన్ని వాడుకోండి.' అన్నాడు రఘు.
    'ఒద్దండీ, మీక్కావద్దూ.'
    'అబ్బే. ఏదో వుంది కదానని తీశాగా ని హాయిగా ఆ కొమ్మ మీది కెళ్లి కూర్చుంటా.' అంటూ ఆ దుప్పటి మదతని రాధ ముందు పెట్టేసి తను ఒక్క అంగలో పై కెక్కి వీలుగా వున్న ఒక పలక మీద కూర్చుని పుస్తకం చదువు కొనారంభించాడు రఘు.
    దుప్పటి ని చిన్న మడతగా పరుచుక్కూర్చుని తను వో పుస్తకం అందుకుంది గాని బుద్ది అందులోకి పోలేదు రాధకి.
    హు, ఆ జాన్, పుష్పా ఈ భారతీ వేదం వీళ్ళంతా ముందు ముందు ఎప్పుడో పెళ్లి చేసుకుందాం అనుకునే వాళ్ళయినా, ఎంత సరదాగా కలిసీ మేలిసీ కాలక్షేపం చేస్తున్నారో? అదీ ఆ కులాంతర వివాహాలకి వాళ్ళ పెద్దలు ఒప్పు కున్నప్పటి మాట ఇక ఆ రాజూ, జయంతీ వాళ్ళ సంగతి చెప్పనే అక్కర్లేదు ఏదో మెడికల్ లైస్ లో వున్నారు గనుక వాళ్ళ గుట్టు బయట పడ్డం లేదు, లేకపోతేనా?
    అయినా అంతలా వాళ్ళందర్లాగే వుండక పొతే పోయే కాస్త ప్రసన్నంగా , సరదాగా నన్నా వుండేందుకేం ఈ రఘుకి. ఏదో, మాట్లాడితేనే ఎక్కడ నోట్లో ముత్యాల్రాలిపోతాయో అన్నట్టుంటాడేప్పుడూ నూ, ఇంతకీ నేనేవన్నా లేనిచోట పుట్టిందాన్నా, కురూపినా, చదువు లేనిదన్నా, ఇష్టం లేదేమో అనుకుందుకన్నాను? పోనీ ఏవీ ఎరగని వాడేమో అంటే మళ్లీ అందరి తోటీ అంత సరసంగా కబుర్లు చెప్తాడు. ఇక నన్ను చూస్తె నేనా ఈ పరా ముఖం? ఏమిటో నేనూ ఎన్నెన్ని మార్లో పట్టించు కోకుండా ఊర్కుంటున్నా . అయినా , హు ఈపాటి భాగ్యానికి వారంతా వేళాకోళాలు కూడానూనా మమ్మల్ని చూసీ! ఏదో.... మొగుడు కొట్టినందుక్కాదు, తోటికోడలు నవ్వినందుకేడ్చానన్నట్టు నా బాధ వీళ్ళకేలా తెలియాలీ.....అనుకుని ఒక్కమాటు నాలుగు వేపులా మళ్లీ పరకాయించింది. విడి సజ్జంతా పెకాడు కుంటుంటే, తనిందాక వర్ణించు కున్న ఆ జంటలన్నీ, ఒకర్నొకరు తగిలీ తగల్నంత దగ్గరగా అక్కడా, అక్కడా కూర్చుని కిచకిచ లాడుకుంటున్నాయి. అది చూసిన రాధ ఒళ్లూ పులకరించి , పైకి చూసింది. ఒద్దనుకుంటూనే దీక్షగా పుస్తకం చదువు కుంటున్నాడు రఘు.
    ఇక ఒంటరిగా అక్కడుండడాని కిష్టం లేక శ్యామలా వాళ్ళ దగ్గర కెళ్ళి కూర్చుంది రాధ.
    'ఇక ఎన్నాళ్ళు లేవే. కాస్తో పీక పట్టు' అంటూ , దివాలా పడ్డట్టున్న రాధ న్చూసి హాస్యం చేసింది శ్యామల.
    'అంటే?' అర్ధంగా అడిగింది. శాన్నాళ్ళ బట్టి రాధనీ, రఘుని ఎరిగున్న రోహిణి .


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS