"అమ్మయ్ అవేవీ తినేటట్లు లేదు. బంగాళాదుంపలవేపుడూ, ముక్కలపులుసు చెయ్యండి. బ్రెడ్డుతో డబల్ కామీఠా చెయ్యండి" అని ఉన్నట్లుండి ఒక్కసారిగా మూలిగింది అహల్య "మ్ మ్మా!"
"అక్కా! నువ్వు ఇంకా ఎక్కువ ఆయాసపడకు. రెస్ట్ తీసుకో. పొద్దుటికి చాలావరకూ నయమయిపోతుంది నొప్పి" అంది రంగేలీ.
తల ఊపి, రంగేలీ భుజంమీద ఆసరాగా చెయ్యివేసినడుస్తూ, వెనక్కి తిరిగి సృజనకు సైగచేసింది అహల్య.
"నువ్వు కూడారా! సృజన!"
కొద్దిగా సంకోచించి, తర్వాత వాళ్ళ వెంట నడిచింది సృజన. అహల్య గది అందరి గదుల్లాగా కాకుండా చాలా స్పెషల్ గా ఉంది. పెద్ద పందిరి మంచం ఉంది. దాన్లో దానికి తలవైపూ, కాళ్ళవైపూకూడా అద్దాలు బిగించి ఉన్నాయి.
రెండుకొయ్యబీరువాలు ఉన్నాయి. వాటినిండా చీరెలు ఉన్నాయి. డ్రెస్సింగ్ టేబుల్ మీద ఖరీదయిన ఇంపోర్టెడ్ కాస్మెటిక్స్ చాలా ఉన్నాయి.
పడుకుని శాలువా కప్పుకుంది అహల్య. "అమ్మాయికి భోజనం తీసుకురా ఇక్కడే తింటుంది" అంది రంగేలీతో. ఆ తర్వాత కొద్ది క్షణాలకే ఆమెకళ్ళు నీరసంతో మూతలుపడిపోయాయి.
భోజనం వచ్చినా సరిగా తినలేదు సృజన. కొద్దిగా కెలికి వదిలేసింది. తర్వాత మంచంమీదే కూర్చుని ఆలోచిస్తూ తనకు తెలియకుండానే కలత నిద్రలోకి జారిపోయింది. మధ్యరాత్రిలో అహల్య లేచితనని సరిగా పడుకోబెట్టిశాలువా కప్పడం కూడా ఆమెకు తెలియదు.
మళ్ళీతెల్లవారుజామున మెలకువ వచ్చింది ఆమెకు. ఏడుపులు వినబడుతున్నాయి. మధుమతీ, భవానీ ఆపకుండా ఏడుస్తున్నారు. ఇప్పటికే ఎనిమిది మందయ్యారు. ఇంకొక్కడొచ్చినా స్పృహతప్పిపోతుంది. ప్రాణాలు పోతాయి. ఈ ఒక్క తప్పు కాచి మమ్మల్ని వదిలెయ్యమని అహల్య అక్కతో చెప్పు ఉస్మానూ!" అంటోంది మధుమతి.
జవాబుగా ఉస్మాన్ కర్కశంగా నవ్వడం వినబడింది.
వెంటనే కెవ్వుమని మధుమతి కేక!
"ఇప్పుడు ఒక్కసారే ఇద్దరా? చచ్చిపోతాము ఉస్మాన్! నిజంగానే చచ్చిపోతాను! నీమీద ఒట్టు!"
మళ్ళీ అతని నవ్వు. వాళ్ళఏడుపులు. కంటికీ మింటిక్ర్ర్ ఏకధాటిగా ఏడుస్తున్నారు వాళ్ళు.
తర్వాత వాళ్ళు పెడబొబ్బలు పెట్టడం వినబడింది.
"ఛస్తాన్రోయ్ దేముడోయ్! నన్ను వదిలిపెడితే చచ్చి నీ కడుపునా పుడతారా ఉస్మాన్! నన్ను వదిలెయ్యరా!"
ఆ తర్వాత ఆగకుండా ఆర్తనాదాలు.
లోపలికి వెళ్ళిన విటులుకాసేపటి తర్వాత బయటికి వస్తున్నట్లు అడుగుల చప్పుడు.
"రేయ్ రిక్షా రాజయ్యా! నువ్వెళ్ళరా! వాళ్ళ మదం అణచాలి!" అన్నాడు ఉస్మాన్.
కానీ ఈసారి వద్దువద్దని బతిమాలుతూ కేకలు వినబడలేదు.
ఎందుకంటే అప్పటికే మధుమతీ, భవానీ ఇద్దరూ స్పృహతప్పిపోయి ఉన్నారు.
అయినా లోపలికి వెళ్ళాడు రిక్షా రాజయ్య. నల్లగా, తుమ్మ మొద్దులా దృఢంగా ఉంటాడు అతను.
అతని వెనుకనే రౌడీ షీటరుజుగల్ కిశోర్, ఆ తర్వాత కొట్లాటం ఈశ్వర్, గుడుంబామాస్టర్ శ్రీనివాస్.
వాళ్ళువెళ్ళిరాగానే ఎల్లయ్య, పోచయ్య, యాదయ్య, నారయ్య, భిక్షపతి.
ఆతర్వాత జీవరత్నం, లాలూ ఖాదర్, షేక్ వలీ, ప్రకాశ్, సుదర్శన్.
ఇంకా ఎంతో మంది.
ఎంతోమంది.
ఒంటిమీద బట్టా, స్పృహలేకుండా శవాల్లాపడివున్న మధుమతీ, భవానీలతో రాక్షసరతి!
తెల్లవారుతుండగా వాళ్ళిద్దరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నిజంగానే శవాలుగా మారారు.
జారిపోతున్న గుండెతో అదంతా అర్ధం చేసుకుంటోంది సృజన.
తెల్లవారకముందే ఆ రెండు శవాలనూ ఎక్కడికో గప్ చుప్ గా చేరవేశారు అహల్య మనుష్యులు.
అవి అటుపోగానే రెండు జీవచ్చవాలు ఆ ఇంట్లో కొనిరాబడ్డాయి.
వాళ్ళు చిలకల చిన్నారావూ, కామాక్షి! భయంతో కలిగిన షాక్ లో ఉన్నాడు చిన్నారావు. కామాక్షి వలవల ఏడుస్తోంది.
వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నట్లు ఉన్న అహల్య లేచి కూర్చుంది.
అక్కడ ఏదో భీభత్సంజరుగబోతోందని తెలిసినా అదేమిటో ఊహించని సృజన.
భయకంపితురాలయిచూస్తూ ఉండిపోయింది.
5
చిలకల చిన్నారావు అహల్య గది గుమ్మంముందు నిలబెట్టాడు.
అతన్ని నిలువునా దహించేటట్లు చూసింది అహల్య. తర్వాత రంగేలీ వైపు తిరిగింది.
"వీణ్ణి ఏం చేస్తే బాగుంటుందీ రంగేలీ?"
"ఏం చేసినా పాపంలేదక్కా! కానీ నాకు ఒకటి తడుతోంది"
"ఏమిటది?"
"నువ్వు ఎంగిలి చెయ్యి విదిలిస్తేరాలిన ఎంగిలి మెతుకులు తిని బలిసి ఇంత మొనగాడయిపోయాడు చిన్నారావ్. అందుకని వీణ్ణి అసలు మొగాడిగానే ఉండనివ్వకపోతే రోగం కుదురుతుంది అక్కా!"
"అంటే?"
"నేనెట్టాబతుకుతున్నానో వీడూ అట్లాగే బతకాలి" అంది రంగేలీ కసిగా.
అర్ధమయింది అహల్యకు.
అంటే చిలకల చిన్నారావుని కూడా రంగేలీలా కొజ్జాగా మార్చెయ్యాలి.
జన్మతః నపుంసకులుగా పుట్టేవాళ్ళెంతమంది ఉంటారో, బలవంతంగా నపుంసకులుగా మార్చబడేవాళ్ళు కూడా అంతమంది ఉంటారని చెబుతారు.
ఆలిస్టులోకి చిన్నారావునికూడా చేర్చాలి ఇప్పుడు.
చిన్నారావుకి నిలువుగుడ్లు పడ్డాయి.
"అహల్యక్కా! వద్దక్కా!" అన్నాడు భయకంపితుడై.
అహల్య మాట్లాడకుండా ఉస్మాన్ కి సైగ చేసింది. ఉస్మాన్ మోటుగా చిన్నారావు భుజంమీద చెయ్యివేశాడు.
"చల్ బే!"
వెంటనే చిన్నారావు శోకం పెట్టాడు. "రేయ్ ఉస్మాన్! నేను నీకు ఇరవయ్యేళ్ళ నుంచి స్నేహితుడినిరా! నన్ను పౌనీ ఆఠ్ని చేసెయ్యకురా! ఉస్మాన్ భయ్! వద్దురా!"
ఉస్మాన్ అతన్ని నెట్టుకుంటూ తీసుకెళ్ళిపోయాడు.
