Previous Page Next Page 
అతని లక్ష్యం పేజి 20


                                     8
    అన్నింట్లకన్నా, అతన్ని మరీ బాధిస్తున్నది ఎప్పుడూ తన కళ్ళ ముందే తిరుగుతుండే రాధ సౌందర్యం. ఒక్కొక్కసారి తన మనసుని బొత్తిగా నిభాయించు కోలేని సమయాల్లో ఆ విశ్వామిత్రుడి తపస్సు ని నాశనం చేసేందుకు కొచ్చిన మేనక లాగ నా లక్ష్యాన్ని సర్వనాశనం చేసేందుకే , రాధ గాని దాపురించిందా ఏం ఇక్కడ-- అని కూడా విసుక్కుంటూ ఉండేవాడు రఘు.
    లేకపోతె నాలుగేళ్ళ పాటూ ఎన్నెన్ని అవాంతరాలోచ్చినా అతి సునాయాసంగా దాటుకుంటూ సాగించిన తన పట్టుదల రాధ వచ్చాక ఈ రెండేళ్ళ బట్టే, ఇలా దిగజారుతుండడం ఎందుకూ.
    రాధని తొలిసారిగా రఘు తమ ఇంట్లో చూసినపుడు ఒంపు సోంపు ల్తో వయ్యారంగా తిరుగుతున్న రాధను చూసి 'హు' తన అందాన్ని చూసి వశులు కాని వారంటూ వుంటారా, అని గామల్సు ఈ పిల్ల నిబ్బరం' అనుకుని ఒక విధంగా రాధని ఏవగించు కున్నాడు రఘు. అయితే అరూపమే , తిప్పించి , మళ్ళించి తరుచూ మళ్లీ తన మనసుని గిలిగింతలు పెడుతూండడం , అందు ఫలితంగా తనలోని స్థిర భావం చంచలమవుతుండడం గ్రహించిన రఘు,' దైవ సృష్టి ని నిభాయించాలను కోవడం లో ఎంత ఇబ్బందుంది' అనుకుంటూ అతి ప్రయత్నంగా రాధ రూపాన్ని తనలో తోచనివ్వ కుండా ఎప్పటి కప్పుడు తుడి చెయ్యసాగాడు.
    ఈ ప్రయత్నం లో అతడు కృతార్ధుడవుతుండేలోగా ఇంతలో మళ్ళీ శాశ్వతంగా అతని ఎదుటే వుండేటందుకు రాధ రానే వచ్చేసింది. ఈసంగతి తెలియడంతోనే తను మరో హాస్పిటల్ కి మార్చేసుకోవాలని అనుకున్నాడు రఘు. అయితే ఇక్కడి వారంతా తనని వదిలి పెట్టేందు కొప్పుకుంటే గా , అదీ గాక తన మనసును తను నిబ్బరం గా వుంచు కుందుకు చేతకాక ఇందుకు జడిసి దుర్బలుల్లాగా పారిపోవడమా? అన్న రోషమూ కల్గింది అతనికి. అందుకనే తన మనసు మీద తనకే అంత నమ్మకం లేకపోతె తనిక ఎందుకు పని కొచ్చేటట్లూ , అనుకుని అక్కడే ఉండి పోయాడు రఘు. అదీగాక ఎవ్వరేలా అనుకున్నా రోష పడకుండా వీలైనంత వరకూ రాధకి తను దూరంగానే వుంటూండాలన్నది అప్పుడే తీర్మానించు కున్నాడు రఘు. అందుకే ఎంతకెంత రాధ తనకి సాన్నిధ్యం లో వుండాలనికుని ప్రయత్నించేదో అంతకంతకూ తను తప్పించుకుని ఎడవేడంగా తప్పుకుంటూ ఉండేవాడు రఘు.
    అయితే పైకి తనిలా ఎంత గంబీరంగా మసులుకున్నా, మనసు మాత్రం లొంగకుండా ఏవేవో మధురభావాల్ని సృష్టించి ఒళ్లు పులకరింపజేయిస్తూ పల్టీలు కొట్టిస్తుండేది తనని. అటువంటప్పుడు తను మరి కొంత పట్టుదలని పుంజుకుంటూ ఆ స్థానం లో తన సుధని పీల్చుకుని ఆప్పటప్పటికి ఆ గండం నుండి బయట పడుతూండేవాడు రఘు.
    మొత్తానికి ప్రకృతి నియమాల్తో పోరుతూ, ముందుకి సాగడమన్నది అటువంటి వాతావరణం లో వున్న తనకి ఇదొక గుండెల్లో గుడ్డులాటే ఆనుకుంటూ ఎలాగో కాలక్షేపం చేస్తున్న రఘు కి ఈ రాధ రాక మరింత తీవ్ర మనో పోరాటాలకి గురి చేసిందనే చెప్పాలి.
    ఎన్ని మార్లో ' ఆపరేషన్' బోర్డు వద్ద తన కతి సమీపంలో రాధ నిలబడుతుండడం , ఏవన్నా పరికరాల్ని అందించే నిమిత్తం గా, చెయ్యి చెయ్యి తగులుతూండడం , అటువంటి సమయాల్లో ఏదో అర్ధం కాని అనుభూతి అతన్ని ఏ లోకం లోనో, సంచరించేటట్టు చేసేది. అయితే ఆ పరిస్థితి కొన్ని క్షణాల కాలం మాత్రమే. అంతలో తను యధాస్థితిని గుర్తించు కునేవాడు రఘు.
    స్టూడెంట్స్, చికిత్స కోసరం వచ్చే వారూ, డాక్టర్లూ, ఇలా కొందరు జంటలు , జంటలు గ స్కూటర్ల లోనూ, కార్ల లోనూ, కాలి నడకనీ నవ్వుకుంటూ కేరుకుంటూ, ప్రతి రోజూ వస్తుండడం చూసినప్పుడల్లా సుధతో తను గడపాల్సున్న కాలాన్ని తల్చుకుని నిరుత్సాహ పడి పోయేవాడు రఘు.
    గుర్రాన్నీ, గాడిద నీ, ఒకే బండికి కట్టినట్లుంటుందేమో తమ సంసార జీవితం -- అని బాధపడేవాడు కొంతసేపు. మళ్లీ అంతలోనే ఆరోజు పాత వీణని శృతి చేస్తూ సుధ అన్న మాటలు గుర్తుకు రావడంతోనే నిజంగా అసలైన సుఖం అటువంటి స్వశక్తి మీద సృష్టించు కున్నప్పుడే కల్గడం, అనుకుని సర్దుకుంటుండేవాడు.
    మొత్తానికి మొదట్లో ఎప్పుడో కల్గుతుండే ఈ కలవరం తరవాత్తారవాత అప్పుడప్పుడూ కదుల్తూ ఇప్పుడు తరుచూ తనని వివశుడ్ని చేసేస్తుంది. 'అయినా ఇది తన తప్పా, రాధ తప్పా? లేక ఇటువంటి అర్ధం మాలిన మమతల్ని పుట్టించి మనసులోని సంకల్పాన్ని తారుమారు చేసి ఆనందిస్తుండే విశ్వకర్త తప్పా అనుకునేవాడు రఘు.
    పొద్దున్న హాస్పిటల్ కెళ్లి కొన్ని 'ఔట్ పేషెంట్స్ ' కేసుల్ని పరీక్ష చేశాక పెద్ద డాక్టర్ తో కలిసి ' రౌండ్స్' కెళ్ళి వచ్చిన రఘు డాక్టరు పురమాయించిన కొన్ని ముఖ్య పనుల మీద దబదబా మేడ మీది కేళ్తున్నాడు.
    'ఇంతసేపూ మీ కోసరమే వెయిట్ చేశా డాక్టర్' అంది గబగబా పై నుంచి దిగోస్తూ మెట్ల మలుపులో తారసపడ్డ రాధ ఆదుర్దాగా.
    'ఏం ఎందుకూ' అన్నట్టుగా మొహం ఎగరేశాడు రఘు.
    'మొన్న ఆపరేషన్ అయిన ఆ ఆరో నెంబరు -- ఒకటే ఆయాస పడుతున్నాడు డాక్టర్. మీపెర్చేప్పి !'' డాక్టర్ ఇంకా రాలేదా' అంటూ లేచిం దగ్గర్నుంచీ ఒకటే గొడవ' అంది గుక్క తిప్పుకోకుండా.
    'బ్లాక్ ఎయిట్ ' లో వార్డు సి లో వున్నతనేనా.
    'ఔను డాక్టర్.'
    'కడుపేవన్నా ఉబ్బసంగా వుందా'
    'కొద్దిగా యూరిన్ పాస్ చేయించి చూశా కూడా.'
    'అయితే గాస్ ట్రబుల్ అయ్యుంటుంది. ఈ మెడిసిన్ ఒక డోస్ ఇవ్వండి' అన్నాడు దబ్బున తన పేంటు జేబులోని చిన్న పుస్తకం లో ఏదో మందు పేరు రాసి అ కాయితాన్ని చింపి అందిస్తూ.
    'ఇస్తా గాని మీరోసారి వచ్చి చూసేసి వెళ్తే కాస్త అణుగుతాడెమో , పోద్దుట్నుంచీ అందరినీ అప్పగింతలు స్తున్నాడేకంగా' నవ్వుతూ అంది రాధ.
    ఉట్టి హడావుడి మనిషి. 'నేనిప్పుడటు వేపుగా పనిగా వెళ్తున్నా చూస్తాలెండి.'
    'అన్నట్టు ఆ డి.ఎమ్. సి. కేసులు సిద్దంగా వుంచెం. కిందికి పంపించమంటారా!'
    'వద్దు. ఈ ఉదయాన్నే గొప్ప బస్సు ప్రమాదానికి గురై , చెయ్యి విరిగిపోయిన ఒక కేసుకి ఇప్పుడు పెద్దపరేషన్ జరుగుతుంది. అది అయ్యాక ఇవి చూద్దాం , మీరూ వస్తారా?'

                   
    'ఏ దియేటర్లో.'
    'నెంబరు డి.'
    'ప్రయత్నిస్తా.' వెళ్ళిపోయింది రాధ. స్టేత స్కోప్ ని విలాసంగా తిప్పుతూ ఎడమ కాలు కుడి కాలి మీద నుంచీ పక్కకు మళ్ళించి బొటన వెల్ని నేలకాన్చి బాలకృష్ణుడి ఫోజులో నిలబడి మాట్లాడుతున్న రఘు సౌందర్యాన్ని తల్చు కుంటూ రాధ మెట్లు దిగి కింది కెళ్ళి పొతే, ఉల్లి పోర వంటి తెల్లచీరే కట్టుకుని కొత్తరకపు చుట్ట చుట్టూ కుని టకటకమంటూ లేడిపిల్లలా మెట్లు దిగి వొచ్చిన రాధ అందాన్నే తలచుకుంటూ పై కెళ్ళి పోయాడు రఘు. ఇటు వంటి సంఘటనలు తరచూ జరుగుతుండడం పరిపాటే.

                            *    *    *    *
    శాంత రాకకోసం రోజులు లెక్క పెట్టుకుంటూ కూర్చున్న సుధకీ, శాంత వొచ్చిన కొద్ది రోజులకే ఎక్కడి సంతోషం అక్కడ మాయమై వూర్కుంది. కేవలం పల్లెటూర్లో పుట్టి పెరిగిన శాంతకి గౌరవం అంటే ఏమిటో సభ్యతంటే ఏమిటో మచ్చు క్కూడా తెలిసున్నట్టు అనిపించదు సరికదా గోప్పవారింటి కోడళ్ళన్నా పట్టణ వాసులన్నా, ఎంతో గర్వంగా నూ, నిర్లక్ష్యం గానూ ప్రవర్తిస్తూండాలనుకునే మూర్ఖత్వం గలది. అందువల్ల జానకీ, సుధల్ని ఏదో నిర్లక్ష్యంగా చూస్తుండేది.
    ఇంటికొచ్చిన ఇరుగు పొరుగు వారితో సుధ సహజంగా మాట్లాడడం చూసి, 'ఛా! అడ్డమైన వాళ్ళనీ సోఫాల మీద కూర్చో పెట్టి . ఏమిటా మాటలూ' అనేది. కాయకూరలూ, పువ్వులూ ఇలాంటివి అటూ ఇటూ వృధా కాకుండా జాగ్రత్త గా సుధ యెత్తి పెట్టిందంటే 'ఏమిటా లేకి పన్లూ ఇవన్నీ అవతల పారెయ్యి' అంటూ 'పాపం పనిమనిషి పట్టు కేళుతుందక్కయ్యా' అని సుధ అంటున్నా వినిపించుకోకుండా విసిరి పారేసేది.
    ఎంతసేపు మేడ మీదే కూర్చోనూ, ముస్తాబులు చేసుకోనూ, ఇంతే తప్పితే అందరి తోటీ కలిసిమెలిసి పనిపాట్లు చెయ్యడం గానీ, మంచి వ్యాపకాల్తో కాలం గడపడం గానీ ఇటువంటివేవీ పనికొచ్చేవి కాదు శాంతకి. ఏదో మేనమామ కూతురుమ పిల్ల అందంగా ఉందనీ తల్లి మాట తోసి వేయలేక చేసుకున్నాడే గానీ, ఈ మనిషి తో ఎలాగా అందులోనూ- అన్నివిద్య లుండి ఇంత విధేయతతో మసులుకునే జానకీ, సుధా , వాళ్ళ మధ్య, ఈ భార్యతో ఎలా నిర్వహించుకు రావడమా! అన్న బెంగే పట్టుకుంది రామానికి.
    ఇంతకీ శాంత చేస్తున్న చేష్టలేవీ ఎవ్వరూ రామానికి తెలియనివ్వడం లేదు. అయినా తనంతట తానూ చూసిన కొన్ని కొన్ని విషయాలకే, రామం మనసు ఎంతో నొచ్చుకుని, అలా కొన్ని నెలలయ్యే సరికి,
    'దాన్ని దోవలోకి తెచ్చి కాస్త పుణ్యం కట్టుకోలేవా అత్తయ్యా' అని చివరికి జానకిని ప్రాధేయ పడేవాడు రామం.
    అయితే , వాళ్ళని చూస్తేనే, ఏవగించు కుంటూన్నట్లు మొహం పెట్టె శాంతతో జానకి ఏ విధంగా పరిచయ పడగలదని? పాపం సుధ మాత్రం తనని విసుక్కున్నప్పుడు మాత్రం రెండు రోజులు పాటు మౌనంగా ఊర్కున్నా, మళ్లీ తనంతట తనే శాంత ని పల్కరిస్తూ వుండేది. శాంతతో పరిచయం కోసరం అలేత హృదయం ఎప్పుడూ తహతహ పడుతుండేది.
    ఒకరోజు శాంత రామంతో సినిమాకు వెళుతున్నట్టు తెలిసి తన నేర్పంతా చూపిస్తూ చక్కని పూల మాల కట్టి శ్రమని కూడా లెక్క చెయ్యకుండా అన్ని మెడ మెట్లూ ఎక్కి వెళ్లి శాంత గది తలుపు కొట్టింది సుధ.
    కసురుకుంటూ వచ్చి తలుపు తీసిన శాంత. 'ఇందా అక్క' అంటూ సుధ అందియ్య బోయిన మాలని చూసి కనుబొమలు ముడేస్తూ , 'ఛా, గొబ్బిళ్ళకు పెట్టినట్టు. ఇవేం పువ్వులూ, నాకొద్దు.' అంటూ ఫెడీమని మళ్ళీ తలుపు వేసేసుకుంది. అనాట్నుంచీ సుధ ఇక అటు వంటి ప్రయత్నాలే మానేసింది పాపం.
    పాపం అనాలేక మానాలేక బాధపడుతుండేవారు పార్వతమ్మ గారు.
    ఆరోజు సాయంత్రం ఎవరో కొందరు ముఖ్య స్నేహితులు శర్మ గారింటి రానున్నందువల్ల , సర్దులూ, సవరింపు ల్తోటి ఇల్లంతా ఏక హడావిడి గా వుంది. ఇంట్లో వున్న ఈపనుల నుద్దేశించి త్వరగా ఇంటికొచ్చిన రామం తిన్నగా లోపలి కెళ్లి  జానకి స్వయంగా తయారించిన కొత్త కొత్త రకపు స్వీట్సు నీ, శంకరయ్య అతి నేర్పుగా తయారించిన మిక్చర్ వగైరా లనీ అడిగి రుచి చూసి మెచ్చుకున్నాక, అక్కడ్నుంచి తిన్నగా మేడ మీదున్న తన గదికి వెళ్ళాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS