Previous Page Next Page 
ప్రేమకు పగ్గాలు పేజి 2


    "మంచి పనే చేశావ్..... రాలేదేమోనని కోపం తెచ్చేసుకున్నాన"న్నాడు బోలెడంత ఆనందంతో భాస్కరం.
    "సురేఖ మా ఫ్రెండు..... గొప్ప గడుగ్గాయి. ఆటలంటే ఫస్టు....." పరిచయం చేసింది పద్మ.
    ఆ క్షణం కోసరమే ఎదురు చూస్తున్నట్టు సురేఖ "నమస్కారమండీ" అన్నది.
    అని వెంటనే "మీరు రారేమోనని మా పద్మం ఎంత ఇధైందనుకున్నారు?" అన్నది చనువుగా.
    చాలా చలాకీగా ఉంది సురేఖ. ఒక చేతికి వాచీ మరో చేతికి రెండే గాజులు వేసుకుంది. నుదుట బొట్టు ఉందో లేదో, భాస్కరం గమనించలేక పోయేడు. ఆ పిల్ల నడుం మరీ సన్నంగా ఉంది. మెడలో ఒక్క నగ లేదు. ఓ విధంగా చెప్పాలంటే బ్యాక్ లెస్ జాకెట్ వేసుకుంది. ప్రయాణంలో నలిగినప్పటికీ, అంత బడలికలోనూ ఉత్సాహంగా ఉంది. పొడుం - రంగు చీరె సిల్కు దయినా, భుజం మీంచి జారని పయిట వేసుకుంది.
    "మరి, మీరు భోజనం, ఫలహారం యేమీ చెయ్యరూ?...... ఆ గుంటూరు-ఫ్లాట్ ఫారం మీదికి వెళ్ళాక ఏం దొరకదు." కూలివాడి విసుగు మొహం చూసి కొంచెం తొందరపడ్డాడు భాస్కరం.
    "నాకేం ఒద్దుబాబూ! ఇంటి కెళ్ళిపోతాగా" అంది పద్మ.
    "తోవ కడాకూ ఇదేనండీ వరసా! ...... తిండి వద్దంటుంది. మళ్ళీ ఉద్యోగం చేస్తుందిట రేప్పొద్దుటా" సురేఖ నవ్వింది పద్మని అనురాగంతో చూసి.
    "పదండి; ఈ సామాను వెయిటింగ్ రూమ్ లో పెట్టిస్తాను. యూ కెన్ టేక్ మీల్స్...." అన్నాడిద్ధర్నీ ఉద్దేశించి.
    భాస్కరాని కా క్షణంలో ఏనుగంత బలం, కొండంత ధైర్యమూ ఉన్నాయి.
    "నో...... నో..... నేనీ ఊళ్ళోనే ఉండిపోతున్నా..దానికే భోజనం....." సురేఖ వారించింది.
    "ఔనండీ! సురేఖ వాళ్ళ "ఆంటీ" గారి దీ వూరే.....అక్కడికే వచ్చింది గాంధీనగరంలోనట" చెప్పింది పద్మ.
    "ఏమయితే నేం? ససేమిరా నే నా రద్దీలో ఏమీ తినలేను బాబూ...." అని హరం-పట్టింది పద్మావతి.
    "అంతగా ఐతే సురేఖ, నేనూ కాఫీ తాగుతాం....అదీ, ఆరో నంబర్ ఫ్లాట్ ఫారంమీద - ఉండదా ఏం?" అన్నది పద్మావతి.
    భాస్కరం బలవంతం చేయలేకపోయాడు.
    సురేఖ పెట్టె, పద్మ పెట్టె కూడా, ఆరో నెంబరు ఫ్లాట్ ఫారం మీద ఉస్సురని పడివున్న గుంటూరు రైల్లో; ఖాళీగా ఉన్న ఆడవాళ్ళ పెట్టెలో పెట్టి తన పని ముగించుకున్నాడు కూలివాడు.
    సురేఖ మాటల సందడిలో అది గమనించనే లేదు. కూలివాడికి డబ్బులిచ్చి వాడిని పంపించడంలో ముగ్గురూ పోటీపడ్డారు.
    చివరికి ఆ పోటీలో భాస్కరమే నెగ్గాడు. అటుతర్వాత అడావుడిగా వెళ్ళి, ఏమీ తేలేక, అరటి పళ్ళలాంటి ఓ అరడజనూ, కోవా బిళ్ళలని చెప్పేవి ఉండే ప్యాకెట్లూ, ప్యారీ కంపెనీ స్వీట్లూ పట్టుకొచ్చేడు.
    సురేఖ నవ్వుతూ "మొత్తానికి పద్మని చంటి పిల్లని చేసేశారం"ది.
    "నో నో..... మొదటే మనవి చేసుకున్నాను.....మరీ హఠంలో; పడితే ఏం చేయను? .... మీకోసరం కూడా అవే తెచ్చాను....." భాస్కరం సాధ్యమయినంత నవ్వుమొహం పెట్టేడు.
    కాని అతగాడికి పద్మావతి పీక్కుపోయిన కళ్ళల్లోకి చూస్తే ఒళ్ళు మండిపోయింది; ఉదయంనుంచీ "మాడు"తూ ఉండి ఉండాలి.
    "మేఉ ఉదయంనుంచీ ఉపవాసం చేస్తున్నారు కదూ?" కోపంగానే అడిగేడు.
    "చిత్తం" అన్నది పద్మ అరటిపండు ఒలుచుకుంటూ.
    "ఇదో ఈ రాణీగారివల్లే .... లేకపోతే నేను దర్జాగా రాజాలా భోజనం చేద్దును...." సురేఖ ఉరిమి చూసింది స్నేహితురాలిని.
    "పోనీ ఇప్పుడెందుక్కూడదూ!" పద్మ, భాస్కరం కేసి కొంటెగా చూసింది. సురేఖ గభుక్కున రైలు దిగిపోయింది.
    "ఇంకా నయం; గుంటూరు రమ్మన్నావ్ కాదు? మా దొడ్డమ్మ ఛంపేస్తుంది ..... కని పెట్టుకుని ఉంటుందం"ది నవ్వుతూ.
    రైలు కూసింది.
    "అయ్యో! నా సూట్ కేసే పద్మా.....మనం చూసుకొనే లేదు......అదో అదేం నీ సూట్ కేస్ క్రింద" నన్నది సురేఖ.
    పద్మ "అయ్యో! సారీ" అని అందివ్వబోగా భాస్కరం గభిక్కున వారించి:
    "డోంట్యూడూ ఇట్" అంటూ, తానే దింపాడు. అతగాడు చెయ్యి వూడిపోయినట్లు నటించడంతో "ఓ! సారీ, ఓన్లీ ఇంగ్లీష్ బుక్స్" అన్నది సురేఖ.
    "అంతేనా లేక "సీస"వచ్చు లేమేనా తెస్తున్నారా?" నవ్వేడు భాస్కరం.
    అంతలో రైలు కదుల్తానని కదిలి వూరుకుంది.
    "అయితే పద్మా! ఇంటి కెళ్ళి భోంచేస్తానంటావు?" బాస్కరం ప్రశ్న.
    "ఉత్తరం రాస్తా"నని పద్మ జవాబు.
    "పద్మా! ఈ రైలు గుంటూరు ఈ రాత్రికి చేరాలి గాక అని ప్రార్ధించు" అని కేకేసింది సురేఖ.
    "తారీఖు మారనివ్వదులే...." అని పద్మావతి అంటూన్నప్పటికీ, ఆమె కళ్ళన్నీ భాస్కరం మీదనే ఉన్నాయి.
    భాస్కరం రైలు వెళ్ళిపోయేదాకా చూస్తూనే ఉన్నాడు.
    "మీ దొడ్డమ్మగారి ఇల్లెక్కడన్నారు?" భాస్కరం బ్రిడ్జి మెట్లెక్కుతూ అడిగేడు.
    "గాంధీ-నగరంలో నండీ....."-
    బహుశా సురేఖ, భాస్కరం గురించి పద్మావతి ద్వారా చాలా విని ఉండాలి : ఆమె పొగడ్తలకు, అలంకారాలకు ఏమాత్రం తూగగలడా? ఇతగా డన్నట్లున్నా యామె చూపులు.
    "అచ్చా! నేను ఇటు హనుమాన్ పేటలోకి వెళ్ళాలి.....అక్కడిదాకా రావా!" అడిగాడు మర్యాదగా భాస్కరం.
    "అబ్బే! అక్కర్లేదండీ! రిక్షాలో వెళ్ళడం నా కలవాటే- మా 'లేట్ అంకుల్' మీరు ఎరిగే ఉంటారు; జగన్నాధరావుగారు చాలా కీర్తి ఉన్నలాయరు. మా ఇల్లందరికీ తెలుసు."-
    "ఆఁ ఆఁ వినే ఉంటాను లెండి......"    
    గేట్ దగ్గర భాస్కరం ఫ్లాట్ ఫారం టిక్కెట్టు ఒక్కటీ పడేడంతో; టి.సీ. అప్పటిదాకా ఆ ఇద్దరి మీద ఉన్న అభిప్రాయం మార్చుకున్నాడు. "కిహి క్కిహీ" మని దగ్గేడు-
    "రిక్షా!" అని కేకవేసి సురేఖ ఎక్కి కూర్చున్న తర్వాత "గుడ్ నైట్!" అన్నాడు భాస్కరం.
    "పద్మకి ఉత్తరం రాయండి ...... నా పేరకూడా ఓ కార్డు రాయమని...." సురేఖ నవ్వుతూ చెప్పింది.
    "సరిపోయింది! ఆ రికమండేషను మీరే నాకు చెయ్యండి." - రిక్షా 'క్రీంగ్ రింగ్' మని వెళ్ళిపోయింది.
    స్టేషన్నుంచి గాంధీనగరం మీదుగా గవర్నరు పేటకి వెళ్ళే రోడ్డు ఎప్పుడూ సందడిగానే ఉంటుంది గానీ, రాత్రి పదిగంటల తర్వాత సందడి వేరు.
    రిక్షాలు తప్ప మరో బాపతు బళ్ళు అగుపించవు.
    భాస్కరంల్లాంటి యువకులను పదేళ్ళు నిండని పసికందులు "రూమ్ కావాలా?" - "అయ్యా! హోటల్ కావాలా?" అని అడగడం భాస్కరాని కేం కొత్త గాదు.
    పదేళ్ళ కుర్రాడు ఈల-వేసి, కన్నుగొట్టి - పలకరించి తన పడక సౌకర్యం గురించి భోగట్టా చెఇస్నప్పుదు భాస్కరంలాంటి యువకులు విసుక్కుంటే తప్పుకూడా లేదు.
    కాని భాస్కరం విసుగుతోబాటు సిగ్గుకూడా పడతాడు. అదే ఆశ్చర్యం.
    భాస్కరానికి సురేఖ రిక్షా వెళ్ళిపోయినా తర్వాత భయంకరమైన ఆలోచనలు వచ్చేయి.
    సురేఖ ఎవరు తనకి?
    'పద్మా ఫ్రెండు'- అంతేనా! సురేఖ ఈ దేశంలో మర్యాదస్తులమని గర్వపడే కుటుంబంలోనించి వచ్చిన ఆడపిల్ల. సురేఖతో తన భయం వ్యక్తపరుస్తే ఏమంటుంది?
    నవ్వుతుంది......"మమ్మల్ని మీరు "ఇన్ ఫీరియర్"గా చూడకండి ..... ఆ మాత్రం స్టేషన్ నించి ఇంటికి వెళ్ళలేకపోతే ఎలాగం"టుంది.
    భాస్కరం పద్మ గురించి ఇల్లు సమీపించే వరకూ ఆలోచించలేకపోయేడు.
    బెజవాడ బాగుచేసే బాహ్ద్యత అంతా తనమీదే ఉన్నట్లు బాధపడ్డాడు. అంతలో ఇల్లు వచ్చేసింది. ఇంటికి పోవటమంటే బెంగగానే ఉంది. బాజారంతా తిరిగి, బాగా పొద్దుపోయాక ఇల్లు చేరాను.
    వెళ్తూనే కుర్చీలో వాలిపోయాను.
    ఆమె నవ్వుతూ ఎదురైంది.
    నా నుదురు ముడతలు పడింది.
    ఏదో చెప్పబోయి, ఆమె ఆగిపోయింది.
    ఆమె చెప్పేది నాకు తెల్సు. వినటం ఇష్టం లేక మొహం తిప్పుకున్నాను.
    ఆమె కుశల మడిగింది.
    తలనొప్పిగా ఉందన్నాను.
    జ్వరముందేమోనని చెయ్యివేసింది.
    నేను నవ్వబోయి ఊరుకున్నాను.
    తర్వాత కాస్సేపు మురిపించుకుని, విస్తరి పూర్తిచేశాను.
    గదిలో నేను పేపరు చూస్తుండగా, ఆమె వచ్చి ఎదురుగా కూచుంది.
    "మీ కిక శ్రమివ్వ దల్చుకోలేదు..... నేను కథ పంపించాను." అందామె.
    కొన్ని క్షణాలు విస్మయంలో ఉండిపోయాను.
    ఆ మాటలు ఒకసారి నెమరు వేసుకున్నాను. నమ్మటానికి మరికొన్ని క్షణాలు పట్టింది.
    ఇంకా నాకు ఆశ్చర్యంగానే ఉంది.
    "అవును, నిజంగా పంపించాను."
    ఆమె కథ రాసింది!
    నాకు కలగా ఉంది; కాని కల్లకాదు.
    నా ఉత్సాహాన్ని దాచుకోలేకపోయాను!
    "కథ పేరేమిటి?" అని ప్రశ్నించాను.
    ఆమె బదులు చెప్పకుండా నవ్వింది. జవాబు కోసం నే నెదురు చూస్తున్నాను.
    నాలో ఉత్సాహం, ఆశ్చర్యం మిళితంగా ఉన్నాయి.
    ఆమె నెమ్మదిగా అంది : "స్వర్ణలతా" అని.
    తెల్లబోయాను.... ఆమె కింత ఆలోచన కలిగినందుకు వింతగా ఉంది.
    "ఆ కథ నీ కెలా నచ్చిందీ?" ఆ కథేమిటో కాస్త గుర్తుకు రాగానే ప్రశ్నించాను.
    "పక్కింటాయన చదివి బాగుందన్నారు.....అతనే పోస్టుచేశారు."
    
                               *    *    *

    ఒక వారం గడిచింది.
    ఆ సాయంత్రం ఇంటికి హిరిగి-వస్తూ మార్కెట్టులో మల్లెలు చూశాను.
    తెల్లటి పువ్వులు నాకు ప్రీతి. వాటి పరిమళం ఒక ప్రత్యేకత.
    తలుపు తీస్తూండగనే పొట్లం కనిపించేలా పట్టుకున్నాను...... గమనించనట్టు ముభావంగా వెళ్ళిపోయిందామె.
    "పువ్వులు తెచ్చాను." ఆమెకు వినిపించాలని గట్టిగా అన్నాను.
    బదులు రాలేదు.
    వంటగదిలోకి వెళ్ళి మళ్ళీ చెప్పాను.
    కనీసం నన్నామె చూడనైనా లేదు.
    నేను మౌనంగా గదిలోకి వచ్చాను.....కారణం ఊహిస్తున్నాను.
    బహుశా, అతని కథ మరొకటి పడేలా ఉంటే, నేను ఇల్లు మారిపోవటం మంచిది. ఆ పరిసరాలు నాకు సరిపడవు.
    దుస్తులు మార్చుకుంటూండగా, టేబిలు పైన ఒక ఉత్తరం కనిపించింది. గదిలోకి రాగానే ఎదురుగా కనిపించే పద్ధతిలో ఉంది.
    అది పత్రికాసంపాదకులు రాసిన ఉత్తరం.
    అనుమానిస్తూ చిరునామా చూశాను. నా పేరున ఉంది.
    "సాధ్యమైనంత త్వరలో మీ కథను త్రిప్పి పంపటానికి ప్రయత్నించగలం."
    ధన్యుణ్ణి!
    తాత్కాలికమైన విశ్రాంతి లభింపజేసినందుకు సంపాదక మహాశయులకు నేను నిజంగా ఋణపడి ఉన్నాను.

                                   *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS