హ స్తా ధ్యా య ము :-
శ్లో!! అధేధానీంతు హస్తానాం, లక్షణాని యధాక్రమమ్ !
అసంయుతాస్సంయుతాశ్చ నృత్యహస్తాస్త్రిధామతాః !!
తా: హస్తములు అసంయుతములని, సంయుతములని నృత్త హస్తములని మూడు విధములు.
అసంయుత హస్తములు :-
పతాకస్త్రి పతాకొర్ధ పతాకః కర్తరీముఖః
మయూరశ్చార్ధ చంద్రశ్చా, పర్యాళ శుకతుండకః
ముష్టిశ్శిఖర సూచ్యాస్యః, కటకాముఖః
బాణస్సర్పశిరః, పద్మకోశో మృగశిర స్తధా
లాంగూల స్సింహవదనశ్చ. తురశ్చాలపల్లవః
హంసాస్యో భ్రమరోహం సపక్షశ్సందంశ ఇత్యపి
ముకుళస్తామ్రచూడశ్చా, సంయుతాః కధితాః కరాః !!
ఏతేసప్త వింశతిర సంయుతహస్తాః, పూర్వచార్యోదితాః
తేషాం లక్షణ వినియోగౌకధ్యతే !!
తా: 1 పతాక, 2 త్రిపతాక, 3 అర్ధపతాక, 4 కర్తరీముఖ, 5 మయూర, 6 అర్ధచంద్ర, 7 అరాళ, 8 శుకతుండ, 9 ముష్టి, 10 శిఖర, 11 కపిద్ధ, 12 సూచ్యాస్య, 13 కటకాముఖ, 14 బాణ, 15 సర్పశిర, 16 పద్మకోశ, 17 మృగశిర, 18 లాంగూల, 19 సింహముఖ, 20 చతుర, 21 అలపల్లవ, 22 హంసాశ్య 23 భ్రమర, 24 హంసపక్ష, 25 సందంశ, 26 ముకుశ, 27 తామ్రచూడము అని ఇరువది ఏడు ఆసంయుత హస్తములు నాట్యాచార్యులుచేత చెప్పబడియున్నవి. ఇంక లక్షణ వియోగములు తెల్పుదును.
పతాక హస్త లక్షణము :-
పతాకః కుంచితాంగుష్టోభవేత్సంప్రసృతాంగుళిః !
దాతురన్య జనిర్జాతిః ద్రాహ్మీవర్ణస్తుపాండురః !
హర్తిర్దెవం ఋషిశ్శూలి, వినియోగోనిగద్యతే !!
తా: హస్తము యొక్క వ్రేళ్ళన్నియు చాచిపట్టి బొటనవ్రేలును ముడినినగో (వంచిన) పతాక హస్తమగును. ఇది బ్రహ్మవల్ల జన్మించినది. బ్రాహ్మణజాతి. తెలుపు వర్ణము. విష్ణువు దైవము. శివుడు ఋషి.
వినియోగము :-
నాట్యారంభము, పండితుడు, మార్ధవము, రాత్రి, కుచస్థలం, వనము, గుఱ్ఱము, తరంగము, దేవతా సమూహము, వాయువు, ప్రయాణమగుట, ప్రతాపము ,శయనము, ఎండ, శుభము ,వెన్నెల ,మేడ ,సప్తవిభక్తులు, తటాకము, జయము, భయము, వినయము, నిర్భయము, చీల్చివేయుట, సముద్రము, తలుపువేయుట, సైన్యము, కప్పుకొనుట, రక్షించుట, భూమి, తళతళమను మెరుగు. సూర్య చంద్రుడు, అగ్ని, సౌందర్యములు, తొందర, మెల్లన, యుద్ధము, గొడుగు, సమూహము, ధిక్కారము, అహంకారము, మనోవికారములు, కత్తి, తొండము, రాళ్ళు, వాద్యము, పాదరసము, సంతోషము, ధ్యానము, నీరాజనము, వారము అయినము (దక్షిణాయన ఉత్తరాయణములు), నెలలు, సంవత్సరము, జలపానము, దిక్కులు, పాపపుణ్యములు, విరోధము, కపోలము, నడుము, గోడ, పరబ్రహ్మ, ప్రవాహము, దట్టము, పాలు, గంధము పూయుట, వక్షస్థలము, క్షమించుట, విద్య, ఓర్పు, కౌగిలి దేవలోకము, దయ, కొంచెమను_అర్ధము. ఉద్యానవనము, సభ, యోగ్యము, దుఃఖము, నమస్కారము, నీడ, వెండినాణెము, ద్వీపము, చల్లదనము, పాదము, నుదురు, తిధులు, దేవత, శుక్రవారము, ఓదార్చుట,
.jpg)
