"నిజమే కానీ - మా నాన్న విషయం నీకు తెలుసుకదా. ప్రతీదీ శాస్త్రోక్తంగా జరగాలంటాడు. అందుకే నెలరోజులు వాయిదా పడింది"
"ఏమిటో మనిషి బతుకు! జీవితం అంత సంక్లిష్టమయింది మరొకటి లేదు. ఒక మనిషి సమస్యలకూ, మరొక మనిషి సమస్యలకూ పొంతన వుండదు. నీ శోభనం ఒక కారణం చేత ఆగిపోతే మరొకరిది మరో సమస్యవల్ల వాయిదా పడుతుంది. శ్రీనిజ అనే మా బంధువుల అమ్మాయిది మరో రకం సమస్య?"
"శ్రీనిజ ఎవరు? ఏమిటామె సమస్య?" సుజన ఉత్సాహంగా అడిగింది.
"శ్రీనిజది మా పక్క ఊరే. మా పెదనాన్న కూతురు. పెద్దనాన్న పెళ్ళి కాగానే అత్తవారింటికి ఇల్లరికానికి వెళ్ళాడు. ఇక అక్కడే సెటిలయిపోయాడు.
ఆయనకీ ఒక్కటే కూతురు శ్రీనిజ. ఇంటర్ వరకు చదువుకుంది. ఆపై చదవటానికి తగిన వసతులు లేకపోవడంతో చదువు మానిపించేశారు. మరో రెండేళ్ళకు ఆమె పెళ్ళి ఫిక్సయింది.
పెళ్ళి కొడుకుది మంగళగిరి. నెల్లూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్. పేరు అమర్. చూడటానికి అందంగా స్టయిల్ గా వుండేవాడు.
పెళ్ళయిపోయింది.
అతనికి అమ్మాయిలంటే సిగ్గో, భయమో తెలియడం లేదుగానీ ఆడపిల్లలకు ఆమడ దూరంలో వుండేవాడు. ఎప్పుడయినా ఎవరితోనయినా మాట్లాడాల్సొస్తే వణికిపోయేవాడు. సక్రమంగా నోటంట మాట వచ్చేది కాదు.
ఆడపిల్లలకి ఎదురైనా ఠక్కున తలవంచుకునేవాడు. ఇలాంటతను ఫస్ట్ నైట్ రోజున ఎలా ప్రవర్తిస్తాడో ఊహించు.
వివాహం జరిగాక దంపతులిద్దరూ మా పెదనాన్న ఊరికొచ్చారు. మరదలికోసం నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళాను.
ఊర్లోని స్త్రీలు చూడటానికి వచ్చినప్పుడు కూడా పెళ్ళికొడుకు గది వదిలి బయటికి రాలేదు.
"మగాడు ఏమిటమ్మా! ఇలా సిగ్గుపడిపోతున్నాడు" అని వాళ్ళంతా బుగ్గలు నొక్కుకున్నారు.
ఆరాత్రి వాళ్ళ ఫస్ట్ నైట్.
పదిగంటల ప్రాంతాన దంపతులు యిద్దర్నీ గదిలోకి తోసి గడిపెట్టాం.
ద్వారం దగ్గర నిలబడిపోయిన శ్రీనిజను అతను పిలవనయినా లేదు. మంచం దగ్గర అతనూ నిలబడిపోయి తల వంచేసుకున్నాడు.
సిగ్గుపడాల్సింది తనో, ఆయనో అర్ధం కాలేదు శ్రీనిజకి.
మా మాటల వలన అతని గురించి ఎంతో కొంత అవగాహనకు వచ్చింది.
దాంతో తనే చొరవ తీసుకోక దప్పదనిపించింది, నడుచుకుంటూ అతని దగ్గరికి వెళ్ళింది.
"పాలు తాగండి"
అదిగో అప్పుడు తలెత్తాడు అతను.
ఆమె చాలా అందంగా వుంటుంది.
మొదటిసారి ఆమెను చూస్తున్నట్టు కళ్ళార్పడం కూడా మరిచి ఆమె చూస్తుండిపోయాడు.
పాలు కొంత తాగి, మిగిలినవి ఆమెకిస్తూ "తాగు..." అన్నాడు శ్రీనిజ భర్త.
'అబ్బ! ఎంతసేపటికి మాట్లాడారు - ఇక ఫర్వాలేదు' అనుకుంటూ పాలగ్లాసు తీసుకుంది.
ఇద్దరూ మంచం మీద కూర్చున్నారు.
"మా నాన్నకు మేం నలుగురూ మగపిల్లలమే. అమ్మ కూడా నా చిన్నప్పుడే చనిపోయింది. అందుకే ఇంట్లో ఎవరూ స్త్రీలు వుండేవాళ్ళు కాదు. నాన్నే వంటంతా చేసేవాడు. ఆయనే మమ్మల్నంతా పెంచాడు. చిన్నప్పట్నుంచీ స్త్రీలు ఇంట్లో లేకపోవడం వల్ల స్త్రీలతో మాట్లాడే అవకాశమే లేకపోయింది. హైస్కూల్ కూడా కో-ఎడ్యుకేషన్ కాదు. కాలేజీలోనూ అంతే. అందుకే ఆడపిల్లలంటే జంకు"
"ఫరవాలేదు - తన సమస్య ఏమిటో? అందుకు కారణాలు కూడా ఏమిటో తెలుసుకున్నాడు" అనుకోని సంతృప్తి పడింది శ్రీనిజ.
"ఒక అమ్మాయి పక్కన అంత క్లోజ్ గా కూర్చున్నది నీతోనే - అదీ పెళ్ళిపీటల మీద"
తన భర్తకు పెళ్ళికి ముందే ఎలాంటి అనుభవమూ లేదని తెలియడంతో ఆమె చాలా ఆనందించింది.
"ఇక ఎప్పుడూ మీతోనే వుంటాను కదా ఈ బెదురంతా పోతుంది లెండి"
అతను కొద్దిగా ధైర్యం పుంజుకున్నాడు.
మెల్లగా ఆమె భుజం మీద చేయి వేసాడు. అతనికి తెలీకుండానే చేయి వణుకుతోంది.
ఆమె దీనిని పసికట్టి ఏదో క్యాజువల్ గా పట్టుకున్నట్టు అతని చేతిని తన చేత్తో బిగించింది.
కొంతసేపటికి వణుకు తగ్గింది.
అతనికి ఏదో చేయాలని వుందిగానీ ఎలా ప్రారంభించాలో, ఎలా ప్రొసీడ్ కావాలో తెలియడం లేదు. సెక్స్ లో అతనికి థీరిటికల్ నాలెడ్జి కూడా లేదు.
ఆమెకి మాత్రం థీరికల్ నాలెడ్జి వుంది.
ఒళ్ళంతా దేనికోసమో ఆరాటపడిపోతూ వుంది. దాహం తెలుస్తోంది గానీ, దప్పిక ఎలా తీరుతుందో తెలియడం లేదు. ముద్దలా ఆమె మీద వాలిపోయాడు.
ఆమె సర్దుకుని పడుకుంది.
పక్కన చెరి అతను ఆమె మీదికి ఒరిగి నోటితో ఎక్కడెక్కడో తడుముతున్నాడు. అందులో ఒక పద్ద్తతి లేదు. ఏమీ తెలియని ఒక పల్లెటూరువాడు ఇంగ్లీషు సినిమాకి వెళితే ఎలా వుంటుందో అలా వుంది పరిస్థితి.
ఫైవ్ స్టార్ హోటల్ కి వెళ్ళిన ఓ సామాన్యుడు ఏ దారి ఎటు వెళుతుందో తెలియక తికమక పడిపోతున్నట్లు అతను గింజుకు పోతున్నాడు.
ఎంతసేపటికి అలా పెదవులతో ఎక్కడెక్కడో రాయడం తప్ప మరి ముందుకు సాగలేకపోతున్నాడు.
ఆమెకి మాత్రం కొంత తెలుసు.
కానీ తను యాక్టివ్ పార్ట్ తీసుకోవడానికి ఏదో తెలియని సిగ్గు ఆమెని వెనక్కి లాగుతోంది.
అతను అలా కొంతసేపు పెనుగులాడి, ఇక ఆపై ఏం చేయాలో తెలియక వూరకుండిపోయాడు.
ఆమెకి ఆ తర్వాత ఏం చేయాలో చెప్పాలనిపించింది గానీ చెప్పలేకపోయింది.
యిద్దరూ మాటలలో పడ్డారు. యెప్పుడో తెల్లవారు జామున యిద్దరూ నిద్రపోయారు. ఏమీ జరక్కుండానే ఆ రాత్రి తెల్లవారిపోయింది.
రెండోరోజు అతనిలో కొంత మార్పు వచ్చింది. మునుపటి రోజులా గది తలుపులు బిగించుకుని కూర్చోలేదు. అప్పుడప్పుడూ బయటికొస్తున్నాడు.
రెండో రోజు రాత్రి యధా ప్రకారం యిద్దరూ గదిలోకి వెళ్ళారు.
ఇద్దరికీ ఇద్దరూ కొంత అలవాటు కావడం వల్ల బిడియం పోయింది. యిద్దరూ అవీ ఇవీ కబుర్లు చెప్పుకున్నాక మంచం మీద పడుకున్నారు.
అతను కోరికలతో కాలిపోతున్నాడు. ఆమెలో కూడా వెచ్చటి ఆవిర్లు ప్రవహిస్తున్నాయి.
