9
చీకటి పడిపోయింది. సిగరెట్టు పొగతో ఆడవారు ధరించిన పూల వాసనలతో గది నిండిపోయింది . గుత్తులుగుత్తులుగా వేళ్ళాడుతున్న దీపాల చుట్టూ పల్చని బట్టలాగా ఉంది పొగ. అమ్మమ్మగారు ఎవరినో కేకవేయడంతో కిటికీలు తలుపులూ తెరిచారు. అవతలి చల్లగాలి నెమ్మదిగా గదిలోకి రావడం మొదలు పెట్టింది. ఓ కిటికీ లో కూర్చుని నెమ్మదిగా ఒక్కక్కటిగా వస్తున్నా నక్షత్రాలని, చెట్ల శిఖరాలని చూస్తూ కూర్చుంది. సరళ నవ్వులు కబుర్లు గట్టిగానే విన్పిస్తున్నాయి. బలరాం ని ఒకటే కవ్విస్తుంది. లలితకి ఎంత కంట్రోల్ చేసినా మనస్సు కోపంతో ఉక్రోషంతో దహించుకు పోతుంది. తననెందుకు చిన్నదాన్ని చూసినట్టు చూసి లెక్క చెయ్యడీ బలరాం! అనుకుంది...తోలి వలపులో దెబ్బతిన్న తన హృదయం బలమైన ప్రేమతో ఇప్పుడే పడింది. కాని ఈ ప్రేమ నిష్పలంగా అయిపోతుందేమో అనిపిస్తుంది లలితకి. బలరాం తనని ఓ స్త్రీ గా గుర్తించడు. ఎప్పటికీ ఓ చిన్న పిల్లగా బాధ్యత తెలియని దానిగానే చూసి ఇలా చిత్రవధ చేస్తాడా?...మనస్సులో దుఃఖం పొంగి వస్తుంది. గదిలో అంతా నువ్వు పాడి తీరాలంటే నువ్వు చదివి తీరాలని పట్టుపట్టి పాటలు పాడిస్తున్నారు. కవిత్వం చదివిస్తున్నారు. 'ఇంతమంది నడుగుతారు. బలరాం పద్యాలు చదవమనండ్రా' ఓ సలహా యిచ్చారు అమ్మమ్మగారు. అంతే ఉప్పెనలా మీద పడింది సరళ చదవమని. చాలాసేపు మొహమాట పడ్డాడు బలరాం. కాని చివరికి తప్పలేదు. అంతా నిశ్శబ్ధమై పోయింది. జీరపోయిన కంఠం'లో మగసిరి ఒలికి పోతుంది. గళమెత్తి గట్టిగా చదివినట్టు పాడినట్టు కాకుండా ఎవరికో చెంత నున్న వ్యక్తికీ చెప్పినట్టు చదువుతున్నాడు బలరాం. కుర్రకారంతా కళ్ళప్పగించి వింటున్నారు.....ఇంకోటి చదువు. ప్లీజ్ అంటున్నారు. కొందరి కంట కన్నీరు. కొందరి కళ్ళలో వింత ఆరాధన. కొందరి పెదవుల పై దరహాసం. కొందరి పాల భాగాలపై విషాదం ...ఆ పద్యాల మూడ్ లో పడిపోయారు అందరూ. కిటికీ లో కూర్చున్న లలిత నమ్మశక్యం గాని యీ దృశ్యాన్ని కరువు తీరా ఆస్వాదిస్తుంది. బలరాం ఎంత రొమాంటిక్! అనుకుంది. గంబీరమైన అతని నడత వెనక ఎంతటి సున్నితమైన హృదయం దాక్కుని ఉంది! అని ఆశ్చర్య పడింది...ఇంకొక్కటి . ప్లీజ్! ఇదే లాస్ట్ కి అంటూ మళ్ళీ పద్యం అవగానే మొదటి . వచ్చారు.... 'మీరింక చదవమన్నా చదవను.... ఇదే లాస్ట్'- అంటూ గొంతుక సవరించుకున్నాడు బలరాం -- కుతూహలంగా ముందుకు వంగి గెడ్డం అరచేతిలో అన్చుకుని కూర్చుంది లలిత....
'ఎదమెత్త నౌటకే
సాదగుందరా అంత
మదిగల మహామ్మంత
వదిలిపోవునురా....'
అంటూ తోలి చరణం చదివేసరికే ' హా బ్యూటి పుల్!' అంటూ చాలామంది సామూహికంగా నిట్టుర్చారు.
'వలపెరుంగక బతికి
కులికి మురిసే కన్న
వలసి ఫలమ్మొంది
విలపింప మేలురా'....
'ప్లీజ్ మళ్ళీ చదువీచరణం'..... అన్నారెవరో . మళ్ళీ చదివాడు బలరాం.
'చెలి వలపు లేని నీ
కలిమి కాల్చేనే వినుము
వలపు తీగనే జీవ
ఫలము కాయునురా'......
ఐసీ! ఏం బాగా అన్నాడు కవి! అని కామెంటు...
'ప్రేమ కన్నను ఎక్కు
వేముందిరా యేల్ల
కామ్య పదవుల కన్న
ప్రేమ యెక్కువరా'........
ఎంత మృదువుగా అన్నాడు-- హాట్స్ ఆఫ్ టు హిమ్....
'ప్రేమించు సుఖము కై
ప్రేమించు ముక్తికై
ప్రేమించు ప్రేమకై
యేమింక వలయురా'.....
ప్లీజ్ బలరాం మళ్ళీ మళ్ళీ చదువీ చరణం....అంటూ చేయందుకుంది సరళ. కళ్ళెత్తి కిటికీ లో కూర్చున్న లలితనే చూస్తున్నాడు బలరాం. ఆమె శరీరం యిక్కడుందే కాని మనసెక్కడో తేలుతూనట్టు ఆ కళ్ళే చెప్తున్నాయి.... యెర్రని జీరలు పడ్డ కళ్ళు వింత కాంతితో మెరిసిపోతున్నాయి....సరళ ని వదిలించుకుని' ఇంక చాలు మీ పాటలు పాడుకోండి' అన్నాడు నవ్వుతూ బలరాం.
'నో నో ...వాటిలో యీ ఫీలింగు లేదనిపిస్తుంది...ఎవరిదీ పద్యం....కొంపతీసి నువ్వు రాయలేదు కద!'
'బసవరాజు అప్పరావుది. అయన నిజమైన ప్రణయ కవిత్వం రాసాడు... మీకూ నా వయస్సు వచ్చాక నచ్చుతుంది లెండి అది.' తప్పించుకో చూశాడు బలరాం.
'నీవేం పాతరాతి యుగంలో వాడివా? అలాంటి వాడి కింత సున్నిత హృదయం యింకా మిగిలి ఉంటుందా?' అంది కిటికిలో కూర్చున్న లలిత.
అంతా అటు తిరిగేసరికి సిగ్గేసిందామెకి.
నా వయస్సిటు నలబై కేసి నడుస్తుంటే ..నీలాంటి వాళ్ళ వయస్సుటు పాతిక చేరడానికి అవస్థ పడుతుంటుంది లలితా!'
'మైగాడ్! నువ్వేం మనిషివి? వయస్సుకీ ప్రేమకీ సంబంధం ఏమిటి?... నా కర్ధం కాదు ....' నెమ్మదిగా అంది.
'నే చదువుకునే రోజుల్లో మేం లల్లాయి పదాలు పాడే వాళ్ళం కాదు....ఎందుకో నాకు తెలియదు. పోటీలు పడి ఆనాటి కవుల పాటలు, పద్యాలు అవకాశం వచ్చినప్పుడల్లా పాడుతూ ఉండేవాళ్ళం.'
'అమ్మాయిలని ఏడిపించేవారు కాదు కాబోలు ! అవునా!'
'ఈ పద్యాలతోనే ఏడిపించేవాళ్ళు-- ఏం ఆనాటి కుర్రాళ్ళు కాలేజి కుర్రాళ్ళు కాదనా నీ ఉద్దేశ్యం!' నవ్వుతూ జేబులోంచి సిగరెట్టు పెకట్టు తీశాడు.... బలరాం. వచ్చి కిటికీ లో లలిత పక్కన కూర్చుని సిగరెట్టు అంటించాడు.
'నువ్వు పాట పాడలేదెం?' నెమ్మదిగా అడిగాడు.
"నావి చాలా పాత పాటలే బలరాం. ఇక్కడ పాడితే నవ్వుతారు.' అంది.
'పది దాటిపోయి చాలాసేపయింది ఇంటికి పోదామా?'
నవ్వుకుందీ మాటలు విని లలిత.
'నవ్వెందుకు లలితా?'
'సరళ అన్న మాటలు జ్ఞాపకం వచ్చాయి. నాకైతే పోవాలనే ఉంది....వాళ్ళు వస్తారా?' కిటికీ లోంచి దూకి నిలబడింది లలిత.
'అడిగి వస్తాను' అంటూ.
'వద్దులే -- పోనీ సరళ బాగా ఎంజాయి చేస్తున్నట్టుంది...నువ్వేం ఎవరితో కలవకుండా ఇలా కూర్చున్నావు?'

'వాళ్ళ వయసు కన్నా నా వయసు బాగా పెరిగిపోయింది బలరాం. నేనిలాంటి వాళ్ళతో కలవలేను. వీరి మాటలు చేష్టలు సిల్లీగా తోస్తాయి నాకు.'
'ఈ కిటికీ లోంచి చూస్తుంటే సర్వ ప్రకృతి నీవు లాగా కన్పిస్తుంది నాకు. నీ పద్యాలన్నీ ఎక్కడెక్కడికో పయినించి ప్రతిధ్వనుల్లాగా తిరిగి నా చెవుల్లో విన్పిస్తున్నాయి. యివి నాకోసం చదివాననవూ' బలరాం' అంటూ అతని భుజం పై వాలి పోవాలన్న బలీయమైన కోరికని బలవంతాన అణచుకుంది లలిత.
మనసులోని భావాలని అద్దంలాగా చూపిస్తున్న లలిత ముఖంలోని కొత్త కాంతి బలరాం గుండె కోత కొస్తుంది.... వీరందరి లో ఎవరైనా లలిత మనస్సుని దోచుకున్నారా? అన్న భయం పట్టి పీడించుతోంది.
'బాగా విసుగ్గా ఉంది నాకిక్కడ....'
'ఏం అమ్మమ్మగారి దగ్గిర కుర్చో పోయి ....' అంటూ వేళాకోళం చేసింది లలిత.
'ఆవిడే నన్నీ యిరుకున పడేసి ఆనందిస్తుంది....'
'పోనీలే నీలో ఇంకో కొత్త కోణం బయటపడిందివేళ. లేకుంటే నీలో యింత ప్రణయ స్వభావం దాగి వుందని ఎప్పటికీ తెలిసి ఉండక పోను.'
గుసగుస లాడుతున్న ఆమె కంఠం మీద తన ముని వెళ్లు రాయాలనిపించింది బలరాం కి. బలవంతంగా చేతిని జేబులో పెట్టుకున్నాడు.
'నువ్వెవరినైనా ప్రేమించావా బలరాం?'
'ఇదొవరేకేవ్వరిని ప్రేమించలేదు....' ముక్తసరిగా చెప్పిన ఆ సమాధానంతో కొండంత ఆశ కన్పించింది లలితకి.
'మరిప్పుడు'?'
"పోనిద్దూ నా గొడవెందుకు....చూడు ఈ కుర్రాళ్ళందరిలో నీకేవరేనా నచ్చారా? అంతా తగిన వరుల్లె అనుకో....'
'నీసంగతి చెప్పు బలరాం.----నువ్వీ వేళ తప్పించుకోలేవు ' అంటూ అతని చేయి మీద చేయి వేసింది లలిత. తన చేయి ఆ చేయి మీద వేయాలనిపించినది బలరాం కి. 'ఔను నేను నిన్ను ప్రేమిస్తున్నాను----కవి అన్నట్టు సుఖం కోసం ముక్తి కోసం ప్రేమ కోసం--నిన్నే.......' ఏదేదో చెప్పాలనిపించింది బలరాం కి.
'వెళ్ళు వెళ్ళు-- యీ వెన్నెలా, యీ కళ్ళు కొట్టే నక్షత్రాలూ ...కుర్రవాళ్ళ ఆరాధనా అంతా నిన్నో....ప్రణయినిగా చేసేస్తున్నట్టుంది.......సరళ ని అత్తయ్య ని రమ్మను వెడదాం' అంటూ తన చెయ్యి వెనక్కి తీసేసుకున్నాడు బలరాం.
కోపం దుఖం ముంచుకు వచ్చాయి లలితకి.
'సరే పోనీ కాస్సేపు అడుకురానా!' చిన్న పిల్లలా అడిగింది కాని మండిపడుతూ అక్కడ్నుంచి వెళ్ళిపోయింది.
కుతూహలంగా ఆమె కేసి చూస్తూ ఆమె వదిలిన కిటికీ సీటు తను ఆక్రమించుకున్నాడు బలరాం.
అతని మనస్సు పరిపరి విధాల పోతుంది. లలితని దూరంగా ఉంచితే తప్పించి తన తపనకి పరిష్కారం ఉండదని అనుకున్నాడు. కాని ఆలా దూరంలో ఉంచడం లో తన గుండె పీకి తానె పారేస్తున్నంత బాధ తోచింది బలరాం కి. 'ఇప్పుడెందుకు రావాలి? నన్నెందుకిలా కాలం మోసం చేసింది?' అనిపించింది.
లలిత సరళ కీ, సరస్వతమ్మ గారికి చెప్పింది -- బలరాం యింక కదులుదాం అంటున్నాడని......ముఖం చిట్లించినా సరే అన్నారు. లలిత అమ్మమ్మగారి దగ్గిరికి వెళ్ళింది చెప్పి పోదామని.
"అప్పుడేనా? పోనీ రాత్రికి ఇక్కడే ఉండిపో బలరాం కి చెప్తాను' అన్నారావిడ.
'లేదు. ఇక మళ్లీ వెళ్ళిపోదామనుకుంటున్నాను మా ఊరు -- వెళ్ళే ముందొచ్చి రెండురోజు లుంటాను మీ దగ్గిర' అంది లలిత. అలా అంటుంటే లలిత కళ్ళు నీళ్ళతో నిండిపోయాయి.
'ఈ పిల్ల ఎందుకో బాధపడుతోంది' అనుకున్నారామె.... అంతా ముందు గదిలో గుమిగూడారు-- ఇక బయలుదేరుదామని. సరళ ఎక్కడో జారిపోయింది !....బాతాకానీ కొడుతూ అలాగే నించున్నారు. జోకులో లాగా -- ఆడవాళ్ళ బాతాకానీకి అంతే క్కడ-- మగవాళ్ళ కి సుదీర్ఘంగా గెడ్డాలు పెరిగిపోయేదాకా. 'వెళ్ళొస్తా ' అంటూనే ఉంటారట-- వీధి గడప మీద నించుని....బలరాం పరిస్థితి అలాగే ఉంది....కాలుకాలిన పిల్లిలాగా తిరుగుతున్నాడు. ఆదరా బాదరాగా పరుగెత్తి వచ్చింది లలిత. 'రా సరళా నీ కోసమే చూస్తున్నాం' అంది-- తొందర పెడుతూ.
