Previous Page Next Page 
ప్రియా.....ప్రియతమా పేజి 18


    "మీ మనవడిని చేసుకోవడానికి మా అమ్మాయికి ససేమిరా ఇష్టం లేదు....సకల అవగుణాలున్న మీ అబ్బాయితో ఆ అమ్మాయి పెళ్ళి జరగదు...' అని వుంటుంది.
    బామ్మకు వళ్ళు మండుతుంది.
    ,నా మనవడినే అన్నేసి మాటలంటారా? మీ సంబంధం మాకొద్దు' అంటుంది.
    తను బాధగా మొహం పెడతాడు.
    'నీకేంట్రా బంగారుకొండా....మంచి సంబంధం చూస్తానంటుంది'
    ఇప్పటికి చూసిన సంబంధం చాల్లే బామ్మా.... నేను చూసుకుంటానంటాడు తను.
    ఆ ఛాన్స్ తనకు వదిలేస్తుంది. తను ఓ ఫాస్ట్ గర్ల్ ను వెతుక్కొని, ఓ ఫైన్ మార్నింగ్  బామ్మకు  పరిచయం చేస్తాడు.
    ఇలా ఊహించేసుకుంటున్నాడు. రామస్వామి శ్రీచరణ్ చేతిలో వున్న ఉత్తరం లాక్కొని బామ్మకు ఇచ్చాడు.
    శ్రీచరణ్ ఎక్స్ ప్రెషన్స్ తో సహా రెడీగా వున్నాడు.
    బామ్మ ఆ ఉత్తరం చదివి, బయటకు వచ్చింది.
    'బామ్మా పెళ్ళెప్పుడే...." సిగ్గు పడుతూ బామ్మ కొంగులో తన తలదాచుకొని అడిగాడు శ్రీచరణ్.
    "పిచ్చి సన్నాసి..." అంది మరింత గంభీరంగా.
    "అదేంటే....ఎక్స్ ప్రెషన్ అలా పెట్టావు..." మొహాన్ని బాధగా పెట్టి అడిగాడు.
    పక్కున నవ్వింది బామ్మ. "అదేంటి నవ్వుతున్నావు. నీకేమైందే..."
    "నాకేమవుతుందిరా నా వజ్రాల కొండా....ఆ అమ్మాయికి కూడా నువ్వు నచ్చావుట. ఇదిగో నీక్కాబోయే మామగారు స్వయంగా ఉత్తరం రాసారు" అంటూ ఉత్తరం శ్రీచరణ్ చేతిలో పెట్టింది.
    వెర్రిమొహమేసుకొని ఉత్తరం వైపు చూసాడు బామ్మగారికి....
    శర్మ అనేక నమస్కారాలతో...
    మీరన్నా, మీ కుటుంబ సాంప్రదాయమన్నా నాకెంతో అభిమానం, గౌరవం. మా అమ్మాయి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ప్రనూషకు మీ చిరంజీవి శ్రీచరణ్ నచ్చాడట. ముహూర్తాలు చూసి మీకు ఉత్తరం రాస్తావు.
    ఇట్లు మీభవదీయుడు శర్మ మండువేసవిలో, రేకుల షెడ్డులో పవర్ కట్లో పడుకున్న ఫీలింగ్ కలిగింది శ్రీచరణ్ కు.
    "అదేంటి...ఆ అమ్మాయికి తన నచ్చడమేంటి? తనిచ్చిన "డోస్ సరిపోలేదా?
    "వెంటనే బామ్మ దగ్గరికి పరుగెళ్ళాడు.
    "బామ్మ యిది అన్యాయమే. అసలా అమ్మాయికి నేను నచ్చి వుండను. ఆ అమ్మాయి అభిప్రాయం తెలుసుకోకుండా గొంతుకోస్తున్నారు" అన్నాడు శ్రీచరణ్.
    'అదేంట్రా....అలాగంటావ్...ఆ అమ్మాయే స్వయంగా ఒప్పుకుందిట. అయినా, ఆ అమ్మాయికి నువ్వు వచ్చివుండవని ఎలా అనుకుంటున్నావు' అనుమానంగా చూసి అడిగింది.
    ఎలా.....అంటే....."గేస్ చేసాను".
    "అదేంట్రా...అయినా స్వయాన ఆ అమ్మాయి తండ్రి రాశాడు" అంది.
    "అయినా...నాకెందుకో ఆ అమ్మాయికి నేను నచ్చలేదేమోననిపిస్తోంది."
    "పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకురా పిచ్చి తండ్రి....నీకా అమ్మాయితో పెళ్ళి జరిగి తీరుతుంది."
    "జరిగి తీరదు గంభీరంగా అన్నాడు శ్రీచరణ్.
    "జరగదా....ఏదీ మళ్ళీ అను ఆ మాట చెప్తా నీ పని..."
    "జరగదంటే...జరగదంతే....దట్సాల్..."
    "అవున్రా...అంటావు...అనవూ మరి. ఇంతప్పుడు వేలెడు...వేలెడున్నంతప్పుడు నిన్ను..." "బామ్మా ఆ....పు...."చెవులు మూసుకున్నాడు.
    'ఆ అమ్మాయి నచ్చిందని నువ్వన్నావు. నువ్వు నచ్చావని ఆ అమ్మాయి అంది. యింకేంటి బుద్దిగా పెళ్ళి చేసుకో....కాదు...కూడదంటే...ఒరేయ్ రామస్వామి..."
    తల బాదుకోవడం తప్ప మరేమీ చేయలేకపోయాడు శ్రీచరణ్.
    అలా...అతిక్లిష్ట పరిస్థితిలో శ్రీచరణ్ పెళ్ళికి ముహూర్తం నిర్ణయించబడింది.
    అటువైపునుండి నరుక్కుంటూ వద్దామని పెళ్ళికూతురితో తన క్యారెక్టరు ను బ్యాడ్ గా చెప్పినా లాభం లేకపోయింది.
    ఇటువైపు బామ్మ నుంచి నరుక్కొద్దామా అంటే తన ఛాదస్తం. 'పెళ్ళి చేసుకుంటావా?" "చూరుకు ఉరేసుకోనా?" అని బెదిరిస్తుంది.
    ప్రనూష్, శ్రీచరణ్ ల పెళ్ళి ఆ విధంగా జరిగిపోయింది.
    మంగళసూత్రం కట్టే సమయంలో కూడా కాసింత ఆశ వుంది శ్రీచరణ్ కు.
    ఇప్పటికైనా ఈ పెళ్ళి తప్పిపోతే బావుండని. అక్కడికీ తాళి కట్టబోతూ, ప్రనూష వంక చూసి పళ్ళునూరి "ఛీ....ఛీ....సిగ్గులేకపోతే సరి. యిన్ని బ్యాడ్ హాబిట్స్ వున్నాయని తెలిసినా పెళ్ళి చేసుకోవడానికి సిగ్గు లేదూ" అని ఆమెకు మాత్రమే వినిపించేలా అన్నాడు.
    కోపంగా ఏదో అనబోయింది. పంతులుగారు "ఆ! తల దించమ్మా, జీలకర్ర, బెల్లం ముద్దపెట్టాలి..." అన్నాడు. అందుకే ఇంకేం అనలేక తలదించుకుంది.
    సమాధానం ఏమీ చెప్పకపోవటంతో మరింత రెచ్చిపోయాడు శ్రీచరణ్.' జీలకర్రా, బెల్లం తినేసేవు తియ్యగా వుంటుందని....అన్నాడు" ఉడికిస్తూ ఆమె తలమీద పెట్టి.
    'మరే....మేం తిండికి మొహం వాచీ ఉన్నాం కదా! అందుకే వెరైటీగా జీలకర్ర బెల్లం తింటాం..." ఈసారి ఊర్కోకుండా తలదించుకునే అంది ప్రిసూష.
    నిజానికి జీలకర్ర, బెల్లం ముద్ద ఇచ్చి పంతులు అతని తలమీద పెట్టమన్నప్పుడు రెండు మొట్టికాయలు కూడా వేద్దామనుకుంది. కానీ, మరీ అంది పెళ్ళి, పైగా వీడియో కూడా తీస్తున్నాడు. దానిలో పడితే ఇంకేం లేదు. తర్వాతందరూ ఆడిపోసుకుంటారని వూరుకుంది.
    తాళికట్టేప్పుడు మూడుముళ్ళు వేశాక మెడమీద గట్టిగా గిచ్చుదామన్నంత కసి వచ్చింది శ్రీచరణ్ కు.
    కానీ వెనకే ప్రనూష చెల్లి ప్రియ (ఫ్రెండ్స్ నిలబడి ప్రనూష పూలజడన్ ఎత్తిపట్టుకుని నిలబడ్డం వలన చేయలేకపోయాడు.
    తలంబ్రాలు పోసేప్పుడు కూడా కసిగా భార్యనెత్తిన కుమ్మరించాడు.
    చెమ్కీలు, రంగు రంగుల పూసలు, ధర్మాకోల్ తో చేసిన కలర్ వుండలు అన్ని దగ్గరుండి ప్రనూషచెల్లి, (ఫ్రెండ్స్ గోలగోల చేసి ప్రనూష చేత శ్రీచరణ్ నెత్తిన పోయించారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS