ఉడుక్కుంది వైజయంతి.
ఏదో ఒకటి ఎట్టా అడుగుతాను?"
"ఆలోచించండి ఏదో ఓ వంక దొరక్కపోదు." ప్రాధేయపడుతున్నట్లు అన్నాడు మదన్ గోపాల్.
"ఇప్పుడంత తల బద్దలు కొట్టుకుని ఆలోచించి వంక డొంక లాక్కపోతేనేమి, మీరడుగుతున్నారుకదా అని. ఇహ బామ్మగారు ముక్కుమీద వేలేసుకుని ఆశ్చర్యపోయి ముక్కుమీద వేలు తొలిగించి "ఒకడు రాక్షసుడు. ఒకడు భగవంతుడి బిడ్డ" అంది.
"మరయితే వాడిపేరు వీడెందుకు పెట్టుకున్నాడు?"
"ఎవరి పేరు ఎవరు పెట్టుకున్నారు మదనా! భారతంలో కర్ణుడొస్తే, రామాయణంలో కుంభకర్ణుడొస్తాడాయె."
"ఎవరే పురాణాలలో వస్తారో నాకంతా కనుఫ్యూజులో వుంది. నేమాత్రం పోతున్నాను. వాళ్ళకు చెప్పునాన్నమ్మా నీ పురాణం" అని లేచెళ్ళి పోయాడు మదన్ గోపాల్.
"ఉత్త వెర్రినాగన్న. నోట్లో వేలుపెడితే కొరకలేడు" ముద్దుగా అని "ఆ....ఎంతవరకొచ్చానర్రా?" అంది బామ్మగారు.
"నోట్లో వేలుపెడితే కొరకలేడుట. నాన్నమ్మకదూ అందుకు కొరికుండడు" నెమ్మదిగా అంది వైజయంతి.
"అంతే అంతే నువ్వు నోట్లోపెడితే మాత్రం ఖాయంగా కొరుకుతాడు."
"నోరుముయ్యి. మరోమాట నీ నోట్లోంచి వచ్చిందా నీ అయిదువేళ్ళు కొరికేస్తాను."
త్రిలోకసుందరి నోరు మూసుకుని చేతులు వళ్ళో దాచుకొంది.
బామ్మగారు శ్రావ్యంగా చెప్పుకుపోతున్నారు. కుంతి విలాసం వర్ణిస్తూ.
