15
వినండయ్, వినండి! ఈ సువార్త విని సంతోషించండి! ! వినండయ్ వినండి! మన ప్రియతమ ప్రధాన న్యాయమూర్తి రామశాస్త్రి గారు ఈనాడే మన నగరానికి తిరిగి వచ్చేస్తున్నారు! వినండహో....
ఈ ఉదయం పూనా నగరం పై దండరాతో మారుమోగింది. ఇక ప్రజల ఆనందానికి అంతులేదు. దండోరా వేసేవారికి ఇది ఒక సమస్య అయిపొయింది! ప్రతి వీధిలో గుంపులు గుంపులు గావచ్చి జనం వివరాలు కోసం అడగటం మొదలు పెట్టారు. ఈ తొక్కిడి లో వారికి ఒక చోట నుంచి మరొక చోటికి కదలటమే కష్టం అయిపొయింది. ప్రశ్నల వర్షానికి తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అయిపోయారు.
"నిజమేనయ్యా! నిజమే! మేము చెప్పేది నిజమే, నమ్మండి! ఇంకో గంటలో రామ్ శాస్త్రుల వారే ఈ వూళ్ళో ప్రవేశిస్తారు. వారి రాకతో మరొక సూర్యోదయం అయినట్లే !.... మీరే చూస్తారు....!" అన్నాడు దండోరా వేసేవారిలో ఒకడు. అంతా దైవ కృప! నానా ఫడ్నవీస్ , సఖా రామ్ బాపూ మరాఠా సామ్రాజ్యానికి గురువరెన్యులన తగిన రామ్ శాస్త్రిని తిరిగి తీసుకు రాగలిగారంటే మన అదృష్టమే. పూనా నగర వాసులకి మళ్ళీ ప్రాణం పోసినట్లే గదా!" అన్నాడు తని సహచరుడు మరొకడు.
ఈ మాటలు విన్న వారి సంతోషం ద్విగుణీకృతమయింది. "బాబూ! ఎప్పుదోస్తున్నారో, ఎలా వస్తున్నారో చెప్తే మాకు మరింత ఆనందంగా ఉంటుంది!'
"రామ్ శాస్త్రి గారు వస్తున్నారా?"
"ఎప్పుడు?
"ఏ వీధి వెంబడి వస్తారు? అక్కడికి వెళ్ళాలిసిందే!"
"అయ్యా, ఇలా సగం విషయం మాత్రం చెప్పి మమ్మల్ని ఉడికించకండి!"
దండోరా వేసేవారు ప్రశ్నల వర్షం విని కోపం వచ్చినట్లు నటించారు.
"ఏమిటి సోద! మమ్మల్ని మా పని చేసుకోనిచ్చేట్లు లేదే! పైవాళ్ళు చెప్పినట్లు అరవగలం గాని హరికధలు చెప్పేవాళ్ల మా? లేదా భట్రాజాలమా ఆశు కవిత్వం చెప్పటానికి! కొట్వాల్ సాహెబ్ వారి అజ్ఞ శిరసావహిస్తున్నామంతె! అంత ఆత్రంగా ఉంటె మరికొన్ని రోజులాగండి.......ఏ కవిగారో రామ్ శాస్త్రుల వారి పుర ప్రవేశ మహోత్సవాన్ని వీనుల పండుగగా వల్లిస్తారు, మీరు విందురు గాని' అని ఊరించాడు ఒకడు.
"అంతే! అంతే! పోదాం పద ఇంకా తిరగవలసిన వీధులు చాలా వున్నాయి!" అని వంత పాడాడు రెండవ వాడు మరొకడు.
అన్నాడే గాని తమకు తెలిసిన విషయాన్ని అక్కడి జనానికి చెప్పకుండా ఉండలేక పోయాడు.
పై మాటలు విని సంతృప్తి ప్రకటిస్తున్న వారిని ఆగండి బాబూ చెప్తే గాని మమ్మల్నీ వదిలేట్లు లేరు అని వూరుకోబెట్టి ఇలా చెప్పుకు పోయాడు ఒకడు. ఒక వారం రోజుల ముందు నానా ఫడ్నవీస్ సభా రామ్ పంత్ బాపూ ని వెంట పెట్టుకుని ఎక్కడో మారుమూల ఉన్న గ్రామానికి వెళ్ళారు. రామ్ శాస్త్రి గారు అక్కడే ఉన్నారని ఎలాగో కనిపెట్టాశారు! సరే, వారిని ఎలాగో వప్పించారు. మళ్లీ ప్రధాన న్యాయమూర్తి పదవిని ఆక్రమించటానికి. రామ్ శాస్త్రి గారు ఆరోజునే పల్లకీ ఎక్కి భార్యా కుమారులతో పూనా నగరం బయల్దేరారు!
"ఇక అపు! కధంతా చెప్తే ఈ చోటు కదిలి వెళ్ళలేము! పద, పద!!" అని అపివేశాడు అతని తోటి వాడు.
"వినండహో! వినండి!! ప్రజలారా వినండి...." జనం సందడి ని పట్టించుకోనట్లు దండోరా వేసేవారంతా ముందుకి సాగిపోయారు.
అయితే ఆ గుంపు వారిని వదలలేదు......వెంటనే నడవటం ప్రారంభించారు. దండోరా వినిపించుకోకుండా ప్రశ్నలు వేశారు. ఇక లాభం లేదనుకుని దండోరా ఆపి వారు తమ కధనాన్ని మొదలు పెట్టారు.
"మమ్మల్ని వదిలేట్లు లేరే! సరే, వినండి ఇంత ఆలస్యంగా వస్తున్నారేమిటి, అంటారా? పూనా నగరం రావటానికి వారం రోజులేమిటని అడుగుతున్నారా?
"ఏం, రామ్ శాస్త్రి గారంటే గౌరవ మర్యాదలు మన కోక్కరికేనా? దారిలో ఒక్కొక్క గ్రామం లో వారి దర్శనం చేసుకుని వందన లర్పించే ప్రజలని అయన పలకరించాలా? వారి మన్ననలందుకోవాలా వద్దంటారా!"
"ఎలా వద్దంటాము?"
"ఆహా! రామ్ శాస్త్రి గారి కీర్తీ ఆచంద్రా తారార్కంగా నిలుస్తుంది!"
"వారి దర్శన భాగ్యం మనకెప్పుడు కలుగుతుందో కదా!" అనుకున్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా.
"అంతటితో వదిలారా ఈ జనం వారిని! లలిత్ , తోలు బొమ్మలాట, కదా కాలక్షేపం , కీర్తన సభలతో వారిని ముంచెత్తేశారు! తమ బిడ్డలని రామ్ శాస్త్రుల వారి పాదాల వద్ద ఉంచి దీర్ఘాయుషు కలిగేట్లు ఆశీర్వదించమని వేడుకున్న అడవారెందరంటారు! ఆహా, వారి కీర్తీ ప్రతిష్టలు అటువంటివి..."
దండోరా వేసే మనిషి కధనానికి అంతరాయం కలిగింది. పెద్ద డెక్కల చప్పుడుతో అశ్వదళం ఒకటి వారిని సమీపించింది. ఆ దళం మొదట కొట్వాల్ ఉన్నాడు. పని ఆపి కబుర్లు చెప్పుతున్నారని అతను ఎక్కడ చివాట్లు వేస్తాడో అని అతను తన సహచరులతో బాటు దండోరా తిరిగి ప్రారంభించి అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయాడు.
కొట్వాల్ , అతని దళం బంగారు నగిషీలు, చెక్కిన దుస్తులు వేసుకుని ఉన్నారు. వారి చేతిలోని ఈటెల చివర పట్టు కుచులు వెళ్ళాడు తున్నాయి. నెమ్మదిగా సవారీ చెయ్యటం వల్ల గుర్రాల మీద పైకి, కిందికి ఎగిరి ఎగిరి పడుతున్న వారి కదలికలకి ఈ పట్టు కుచ్చులు విచిత్రంగా ఆడుతున్నాయి. ఆశ్వికుల ముఖాల మీద ఏది ఉత్సాహం కనిపిస్తోంది. అక్కడ పోగాయిన వారిని , "పక్కగా నిలవండి! వూరేగింపుని చెడ గోట్టకండి!" అని హెచ్చరిస్తూ వచ్చారు కొట్వాల్. అతని హెచ్చరిక విన్నదే తడవుగా చాలామంది, తమ ఇళ్ళ వైపుగా పరిగెత్తారు. అతి త్వరలో ఇళ్ళ ద్వారాల మీద మామిడి తోరణాలు వెలిశాయి, పూల మాటలు కిటికీల మీద వెళ్ళాడాయి. ఇళ్ళ ముందు స్త్రీలు, బాలికలు ఉత్సాహంగా రంగు రంగుల ముగ్గులు వెయ్యటం మొదలు పెట్టారు.
శనవర్వాడతో పేష్వా కోట వైపు నుంచి వినిపించిన ఫిరంగుల ఉరుము రామ్ శాస్త్రి పుర ప్రవేశం చేసాడని తెలిసింది. ప్రజలలో ఆనంద కోలాహలం ప్రారంభం అయింది. త్వరలో ఈ కోలాహాలనికి వూరేగింపు కోలాహలం తోడుయింది.
ముందుగా వందమంది ఆశ్వీకులు, వారి వెనుక రాజశివికం లో నారా ఫడ్నవీస్, సభా రామ్ బాపూ ప్రభ్రుతూలు, పల్లకీ వెనుక మరాఠా సామ్రాజ్య కాషాయ ధ్వజాన్ని తొండం తో ఎత్తి పట్టుకుని నెమ్మదిగా నడిచి వస్తున్న తెల్లటి అంబారీ ఏనుగు, వెండి అంబారీ లో గంబీర ముఖ కవళికతో కూర్చుని ఉన్న రామ్ శాస్త్రి , ఏనుగు వెనుక మరొక శతాశ్వదళం, దాని వెనుక శంఖారావం చేస్తూ, దుందుభులు మోగించే మేళం ఇవన్నీ చూడగానే వీరిని చూడగానే.
"రామ్ శాస్త్రుల వారికి సుస్వాగతం!--"
"రామ్శాస్త్రుల వారు, నిజంగా దేవుడి వంటి వారు!"

ప్రధాన న్యాయమూర్తి వారికి సహస్త్ర వందనాలు!"
"దక్కన్ దేశ రత్నం రామ్ శాస్త్రికి జయ్!"
అన్న నినాదాలు మిన్ను ముట్టాయి. ఎందరో పేద ప్రజలు పూల మాలలతో, సుగంధ ద్రవ్యాలతో ముందుకు వచ్చి అవి రామ్ శాస్త్రి కూర్చున్న అంబారీ లోకి విసరం మొదలు పెట్టారు. ధనవంతుల శ్వేత గజం మీద బంగారు, వెండి నాణాలు చల్లారు. క్షణ క్షణానికీ అక్కడి జన సమూహం విస్తరం అవుతూ వచ్చింది. ఊరేగింపు వీధి కొసని సమీపించింది. అక్కడ, మూలగా ఒక అమ్మాయి, కొన్ని పూలు పట్టుకుని నుంచుని ఉంది. ముఖానికి బొట్టు లేదు. వయసు తక్కువే అయినా వైధవ్యం సంభవించింది. కట్టుకున్న చీర చాలా ముతకగా ఉంది. ఆమె కోమల మయిన శరీరం దానిని భరించగలదా అన్నట్లు ఉంది. అంబారీ లోని రామ్ శాస్త్రి కనిపించగానే ఆమె ముఖంలోని నిరీక్షణా భావం అదృశ్యం అయింది. అపారమయిన భక్తీ భావం గోచరించింది. కళ్ళ నీరు నిండాయి. తొట్రు పాటుతో ముందరికి జరిగింది. రామ్ శాస్త్రి గారి పాదాలకి ఆ పుష్పాలు సమర్పించాలని ఆ యువతి ఉద్దేశం. కాని ఆ జన సమ్మర్ధం లో అది ఆమెకి వీలు కాలేదు. నిరాశతో అక్కడే నిలిచి పోయింది.
అదే సమయంలో ఒక విచిత్ర సంఘటన అక్కడి జనాన్నంతా ఆశ్చర్య చకితుల్ని చేసింది.
రామ్ శాస్త్రి ముందుకి వంగి మావటి వాడితో ఏదో చెప్పాడు. అతను వెంటనే ఏనుగుకి ఏదో అజ్ఞ వేశాడు. మావటి వాని అజ్ఞ వినగానే ఏనుగు ఆగిపోయింది. ఆగి, మోకరిల్లింది. అంతటితో వూరేగింపు అంతా ఆగిపోయింది. వెనుకటి కోలాహలం అంతా ఆగిపోయి ఆ ప్రదేశాన్ని ఒక పెద్ద నిశ్శబ్దం ఆవరించింది. అందరి కళ్ళూ రామ్ శాస్త్రి మీదనే ఉన్నాయి. అతను అంబారీ దిగి నేరుగా పూలు చేత పట్టుకుని నుంచుని ఉన్న అమ్మాయి వైపు వెళ్ళాడు. జనం సంభ్రామాశ్చర్యాలతో అతనికి దారి కలిగించారు.
"తల్లీ శ్యామా! నువ్విక్కడున్నా వామ్మా!" అంటూ రామ్ శాస్త్రి వాత్సల్యంతో ఆమె చేతులని తన చేతులలోకి తీసుకున్నాడు.
"నిన్నిక్కడ చూస్తూ ఉంటె నాకెంత ఆనందంగా ఉందొ తెలుసా! ఈ పూలు నా కోసమేనా పిచ్చి తల్లీ! ఈ పుష్పాల విలువ నీకు తెలీదు....! ఈ అశేష జనసమూహం నా మీద జల్లిన పుష్ప వృష్టి కన్నా ధనం కన్నా ఈ గొప్ప వూరేగింపు కన్నా ఈ శ్వేత గజం కన్నా ఫిరంగులు పేల్చి చేస్తున్న సన్మానం కన్నా ఎక్కువ విలువ కలవి నీ చేతి ఈ పుష్పాలు! వాటి సువాసనలతో నీ ఆత్మ సౌందర్యాన్ని ముల్లోకాలకీ చాటుతున్నాయి!
"ఈ లోకం ఏ అర్హతా లేని నా వంటి వాటిని సంమానిస్తుంది. శ్లాఘిస్తుంది. పేదరికం వల్ల అజ్ఞాతంగా ఉండిపోయే నీ వంటి దైవ సమాను లన తగిన వారిని గమనించదు. మీ సేవ వల్లనే కదా మాస్వల్ప కృషి ఫలించేది! అమ్మా, నేడు ఈ సమయంలో నువ్విక్కడ ఉండటం వల్ల మేమందరమూ ధన్యులమయ్యాము! పరమాత్ముడిని నేను కోరేదల్లా ఒకటే. ఈ భరత ఖండం లో చంఫాజీ వంటి వీరులు శ్యామా వంటి వీర వనితలు ఇంకా ఎందరో జన్మించాలి! మనదేశం సకల ప్రపంచానికి ఆదర్శ ప్రాయం కావాలి. ధర్మానికి నిలయం కావాలి."
(అయిపొయింది)
