ఆమె వెళ్ళిన మరుక్షణం నుంచి తిరిగి ఆమె పిలుపు కోసం ఎదురుచూడటం ప్ర్రారంభించాడు. అతడాసించిన విధంగానే రెండు నెలల తర్వాత ఢిల్లీనుంచి పిలుపువచ్చింది. కెప్టెన్ మాలతి బృందంలో కలిసిపోయి కొద్దివారాలు గడిపాడు ఫిజో ఆమె తనలా కేవలం ఒక్కవిద్యలో ప్రవీణురాలుకాదు. విద్యాధికురాలు: సాహసి.
అటువంటి కెప్టెన్ తో పాటుగా ఒక ఆశయసాధనకై జరుగుతున్న కృషిలో పాల్గొనటం ఎవరికయినా అదృష్టమే అనిపించింది తనకు.
టీములోని మిగిలిన వారందరూ అదే అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం అతడు గమనించాడు. కుట్టీ, గోయెల్, సిన్హా, ముఖర్జీ అందరూ ఆమెమీద ఆరాధనా భావం వున్నట్లుగానే చెప్పుకుపోయేవారు.
ఇప్పుడు ఏమయింది? తీరా ఆమె ఒక సమస్యతో తల దూర్చి ప్రమాదకరమైన స్థితిలో ఎక్కడో దిక్కు తెలియని చోటున చిక్కుకుపోయింది.
అటువంటి సమయంలో అనుచరులు అందరూ ఆమెను తిరిగి రప్పించుకోటానికి కృషిచేయాలి. కాని అందరూ తిరుగు ముఖాలుపట్టి వెళ్ళిపోయారు.
ఒక్కరయినా కెప్టెన్ మాలతిని అన్వేషించే ప్రయత్నంలో ముందుకు రాలేకపోయినారు. యిది దురదృష్టకరమయిన స్థితి! ఆలోచిస్తూ గుహలో అలాపరుండిపోయినాడు ఫిజో!
తన భవిష్యత్ కార్యక్రమం గురించి ఆలోచనా. తన అనుచరుణ్ణి రక్షించుకునే ప్రయత్నంలో కెప్టెన్ మాలతి గుర్తుతెలియని ప్రాణిచేతిలో చిక్కి దిక్కు తెలియని చోటుకి తీసుకుపోబడిన వైనము తలచుకుంటూనే సగం రాత్రి కరిగిపోయింది. అలా ఆలోచిస్తూ ఉండగానే రెప్పలు బరువుగా వాలినాయి. అలసట అతని మనసులోని అలజడిని జయించింది.
అతడు ప్రగాఢమయిన నిద్రాజగత్తులోకి వెళ్ళిపోయి నాడు. అలా ఎంతసేపు గడిచిందో తెలియదు. చలితీవ్రత తగ్గిపోయింది. రవంత వెచ్చదనంవల్ల శరీరం ఉల్లాసితమయింది రవంత గాలి వీస్తోంది.
ఫిజో చాలా బద్దకంగా కళ్ళు విప్పాడు.
గుహ ముఖం నుంచి దూరంగా వెండికొండల్లా మంచు ముద్దలతో ఉన్న గిరిశిఖరాలు కన్పిస్తున్నాయి. పీచిమబ్బులు గిరిశిఖరాల్ని కౌగలించుకుంటున్నాయి.
గుహలో గోడలన్నీ ఏవో పిచ్చిగీతల్లాంటి బొమ్మలు కన్పిస్తున్నాయి. అతడు వాటిని చూసిన మరుక్షణం చివాలున లేచి కూర్చున్నాడు.
ఎదురుగా ఉన్నతమయిన శిలావేదికమీద నిలిచినా రూపం అతనిని పరిశీలించటం అతడెరుగడు.
గుహలోపలి గోడలమీది పిచ్చిగీతలాంటి బొమ్మలు ప్రకృతి సహజంగా ఏర్పడినవికాక ఎవరో గీచినవాటిలా కన్పించినాయి.
అయితే ఇక్కడ ఇప్పుడో మరొకప్పుడో మనుషులు నివశించి ఉండాలి. ఆ ఆలోచన రాగానే ఫిజో నేత్రాలువిప్పారితమయినాయి. ముఖం అశృరాగరంజితమయ్యింది. గీతల్లాంటి బొమ్మల్ని పరిశీలించసాగాడు.
అవి నేర్పరి అయిన చిత్రకారుడు గీచిన చిత్రాల్లా లేవు. చాల అస్తవ్యస్తంగా ఆలోచనను ఒక క్రమంలో వ్యక్తులు చిత్రించిన వాటిలా అన్పించసాగాయి.
అతడు లేచి అన్ని చిత్రాలను పరిశీలించాడు. గుహ లోపలి భాగంవంక కనులు త్రిప్పాక ఒకవ్యక్తి వచ్చి తననుపరిశీలిస్తూ ఉండటం చూచిమరింతవిబ్రాంతుడయినాడు. ఎదురుగా నిలిచిన ఆ అద్భుతవ్యక్తి శరీరం ఉన్నతమయినది. రాగివర్ణంలో ఉన్న కేశ పాశాలు సుదీర్ఘంగా పెరిగిపోయి అస్తవ్యస్తంగా ఉన్నాయి.
ఫిజో అమితసంభ్రమంతో ఆవ్యక్తి దగ్గరగా వెళ్ళాడు. అతడు చిరునవ్వు నవ్వుతున్నాడు.
"నీవు మౌనివా?" అని అడిగాడు ఫిజో.
"అవును" అంటూ చిరునవ్వు నవ్వి, అతని శిరసుని చేయివుంచి ఆశీర్వదించాడు మౌని. కెప్టెన్ మాలతిని గురించి అతడే చెప్పగలడనిపించింది. ఫిజో తృప్తిగా నిట్టూర్చాడు,
6
"శరీరంలోకి రవంత వెచ్చదనం రావటంలో కన్నులు విప్పి చూసింది కెప్టెన్ మాలతి ఆవిచిత్రమానవుడు ఆమెను తనబాహువులలో బంధించి ఉంచాడు. ఊపిరికూడసలుపనంత గాఢంగా హత్తుకుపోయినాడు.
కెప్టెన్ మాలతి ఉలిక్కిపడి లేచింది. ఉడుంపట్టులా ఉన్న అతని బాహువులనించి బయటపడింది. ఆ ప్రయత్నం లో అతడు నిద్రాముద్రనించి బయటపడినాడు. ఎత్తయిన రాతిమీద చమరీ మృగాల చర్మాలను మెత్తని శయ్యలా అమర్చాడు. దానిమీదినించి ఉదుటున దిగిపోయింది మాలతి.
చిన్నపిల్లాడు తల్లి చెంగుపట్టుకొని ఆమెను అనుసరించి నట్లుగా అతడు కూడశయ్యమీది నించిదిగిపోయినాడు. అతని చూపులన్నీ మాలతిమీదనే ఉన్నాయి. ఒక రాత్రి అంతా ఆమెను తన బాహువులలో బంధించిఉంచిన ఆ విచిత్ర మానవుడు ప్రదర్శించేది ఆత్మయతా భావం అని అర్ధంచేసుకుంది మాలతి. అతనికి మరొక ప్రపంచం తెలియదు.
మానవుడు సంఘజీవి. మనోగతమయిన ఆలోచనలు అన్ని అర్ధం చేసుకుందుకు, తన ప్రజ్ఞాపాటవాలనుప ప్రదర్శించుకునేందుకు, సుఖదుఃఖాలను తనతో సమంగా పంచుకునేందుకు తనకు ఒక తోడుకావాలి. అది మనిషిలో అనాదిగా పెరుగుతూ వచ్చిన ఎలిమెంట్!
అతడు తనను తాకినా, తనవంక రెప్పవేయక చూచినా తనను ఒక రాత్రి అంతా బాహువులలో బంధించి ఉంచినా దాని వెనుక వున్న భావాలు ఆ ఎలిమెంట్ కు సంబంధించినవే అయితే అతడు వ్యక్తుడయిన విచిత్రమానవుడు.
అందునించి మనోగాతమయిన ఆలోచనలూ, శారీరక మయిన వికాసమూ ఒక స్త్రీని అనుభవించగలిగిన స్థితికి వచ్చాయి. కాని ఆ స్త్రీ తన ఎదురుగావున్న మాలతి అని అర్ధం చేసుకోలేకపోయినాడతడు.
తన ఒంటరితనాన్ని రూపుమాపేందుకు తనకు లభించిన దేవత అని మాత్రమే అని భావించాడు. ఆమె స్పర్శలో ఒక అపురూపమయిన తృప్తిని అనుభవించాడు. ఆ స్పర్శ పదేపదే తనకు కావాలని అతనికి అనిపిస్తోంది.
తనకు కావాలని అనిపించేదాన్ని, తనకు తృప్తి ఇవ్వ గలిగినదాన్ని సంపాదించుకోవటమే ప్రకృతినించి అతడు నేర్చుకున్నాడు.
