"ఎక్కడ చచ్చావే? ఎవరితో కులుకుతున్నావ్? ఏమిటా శబ్దాలు?" అని రంగస్వామి అంత బాధలోనూ పెళ్ళాం మీద ఎగిరిపడ్డాడు.
జరిగిందేమిటో ఆ పిల్లకి సగం సగం అర్ధమైంది.
ఏదో సర్ది చెప్పింది. సాక్ష్యాలు లేవు కాబట్టి రంగస్వామి అంతకంటే ఏమీ అనలేకపోయాడు.
పొట్టమీద కాలిన పుండ్లు తగ్గడానికి నెలకు పైగానే పట్టింది. శరీరం బాగైంది కానీ మనసు మాత్రం అలా కుతకుతలాడుతూనే వుంది.
అదిగో అప్పుడు రంగస్వామి నా దగ్గరికి వచ్చాడు.
"ఎలాగైనా దాన్ని పట్టుకోవాలి. నేను వున్నప్పుడు జాగ్రత్తగా వుంటుంది. కాబట్టి నువ్వు డిటెక్టివ్ పనిచేసి దాన్ని పట్టుకోవాలి. ఈ పని చేసి పెడితే నీకేం కావాలంటే అదిస్తాను" అన్నాడు.
"ఏమడిగితే అదివ్వాలి"
"ఒట్టు" అంటూ చేతిలో చేయి వేశాడు.
"వారం రోజుల్లో పని ముగించేస్తాను" అన్నాను.
మాట ప్రకారం వారం రోజుల్లో ఆ పిల్లను రెడ్ హాండెడ్ గా పట్టుకున్నాను.
"ఎలా?"
"చెబుతాను మంచి కాఫీ తెప్పించు" అంది రంగనాయకి.
"రంగస్వామితో కేసు పట్టిస్తానని ఒప్పుకున్నానుగానీ ఎలా పట్టుకోవాలో నాకర్ధమైంది కాదు" అంటూ తన మొదటి కేసు గురించి చెప్పడం ప్రారంభించింది రంగనాయకి.
రెండోరోజు నుంచి రంగస్వామి భార్య మధుమతి మీద ఇరవై నాలుగు గంటలూ ఓ కన్నేసి వుంచాను.
రోజూ సాయంకాలం అలా పొలాల దగ్గరికి వెళుతోంది తప్ప మిగిలిన టైమంతా ఇంట్లోనే గడుపుతోంది. రమేష్ ఎప్పుడూ ఆమె ఇంట్లోకి వెళ్ళడం లేదు. అంటే ఇంట్లో దుకాణం పెట్టేటట్టు లేదు.
మరి వీళ్ళిద్దరూ ఎక్కడ కలుసుకుంటున్నట్టు?
కలుసుకోకుండా వుండరు. ఒకసారి కొత్త సంబంధం ప్రారంభమయ్యాక ఏదో బలమైన కారణం వుంటే తప్ప ఫుల్ స్టాప్ పెట్టలేం మధుమతి తన భర్తకు అనుమానం వచ్చిందని తెలుసుగానీ దాంతోనే భయపడిపోయే రకం కాదు. మరి వీళ్ళు ఎలా, ఎక్కడ కలుసుకుంటున్నారు?
నాలుగురోజులు గడిచిపోయాయి.
అయిదోరోజు సాయంకాలం నేను చల్లగాలి కోసం పొలాల మీద పడ్డాను
అలా నడుచుకుంటూ వస్తున్నాను. ఉత్తరపువేపు గాలి చల్లగా శరీరాన్ని తగులుతోంది. బాగా పండిన జొన్నచేలు బంగారు తునకల్ని దేవతలు భూమి మీద ఆరబెట్టినట్టున్నాయి.
నా ముందున్న చేలో జొన్నకంకులు కదలడంతో నేను ఆగిపోయాను.
ఉత్తరపు దిక్కుగాలి వీస్తుండడంతో జొన్నకంకులన్నీ దక్షిణం వేపుకి వంగుతున్నాయి. ఓ దగ్గర మాత్రం అందుకు విరుద్దంగా కొన్ని కంకులు ఉత్తరం వైపుకు వంగుతున్నాయి.
కారణం ఏమిటి?
నా బుర్రలో ఏదో తళుక్కున మెరిసింది.
ఉత్తరం వేపుకు కంకులు వంగడం గాలివల్ల కాదు, మనుషులో, సక్కలో అక్కడుండడం వల్లే అలా జరుగుతోందని నాకు తట్టింది.
అందుకే నేనూ జొన్న చేలో చొరబడ్డాను.
వాళ్ళు చేసిన తప్పు నేను చేయలేదు. దక్షిణం వేపుకే నడవడం మొదలుపెట్టాను.
కొంతదూరం అలా నడిచానో లేదో ఎవరో చిన్నగా మాట్లాడుకుంటున్నట్టు గుసగుసలు విన్పించాయి.
అంటే నక్కలు కాదు- మనుషులే.
ఓ దగ్గర కూర్చుండిపోయాను.
వాళ్ళెవరో నాకు తెలియడం లేదు.
గొంతులు బట్టి పోల్చుకోవాలి.
"ఇప్పుడు మనిద్దరికీ ఓ పందెం. మనం ముద్దులు - ముచ్చట్లు ప్రారంభిద్దాం. ఎవరైతే తట్టుకోలేక ముందు ఎదుటి వ్యక్తిని మీదికి లాక్కుంటారో వాళ్ళకి నిగ్రహశక్తి తక్కువన్న మాట. ఆ వ్యక్తి ఓడిపోయాడన్న మాట చలించకుండా వుంటే గెలిచినట్టు లెక్క సరేనా?"
ఆ గొంతు రమేష్ ది.
సరసుడే అనుకున్నాను.
ఆమె తలూపినట్టుందే తప్ప మాట్లాడలేదు.
ఆమె ఎవరు? మధుమతా?
నేను ఇంకాస్త ముందుకి జరిగాను.
ఇప్పుడు వాళ్ళిద్దరూ స్పష్టంగా కనిపిస్తున్నారు.
సందేహం లేదు- ఆమె మధుమతే.
అతని మాటలకు సిగ్గుపడి మూతి ముడుచుకున్నట్టు, చీరమడతలు పైకెగబాకి ఆమె పదాలు బంగారు రంగు జొన్నచేలో కలిసిపోయినట్టు కనిపిస్తున్నాయి. పైట ఆమె ఎద మధ్యలో ఇరుక్కుపోయి రెండుకొండల మధ్య ప్రవహిస్తున్న సెలయేరులా వుంది. సాయం సంధ్య ఎరుపంతా ఆమె బొడ్డులో చిక్కుకుపోవడంతో అది కనకాంబరప్పూవులా అనిపిస్తోంది.
అతను తన నాలుకతో ఆమె నాలుక పొడవు ఎంతో చూస్తుంటే ఆమె అతని ఎంగిలి ఎంత రుచిగా వుందో చూస్తోంది. అతని వవేళ్ళు ఏదో రహస్యాల్ని వెతుక్కున్నట్టు కదులుతున్నాయి. అతని వేళ్ళు కదిలినప్పుడంతా ఆమె శరీరం ప్రకంపనాలతో వూగిపోతోంది. అతని చూపులు ఆమె కళ్ళల్లో కోరికను చల్లుతున్నాయి.
అతని చేతులు ఆమె వంపు సొంపుల్లో వంపెంతో సొంపెంతో చూస్తున్నట్టు రిథమిక్ గా కదులుతున్నాయి.
ఆమె అప్పుడప్పుడూ తమకాన్ని తట్టుకోలేక కాబోలు అరడుగు పైకెగురుతోంది.
అతను ఆమె మీదికి పూర్తిగా వంగి రెక్కలు లేని తుమ్మెదై పోయాడు.
పందెం గుర్తొచ్చినట్టు ఠక్కున పైకి లేచాడు.
కోరిక శరీరాన్ని మండిస్తుంటే, ఆ మంటల్ని ఆర్పుకోవడానికన్నట్టు ఆమె అతని నోట్లోకి తన పెదవుల్ని తోసి, వూపిరాడక గింజుకుంటోంది.
అతను మరింతగా ఆమెను రెచ్చగొడుతున్నాడు.
కామం బరువుకి శరీరం చిట్టినట్లు ఆమె తన చేతుల్ని పైకి లేపి అతన్ని మీదికి లాక్కుంది.
"ఓడిపోయావ్" అతను తన చిలిపితనాన్ని అక్షరాలను అంచులుగా కుట్టినట్లు అన్నాడు.
ఆమె దాన్ని పట్టించుకోనట్టు అతన్ని మరింతగా లాక్కుంది.
సూర్యుడు సెన్సారాఫీసర్ అయినట్టు కట్ చెప్పాడేమో మిగిలిన సంధ్య కాంతి కూడా మాయమైపోయింది.
