కాలానికి ఎవరితోనూ పనిలేదు. ముందుకుపోవడమే తెలుసుదానికి శారదకి నీరజ దినేష్ ల స్నేహం గొప్ప అనందాన్ని తృప్తిని యిస్తోంది. నీరజ మాట్లాడే మాటలు ఎంతో అర్ధవంతంగా కనిపిస్తున్నాయి శారదకి.
రామానికి లలితపై వ్యామోహముండే వుంటుంది. లేకపోతే తాను రామంతో మరో ఊరు రానంటే బతిమాలి తీసికెళ్ళే ప్రయత్నమే చేయలేదెందుకని - తనని ఒకరు మోసం చేస్తే తనూ మోసం చేస్తుంది. తప్పేముందీ! రామనికి తను అక్కర్లేక పోతే తనకి రామం కావాలా ! వద్దు, వద్దు - శారద మంచం మీదనుంచి లేచి కూచుంది. అప్పటికి రామనికి ట్రాన్సఫరయి ఆరునెలలు కావస్తోంది -
తెల్లవారు ఝామున తలుపు తడుతున్నారెవరో శారద తలుపు తీసింది. ఆశ్చర్యం ఎదురుగా రామం - 'మీరా' - ఆశ్చర్యంగా అంది శారద.
'నేనే' - లోపలకొచ్చి తలుపేసి శారదని కౌగిలించుకున్నాడు రామం.
'వదలండి - ఆర్నెల్లుగా లేని అవసరం నాతో ఇప్పుడెందుకొచ్చిందీ శారద మనసులో రామంపై అనుమానం బీజం, వృక్షమై పెరిగింది.
'శారద - ఏమిటి నువ్వనేది'
'నేను విడిపోవాలని నిశ్చయించుకున్నాను.'
'ఏమిటీ - పిడిగుపాటులావుంది ఆ మాటరామానికి
'దేనికీ'-
'మనసులు కలవకుండా కలసి బతకటం అనవసరం'
'అంటే'
'అంతే - శారద గట్టిగా అరిచి వీధి గదిలోకెళ్ళి కూచుంది.
రామం ఒక్కసారి నీరుకారిపోయాడు. భార్యను చూడాలనిపించి సెలవు పెట్టి వచ్చేసాడు కానీ రామం రెండురోజుల్లో తిరిగి డ్యూటీలో చేరిపోయాడు. మనసు ముక్క ముక్కలైంది. ఇదే వసంతంలో గ్రీష్మం!.
* * *
5
దినేష్ కారుహారన్ గుమ్మంలో మ్రోగింది. లోపలున్న శారద వీధి గుమ్మంలో కొచ్చింది. ఆ రోజు దినేష్ బర్త్ డే కి వెళ్ళలేకపోయింది శారద. రామం ఊళ్ళోనే వున్నాడు. దినేష్ కోసం కొన్న టై లోపలే వుంది. "రండి ఇది మీ కోసం కొన్నది" - టై ఎర్రని స్ట్రెబ్సతో చాలా ముచ్చటగావుంది.
థాంక్యూ - కానీ దినేష్ శారద వంక చూస్తూ అన్నాడు.
'అవునూ నీరజ ఏదీ'
' 'నీరజ మద్రాసెళ్ళింది. వారం రోజులదాకా రాదు' దినేష్ చూపులు శారదపైనుంచి మరలటం లేదు.
'మనం ఎల్లుండి బొంబాయి వెడుతున్నాం'
'ఎల్లుండా నీరజ రావాలిగా. అయినా ఏదోనసిగింది శారద.
'నిన్ను చాలా గొప్ప దాన్ని చేసే అవకాశం వస్తోంది శారదా. 'నన్ను గొప్పదాన్ని చేస్తారా' కిలకిలా నవ్వింది శారద.
'షేర్ మార్కెట్ అనే మాట విన్నావా'
'ఆ' - శారద కళ్ళుతిప్పుతూ అంది.
'బొంబాయిలో నీరజ పిన్నిగారు చేసేపని అదే - షేర్ మార్కెట్ స్టాక్ బ్రోకర్. షేర్ లు, షేర్ లు. ఓహ్ ఆ సందడి, ఆ భయం, ఆ ఆనందం, ఆ ఆవేశం - అన్నీ చూసితీరాలి. చెప్తే తెలియవు. ఆ షేర్ మార్కెట్ లో నీకు ఎంతో లాభమొచ్చేలా చేయాలని నా ఆశ. నిన్ను ఉన్నట్టుండి కోటీశ్వరురాలిని చేయాలని నాఆశ. ఏమంటావ్ దినేష్ సిగరెట్టు ముట్టిస్తూ అన్నాడు.
ఈ మధ్య ఎవరినోట విన్నా ఇదే - షేర్స్ - షేర్ మార్కెట్ - నిజంగానే అందులో ఏదో విశేషం లేకపోతే అందరూ ఎందుకు అలా ఎగబడతారూ ? - శారదలో ఆశ పెరగటం మొదలెట్టింది - కొన్న ప్రతిషేరు విపరీతంగా పెరిగిపోతే, తను అలా అలా షేర్ మార్కెట్ లో గొప్పదయిపోతే, కోటీశ్వరురాలయిపోతే అబ్బ - అంత అదృష్టముందా తనికి !.
శారద దినేష్ వంక చూసింది 'అవును - నేను ఊరికే అంట లేదు. మాఫ్రెండు మూడులక్షలు పెట్టి మొదలుపెడితే ముప్పయి కోట్ల లాభమొచ్చింది తెలుసా'.
'ముప్పయికోట్లా' - ఆశ్చర్యపోయింది శారద.
నిజంగా దినేష్ లాటివాడు తనబాగుకోసం, భవిష్యత్తుకోసం ఆరాటపడుతున్నాడంటే అతనికి తనపై ఎంత గౌరవం, అభిమానం వున్నట్లోనని మురిసిపోయింది శారద. ఒక మంచి స్నేహితుడు అతను అనుకొంది.
నాకు షేర్ మార్కెట్ గురించి అన్నివివరాలు చెప్పాలి - ముందు అన్నీ తెలుసుకుని తర్వాత బొంబాయి వస్తాను - శారద దినేష్ కి కాఫీకప్పు అందించింది.
'నేను చేసే బిజినెస్ అది. నువ్వు అనుకుంటున్న నీరజ ఇల్లు నీరజదికాదు. నాదే. నేనే నీరజ పేరున కొన్నా'.
మరీ ఆశ్చర్యంగావింది శారద.
'నీ పేరిట బొంబాయిలో అలాటి భవనమే కొనాలనుకుంటున్నా దినేష్ అనేసరికి శారద పకపక నవ్వింది.
జోక్ కి కొంతయినా అర్ధముండాలా - అంది
'జోక్ కాదు ..... నిజం.....అయితే ఎప్పుడో తెలుసా.....నీ కోర్టుకేసు పూర్తి అయ్యాక! దినేష్ శారద కళ్ళలోకి చూసాడు.
'మళ్ళీ వాయిదా ఎప్పుడుంది' -
'ఈ నెలాఖరుకి' - దినేష్ యాష్ ట్రీలో సిగరెట్టుపొడిని వదిలాడు తలుపుకొట్టారెవరో....టెలిగ్రామ్ !
శారద తండ్రి దగ్గర నుంచి - ఒంట్లో బాగా లేదని, వెంటనే బయలు దేరి రమ్మని టెలిగ్రామ్.
దినేష్ టెలిగ్రామ్ తీసి చదివాడు.
'మరెలాగ ఇప్పుడు. బొంబాయిలో ఆమె మనకోసమే ఎదురుచూస్తూ వుంటుంది. షేర్ మార్కెట్ వ్యవహారాలూ నీకు కొన్ని అప్పగిస్తానని చెప్పింది. మరి ఇప్పుడీ టెలిగ్రామ్ - దినేష్ శారదవంకే చూస్తున్నాడు. కోట్ల డబ్బు సంపాదించుకునే అవకాశం వచ్చినప్పుడు దాన్ని వదులుకుంటే ఎలా - ఈ దినేష్ తనని వదిలివెళ్ళిపోతే ఎట్లా పైగా తన విడాకుల కేసు పనులు, వకీలుతో మాట్లాడటాలు - అన్నీ ఈమధ్య ఇతనే చూస్తున్నాడు- ఇవన్నీ ఇలా వదిలేసి తను తండ్రికోసం వెళ్ళాలా. వెళ్ళాలా. శారద మెదడు పని చేయటంలేదు ఆ క్షణంలో. ఏవి మానవ విలువలో, ఏవి గౌరవించవలసినవో, ఏమో! మీరు చెప్పండి ఏం చేయాలో అంది.
'ఊ షేర్ మార్కెట్ లో అడుగుపెట్టే అవకాశం కలగటమే గొప్ప అదృష్టం - కానీ మరి కన్నతండ్రి - మీనాన్నకి ఎన్నేళ్ళు "దినేష్ అనగానే "ఏళ్ళతో ఏం పని. ఆయన మానాన్న" అంది శారద.
'అది నిజమే. మరీ ముసలాయనయితే ఈ టెలిగ్రాం అంత పెద్దగా పట్టించుకోనక్కరలేదు - ఏదో ముసలాడు, ఛాదస్తం అనితీసిపారేయవచ్చు - మనం బొంబాయి అనుకున్న ప్రకారం వెళ్ళిపోవచ్చు శారద మాట్లాడలేదు.
'మీ యిష్టం - ఆలోచించుకోండి, అదృష్టం ఎప్పుడూ రాదు. వచ్చినప్పుడు పట్టేయాలి పోనీయకుండా - నే వెడుతున్నా" దినేష్ బయటకి నడిచాడు.
