Next Page 
పధ విహీన పేజి 1


                                పధ విహీన                                                                      లత

                                       

 

    సౌశీల్యానికి కాణాచి, ప్రాతివ్రత్యానికి పట్టుగొమ్మ -- భారత నారి. పురాణ కాలం నాటి స్త్రీలకు తీసిపోదు విజయ. తప్పు క్షమించదు. శిక్ష విధించి తీరాలంటుంది.
    ప్రేమించిన వానికి సర్వస్వమూ అర్పణ చేసుకోనడానికి మించిన ధర్మం లేదు చిట్టికి.
    ఇరువురూ ప్రేమించిన వారే. కాని ఎంతటి అంతరం?

    జీవిత విలస ప్రతి పాదనలో పడి జగాన్నే మర్చి పోయిన మానవులు ఎవరయినా ఉంటె-- లోకం వారినే చెడిపోయిన వారు అని నిందిస్తుంది.
    ఉజ్జ్వలమైన ఆశలతో స్వప్నలతో జీవితం ప్రారంభించే వారికి పరిస్థితులు అనుకూలించక పొతే పధవిహీనత శాపంగా పరిణమిస్తుంది.
    అసలు స్వప్నాలంటూ పెంచుకొని అధర్మ పధంలో రూపకల్పనం చేసుకునే వారికి పధవిహీనత ఎలాగా తప్పదు. ఆ ఉజ్జ్వలత వెనకాల అందకారమూ తప్పదు. కాని ధర్మ పధంలో జీవిస్తూ క్రమం తప్పని స్వప్నాలను వాస్తవం చేసుకోవాలని ప్రయత్నించే వాళ్లకు కూడా ఈ శాపం తప్పటం లేదంటే అసలు స్వప్నాల లోనే ఒక తప్పు ఉన్నదని అనిపిస్తున్నది.
    కలలూ, ఊహలు, ఆలోచనలూ ఇవన్నీ శాంతి నివ్వటానికి బదులుగా బ్రతుకును అశాంతి పూరితం చేస్తున్నాయా అని అనుమానమూ వస్తుంది.
    తన బ్రతుకు వీటి వలన అశాంతి లో పడుతుందని ఏమాత్రం ముందు పసిగట్టిన చాలావరకు జాగ్రత్త పడేది విజయ లక్ష్మీ.
    భర్త జయప్రదరావు సాహచర్యం లో అసంతృప్తీ, అశాంతి లేకుండానే చాలాకాలం గడిపివేసింది.

                          
    బాల్యం ఇంకా పూర్తీ గా వదలక మునుపే అత్తవారింటికి వచ్చేసింది విజయ. ఆ తరువాత వృద్దురాలైన అత్తగారి పర్యవేక్షణ లో త్వరలోనే గృహిణి అయి హుందాతనం నేర్చుకుంది. ఉదాత్తుడూ, గంబీరుడు అయిన భర్త అంటే ఆమెకు అమితమైన ఆరాధనా ప్రేమా ఉన్నాయ్.
    అతని అడుగులకు మడుగు లోత్టుతూ ఉండడం లో ఆమెకేదో అపూర్వ నందం లభిస్తుంది. కాపురానికి వచ్చిన కొత్తలో గర్బవతి అయి ఏడవ నెలలో మృత శిశువును ప్రసవించింది. ఆ తర్వాత మళ్ళీ తల్లి అయ్యే భాగ్యం ఆమెకు లభించలేదు. ఏ అసుర సంధ్యా సమయంలోనో దూరంగా పసిపిల్ల ఏడుపూ తల్లి పాడుతున్న జోల పాటా వినిపిస్తే -- చాలాకాలం క్రితం తనను అన్యాయం చేసి పోయిన తన మృత శిశువు కోసం ఆమె రెండు కళ్ళూ చేమ్మగిల్లెవి.
    కాని మరుక్షణం లో అత్తగారి సేవలోనూ, భర్త కోసం నిరీక్షణ లోనూ, భగవంతుడి పూజలోనూ, ఆమె మునిగి పోయేది. ఈ దేశంలో పుట్టిన స్త్రీకి అంతకంటే జన్మ సాఫల్యం మరోటి లేదని విజయలక్ష్మీ నమ్మకం. సీతా సావిత్రుల పవిత్ర చరిత్ర చదివితే ఆమెకు కళ్ళు చేమ్మగిల్లెవి. పాతివ్రత్యం పరమాదర్శమని ఆమె నమ్ముకుంది. అంతేకాదు ఆచరణలోనే పెడుతుంది.
    ఉదయాన్నే లేచి భర్త కాళ్ళకు నమస్కరించి, మంగళ సూత్రం కళ్ళ కద్దుకుని, ఇంటి పనుల్లో మునిగి పోతుంది. ముందు పాలదాలికి నిప్ప్పు వేసి , మొగం కడుక్కునే సరికి ఆ నిప్పు రాజుతుంది. ఆ నిప్పే ఇంత కుంపట్లోనూ, బాయిలర్లోను వేసి, భర్త సేవకు ఉపక్రమిస్తుంది విజయ. అతను లేచేసరికి వేడినీళ్ళూ , పేస్టూ , బ్రష్షు సిద్దంగా ఉంచుతుంది. మొగం కడుక్కోగానే కాఫీ ఇస్తుంది. తరవాత అతని స్నానం, భోజనం దుస్తుల విషయంలో ఏ లోటూ రానివ్వదు. ఏ అలస్యమూ కానివ్వదు.
    అతను ఆఫీసుకు వెడుతుంటే కనిపిస్తున్నంత వరకూ వాకిట్లో నిలబడి చూసి ఒక నిట్టుర్పూ విడిచి లోపలికి వెడుతుంది ఆమె. సంప్రదాయం , సౌశీల్యం , ఆత్మ విశ్వాసం , సేవ నిండి ఉన్న ఆ స్త్రీ మూర్తి ని చూస్తె ఎవరికైనా పూజ్య భావం కలుగుతుంది. ఆ వీధిలో మంచికీ, చెడుకూ అన్నిటికీ విజయలక్ష్మీ కావాలి. ఆప్యాయతకూ, స్నేహానికీ విజయ లక్ష్మీ కావాలి. తన భార్య విజయలక్ష్మీని ఆదర్శంగా తీసుకోవాలని అవీధిలో ఉండే ప్రతి మగవాడూ అనుకుంటాడు. అంతేకాదు. జయప్రదరావు విజయను చూస్తున్నంత ప్రేమగా తమను తను భర్తలు చూడాలని స్త్రీలు వాంచిస్తారు. కాలం ఇలా సాఫీగా గడిచి పోవటం మానివేయడం మొదలు పెట్టం గానే వృద్దురాలైన అత్తగారు ఒకనాటి ఉదయాన కృష్ణ కృష్ణా అని ఏ లోకానికో ఎగిరి పోయింది.
    విజయ కిప్పుడు రెండు జ్ఞాపకాలు. ఒకటి తన బిడ్డ. రెండు అత్తగారు.
    విజయ కు పుట్టింట్లో ఇప్పుడెవరూ లేరు. ఇన్న ఒక్క సవతి అన్నగారూ దుర్గాపూరు లో ఉద్యోగం చేస్తున్నాడు. నూటికి కోటికీ ఒక నాడు ఒక కార్డు ముక్క వ్రాసి తన బాధ్యత తీరిపోయిందనుకుంటాడు అతను. ఇక అత్తవారింట్లో కి తను రాగానే తన తండ్రీ ని సోదరుడీ ని కూడా భారత్లోనే చూసింది విజయలక్ష్మీ.
    అత్తగారు కొడుకును "పదుడూ ' అనీ "పధా' అనీ పిలిచేది. విజయ కూడా ఏకాంత సమయాల్లో విలాసినిగా మారిపోయినపుడు "పధా, ఇటు చూడు" అంటూ ఉండేది. ఆ పిలుపు వింటే జయప్రద రావుకు అమితమైన ఉద్రేక ఉత్సాహాలు కలుగుతూ ఉండేవి. సౌందర్య వతీ, సమర్దురాలూ అయిన తన చిన్నారి భార్యతో అతను ఇంతకాలం నుంచీ అనుభవిస్తున్న అపూర్వ సుఖానికి అవధులూ లేవు. తృప్తీ లేదు. ఎప్పటి కప్పుడే ఆమె స్పర్శ, ఆమె విలాసం అతనికి కొత్తగా ఉంటాయి.
    రాత్రి అంత మోహినీ మూర్తిగా మారిన భార్య తెల్లవారే సరికి ఇంత హుందాగా , గంబీరంగా ఎలా మారుతుందో అతనికి అవగతం కాదు. అప్పుడామెను చూస్తె మోహం కలుగదు. పూజ్య భావం కలుగుతుంది. ఆమె అజ్ఞ లను తలదాల్చా లనిపిస్తుంది. ఆమె చల్లని పర్యవేక్షణ లో తనను తాను జోకొట్టుకోవాలనిపిస్తుంది.
    జీవితం అనేది తనకు విజయ లక్ష్మీ ని ఒక మహావరంగా ప్రసాదించింది. భర్తను పూజించి ప్రేమిస్తుంది. కోప్పడి లాలిస్తుంది. తిట్టి ఆజ్ఞాపిస్తుంది. విసిగించి వేడుకొంటుంది. విదిలించి దగ్గరికి తీస్తుంది. విజయ విలాసాలు ఎప్పటి కప్పుడే అతనికి కొత్త. అందుకే ఆమెను వదిలి స్వర్గానికి పొమ్మన్నా అతను పోడు.
    విజయ అందం కూడా తక్కువేం కాదు. పట్టుచీర కట్టుకుని నిండుగా పమిట కప్పుకోన్నప్పుడు కూడా ఆమె శరీర కాంతులు వెలికి ప్రవహిస్తూనే ఉంటాయి. ఎప్పుడూ జయప్రదరావు అంటూ ఉంటాడు--
    "నా ఎదుట కూడా పమిట అంత నిండుగా కప్పుకోవాలా ఏమిటి?' అని.
    తర్జనితో అవన్నీ బెదిరించి "ఇలాటి మాటలు అనటానికి మీకు వెరుపు లేడూ?' అన్నది విజయ.
    "మొగుడిని కదా నీ అందం.........."
    "ఛీ. ఊరుకోండి."
    "విజయా....

    "ఊ."
    "ఇంత అందం ఎదేముడిచ్చాడు  నీకు?"
    "ఆడవాళ్ళు అందంగా ఉండరా ఏమిటి? అన్నీ ఆశ్చర్యాలే మీకు."
    "ఇంత అందం గానా?"
    "మా నాయనమ్మ ఇంకా అందంగా ఉండేది. కాస్తో కూస్తో నాకు ఆవిడ పోలికే వచ్చింది. చివరి రోజుల్లో పక్షపాతం తో తీసుకుని...." "ఇహ చాల్లే......"అని కాఫీ త్రాగడం లో నిమగ్న మయ్యాడు అతను. హటాత్తుగా భర్త ఎందుకని సంభాషణ తెంచేశాడో ఆమెకు తెలియలేదు. దీనికి కారణం నాయనమ్మ పక్షపాతం ప్రసక్తి అని ఆమెకు అనిపించనూ లేదు. బిక్క మొగం తో నిలబడింది. జయప్రదరావు ఆమెను దగ్గరకు తీసుకుని-- "పక్షపాతం సంగతి దేనికి?' అన్నాడు.
    విజయ నవ్వి "అదా. అది నాకు రాదు లెండి. మీ ఒడి;లో ఇలాగే ప్రాణాలు పోతాయి" అన్నది.
    జయప్రద రావు ఆమె నోరు మూశాడు.
    "మీకు తెలియదు. ప్రతిరోజూ వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్ధించేది ఇందుకే. మీ ఒడిలోనే నా ప్రాణాలు పోవాలని" అన్నది ఆమె అతని చెయ్యి తప్పించి..గడియారం గంట కొట్టడం ప్రారంభించింది. ఇద్దరి కళ్ళూ అప్రయత్నంగా దాని వేపు తిరిగాయి. ఇద్దరి కళ్ళూ నీటితో నిండి ఉన్నాయి.
    ఆ కిందటి రోజే శరత్ భాబు విరాజ్ బహు ఇద్దరూ చర్చించు కోటం జరిగింది.
    "నేనయితే ఆ పరిస్థితులే కాదు ఏ పరిస్థితుల్లోనూ భర్తను వదిలి పెట్టను-- అంత మాత్రానికేనా?" అన్నది విజయ.
    "అలా కాదు విజయా. పరిస్థితులనేవీ మనిషి చేత ఎన్ని వెధవ పనులు చేయిస్తాయో నీకు తెలియదు. ఎటువంటి వారయినా పరిస్తితుల్ని బట్టి కొన్ని పొరపాట్లు చేయటం సహజం. వారికి సానుభూతి ఇవ్వడం నేర్చుకోవాలి గాని, విమర్శించకూడదు. బ్రతకటం మాటలు కాదు" అని మందలించిన భర్త కేసి అని మేషంగా రెండు నిమిషాలు చూసి-----


Next Page 

WRITERS
PUBLICATIONS