Previous Page Next Page 
మూసిన తలుపులు పేజి 9


    
    బాధతో బొంగురు పోయిందతని కంఠం.
    "ఇందులో సమస్య ఏముంది రాజ్? నేను కలలు కంటున్న శుభదినం వచ్చింది. అది నిన్ను బాధిస్తే నా తప్పే అవుతుంది."
    గుండె దడదడలాడుతుండగా చెప్పింది రజియా. అతని వాలకం చూస్తుంటే ఇష్టం లేనట్లే వుంది. "కరుణించు, భగవాన్!' అనుకొంది మనసులో.
    "ఇది బాధో లేక ఆందోళనో అర్ధం కావడం లేదు. నా మనసెప్పుడూ ఈ విషయం గురించి ఊహించి ఉండలేదు. ఆసలు మన పరిచయం ప్రేమకు దారి తీస్తుందని ఊహించి ఉంటె దాన్ని మధ్యలోనే త్రుంచేసేవాడిని."
    "రాజ్!" ఆత్రుతగా అంది రజియా.
    "క్షమించు , రజియా . నా చనువును నువ్వు అపార్ధం చేసుకొని ఉంటె నేను అందుకు బాధ్యుణ్ణి కాలేను."
    "ఇన్నాళ్ళూ నాతొ ఉండి నన్ను అర్ధం చేసుకొన్న దిదేనా రాజ్! నా ఆరాధన నిరాకరిస్తావా?' వస్తున్న దుఃఖాన్ని అపుకొంటూ అడిగింది రజియా.
    "నిన్ను నిరాకరించాలని గానీ, స్వీకరించాలని గానీ నేను ఎన్నడూ అనుకోలేదు, రజియా! కానీ నే భయపడుతున్నది ఒకే విషయం. నా జీవితం విచిత్రమైన గతుకులతో నిండి ఉంది. నాకు తెలిసి ఉన్నంత వరకు తల్లి ప్రేమ కానీ, తండ్రి ప్రేమ కానీ ఎరుగను. పరాయి వారి ఆధారంతో బ్రతుకును ఈడ్చు కోస్తున్నాను. నాదంటూ, నావరంటూ లేరు ఈ విశాల ప్రపంచం లో అటువంటి ఈ బికారిని నీలాంటి వారు నమ్ముకొని ప్రయోజనం లేదు. నన్ను ఆరాధించి ఏం పొందగలవు?"
    "నాకు నీ అనురాగ ముంటే చాలు. రాజ్! ఈ జీవితంలో నాకింకేమీ వద్దు."
    "రజియా! ఆ ప్రేమ జీవితాన్ని తలచుకొంటే భయమేస్తుంది. జీవితంలో నా కాళ్ళ పై నేను నిలబడే వరకు ఈ ప్రేమ, పెళ్ళి వీటి దరిదాపులకు పోకూడదను కొన్నాను. ఈనాడు నీ కోరికతో నా నిశ్చయం హటాత్తుగా మారిపోతోంది. అది ఎటువంటి అనర్ధాలకు దారి తీస్తుందో నను భయపడుతున్నాను. నీ మనసు నొప్పించలేను."
    "నేను నీ పిలుపు కొరకు వేచి ఉంటాను, రాజ్! అంతవరకు నిన్ను నా హృదయం లో దాచుకొని అరాదిస్తుంటాను. అనుమతి నివ్వు."
    "రజియా! నన్ను ఇలా బాధించడం న్యాయం కాదు."
    "కాదు, రాజ్! నా ప్రార్ధన అంగీకరించు. లేకుంటే ఈ బ్రతుకే నిరరర్ధకం" అంటూ చేతులు జోడించింది.
    అదే దీనత్వం; అదే ప్రార్ధన. ఎందుకీ ఆవేదన ఆడవారిలో? ఆ ప్రార్ధన లో వసంత రూపం దీనంగా కనబడింది. ఆనాడు నీలో హృదయం లేదు, ఈనాడైనా ఈదీనూరాలి కోరిక మన్నించి అని ఎవరో ఆజ్ఞాపించినట్టయి ఉలిక్కి పడ్డాడు రాజ్.
    "రజీ, అటువంటి మాటలనకు. నీ యిష్ట ప్రకారమే కానివ్వు" అని ఆమె చేతులను తన చేతులలోకి తీసుకొన్నాడు.
    "రాజ్" అంటూ అతని భుజం మీద వాలిపోయింది రజియా.
    తెలికపడ్డాయి రెండు హృదయాలు. అంతకు మునుపు కన్నా రెట్టింపయిన ఉత్సాహం వారిలో ఉంది. వారి ఆనందం రంగులు మార్చుకొంది ప్రేమ వారిని మరింత గట్టిగా బధించింది. అందరికీ లభ్యం కాని, దూరమైనా ప్రవిత్రమైన ప్రేమ. ఏమిటో అందులోని ఆనందం, అందులోని సౌఖ్యం, అందులోని తృప్తి అనుభవించిన వారికే తెలియాలి.

                                       6
    పాఠం చెపుతూ జేబురు మాలుతో చెమట తుడుచు కొంటున్న భానుమూర్తి ని రెప్ప వెయ్యకుండా చూస్తుంది వసంత. అనర్గళంగా సాగిపోతున్న అతని ఉపన్యాసాన్ని విద్యార్ధులంతా అతి శ్రద్దగా వింటున్నారు. అందరికీ అతడంటే గౌరవమూ, భక్తీ, భయమూ అలవడ్డాయి. ఆ క్లాసుకు అందరూ హాజరయి చక్కగా చదువు కొని వస్తుంటారు. లేకుంటే ప్రశ్నలు వేసి మెత్తగా చీవాట్లు పెడతాడని భయం.
    చెప్పడం ముగించి "అందరికీ అర్ధమయిందనుకొంటాను." అన్నాడు క్లాసంతా కలయ జూచి.
    ఎవ్వరూ పలుకలేదు కానీ కొన్ని తలలు అయిందన్నట్లు అటూ యిటూ ఊగాయి.
    "ఏమైనా సందేహ ముంటే లేచి అడుగవచ్చు." వసంత మెల్లిగా లేచింది.
    "యస్. వాట్ ఈజ్ యువర్ డౌట్ ప్లీజ్?" అడిగాడు భానుమూర్తి ఉత్సాహంగా.
    "ఈ పోయం అర్ధం కాలేదు సార్" అని ఒక పద్యం చెప్పింది.
    భానుమూర్తి అ పద్యాన్ని మరోసారి చెప్పి "ఇప్పుడు మీ సందేహం తీరిపోయిందనుకుంటాను" అన్నాడు.
    "పూర్తిగా కాలేదు" అంది వసంత.
    "మీ ఒక్కరి కోసం టైం వెస్ట్ చెయ్యలేను. ఆ తర్వాత వచ్చి స్టాఫ్ రూమ్ లో కలుసుకోండి. చెప్తాను."
    అలాగే నంటూ చిన్నగా నవ్వుకొంటూ కూర్చుంది వసంత. టైం చూసుకొన్నాడు భానుమూర్తి. ఇంకా పది నిమిషాలు ఉంది. అంతకు ముందు రోజు జరిగిన పాఠం లో కొన్ని ప్రశ్నలు వేశాడు.
    మొదటిసారిగా వసంత ను అడిగాడు. ఏమీ చెప్పలేక పోయింది. "కాలేజీ కి వచ్చింది చదువు కోవడానికి గాని లెక్చరర్ల ను యెగతాళి చెయ్యడానికి, వారి కాలాన్ని వృధా చెయ్యడానికి కాదని తెలుసుకొంటే మంచింది. "కూర్చోండి " అని "నెక్ట్స్" అన్నాడు.
    వసంత అవమానంతో , తల ఎత్తలేక పోయింది. నీ పని పడతాలే అనుకోంది మనసులో.
    సాయంకాలం లాస్టు పీరియడు క్లాసు ఎగుర గొట్టి స్టాప్ రూమ్ కు పోయింది వసంత. భానుమూర్తి ఒక్కడే కూర్చొని ఏదో పత్రిక చదువు కొంటున్నాడు. ఆమెను చూసి అది ప్రక్కన పెట్టి కుర్చీ చూపించాడు . ఆ సమయంలో అక్కడ మిగతా లెక్చరర్లు ఎవ్వరూ లేరు.
    "మీ కే పాఠం అర్ధం కాలేడో చెప్పండి."
    వసంత పుస్తకం తీసింది.
    ఇంతలో ఫ్యూన్ వచ్చి "సార్, మిమ్మల్ని ఇంగ్లీషు హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ వారు పిలుస్తున్నారు." అన్నాడు.
    భానుమూర్తి ఏం చేస్తామన్నట్లు చూశాడు.
    'సరే, మీరు వెళ్లి రండి. నేను రాత్రికి మీ గదికి వస్తాను. అప్పుడు చేపుదురు గానీ" అని లేచింది.
    భోజనం చేసుకుని వసంత భానుమూర్తి గదికి పోయింది. భానుమూర్తి అవివాహితుడు. గది ఆద్దేకు తీసుకుని ఉంటున్నాడు. వసంత గదిలో అడుగు పెట్టేప్పటికి భానుమూర్తి వాలు కుర్చీ లో పడుకొని కళ్ళు మూసుకొని ఉన్నాడు. వసంత తన రాక సూచిస్తూ పొడిగా దగ్గింది.
    'ఓ వసంతా! రావేమో ననుకున్నాడు. అలా కుర్చీ తెచ్చేసుకొని కూర్చో" అన్నాడు.
    వసంత చిరునవ్వులు ఒలక బోస్తూ అతని కెదురుగా కుర్చీలో కూర్చుంది.
    వసంత అతని చేత అర్ధం కాలేదంటూ చాలా పాఠాలు చెప్పించుకోంది. అతడు చెపుతున్నంత సేపూ అతని మొహాన్ని చూస్తూ కూర్చొంది. పాఠాలు విందో లేదో ఆ దేవుడికే తెలియాలి.
    ఒక గంట అయిన తర్వాత "ఇక వెళ్తాను" అని లేచి మరికొంచెం సేపు కూర్చోమంటాడెమోనని నిలబడింది. ఆ వెలుగులో భానుమూర్తి ఆమె అందాన్ని పరీక్షించాడు. జిగేలు మనిపించే ఆ సౌందర్యాన్ని తాకాలని పించింది.
    అంతే. మరు క్షణం లోనే ఆమె అతని కౌగిట్లో ఇమిడిపోయి పెనుగు లాడసాగింది. తనివితీరా ఆమె ఆధారాలను ముద్దు పెట్టుకొని ఆమెను వదిలేసిన అతని చెంప చెళ్ళు మంది.
    ఆ దెబ్బ అతనిలో అణిగి ఉన్న పౌరుషాన్ని , మగతనాన్ని పురికొల్పింది. ఫలితం అతని బలమైన చేతుల నుండి తప్పించు కోలేక మెలికలు తిరిగింది వసంత. కొంతసేపటి వరకు వారికి కాలగమనం తెలియలేదు.
    తమాషా అనుకొన్న అవకాశం ఆవేశాన్ని కలుగజేసింది. ఆ ఆవేశం అనర్ధాన్ని తెచ్చింది. ఆ అనర్ధం వల్ల వచ్చిన నష్టమేమీ ఉండదు. కానీ మనసు అద్దం  వంటిది. ఆ అనర్ధం మాయని మచ్చలా మిగిలి పోతుంది. అనుకోకుంటే ఏమీ జరగనట్లే ఉంటుంది. అదే తమాషా అయిన ఆ అనుభవం. ఆ అనుభవం కోసమే లేనిపోని అనర్ధాలు, మనస్పర్ధలు, కలతలు. ఎవరికీ ఏ నష్టం కలుగ చేయదంటూనే గొప్ప నష్టాన్ని, విఘాతాన్ని సృష్టించే ఆ అనుభవ మహత్యం చాలా గొప్పది.
    భానుమూర్తి పువ్వు నుండి బయటపడ్డ తుమ్మెద వలె లేచి నిలబడ్డాడు. వసంత మితిమీరిన కోపంతో దుఃఖంతో అక్కడి నుండి లేవలేక పోయింది. ఆమె ఏడుస్తుండడం చూసి భానుమూర్తి సిగ్గుపడ్డాడు.
    "క్షమించు , వసంతా! ఆవేశం లో నేనేం చేశానో నాకే తెలియదు" అన్నాడు తలవంచుకొని.
    ఖస్సు మంటూ లేచింది వసంత. "సిగ్గులేక చేసినదానికి మళ్లీ నిన్ను క్షమించాలా? నువ్వు మనిషివి కాదు. పశువు కన్నా హీనంగా ప్రవర్తించావు. నా జీవితం ఏమౌతుందని ఈ అత్యాచారానికి ఒడి గట్టారు?"
    "ఆవేశ పడకు, వసంతా! నీ జీవితానికి ఎలాంటి ఆపదా రానీను. నిన్ను పెళ్ళి చేసుకొంటాను. నన్ను నమ్ము."
    "మీ మొహానికి అదోక్కటీ తక్కువ. నీలాంటివారిని పెళ్లి చేసుకోవడం కన్నా చచ్చేది మేలు. ఇంకెప్పుడూ నాకు మీ మొహాన్ని చూపించకండి. అలా జరిగితే ఏం జరుగుతుందో చెప్పలేను. జాగ్రత్త." అని కోపం వచ్చినా ఏం చేయలేక అక్కడి నుండి వెళ్ళిపోయింది.

                              *    *    *    *
    పిక్చర్ కు పోదాం పద, రాజ్" అంటూ రజియా అతని చేయి అందించింది.
    రాజ్ తటపటాయించాడు. ఆమెతో పిక్చర్ కు వెళ్ళడానికి తన దగ్గర డబ్బులు లేవు. తను సినిమాలు చూడడం ఏ సంక్రాంతి కో లేక దీపావళి కో. తన పరిస్థితి అలాంటిది. జల్సాగా ఖర్చు పెట్టడానికి తన దగ్గర డబ్బులు ఉండవు.
    "ఏమిటి రాజ్, ఆలోచిస్తున్నావు?"
    "రేపు వెళదాం లే, రజీ." తప్పించుకో చూశాడు.
    "రాజ్, మనలో దాపరికాలేందుకు? నేను వెంట నుండగా నువ్వు ఏమీ ఖర్చు పెట్టడానికి వీల్లేదు. ఇంకా నీ దృష్టి లో నేను పరాయి దాన్నయితే నీ యిష్టం." అతని పరిస్థితి అర్ధం చేసుకొని బాధగా అంది రజియా.
    "అది కాదు, రజీ పద పోదాం" అని ఆమెకు కష్టం కలిగించడం ఇష్జ్తం లేక ఆమె చెయ్యి పట్టుకొని లేచాడు.
    "మేనేజరు" అని బోర్డు ఉన్న గదిలో నుండి సిగరెట్టు త్రాగుతూ గోపీ బయటికి వచ్చి బాల్కనీ లోకి నడిచాడు. గేటు వద్ద నిలబడి సినిమాకు వచ్చిన వ్యక్తుల నందరినీ చూశాడు. రంగురంగుల చీరెలు ధరించిన అందమైన ఆడవారి తోనూ, పాలిష్ చేయబడిన తెల్లటి దుస్తులు ధరించిన పురుషుల తోనూ చూడ ముచ్చటగా ఉన్న ఆ దృశ్యాన్ని చూసి ఏదో తెలియని ఆనందం అతని మనసును ఆవరించింది. వారిలో హోదా తో గంబీరంగా ఉండేవారు, ఆడంబరం గాను, నిరాడంబరం గాను ఉండేవారు ఉన్నారు. కాంతి లో తళుక్కు మని మెరిసే నెక్లేసు లతోనూ, బంగారు ఉంగరాలతో నూ క్రొత్త అందం అలరారుతుంది.
    ఇంతలో ముగ్గురు స్త్రీలు వచ్చారు. గేటు కీపర్ ఒకడు వారి టికెట్లు చింపు తుండగా మరోకడు వారికి సీట్లు చూపుతున్నాడు. వారిలో ఒక అమ్మాయి అక్కడే నిలబడి ఉన్న గోపీని చూసి అక్కడే నిలబడిపోయింది. ఆప్రయట్నంగా ఆమెను చూసిన గోపీ గతుక్కుమన్నాడు. అతని గుండె దడదడలాడింది. ఆమెను చూసి చూడనట్లు తల మళ్ళించేశాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS