Previous Page Next Page 
చాటు పద్యమణి మంజరి పేజి 9

 

    ఉ.     తల్లి సతీమతల్లి పదతామర సాశ్రిత' కల్పవల్లి భా
        స్వల్లలితంగవల్లీ రతివల్లభుతల్లి కృపారనంబు పైఁ
        జల్లి నిరంతరంబు మముఁ జల్లని చూపులఁ జూచి నీవు మా
        యిల్లను పాలవెల్లి వసియంపఁగదే జగదంబ భార్గవీ!

                గొట్టెముక్కుల నరసింహారాజుగారు.
    
                 కార్తవీర్యార్జునా!

    శా.    శ్రీరాజిల్లఁగఁ బ్రోజ్జ్వలన్మణిగణశ్రీ మించు సింహాసనం
        బారూడస్థితిచే వహించి ఘనభూపాలంకరిష్ణుండవై
        రారాజుల్ వినుతింపఁగా భువనముల్ రక్షించుమీరాజసం
        బారాదించి నుతింతు మేరునగధైర్యా! కార్తవీర్యార్జునా!

    మ.    లలితెంద్రోపలనీల భక్తజనపాలా సద్దయావాల ని    
        శ్చలసంధ్యారుణదేల సుందరతరశ్యామాయుతాలోల ని
        స్తులశుంభడ్గుణజాల సంతతఘనస్తుత్యైక భూపాల య
        త్యలఘు ప్రాభవశీల మేరునగధైర్యా! కార్తవీర్యార్జునా!

    మ.    నవరత్నోజ్జ్వలదివ్యభూష నతనానా భక్త పాషా మహా
        హవసంరంభవిజృంభమాణరివు బాహాటోపశోషా జన
        స్తవనీయోజ్జ్వలభాష దీనజనదోష ద్వేష లావణ్య గౌ
        రవసం మోహన వేష మీరునగధైర్యా! కార్తవీర్యార్జునా!

    మ.    గ్రహసందర్శన మైనచోట భయముల్ కన్పించుచోటన్ దురా
        గ్రహవృత్తిన్ రివు లేచుచోట నిడుమల్ గారించుచోటన్ నవ
        గ్రహవేఢల్ ఘనమైనచో దమసుమంత్రంబే సదా ద్రవ్యసం
        గ్రహమై భక్తులఁ బ్రోచు మేరునగధైర్యా! కార్యవీర్యార్జునా!

    శా.    నీలేందీవరదివ్యకాయ సురమౌనిశ్రేణి సంస్తూయ భ
        క్తాళీమానవసంవిదేయ కరుణాదౌరేయ విద్విణ్మదో
        త్తాల స్తంభనసాంపరాయ విలసడ్ గ్రైవేయ కళ్యాణ భ
        వ్యాలంకారనికాయ మేరునగధైర్యా! కార్తవీర్యార్జునా!

    మ.     కరుణాపాంగ నవాతసీకుసుమరంగత్కోమలాంగ ప్రభా
        కరనీకాశకనద్రథాంగ రణరంగ స్తైర్య శౌర్య క్షపా
        చరసందోహతమః పతంగ మకుటస్పారోత్తమాంగారి సం
        హరదోర్దండభుజంగ మేరునగధైర్యా! కార్తవీర్యార్జునా!

    మ.    సరసీజాక్ష విశాలవక్ష భవశిక్షాదుష్టచోరారికుం    
        జరహర్యక్ష కృపాకటాక్ష బలదక్షా చక్రసంరక్ష భూ
        భరణాధ్యక్ష మహోరగాది మృగకృద్భాధాపహా రేక్ష ని
        ర్జర మౌని వ్రజపక్ష మేరునగధైర్యా! కార్తవీర్యార్జునా!

    మ.    పటుదీర్ఘాంచిత బాహుదండ సమరప్రారంభ శుంభన్మదో
        త్కకకోదండ ప్రచండకాండనత హృత్కంజాత మార్తండ ది
        క్తటవిద్యోతితదానశౌండ హిమరుద్గండద్వయోద్దండ దు
        ర్ఘటదేవారివిఖండ మేరునగధైర్యా! కార్తవీర్యార్జునా!

    మ.    గిరిదుర్గాటవి దుర్గమాస్థల జలాగ్ని క్రూర పై శాచచొ
        రరివువ్యాఘ్రలులాయ సూకరమృగేంద్ర వ్యాశవై హంగ వా
        శ్చర వర్షాతపశీతవాత ఘననాశం బిష్టసంధాన ము
        ర్వర నీమంత్రబలంబు మేరునగధైర్యా! కార్తవీర్యార్జునా!

    మ.    గరిమ న్నీదుషికారు వైభవము వక్కాణించగా శక్యమా    
        వరభీరీపటహాది ధంధణధణధ్వానంబులున్ డిండిమో
        త్కరడిండిండిమ డిండిమారవము లుద్యత్తూర్యనాదంబులు
        ర్వరలో దుర్భరమౌర మేరునగధైర్యా! కార్తవీర్యార్జునా!

    మ.    తురికీ రాణి తురాణ్యరబ్బీహయముల్ దూకించి శాబాసు బా
        పురేయంచున్మెడలప్పళించి హవుసింపొందంగ తేగాను రే
        తరవారుల్ ఝుళిపించగన్ బగలు సర్దార్ ఘార్నిఘల్ సేయానీ
        హరువౌదౌఱతునెంతు మేరునగధైర్యా! కార్తవీర్యార్జునా!
    
    శా.    దాటున్ గుల్కెడు కళ్ళేమున్ పసిఁడిగండాపట్టు కింఖాపు చే
        వాటంబై తగుజీను పోషు మణిరవ్వల్ జుగ్జగాయించుదు
        చ్చీటంగున్ బిరుదందియల్ కలుగు తేజిన్ స్వారియై లీలఁజె
        ర్లాటం బాడెద వౌర మేరునగధైర్యా! కార్త వీర్యార్జునా!

    శా.    జంగోష్బేషు జగా జిరాసరి ఫెనల్ జామాతుమంపట్టుక
        మ్మిరుపేటీ మొకమాలు ఠంచికిలిదమ్కి మోరు షంషేడుదు
        స్తురుమాల్ కస్తూరి బొట్టు సిస్తుగులుకన్ తుర్కీహయంబెక్కి వా
        హ్వారె నీవేఁగేదుస్వారి మేరునగధైర్యా! కార్తవీర్యార్జునా!

 

            బ్రహ్మబిల పంచరత్నములు
    
    సీ.    నీలతోయద మధ్య నివారశూకవ
                   త్పరిపూర్ణ కాంతితోఁ బ్రబలుచుండు
        శంపాలతలభాతిఁ జటుల ప్రకాశమై
                    చంచరీకమురీతి జరుగుచుండు
        కరుకుంభమధ్యస్థ ఘనమౌక్తికద్యుతి
                     ప్రబల ప్రకాశమై పరగుచుండు
        శరదిందుచంద్రికాస్వచ్చ విద్యోతమై
                    యాహ్లాదజనకమై యలరుచుండు

    గీ.    పద్మగర్భోద్భువము గొల్పు భానుపగిదిఁ
        ఐటిమదీపించుఁ జటుల హృత్పద్మమందుఁ
        బరమహంసవిహార చిత్ప్రణవధార
        పదుల నైదింటశోభిల్లు బ్రహ్మబిలము

    సీ.    కరతలంబున నొప్పలరు నిష్ఠలింగంబు
                  నయనస్థలంబున వనువు పఱచి
        నయన్థలంబున నలరుసత్ర్పాణంబు
                  హృదయస్థలంబునఁ గుదురు పఱచి
        హృదయస్థాలంబునఁ బొదలు సద్భావంబు
                   మంత్ర స్థలంబున మరులు కొలిపి    
        మంత్ర స్థలంబున మరులందు చిద్బిందు
                   కూటత్రయంబునఁ బాటు పఱచి
    
    గీ.    పాటకూటత్రయంబులో ప్రణవ తేజ    
        తేజ తేజోలయ వ్యాప్త తేజమగుచు
        మర్మవర్మాది కర్మముల్ మర్మమగుచుఁ    
        బదులనై దింట శోభిల్లు బ్రహ్మబిలము.
    
    సీ.    ప్రణవకుండలి శిరోమణి మండలంబున
                  మండలత్రయమున మాటు పఱిచి
        మండలత్రయమున మాటుపడున్నట్టి
                   ఆఉమక్షరత్రయం బనువు తెలిసి
        అఉమక్షరత్రయం బనువు తెల్సిన చోట
                   నంగలింగ జ్ఞానసంగ మెఱిగి
        యంగలింగ జ్ఞానసంగ స్థలంబున
                  నలబిందు పంచకం బైక్యపఱచి

    గీ.    పరచిదానందషట్కోశపద్మ మొంది
        మందిరాంతరచిత్క;ళా మండలముల
        నంబుజానంద మణితేజకంద మగుచు
        పదులనైదింట శోభిల్లు బ్రహ్మ బిలము


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS