Previous Page Next Page 
అనుక్షణికం -2 పేజి 88


    "స్వప్నా"
    "నా ఈ జీవితం యిలా అనంతంగా సాగిపోతూ వుండిపోవాలని_ అనంత్_ అనంతంగా అనంతంలో లీనమై_"
    "నాకింత అదృష్టం! నువ్వు కారుణ్య దేవతవి" అన్నాడు.
    "కారుణ్యమేముంది దీన్లో! అనురాగ పరస్పరాధీనత" అని పక్కకి తిరిగి, అతని చెంపలకి చేతులు అద్దింది. పుప్పొడి అద్దినట్లుగా అనిపించింది అతనికి.
    "గిటార్ తెచ్చారు కదూ?" అంది.
    "వింటావా? యెప్పుడూ విననేలేదు__" అన్నాడు.
    "వినకపోవటమేమిటి!"
    "ఫంక్షన్స్ లోనా! ప్రత్యేకం నీకోసం నీవొక్కదానికే వినిపించాలని యెంతగా అనిపించేదో తెలుసా!"
    "అన్నాళ్ళు సిటీలో__ఒక్కసారైనా గిటార్ చేతపుచ్చుకు రాలేదేం మరి!" అంది.
    "యేదో తెలియని బిడియం. పెళ్ళికి ముందుగా చొరవగా ప్రవర్తించాలంటే__"
    "గిటార్ వినిపించటానికి కూడానా!"
    లేచి లోనకి వెళ్ళి గిటార్ తెచ్చాడు. ఎలక్ట్రిక్ గిటార్. లోన ట్రాన్సిస్టరైజ్డ్ బ్యాటరీ వుంది.
    మొదటి మీటు__ చివాలున కొమ్మ వంచి వదిలినట్లుగా అన్ని తంత్రులనూ అన్ని వేళ్ళతో ఒకేసారి మీటినట్లుగా.
    నిద్రిస్తున్న సరోవరం కలలో కలవరించినట్లు __ స్వప్నరాగలీన హృదయం జలదరించింది.
    అతను రకరకాల బాణీలు పలికిస్తున్నాడు. జాజ్, మెక్సికన్ ట్రైబల్ బీట్, అరబిక్, హిందుస్థానీ....
    పచ్చికని నిమురుతున్న ఆమె అరిచెయ్యి, వెన్నెలను తాకుతున్న ఆమె కళ్ళు, ఆనందాన్ని నింపుకుంటున్న ఆమె మనసు, గాలిని పీల్చుతున్న ఆమె చర్మం, సంగీతాన్ని శృతిస్తున్న ఆమె హృదయం__ ఆ గిటార్ వింటూ ఆమె_యింకా వత్తిడిగా ఇంకా గాఢంగా ఇంకా లోతుగా వీణానాదంలా సితార్ విశ్వాసంలా తాదాత్మ్యపు లోలోతుల __ ఆమె తల అటూయిటూ అడ్డంగా వూపింది.
    గిటార్ అనంతాన్ని చేరలేదు. అది గిటార్ వాద్యపు పరిమితి. దేని పరిమితి దానికుంటుంది. వీణ డప్పులా మోగలేదు.
    "అనంత్" అంది. ఆ గొంతులో తీవ్రపు వొత్తిడి.
    ఆపి, "స్వప్నా" అంటూ గిటార్ కిందపెట్టి, ఆమె పక్కన కూర్చుని ఆమె పొట్టమీద అరిచెయ్యి ఆన్చాడు. ఆ చేతిమీద తన చెయ్యి వేసి తన పొట్టమీద అతని చేతిని జరుపుతూంది. పైకి జరుపుకుని వక్షంమీద ఆ చేతిని అదిమి__ కనురెప్పలు వాల్చింది.
    అతను లేచినట్లుగా కదిలి, ఒక చెయ్యి ఆమె వీపు కిందనుంచీ రెండో చెయ్యి మోకాళ్ళకీ తొడలకీ మధ్య కిందనుంచి దూర్చి ఆమెని పైకి లేవనెత్తి __ లోనకి నడుస్తున్నాడు. నవ్వుతో తడిసిన పెదాలలోంచి కళ్ళలోంచీ అనురాగపు చల్లని ఆవిరి అతని ముఖాన్ని ఆవరించింది_ చందనం పరిమళంతోపాటు.
    మంచం మీద పడుకోబెట్టాడు.
    దిండుమీద తల. ఒక చెయ్యి పక్కమీద, ఒకచేయ్యి పొట్టమీద, కాళ్ళూ పాదాలు వొకదానిమీద వొకటి.
    మంచంమీది మల్లెలన్నీ పోగుచేసి ఆమె ముఖంమీదా వక్షంమీదా పొట్టమీదా వొళ్ళోనూ పాదాలమీదా పోస్తూ__ వొంగి ఆమె పాదాలు ముద్దు పెట్టుకున్నాడు.
    చేత్తో అతని జబ్బ పట్టుకుని పైకి లాగింది. పక్కగా వచ్చి మంచం అంచుమీద కూర్చుని ఆమె కళ్ళలోకి చూస్తూ, "స్వప్నా" అన్నాడు తన్మయంగా.
    "వూఁ_" అంది.
    "యెక్కడ నేర్చుకున్నావు, "వూ" అని అట్లా అనటం?" అన్నాడు.
    "యెక్కడా నేర్చుకోలేదు. గొంతే అంత. యిప్పుడు మార్చుకోవాలన్నా మారదు సుమీ" అంది.
    కలవరపడిపోయి, "నా వుద్దేశం అదికాదు. నువ్వు__ వూఁ__అని అట్లా అనటం యెంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను. యేదో అపూర్వమైన వాయిద్యం__ యేదో వింత సంగీతం పలికినట్లుగా వుంటుంది" అన్నాడు.
    "వూఁ?"
    "అబ్బ. నువ్వు అట్లా వూఁ_ అని అంటూంటే వోపలేను" అన్నాడు.
    "వోపలేకపోతే వోపకండి" అని చిన్నగా నవ్వింది.
    "ఆ నవ్వు కూడా__"
    "అదీ వోపలేనంటారు!"
    "అట్లా నువ్వూ__"
    "నన్నూ వోపలేనంటారు? యేదీ వోపలేని నా అనంత్__ అని అతని భుజాల చుట్టూ చేతులు ఆన్చి కిందికి వాల్చుకుంది. వొరిగి__
    ఆమె పెదాలమీద అతని పెదాలు తొలిముద్దు.
    అతని పెదాలను నాలిక కొసతో తడిమి, పెదాలకి బిగించి__ యేదో ధార పెదాలలోంచి నోట్లోంచి గొంతులోంచి నరాల్లోంచి నెత్తుట్లోంచి__
    అతని వీపు చుట్టూ చేతులు తిప్పింది.
    ఒకరినొకరు పెనవేసుకుని అటూ యిటూ దొర్లి.
    ఆమె స్తనాలు పొంగి వొక హుక్కు తెగింది.
    అతని ముఖం, ఆమె కంఠం దిగువగా వక్షంమీదా జబ్బలమీదా__
    ఆమె పెదాలు అతని పెదాలను వెతుక్కుని _ ఈ మాంస కండరాలలోంచి, నరాలలోంచి యేదో సంగీతపు ధారలాంటి మాధుర్యపు ధార ప్రవహించి నెత్తుట్లో కలిస్తే, నెత్తురు పొంగులెత్తి__ ఆమె కాళ్ళు అతని నడుం చుట్టూ మెలితిరిగాయి.
    కొద్ది నిమిషాలకి__
    పాలు విరిగినట్లు బట్ట వెలిసినట్లు; అతని ముఖం భీతిచెందినట్లుగా కంపించింది.
    పొంగిన పాలమీద నీళ్ళు చల్లినట్లు జాబిలీ మట్టిపెళ్ళలా రాలిపడినట్లు ఆమె ముఖం కుచించుకుపోయింది.
    పావుగంట.
    బలహీనంగా కొట్టుకుంటున్న యిరువురి గుండెల చప్పుడు స్పష్టంగా వినిపించేటంత నిశ్శబ్దంగా మనసులు.
    మరో పావుగంట.
    తల విదిల్చి తీక్షణంగా చూసి, అతని వొళ్ళో__చెయ్యి వేసింది.
    రెండు నిమిషాలు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS