Previous Page Next Page 
క్రాస్ రోడ్స్ పేజి 7


    ది ఫాదర్ ఆఫ్ ది గేంబ్లింగ్.
    
    గ్రేట్ గేంబ్లర్...
    
    బెట్టింగ్, గేంబ్లింగ్.
    
    చైనీస్ రక్తంలో ఇప్పటికీ మిగిలి ఉన్న జూదం.
    
    హీ హేజ్ బిల్డ్ హిమ్ సెల్ఫ్ కి మేఘా ఫైనాన్షియల్ ఎంపైర్ కాన్ స్టెంట్లీ ఎక్స్ పేండింగ్ ఫర్ మోర్ దేన్ ఫార్టీ ఇయర్స్.
    
    వెన్ టైమ్స్ ఆర్ బేడ్
    
    ది చైనీస్ గేంబుల్.
    
    వెన్ టైమ్స్ ఆర్ గుడ్ ది చైనీస్ ఆల్ సో గేంబుల్.
    
    జూదాన్ని ఆరోప్రాణంగా చేసుకున్న తండ్రి రక్తం.
    
    దేవుడు, దెయ్యం, భక్తి, ముక్తి, సంస్కృతి, సాంప్రదాయాల్ని నరనరాన జీర్ణించుకున్న తల్లి జీనియాలజీ మాస్టరు రక్తంలో కలిసిపోయి ఉన్నాయి.
    
    అతను ఓ కోణంలో చైనీస్ లా మరో కోణంలో ఇండియన్ లా కనిపిస్తాడు.
    
    ఇండో చైనీస్ ఫీచర్స్.
    
    తండ్రి చనిపోయేవరకు హాంగ్ కాంగ్ లో వున్న మాస్టర్ తల్లి కోరిక మేరకు ఆ తరువాత వచ్చి బొంబాయిలో స్థిరనివాస మేర్పరచుకున్నాడు.
    
    మరి అలాంటి వ్యక్తి ప్రాణరక్షణకు సంవత్సరానికి రెండుకోట్లంటే పెద్ద మొత్తమే అవుతుంది?
    
    కొన్ని చిన్న దేశాల ఆర్ధిక వ్యవస్థలే అతనిచ్చే విరాళాల మీద ఆధారపడి నడుస్తుంటాయి.
    
    మనిషిలో ఈజీయనీ గురించి మొలకెత్తే ఆశలు.
    
    జూదవ్యసనం అతని వ్యాపారానికి ఆయువుపట్టు అతనేం ఫెయిర్ బిజినెస్ మెన్ కాదు.
    
    అంతర్జాతీయ స్థాయి జూదగృహాలన్నీ అతడివే.
    
    మనిషి బలహీనతలపై సొమ్ము చేసుకుంటుంటాడు.
    
    అదే అతన్ని అడిగితే నేనేం దొంగతనం చేయటం లేదు. దోపిడీ చేయటం లేదు.
    
    జూదం ఆడాలనుకొనే వ్యక్తులకు అవకాశం కలిపిస్తున్నారు. జూదం ఆడేందుకు వచ్చే జూదరులకు తెలీదా జూదంలో సర్వం ఓడే ప్రమాదం వుందని.
    
    నేను ఇటీవలే టీవీలో మహాభారతం చూశాను.
    
    నేను చూసిన ఎపిసోడ్ లో ధర్మరాజు, దుర్యోధనుడు జూదం ఆడారు ఆ ఎపిసోడ్ నాకు బాగా నచ్చింది. ఆ జూదాన్నే మా ఫాదర్ మోడర్నైజ్ చేశారు.
    
    గాంధారరాజు వెన్నుపూస ఎముకలు అతని కొడుకైన శకుని చేతిలో పాచికలయ్యాయి.
    
    వ్యాసుడి గ్రాండ్ కాన్వాస్...
    
    గుఫీసైంధాల్ నటన అద్భుతం.
    
    అసలు చోప్రా నన్ను కలిసుంటే ఆ ఎపిసోడ్ తీసేందుకు కోటి రూపాయలు ఇచ్చి వుండేవాడ్ని.
    
    మాస్టరు ఆలోచనలు ఎవరికీ అర్ధంకావు.
    
    అతని మాటలు ఇన్ స్క్రూటబుల్.
    
    అతనికి పెద్ద సైకలాజికల్ ఏంకర్. అతని చిన్నక్క కూతురు. ఆపైన అతని తల్లి యశోధర. ఈ ప్రపంచంలో అతనికి వున్న ముఖ్యమైన వాళ్ళు ఆ ఇద్దరే.
    
    చిన్నక్క కూతురు సోహ్ని...
    
    ఆ పాపకు పదేండ్లుంటాయి.
    
    తన తల్లి అసాసినేట్ కాబడినప్పుడు ఆ పాప తన తల్లి గర్భంలో ప్రశాంతంగా నిద్రిస్తోంది.
    
    తల్లి రక్తపు మడుగులో విలవిల్లాడుతూ ఒక పసికందుకి ప్రిమెచ్యూర్ బర్త్ ని ప్రసాదించింది.
    
    ఆ పసిగుడ్డు ప్రాణాలనయితే కాపాడుకుంది. కాని, అంగవైకల్యం నుంచి దూరం కాలేకపోయింది. స్టేన్ ల్లీ హో కొన్ని మిలియన్స్ ఖర్చు పెట్టి దేశదేశాలు తిరిగి చివరకు ఒక కృత్రిమమయిన కాలును మాత్రమే తన మనుమరాలికి సంపాదించి పెట్టగలిగాడు. ప్రపంచవ్యాప్తంగా అతను అందరికీ స్నేహపాత్రుడే అలాగే ప్రపంచంలోని ప్రతిమూల అతన్ని హత్య చేసేందుకు హంతకులకు స్థానం కల్పిస్తుంటుంది.
    
    అదే వారసత్వం అతని చిన్న కొడుక్కి కూడా వచ్చింది.
    
    బొంబాయిలో లార్స్ న్ అండ్ టూబ్రో కంపెనీ దాటి విక్రోలికేసి వెళ్ళే దారిలో కుడివేపు వున్న చిన్న చిన్న కొండలలోని ఒక కొండపై మాస్టర్ బంగ్లా వుంది.
    
    దాని ఖరీదు మూడున్నర కోట్లు.
    
    సాధారణంగా కొత్తిల్లు కొనేప్పుడు వాస్తు చూస్తారు.
    
    కాని మాస్టర్ ఇంటిని కొనే ముందు, మిల్లర్ హాంగ్ కాంగ్ నుంచి ప్రత్యేకంగా వచ్చి సెక్యూరిటీ ఛాన్సెస్ గురించి చూసాడు. అన్ని విధాల ఆ ఇల్లు మాస్టర్ ప్రాణాల్ని కాపాడగలుగుతుందని, చిన్న చిన్న మార్పులతో దుర్భేధ్యమయిన నివాసంగా, దుర్నిరీక్ష్యమయిన నివాస్మగా మారిపోగలదని నమ్మాకే దాన్ని కొనటం జరిగింది.
    
    రెండు చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఆరేడు దశాబ్దాల క్రితం ఒక ఫ్రెంచ్ బిజినెస్ మెన్ నిర్మించిన అత్యద్భుతమయిన ఆ బంగ్లా రాజప్రాసాదంలా కనిపిస్తుంటుంది. చుట్టూ గార్డెన్.... ఫ్లవర్ బోర్డర్స్, ఫౌంటెన్స్, సన్నటి పచ్చిక రహదారులతో శోభాయమానంగా ఉంటుంది.
    
    వాటన్నింటిని బయట ప్రపంచం నుంచి దూరం చేసే మహోన్నతమయిన సుదృఢ ప్రాకారం చుట్టూ పహరా కాస్తున్నట్లుంది.
    
    సుశిక్షితులయిన మాస్టర్ కమెండోస్ అనుక్షణం, అప్రమత్తంగా ఆ బంగ్లాను పహరా కాస్తుంటారు.
    
    మాస్టర్ రక్షణ ఏర్పాట్లకు, ప్రోటోకోల్ ని చూసి ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ వింగ్స్ కూడా ఈర్ష్య పడటం ఖాయం.
    
    నారీమన్ పాయింట్ వ్యాపార వేత్తలు సయితం మాస్టర్ స్టేన్ ల్లీ జీవన విధానాన్ని చూసి అసూయ చెందుతుంటారు.
    
    ఆ బంగ్లాలోనే రెండు హెలీపేడ్స్ ఉన్నాయి. 259 ప్రయాణికుల కోసం డిజైన్ చేసిన డిసి ఎయిర్ ఫ్లయిట్స్ రెండు మాస్టర్ తండ్రి కలల్ని, మాస్టర్ వ్యాపార వ్యవహారాల్ని చక్కబెట్టుకొనేందుకు అనుకూలంగా మార్చబడ్డాయి. వాటిల్లో ఒకటి సాహోర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఇంధనాన్ని నింపుకొని మాస్టర్ కోసం సర్వసన్నద్ధంగా ఉంటాయి. వాటి ఖరీదు ఒక్కొక్కటి 49 కోట్ల అరవై లక్షలు. రెండూ కలిపి సుమారు వందకోట్ల ఖరీదుంటాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS