Previous Page Next Page 
చైనా యానం పేజి 6


    ఆ మాటలన్నందుకు ఆవిడకీ కోపం వస్తుందని నాకు తెలుసు. అంచేత నాలుగైదు వాక్యాలలో రవీంద్రుని గొప్పతనం గురించి మాట్లాడాను. ముఖ్యంగా అయన సామ్రాజ్యవాడ వ్యతిరేకతను ఉగ్గాడించాను. అయన జాతీయవాది మాత్రమే కాక అంతర్జాతీయవాది కూడా అని అంగీకరించాను. అన్నటికన్నా మిన్నగా చెప్పుకోదగ్గది. ఇటీవలి కాలంలో మొట్టమొదటి సారిగా శాంతినికేతన్ లో చైనా భవన్ స్థాపించినది రవీంద్రులే అని గుర్తుచేశాను. అందుకు మైత్రేయీదేవి అపరిమితానందం చెందారని నేను వేరే చెప్పనక్కరలేదు.
    పీకింగ్ హోటల్ లో నా గది నెంబరు 5040. అనగా అయిదో అంతస్తులో 40వ నంబరు డబుల్ రూమ్. ఇందులో నేనూ చెండీఘర్ కు చెందిన ధింగ్రా అనే అయన ఉంటున్నాము. ఆయనకు ఇంగ్లీషు రాదు. నాకు కొద్దిగా ఉర్దూ వచ్చును. ధింగ్రా గారు చక్కని ఉర్దూ మాట్లాడతారు. వారి సౌజన్యం పట్ల నాకు గల గౌరవం మరింత అతిశాయించింది. చిత్రం ఏమిటంటే హిందీలోని సంస్కృత పదాలు ఆయనకు అర్ధం కావు. క్రాంతి అంటే ఇంక్విలాబ్ అని నేను వివరించవలసివచ్చేది.
    ఆ రాత్రి భోజనాలు ముగించుకుని నిద్రపోయే సరికి పదకొండు దాటిపోయింది. మర్నాడు ఆరు గంతాలకే మెలకువ వచ్చేసింది. చైనాలో ఉన్నన్నినాళ్ళు పెందరాళే పడుకున్నా ఆలస్యంగా నిద్రపోయినా ఆరుగంటలకే మేలుకునేవాణ్ణి. 7.30 కి గాని బాగా వెలుతురూ వచ్చేది కాదు. ఇది ఉత్తర చైనాలో. దక్షిణ చైనాలో ఇంచుమించు మద్రాసులాగే ఉంటుంది. చలి కూడా అంత ఎక్కువ కాదు. ఎక్కడయినా ఉదయం ఎనిమిది గంటలకి బ్రేక్ ఫాస్ట్. ప్రతినిధివర్గం అందరమూ సరిగ్గా ఎనిమిదయ్యేసరికి డైనింగ్ హల్లో ఉండేవాళ్ళం.
    7-12-76 వ తేదీన పీకింగ్ హోటల్ లోనే ఒక నోట్ బుక్ కొన్నాను. అందులోనే దినచర్య రాయడం ప్రారంభించాను.
    ఉదయం : పర్యటన కార్యక్రమం ఖాయమయింది.
    (కాని , దరిమిలాను కొద్ది మార్పులు కలిగాయి. ఉత్తర చైనా అంతటా చలి తీవ్రంగా ఉంటుంది. కాబట్టి అక్కడ కొన్ని చోట్లకు బదులు దక్షిణ చైనాలోని ప్రాంతాలకు పర్యటన మారింది. ఇది మా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చైనావారు చేసిన మార్పు.)
    మధ్యాహ్న భోజనం అయిన తర్వాత చైనా చక్రవర్తుల భవనాలను చూశాం. అవన్నీ ఇప్పుడు కేవలం మ్యూజియం లాగున్నాయి. అన్నిటినీ చూడాలంటే అయిదారు రోజులయినా చాలవేమో. కొన్ని ముఖ్యమైన భవనాలను మాత్రం చూసి సాయంత్రమయ్యే సరికి హోటల్ చేరుకున్నాం.
    ఆ రాత్రి డైనింగ్ హల్లో చైనీస్ అధికారులిచ్చిన విందు భోజనం, ఇటువంటివి రోజువిడిచి రోజు జరుగుతూనే ఉండేవి. మా అందరి పక్షాన, మా ప్రతినిధి వర్గ నాయకుడు డాక్టర్ బాసూ గారే మాట్లాడేవారు. మిగిలిన వాళ్ళం ఉపన్యాసాలంటూ చెయ్యకపోయినా చైనీస్ మిత్రులతో ఇష్టాగోష్టి గా మాట్లాడుకునే వాళ్ళం.
    8-12-76 ఉదయం 9 గంటలకు పీకింగ్ లోని ఆప్టికల్ పరికరాల ఫ్యాక్టరీని ధర్శించాం. ఇందులో చిన్న చిన్న లెన్సులు మొదలు పెద్ద పెద్ద మైక్రోస్కోపులు , టెలిస్కోపులూ తయారవుతాయి. ఈ ఫ్యాక్టరీని 195\8 (పెద్ద ముందడుగు సంవత్సరంలో) ప్రారంభించారు. ముడి సరుకుల కోసం ఒక్క విదేశం మీద కూడా ఆధారపడకుండా చీనా ప్రజలు స్వయంశక్తితో , దేశీయ వనరులతో నడిపించే ఫ్యాక్టరీ ఇది. (ఇటువంటివే ఒక ్కొక్క నగరంలో వేరువేరు వస్తువులు తయారుచేసే ఫ్యాక్టరీలు చాలా చూశాం.)
    పీకింగ్ ఫ్యాక్టరీలో 520 మంది వర్కర్లు ఉన్నారు. విశేషం ఏమిటంటే వీరిలో 75 శాతం స్త్రీ లు . స్త్రీలకయినా , పురుషులకయినా చేసే పనిని బట్టి వేతనాలు నిర్ణయిస్తారు. గాని ఆడా, మగా అనే తేడాలు లేవు. రోజుకు 8 గంటలు పని. అతి తక్కువ జీతం 40 యేన్నులు. ఎక్కువ జీతం 100 యేన్నులు. ఆడవాళ్ళు 56వ యేటా , మగవారూ 50 వ ఏటా పని నుండి విరమిస్తారు. ఆ తర్వాత నూటికి 80 శాతం జీతం ఉపకార వేతనంగా ప్రభుత్వమే వారికి యవజ్జీవితమూ ఇస్తుంది. 70 యేళ్ళ ముసలివాళ్ళనూ, 80 ఏళ్ళ ముసలివాళ్ళనూ నేనెందర్నో చూశాను ఆ దేశంలో.
    అమెరికాలో వయో వృద్దుల గొడవ పట్టించుకునే వాళ్ళు లేనే లేరనేది జగద్విచితమైన విషయం. మా ప్రతినిధి వర్గంలో అమెరికాకు వెళ్ళి వచ్చిన ఒకాయన, అక్కడ తాను కలుసుకున్న ఒక వృద్దుడిని గురించి చెప్పారు. పార్కు బెంచి మీద కూర్చున్నాడట ఒక ముసలాయన. 'బాగున్నారా?" అన్న పలకరింపు వినగానే అతనికి ప్రాణం లేచి వచ్చిందట. "ఇండియా నుంచి వస్తున్నావా, నాయనా! ఇక్కడ నన్నింత ఆప్యాయంగా పలకరించే వాళ్ళే లేరు !" అన్నారట అయన.
    మరి మనదేశంలో చూస్తె డేబ్బయ్యేళ్ళ వాళ్ళు రిక్షాలు తొక్కుతుంటారు. ఇద్దరు ముసలి బెస్తలు బరువయిన చేపల వలను మోస్తూ ఈ మద్రాసు బీచిలోనే కనిపిస్తారు. గడ్డం పండిన ఆసామీ కాఫీ క్లబ్బు ముందు నిల్చొని ఇంగ్లీషు భాషలో యాచిస్తాడు. ఎవరు పట్టించుకుంటారు ఈ కఠోర వాస్తవాలను?
    అంతదాకా యెందుకు? ఇప్పుడు నా వయస్సు 67. యేదేనా సినిమా పాటో, పత్రికలకి కధలో, గీతాలో రాస్తేనే తప్ప పొయ్యిలో పిల్లి లేవదు. సినిమా వైకుంఠంలో శ్రీరంగధాముడిలా వుంటున్నానని చాలా మంది భ్రమ. నిజానికి ఎటువంటి గ్యారంటీలూ లేని జీవితం నాది.
    చైనా నుంచి మద్రాసు వచ్చిన మరునాడు బస్సులో ప్రయాణం చేస్తున్నాను. జేబులోంచి ఫౌంటేన్ పెన్ ఎవడో కొట్టేశాడు. తన హస్త లాఘవానికి నా కాలాన్ని హక్కు భుక్తం చేసుకున్నాడు.
    ఇవి చాలా చిన్న విషయాలే కావచ్చు! ఇటువంటి అనుభవాలు నా ఒక్కడివే కాకపోవచ్చు. ఎవళ్ళ మట్టుకు వాళ్ళే మనకెందుకులే పోనిద్దూ అనుకుంటారు. అక్కడే ఉంది అనమర్ధమంతా!
    ఇలా రాస్తున్నానే కాని చైనాలో ఉన్నంతకాలమూ, స్వదేశాని కెప్పుడూ పోతానా అనే అనిపించేది. ఇప్పుడే కాదు, ఇంతకూ పూర్వం చాలా సంవత్సరాల క్రిందట సోవియట్ యూనియన్ లో పర్యటించినప్పుడు కూడా మొదటి వారం రోజులలోనే ఇటువంటి భావం నాకు కలిగింది.
    8వ తేదీ మధ్యాహ్నం పీకింగ్ నుంచి రైలు బండిలో ప్రయాణం చేసి , ఆ రాత్రి 9 గంటలకు షేబియా చువాంగ్ నగరం చేరుకున్నాం. అక్కడే ఆ మరునాడు కోట్నీస్ స్మారక భవనం అవిష్కరనోత్సవం. మా ప్రతినిధి వర్గం ఈ ఉత్సవంలో పాల్గొనడానికే వచ్చింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS